TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 5th Lesson పల్లె అందాలు Textbook Questions and Answers.

పల్లె అందాలు TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు 1

ప్రశ్నలు
1. పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి?
జవాబు.
ఆకాశంలో సూర్యుడు, పక్షులు కనిపిస్తున్నాయి. క్రింది నుండి కొండపైకి దారి వేశారు. ఇళ్ళు, చెట్లు, పశువులుతో పల్లె కనిపిస్తోంది. పల్లె పచ్చని మొక్కలతో అందంగా ఉంది.

2. మీరు చూసిన పల్లెకు, బొమ్మలోని పల్లెకు తేడాలేమిటి?
జవాబు.
మేము చూసిన పల్లె పచ్చని పొలాలలతో నిండి ఉంది. చల్లనిగాలి, పక్షుల కిలకిలరావాలు ఎంతో ఆనందాన్నిచ్చేవి. పైబొమ్మలోని పల్లె కూడా అలానే ఉంది.

3. పల్లెలో ఏమేమి ఉంటాయి?
జవాబు.
పల్లెలో చిన్న ఇళ్ళు, పాడి ఆవులు, గేదెలు, పచ్చని పొలాలు అందరూ కలసిమెలసి ఉండే వాతావరణం ఉంటుంది. రకరకాల పండ్లు, పూలచెట్లు, చెరువులు, సెలయేళ్ళు ఉంటాయి.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కవి చెరువును గంగాళంతో పోల్చాడు కదా! ఇంకా చెరువును వేటితో పోల్చవచ్చు?
జవాబు.
ఇంకా పెద్ద పాత్రతో, చిన్న సముద్రంతో పోల్చవచ్చు. బాగా విచ్చిన తామరపువ్వుతో పోల్చవచ్చు. హైదరాబాద్ లోని చెరువులను హుసేన్ సాగర్, నిజాంసాగర్ అని సాగరంతో పోల్చడం జరిగింది. (వనపర్తి సంస్థానంలోని 7 పెద్ద చెరువులను సప్తసముద్రాలుగా పిలిచేవారు. కావున చెరువును సముద్రంగా పోల్చవచ్చు.

ప్రశ్న 2.
పాఠంలో “చెరువును పద్మాలకు నిలయాలు” అని కవి అన్నాడు కదా! ఇప్పుడు చెరువులు వేటికి నిలయాలు ?
జవాబు.
మా పాఠంలో కవి చెరువును పద్మాలకు నిలయాలు అని చెప్పాడు. పూర్వం పరిశుభ్రత, స్వచ్ఛత ఉండడం వలన అవి అలా ఉండేవి. నేడు రసాయనాలు, మురికి, చెత్తా, చెదారంతో నిండి చెరువులు కలుషితం అవుతున్నాయి.

ప్రశ్న 3.
సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది?
జవాబు.
సూర్యోదయ సమయంలో చెరువు పరిశుభ్రంగా, నిర్మలంగా ఉంటుంది. సూర్యుని లేత కిరణాలు చెరువులో పడి, అందులోని తామరపూలు వికసించి ఎంతో అందంగా ఉంటాయి. లేత కిరణాలు పడి చెరువు స్వచ్ఛత వలన చూడ ముచ్చటగా ఉంటుంది.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

ప్రశ్న 4.
పూవులను ఏయే సందర్భాలలో అలంకరణకు వాడుతారు?
జవాబు.
పూలను ఆడవారు తమ తలపై పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రతిరోజు దేవునికి సమర్పించడానికి, పూజలు చేయడానికి వినియోగిస్తారు. పండుగలలోను, పెళ్ళిళ్ళలోను, ఇంకా ఇతర సమయాలలో అలంకరించడానికి వాడతారు. గౌరవనీయులైన వారి మెడలో వేయడానికి పూల మాలలను వాడతారు. పూలు అలంకార సాధనం.

ప్రశ్న 5.
ఏఏ ఋతువులో ఏయే పూలు దొరుకుతాయి?
జవాబు.
వసంతఋతువు – చైత్ర, వైశాఖం
గ్రీష్మఋతువు – జ్యేష్టం, ఆషాఢం
వర్షఋతువు – శ్రావణం, భాద్రపదం
శరదృతువు – ఆశ్వయుజం, కార్తీకం
హేమంతఋతువు – మార్గళిరం, పుష్యం మాఘం, ఫాల్గుణం
శిరరఋతువు – మాఘం, ఫాల్గుణం – మోదుగ

ప్రశ్న 6.
మీ గ్రామ ప్రత్యేకతలు ఏమిటి?
జవాబు.
మా గ్రామంలో అన్ని వర్గాల వారు కలసి మెలసి ఉంటారు. ఒకరి మంచి చెడులలో అందరూ పాల్గొంటారు. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అందరూ వస్తారు. ఎవరికి ఎలాంటి కోపతాపాలు ఉండవు. ప్రశాంతంగా జీవిస్తారు. ఒకరిని మరొకరు గౌరవించుకొంటారు. అందరిలోను నీతి, నిజాయితి ఉంది.

ప్రశ్న 7.
పల్లె జీవితం నుండి పశుసంపద ఎందుకు దూరం అయ్యింది?
జవాబు.
ఆధునిక యంత్రాలైన ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు రావడం ఒక కారణం. పశుసంపదను పోషించడానికి కావలసినంత వసతి, మేత దొరకక పోవడం ఒక కారణం. పశువుల ఖరీదు ఎక్కువ కావడం ఒక కారణం. పశువుల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం మరొక కారణం.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

ప్రశ్న 8.
పల్లెలోని వ్యాపారులు ఎట్లాంటి వ్యాపారం చేసేవారు? మీగ్రామంలోని వ్యాపారులకు, వీరికి భేదం తెలుపండి.
జవాబు.
పల్లెలోని వ్యాపారులు అన్ని రకాల వస్తువులు అమ్మేవారు. మా గ్రామంలోని వ్యాపారులు రైతుల వద్ద ధాన్యం, కందులు, మినుములు, పెసలు మొ॥ వాటిని కొని నిల్వ చేస్తారు. బాగా ధర వచ్చినపుడు అమ్మి లాభాలు పొందుతారు.

ప్రశ్న 9.
మీ ఊరిలో అంగ ఎట్లా జరుగుతుంది?
జవాబు.
మా ఊరి అంగడిలో అనేక వస్తువులు దొరుకుతాయి. ప్రతి వస్తువూ చౌకగా లభించడం మా అంగడి ప్రత్యేకత !

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాల ద్వారా ఊరి గురించి తెలుసుకున్నారు కదా! మీరు చూసిన ఊరుతో దీన్ని పోల్చి మాట్లాడండి.
జవాబు.
పాఠంలోని పద్యాలలో ఊరు చెరువులు, పూలు, పండ్లు, పంటలు, పాడి, చేనేత కార్మికుల గూర్చి చెప్పారు. మేము చూసిన ఊరు హుజూర్ నగర్. కుమ్మరి కుండలు చేస్తాడు. రైతులు పంటలు పండిస్తారు. వడ్రంగివారు చెక్కపని చేస్తారు. ఆయా ఋతువులలో అన్ని రకాల పండ్లు దొరుకుతాయి.

ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలను రాగంతో చదవండి. వాటి భావాలు చెప్పండి.
జవాబు.
ముందిచ్చిన పద్యాల భావాలు చూడండి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. ఈ కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రకృతి అందచందాలు అమూల్య సంపదలు. గలగలపారే సెలయేరు, ఉదయించే అరుణకిరణాల సూర్యుడు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని కొంగేసినట్లున్న వనసీమలు ఒకటేమిటి? ఎన్నెన్నో అందాలతో విలసిల్లే పల్లె ఆనందానికి నెలవు. పల్లె ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకునే తల్లి. ఆప్యాయతకు, అనురాగాలకు పట్టుగొమ్మ. పల్లె అమాయకత్వం, దివ్యత్వంతో ఉన్న అద్భుత శిల్పం.

(అ) అమూల్య సంపదలు అంటే ఏమిటి?
జవాబు.
అమూల్య సంపదలు అనగా చాలా విలువైన సంపదలు అని అర్థం. వాటికి విలువ కట్టలేమని భావం.

(ఆ) ఆనందానికి నెలవు అంటే ఏమిటి?
జవాబు.
ఆనందానికి నెలవు అంటే సంతోషానికి నిలయం అని అర్థం.

(ఇ) అక్కున చేర్చుకోవడం అంటే మీకేం అర్థమయింది?
జవాబు.
ప్రేమ చూపడం అని అర్థమయింది.

(ఈ) అనురాగాలకు పట్టుగొమ్మ అంటే ఏమిటి?
జవాబు.
అనురాగం అంటే ప్రేమ. పట్టుగొమ్మ అంటే స్థానము. పల్లె ప్రేమకు, అనుబంధాలకు స్థానం అని అర్థం.

(ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు.
పల్లె తల్లిప్రేమ.

2. పాఠం ఆధారంగా కింది భావం తెలిపే పద్యపాదాలను వెతికి రాయండి.

(అ) అలుగుల గడుసుదనంతో ఒకే చెరువా అని తెలుపుతున్నట్లున్నాయి.
జవాబు.
“ రెండు చెరువు లొక్కటేయని చెప్పుచునుండె నడుమ గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.”

(ఆ) సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్లున్నాయి.
జవాబు.
“అరుణ కిరణాల దేవత కర్ష్యమిచ్చు ప్రత్యుషస్సున మయూరి పద్మలతలు.”

(ఇ) దంపతులవలె మా ఊరికి కానుకలు సమర్పిస్తున్నాయి.
జవాబు.
ఊరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.

(ఈ) జనం రాకపోకలతో మా అంగళ్ళన్నీ సందడితో ఉంటాయి.
జవాబు.
“జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మా యంగడులు నన్ని వేళలందు”

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

(అ) కవి అంగడిని బహుళ వస్తుప్రధానం అన్నాడు కదా! మీ ఊరి అంగడి కూడా ఇట్లే ఉంటుందా? వివరించండి.
జవాబు.
మా ఊరి అంగడికూడా కవి ఊరి అంగడిలా అన్ని వస్తువులతో నిండి ఉంటుంది. మా ఊరి అంగడిలో అన్ని వస్తువులూ లభిస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు ఇంటిలో ప్రతినిత్యం మనం ఉపయోగించే అన్ని వస్తువులు మా అంగడిలో లభిస్తాయి. అంగడిలోని సరుకులు తాజాగా ఉంటాయి. చౌకగా లభిస్తాయి.

(ఆ) గ్రామాల్లో కాపులు, పద్మశాలీలు కాకుండా ఇంకా ఎవరెవరు ఉంటారు? వీరివల్ల ఊరివాళ్ళకేం లాభం కలుగుతుంది?
(లేక)
గ్రామాల్లోని కులవృత్తి వారి వలన కలిగే లాభాన్ని వివరించండి.
జవాబు.
గ్రామాలలో అనేక కులాల వారు ఉంటారు. వారు వారి కులవృత్తులను చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. కాపులు, పద్మశాలీలే కాకుండా మంగలిపనివారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగం వృత్తులవారు, పశుకాపరులు ఉంటారు. ఆయా కులాల వారు వారి వృత్తులను నిర్వర్తించడం వలన ఊరివాళ్ళ అవసరాలు తీరుతాయి. అందరికీ పని దొరుకుతుంది. అసమానతలు పోతాయి.

(ఇ) ఆదర్శగ్రామం ఎట్లుండాలని నీవనుకుంటున్నావు? (లేక) ఆదర్శగ్రామానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి?
జవాబు.
ఆదర్శగ్రామంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా జీవించాలి. అన్ని మతాల పండుగల్లో అందరూ పాల్గొనాలి. ఎవరికి ఎలాంటి అవసరం లేదా కష్టం వచ్చినా అందరూ సాయం చేయాలి. ఒకరి అవసరాలకు వేరొకరు నిలబడాలి. పేద, ధనిక తేడా చూపకుండా కలసి మెలసి ఉండాలి. గ్రామం అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేసుకొని అందరూ కలసి పూర్తి చేయాలి. మనుషులు, మనసులు వేరైనా ఒకే ఆలోచనతో ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అదే ఆదర్శగ్రామం.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

(ఈ) ఊరుకు, చెరువుకు ఉన్న బంధం ఎట్లాంటిది?
(లేక)
సమాజంలో ఊరికి, చెరువుకు దగ్గరి బంధం ఉంది. వివరించండి
(లేక)
ఊరు చెరువుల బంధం విడదీయరానిది. వివరించండి.
జవాబు.
ఊరు అంటే ప్రజలు, వారితోపాటు పశువులు, పక్షులు. వీరందరికీ నీరు కావాలి. నీరు ఒక కాలంలో దొరికి ఒక కాలంలో దొరకకపోతే కష్టం. అందుకే నీరు నిల్వ ఉంచే చెరువు ప్రతి ఊరికి అవసరం. నీరు తాగడానికే కాదు, వ్యవసాయానికీ కావాలి. ఇన్ని అవసరాలు తీరాలంటే నీరు అన్ని కాలాలలో నిల్వ ఉంచే చెరువు కావాలి. ఇలా చెరువుకు, ఊరుకు విడదీయలేని సంబంధముంది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఊరికి అందాన్నిచ్చే అంశాలేవి? ప్రస్తుతం పల్లెటూర్లలో ఇవి ఉంటున్నాయా? మీ అభిప్రాయాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు.
ఊరికి అందాన్నిచ్చేవి :
తామరపూలతో, కలువపూలతో నిండిన చెరువులు, మంచినీటి బావులు. ఊరిని పండు ముత్తైదువులా చేసే బంతి, చేమంతి వంటి పూల మొక్కలు, పరిమళం వెదజల్లే గులాబీ, మొల్ల, గన్నేరు, దాసన వంటి పూల మొక్కలు. మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన చెట్లు. వివిధ వృత్తులవారు, పశువులను పోషిస్తూ పంటలను పండించే కాపు బిడ్డలు. జనం రాకపోకలతో సందడిగా ఉండే అంగళ్ళు. ప్రస్తుతం పల్లెటూళ్ళలో ఇవేవీ ఉండటం లేదు. చెరువులు కనబడటం లేదు. పచ్చని పొలాలు మాయమయి పోతున్నాయి. ట్రాక్టర్ల రాకతో పశువులు కనబడడం లేదు. ఇప్పుడు పల్లెలన్నీ పట్నాలలాగే ఉన్నాయి.

IV. సృజనాత్మకత/ప్రశంస

(అ). పాఠంలోని 3వ, 4వ పద్యాలలో ఊరి అందాలను కవి వర్ణించాడు కదా! మీరు చూసిన / మీకు తెలిసిన ఊరు అందాలను వర్ణిస్తూ రాయండి.
జవాబు.
నేను చూసిన పల్లె ఖమ్మం జిల్లా వైరాకు దగ్గరగా ఉన్న సిరిపురం. ఈ ఊరిలో ప్రకృతి రమణీయంగా ఉంది. ప్రధానంగా పచ్చని పంట పొలాలతో నిండి ఉంది. ఎక్కడ చూచినా మనోహరమైన దృశ్యాలతో చూడముచ్చటగా ఉంది. ఉదయం సూర్యకిరణాలు వెచ్చని స్పర్శతో నిద్ర లేపుతాయి. కొలనుగట్లపై ఏపుగా పెరిగిన గడ్డి, కొలనులోని కలువల అందాలు నా మనసును దోచుకున్నాయి. కొలనులలోని తామరపూల సౌందర్యం చూడగానే నేను ఎంతో పులకించిపోయాను. ఆ అందం వలన కలిగిన మధురానుభూతులు నా హృదయాన్ని పెనవేసుకొని పోయాయి.

(ఆ). మూడవ పద్యం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి. దాని గురించి చిన్న కవిత రాయండి.
జవాబు.
అర్ఘ్యం

కొలనులోని జలములలో
కదలాడే చిరుత అలల
తానమాడి సంధ్యవార్చి
ధ్యానములో కొంత మునిగి
మెత్తని తన చేతులెత్తి
దోసిళ్ళుగ వాటి జేర్చి
నిర్మలమౌ జలములతో
దోసిళ్ళను నింపుకొని
తరుణారుణ కిరణ మణికి
తరణికి ఆ తరుణీమణి
మనోహరిణి పద్మలతిక
ప్రత్యుషస్సు సమయమ్మున
అర్ఘ్యమిచ్చి అర్చించెను
కర్మసాక్షి దినకరునికి

(ఇ). నీవు చూసిన పల్లెను వివరిస్తూ స్నేహితునికి లేఖ వ్రాయుము.
లేఖ
జవాబు.

ఖమ్మం,
తేది : XXXX

ప్రియమైన స్నేహితునికి కుశలములతో నీ మిత్రుడు శంకర్ వ్రాయునది. నేనిక్కడ కుశలం. నీ కుశలములు తెలుపుము. నేను ఈ మధ్య వైరా దగ్గరలోని గోపాలపురం అనే పల్లెను చూశాను. అక్కడి నా స్నేహితులతో కలసి వేసవి సెలవులు గడిపాను.
ఆ వూరి ప్రజలు చాలా మంచివారు. అమాయకులు. అక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంది. ఎక్కడ చూచినా చెట్లు, పూలమొక్కలు, పాడి ఆవులు, గేదెలు, పొలాలు ఎంతో అందంగా ఉన్నాయి. వారంతా కష్టజీవులు. నేను వారి వృత్తిపనులు చూసి చాలా ఆనందించాను. వడ్రంగి చేసే బొమ్మలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. నేత వారు నేసే వస్త్రాలు ఎంతో మన్నికగా ఉన్నాయి. వాటిపై వేసే అందమైన అద్దకాలు తనివితీరా చూడాల్సిందే! ఎలాంటి కాలుష్యం లేదు. నీవు కూడా వీలైతే ఏదైనా పల్లెకు వెళ్ళిరా. నీ అనుభూతులు రాయి.

ఇట్లు
నీ మిత్రుడు,
శంకర్.

చిరునామా :
కె. సురేష్,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా.

V. పదజాల వినియోగం

1. కింద గీతగీసిన పదాలకు అదే అర్థాన్నిచే పదాలు రాయండి.

ఉదా : సంపద తో గర్వపడకూడదు.
(అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి.
(ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం.
(ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది.
జవాబు.
ఉదా : సంపద తో గర్వపడకూడదు. – (కలిమి, ధనము)
(అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి. – (చెరువు)
(ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం. – (వస్త్రాలు, వలువలు)
(ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది. – (పట్టణం, ప్రోలు)

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

(అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
(ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది.
(ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి.
జవాబు.
(అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. – (అలలు)
(ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది. – (చెరువు తూము)
(ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి. – (పశువుల పాక)

3. పాఠం ఆధారంగా కారణాలు పట్టికలో రాయండి.

(అ) ఊరు పసుపు అద్దినట్లుండడానికి కారణం చేమంతి పూలతో నిండి ఉండడం
(ఆ) ఎర్రని పారాణి అద్దినట్లుండడానికి కారణం గోరింటాకు వలన పారాణి అద్దినట్లుంది.
(ఇ) కుంకుమబొట్టు పెట్టినట్లు ఉండడానికి కారణం పట్టుకుచ్చుల పూలు
(ఈ) పండు ముత్తైదువగా ఉండడానికి కారణం పై మూడింటి వలన

4. భావనాచిత్రమంటే ఒక అంశానికి సంబంధించిన భావనలన్నింటినీ వర్గీకరించుకోవడమే! ఒక గ్రామానికి చెందిన భావనాచిత్రం గీయమన్నపుడు గ్రామంలోని ప్రత్యేకతలు, గ్రామంలోని కీలక ప్రదేశాలు, ప్రజలు, వృత్తులు తదితర అంశాలన్నీ పరిగణిస్తాం.
TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు 2

ఇచ్చిన ఉదాహరణ అంశాలను గమనించండి. ఆయా అంశాల ఆధారంగా పై భావనా చిత్రాన్ని పూర్తిచేయండి.
TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు 3

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను కలిపి రాసి, సంధిని గుర్తించండి.

ఉదా : నీవు + ఎక్కడ = నీవెక్కడ – ఉత్వసంధి
(అ) భీముడు + ఇతడు = భీముడితడు – ఉత్వసంధి
(ఆ) అతడు + ఎక్కడ = అతడెక్కడ – ఉత్వసంధి
(ఇ) ఇతడు + ఒకడు = ఇతడ్కడు – ఉత్వసంధి
(ఈ) ఆటలు + ఆడు = ఆటలాడు – ఉత్వసంధి

2. కింది పదాలను కలిపి రాయండి.

(అ) ఏమి + అది = ఏమది
(ఆ) ఎవరికి + ఎంత = ఎవరికింత
(ఇ) మరి + ఇప్పుడు = మరెప్పుడు
(ఈ) అవి + ఏవి = అవేవి

పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించండి.
మొదటి పదం చివరి అచ్చు “ఇ” కారం. (ఇత్తు). రెండవ పదాల మొదట్లో అన్నీ అచ్చులే వచ్చినవి. ఈ విధంగా “ఏమి” మొదలైన పదాల ‘ఇ’కారానికి (ఇత్తుకు) అచ్చుపరమైనపుడు సంధి జరుగుతుంది. కొన్నిచోట్ల ఇట్లా సంధికార్యం జరుగదు. ఆ పదాలను చూద్దాం.
ఉదా : ఏమి + అయ్యె = ఏమయ్యె – సంధి జరిగింది
ఏమి + అయ్యె = ఏమియయ్యె – సంధి జరగక యడాగమం వచ్చింది.

ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరుగక (నిషేధము) పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ (వైకల్పికము) అంటారు. “ఏమి” మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుందికదా! దీనినే ఇత్వసంధి అంటారు. సూత్రం : ఏమి మొదలైన పదాలలో ‘ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.

3. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

ఉదా : రావాలని = రావాలి + అని (ఇత్వసంధి)
(అ) చెప్పాలంటే = చెప్పాలి + అంటే – ఇత్వసంధి
(ఆ) ఒక్కటే = ఒక్కటి + ఏ – ఇత్వ సంధి
(ఇ) రానిదని = రానిది + అని – ఇత్వ సంధి
(ఈ) నీటినిసుమంత = నీటిని + ఇసుమంత – ఇత్వసంధి
(ఉ) చెప్పినదియేమి = చెప్పినది + ఏమి – ఇత్వసంధి
(ఊ) వచ్చినపుడు = వచ్చిరి + అప్పుడు – ఇత్వసంధి
(ఋ) ఎన్నియేని = ఎన్ని + ఎని – ఇత్వ సంధి

ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
మీ ఊరిలో ఉన్న చెట్లను, పూలను, జరిగే వ్యాపారాలను, చేతివృత్తులవారిని పరిశీలించండి. పట్టికలో నమోదు చేయండి.
జవాబు.

చెట్లు పూలు వ్యాపారం చేతివృత్తులవారు ఇతరములు
ఉదా॥ మామిడి గన్నేరు బియ్యం వడ్రంగులు
1. నిమ్మ బంతి కందులు కుమ్మరి సంకీర్తనలు
2. దానిమ్మ చేమంతి చింతపండు మేదరి భజనలు
3. జామ సన్నజాజి ఉల్లిపాయలు కంసాలి
4. సపోట గులాబి బెల్లం వడ్గి
5. రావి సంపంగి మినుములు రజకుడు
6. వేప కనకాంబరం పెసలు మంగలి
7. సీతాఫలం మల్లె అల్లం చర్మకారుడు
8. బొప్పాయి మందారం బియ్యం తాపీపని


విశేషాంశాలు:

అర్ఘ్యం : చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు, సూర్యునికోసం సమర్పించే నీళ్ళను కూడా అర్హ్యం అని వ్యవహరిస్తారు.

ముత్తైదువ : ముత్తలు (పసుపు కుంకుమ, మాంగల్యం, మట్టెలు, ముక్కెర, గాజులు) అయిదు కల్గిన స్త్రీ, సుమంగళి అయిన

స్త్రీగా జనవ్యవహారం. (ముక్కెరకు బదులు ‘పూలు’, ‘పాపిట సింధూరం’ అని చెప్తున్నారు.)

పద్మశాలీయులు : ప్రాచీనకాలంలో పద్మపుతూడు నుండి తీసిన నారతో వస్త్రాలు తయారుచేసే వారిని పద్మశాలీయులు అనేవారు. ఆధునిక కాలంలో వీరు అన్ని రకాల వస్త్రాలు నేస్తున్నారు.

TS 7th Class Telugu 5th Lesson Important Questions పల్లె అందాలు

ప్రశ్న 1.
పల్లె ప్రజల జీవనం గూర్చి వ్రాయండి.
జవాబు.
పల్లెలోని ప్రజలు నిరాడంబరంగా జీవిస్తారు. వారి ఆలోచనలు పట్టణ ప్రజల శైలికంటె వేరుగా ఉంటుంది. పల్లె ప్రజల మనస్సుల్లో కాలుష్యం ఉండదు. అందరూ ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉంటారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం రచ్చబండ వద్ద కలుస్తారు. అందరి కష్టసుఖాలు, సమాజం, దేశరాజకీయాలు చర్చిస్తారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు.

ప్రశ్న 2.
నీవు చూచిన ఒక పల్లెటూరును గూర్చి, అక్కడి పరిస్థితుల గూర్చి వ్రాయుము.
జవాబు.
మా ఊరి పేరు రామాపురం. మా గ్రామానికి సర్పంచి, వార్డు మెంబర్లు ఉన్నారు. గ్రామం మొత్తానికి పెద్ద అయిన రామయ్యగారు ఉన్నారు. వారు నిజాయితీపరులు. అందరి కష్టసుఖాలను తెలుసుకుంటారు. ఎవరికి సమస్య వచ్చినా వారి వద్దనే పరిష్కారమవుతుంది. ఆయన మాటంటే అందరికీ గౌరవం. ఊరిలో దుకాణాలు, కూరగాయల మార్కెట్టు, అనేకరకాల వస్తువులమ్మే అంగళ్ళు ఉన్నాయి. మా పల్లె పచ్చని పైరులతో అలరారుతున్నది. అందుకే మా ఊరంటే మాకెంతో ఇష్టం.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

ప్రశ్న 3.
పల్లెజీవనానికి, పట్టణ జీవనానికి పోలికలెట్టివి?
జవాబు.

పల్లెజీవనం పట్టణజీవనం
1. పల్లె తల్లి వంటిది. 1. పట్టణం పెంపుడుతల్ల వంటిది.
2. పల్లె నీకేం కావాలి? అంటుంది. 2. పట్టణం నా కేమిస్త్వు? అంటుంది.
3. ఒకరి అవసరాలు, కష్టాలు, సంతోషాలు మరొకరు తెలుసుకుంటారు. 3. ఎవరి జీవాతాలు ఐారే గడుతుతా.
4. పల్లెల్లో కాలాలు, ఋతువులు తెలుస్తాయి. 4. ఉదయం లేచినప్బటి నుండి సాయంత్రం వరకు వేగంగా జీవితం గడపడం వలన ఏమీ తెలయదు.
5. పచ్చని పొలాలతో ప్రకృతి రమణీయంగా, ప్రశాంతంగా ఉంటుంది. 5. రణగాణ ధ్ననులతో విపరీతమైన కాలుష్యం ఆవరంస ఉంటుంద.
6. ఇళ్ళు విశాలంగా, ఆలోచనలు విస్తరించి ఉంటాయి. 6. ఇళ్ళ ఇరుకుగ ఉంటాయి. ఆలోచనలు కూడా స్యార్థూరితంగా ఉంటాయి.
7. పల్లెల్లో సాయంత్రానికి ఒకచోట చేరి కష్టసుఖాలు పంచుకుంటారు. 7. ఎవరి ఱలోచనలు, కష్టాలు, సఖాలు వారిే! ఏక్కన ఎవరున్నా కో కూడా తెలెయకుండా జీవిత వేగంగా గడుపుతారు.
8. పల్లెల్లో జీవించేవారు ఎక్కువ కాలం జీవించగల్గుతారు. 8. పట్టణాల్లో గాలి, స్రు, अహరంలో కల్ ఉండి, ఎక్కువ కాలం జీవించలేరు.


పర్యాయ పదాలు

  • కోవెల = గుడి, దేవాలయం, మందిరం
  • ఆలవాలం = నిలయం, నివాసం, స్థానం
  • నీరు = జలము, పానీయము
  • అరుణుడు = సూర్యుడు, భాస్కరుడు, దినకరుడు
  • పరిమళము = సుగంధము, సువాసన
  • గోవు = ధేనువు, ఆవు
  • అంగడి = దుకాణము, దివాణము
  • సౌందర్యము = అందము, సుందరము

నానార్థాలు:

  • తరుణి = యువతి, గులాబిపువ్వు, పెద్దజీలకర్ర
  • అంబరము = ఆకాశము, వస్త్రము, కుంకుమపువ్వు
  • చిత్రము = ఆశ్చర్యము, చిత్తరువు, తిలకము

ప్రకృతులు – వికృతులు

  • నీరము – నీరు
  • స్నానము – తానము
  • భక్తి – బత్తి
  • నిత్యము – నిచ్చలు
  • పుణ్యము – పున్నెము
  • వర్ణము – వన్నె
  • పురము – (ప్రోలు
  • స్థలము – తల

సంధులు:

నాట్యమాడుతూ నాట్యము + ఆడుతూ ఆత్యసంధి
ఇంపార ఇంపు + ఆర ఉత్వసంధి
దంపతులట్లు దంపతులు + అట్లు ఉత్ససంధి
బావులున్నవి బావులు + ఉన్నవ ఉత్వసంధి
సోయగమైన సోయగము + ఐన ఉత్వసంధి
సంపన్నమగుచు సంపన్నము + అగుచు ఉత్వసంధి
సాంద్రమగుచు సాందము + అగుచు ఉత్వసంధి
చెరువులోక్కట! చరరువు + ఒక్కటె ఉత్రసంధి
పద్మాకరము పద్మ + ఆకరయ సవర్ణదీర్ఘసంధి
సాగరికాంబరము నాగరిక + అంబరము సవర్ణదీర్ఘసంధి


సమాసాలు:

శాంతి సౌభాగ్యాలు శాంతి మరియు సౌభాగ్యం ద్వంద్వ సమాసం
(పేమానురాగాలు (పేమ మరియు అనురాగం ద్వంద్వ సమాసం
రెండు చెరువులు రెండు అను సంఖ్యగల చెరువులు ద్విగు సమాసం
బంతి చేమంతులు బంతి మరియు చేమంతి ద్వంద్వ సమాసం
మారేడులల్లనేరుడులు మారేడులు మరియు అల్లనేరేడులు ద్వంద్వ సమాసం


I. క్రింది పద్యాన్ని వరుసక్రమంలో అమర్చండి.

(అ) గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము
నిండు గంగాళముల వంటి రెండు చెఱువు
ఊరిప్రక్కన గన్పట్టు నొదుగులేని
లొక్కటేయని చెప్పుచునుండె నడుమ
జవాబు.
ఊరి ప్రక్కన గన్పట్టు నొదుగు లేని
నిండు గంగాళముల వంటి రెండు చెఱువు
లొక్కటేయని చెప్పుచునుండె నడుమ
గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

II. క్రింది పద్యపాదాలలోని ఖాళీలను ఇచ్చిన పదాలతో పూర్తి చేయండి.

(హాయిగ, అంగడులు, లలిత, మధురముల్, మాయూరి)
(అ) మా తటాకాలు ……………… పద్మాకరాలు.
(ఆ) పత్రత్యుషస్సున ………………. పద్మలతలు.
(ఇ) మావులున్నవి …………………. మంచినీటి బావులున్నవి.
(ఈ) వెలయు మా ………………… నన్నివేళలందు.
(ఉ) భూమిదున్నుకొని ……………….. నుందురు.
జవాబు.
(అ) మా తటాకాలు లలిత పద్మాకరాలు.
(ఆ) పత్రత్యుషస్సున మాయూరి పద్మలతలు.
(ఇ) మావులున్నవి మధురముల్ మంచినీటి బావులున్నవి.
(ఈ) వెలయు మా అంగడులు నన్నివేళలందు.
(ఉ) భూమిదున్నుకొని హాయిగ నుందురు.

III. సరియైన వాటితో జతపరచండి.

1) చెరువులు (ఎ) (అ) పారాణి అద్దినట్లు
2) బంతి, చేమంతి పూలు (ఈ) (ఆ) పండు ముత్తైదువువలే
3) ఊరు (ఆ) (ఇ) కుంకుమ పెట్టినట్లు
4) పట్టుకుచ్చులపూలు (ఇ) (ఈ) పసుపుదిద్దినట్లు
5) ఎర్రని గోరింటాకు (అ) (ఎ) గంగాళములవలె

IV. క్రింది అపరిచిత పద్యానికి 5 ప్రశ్నలు తయారు చేయండి.

“మిరపగింజ చూడ మీద నల్లగ నుండు
గొరికి చూడ లోన జురుకు మనును
సజ్జన లనెడి వారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ!

(1) మిరపగింజ ఎలా ఉంటుంది ?
(2) అది కొరికి చూస్తే ఎలా ఉంటుంది ?
(3) మిరపగింజలాంటి వారు ఎవరు?
(4) పైపద్యం ఏ శతకం నుండి గ్రహించబడినది ?
(5) పై పద్యానికి శీర్షిక పెట్టండి.

V. క్రింది పద్యపాదాలను చదివి వాటికి సరియైన అర్థం రాయండి.

1. అరుణ కిరణాల దేవత కర్ఘ్యమిచ్చు
బ్రత్యుషస్సున మాయూరి పద్మలతలు
జవాబు.
మా ఊరిలోని తీగవంటి పద్మాలు ఉదయాన సూర్యునికి అర్థ్యమిస్తున్నట్లున్నాయి.

2. యూరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.
జవాబు.
దంపతులవలె మా ఊరికి కానుకలు సమర్శిస్తుంటాయి.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

VI. క్రింది పదాలలోని పర్యాయ పదాలు గుర్తించి వేరుగా రాయండి.

(అ) హిందువులు గోవులను పూజిస్తారు. ఆవు పాలు పిల్లలకు ఉత్తమమైనవి. ధేనువు సాధుజంతువు.
జవాబు.
గోవు, ఆవు, ధేనువు

(ఆ) నేను ప్రతిరోజు కోవెలకు వెళతాను. దేవాలయం ప్రశాంతంగా ఉంటుంది. ఆ గుడి చాలా పెద్దది.
జవాబు.
కోవెల, దేవాలయం, గుడి

(ఇ) మనము ప్రతిదినము సూర్యుడు ఉదయించేటప్పటికి లేవాలి. భాస్కరుని ఉదయ కిరణాలు లేతగా ఉంటాయి. దినకరుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు.
జవాబు.
సూర్యుడు, భాస్కరుడు దినకరుడు

(ఈ) మనము నీటిని వృథాచేయరాదు. జలము లేనిదే జీవించలేము. ఉదకము ఎక్కువగా తాగుట మంచిది.
జవాబు.
నీరు, జలము, పానీయము

(ఉ) గులాబీల పరిమళం ఎంతో బావుంటుంది. ఆ సువాసనలను పీల్చడం ఆరోగ్యానికి మంచిది. శుభకార్యాలలో సుగంధాలను వెదజల్లుతారు.
జవాబు.
పరిమళము, సువాసన, సుగంధము

VII. క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి.

(అ) స్నానము చేయుట వలన మురికి పోవును. ప్రతివారు రోజుకు రెండుమారులు తానము చేయాలి.
జవాబు.
స్నానము – తానము

(ఆ) ప్రతివారు భక్తితో పూజచేయాలి. బత్తిలేని పూజ పనికిరానిది.
జవాబు.
భక్తి – బత్తి

(ఇ) వస్త్రములోని వర్ణములు అందంగా ఉన్నాయి. వన్నెలు బట్టి వస్త్రాలకు గిరాకీ ఏర్పడును.
జవాబు.
వర్ణము – వన్నె

(ఈ) ఆ పురమునందలి ఇళ్ళు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆకసంలో పక్షులు ఎగురుతున్నాయి.
జవాబు.
ఆకాశం – ఆకసం

(ఉ) ఈ భూమిపై అనేక జీవరాశులున్నాయి. మానవుడు బువిలో ప్రాణులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి.
జవాబు.
భూమి – బువి

VIII. క్రింది పదాలను కలిపి రాయండి.

(అ) ఇంపు + ఆర
(ఆ) పద్మ + ఆకరము
(ఇ) దంపతులు + అట్లు
(ఈ) భీముడు + అతడు
జవాబు.
(అ) ఇంపు + ఆర – ఇంపార
(ఆ) పద్మ + ఆకరము – పద్మాకరము
(ఇ) దంపతులు + అట్లు – దంపతులట్లు
(ఈ) భీముడు + అతడు – భీముడతడు

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

IX. క్రింది పదాలను విడదీసి, సంధిపేర్లు రాయండి.

(అ) నాట్యమాడుతూ –
(ఆ) సాంద్రమగుచు –
(ఇ) ఆటలాడు –
(ఈ) ఏమది –
జవాబు.
నాట్యము + ఆడుతూ – ఉత్వసంధి
సాంద్రము + అగుచు – ఉత్వసంధి
ఆటలు + ఆడు – ఉత్వసంధి
ఏమి + అది – ఇత్వసంధి

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1. తే.గీ. ఉరిప్రక్కన గన్పట్టు నొదుగు లేని
నిండు గంగాళముల వంటి రెండు చెఱువు
లోక్కటేయని చెప్పుచునుండె నడుమ
గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.

ప్రతిపదార్థం

ఊరిప్రక్కనన్ = ఊరి ప్రక్కన
కన్బట్టున = కనబడునట్టి
ఒదుగు = వెలితి
లోన = లేనట్టి
నిండ = నిండిన
గంగాళములవంటి = పెద్దపాత్రల వంటి
రెండు చెఱువులు = రెండు చెరువులు
నడుమ = మధ్ల భాగంలో
కలసి = కలిసిపోయి
ఉన్నట్టి = ఉన్నటువంటి
అలుగుల = తూముల
గడుసుదనము = అందము
ఒక్కటే+అని = ఒకే చెరువు అనే విధంగా
చెప్పుచున్+ఉండె = ఉన్నద

తాత్పర్యం : మా ఊరి చెరువులు నిండు గంగాళమువలె పూర్తిగా నిండి ఉన్నాయి. వాటి అలుగులు రెండూ కలువడంతో, ఆ గడుసుదనంవల్ల అవి ఒకే చెరువువలె ఉన్నాయి.

2. తే. గీ. నీటి నిసుమంత గనుపడనీక మొదటి
వరకు వ్యాపించి వలగొను పద్మలతల
సాదుకొను చుండె [పేమ రసాల నాలికి
మా తటాకాలు లలిత పద్మాకరాలు.

ప్రతిపదార్ధం

మా తటాకాలు = మా ఊరిలోని చెరువులు
నీటిని = తనలోని నీటిని
ఇసుమంత = కొంచెం కూడా
కనుపడనీక = కన్పించ నివ్వకుండా
పద్మలతల = తీగవంటి పద్మాల
మొదటివరకు = కాడల వరకు
వ్యాపించి = వ్యాప్తిచెంది
వలగొను = అల్లుకొన్నాయి
లలితపద్మాకరాలు = సున్నిత పద్మాలకు నిలయమైన చెరువులు
(పేమరసాలన్ = [పేమతో కూడిన రసాలను
ఒలికి = ఓలికించి పద్మాలను
సాదుకొనుచు + ఉండె = (పేమతో చూచుకొనుచున్నాయి

తాత్పర్యం: మా ఊరి అందమైన చెరువులు, తమలోని నీటిని కొంచెం కూడా కన్పించనీయకుండా మొదళ్ళ వరకు వ్యాపించిన పద్మాలను (ప్రేమతో సాదుకుంటున్నాయి.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

3. తే.గీ. చిన్ని కెరటాల స్న్నాలు జేసి వార్చి
తరుణ పేశల కమల పత్లా నెత్తి
అరుణ కిరణాల దేవత కర్థ్యమిచ్చు
బృత్యుషస్సున మాయారి పద్ములతలు

ప్రతిపదార్థం

మా+ఊర = మా ఊరిలోని
పద్మలతలు = తీగవంటి పద్మాలు
చన్ని = చిన్నవైన
కెరటాల = అలలతో
స్నానాలు+చేసి = స్నానాలు చేసి
తరుణ = నిగనిగలాడె
పేశల = సున్నితమైన
కమలపత్తాలను + ఎత్తి = తమ రేకులను ఎత్తి
అరుణ = ఎర్రని
కిరణాల = కిరణముల
దేవతకు = సూర్యదేవునికి
ప్రత్యషస్సున = ఉదయకాలమున
అర్ఘ్యము+ఇచ్చు = సంధ్యా నమస్కారము చేయు చున్నావా? అన్నట్లు ఉన్నాయి

తాత్పర్యం : మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి, నిగనిగలాడే సుకుమారమైన తమ రేకులను ఎత్తి సూర్యునికి అర్ఖ్యమిస్తూ, సంధ్య వారుస్తున్నాయా అన్నట్లున్నాయి.

4. తే.గీ. బంతి, చేమంతి థక్తోతో బసవు దిద్ద
రంగు గోరంట జాతి పారాణులద్ద
పట్టు కుచ్చులు కుంకుమ బొట్టుఱెట్ట
నలరు మాయూరు పెద్దముల్తైదువట్లు.

మా + ఊరు = మా ఊరు
బంతి = బంతిపూలతోను
చేయుంత = చేమంతిపూలతోను
భక్తి = భక్తితో
పసవుదిద్ద = పసుపుతో దిద్దినట్లు ఉన్నాయి
గోరింట = గోరింటాకు
రంగు = రంగు
జాతి = మేలిమి (గొప్పదైన)
పారాణులు + అద్ద = మా ఊరికి పారాణి అద్దినట్లున్నది
పట్టుకుచ్చులు = పట్టుకుచ్చుల పూలు
కుంకుమ = ఎర్రని
బొట్ట్పెట్ట = బొట్టుపెట్టినట్లున్నద
మా+ఊరు = వీటి వలన మా ఊరు
పెద్ద ముత్తెదువు + అట్లు = పెద్దముత్తైదువు వలే
అలరు = ఒప్పుచున్నది

తాత్పర్యం: బంతి, చేమంతిపూలు మా ఊరికి పసుపు దిద్దినట్లున్నాయి. ఎఱ్ఱని గోరింటాకు మా ఊరికి పారాణి అద్దినట్లుంది. పట్టుకుచ్చుల పూలు మా ఊరికి కుంకుమదొట్టు పెట్టినట్లున్నాయి. వీటివల్ల మా ఊరు పండు ముత్తైదువు వలె శోభిల్లుతున్నది. (ప్రకృతి దృశ్యాల్లో సాంస్క్రతిక విలువలు దర్శించడం కవి ఊహాత్మక శక్తికి తార్కాణం).

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

5. ఉ. మారెడు లల్లనేరడులు మామిడి రేగులు జామ నిమ్మలం
జురల నంట్లు దాడిమల సోగగులాబులు మల్లె మొల్లగ
న్నేరులు దాసనల్ వెలసి నిశ్చలతన్ దమకార్తులందు నిం
పొర ఫలాల పూవులను నంచెలవారగ సంతరించి మా
యూరి కుపాయనం విడుచునుండును దంపతులట్ల్ నిత్యమున్.

ప్రతిపదార్థం

అంచెలహారిగ = ఆయా కాలములలో
మారెడులు = మారేడు
అల్లనేరడులు = అల్లనేరేడు
మామిడి = మామిడి
రేగులు = రేగు
జామ = జామ
నిమ్మలు = నిమ్మ
అంజూరలన్ = అంజూర
అంట్లు = అరటిచెట్లు
దాడిమల = దానిమ్మవంటి వృక్షాలు
సోగగులాబులు = అందమైన గులాబులు
మల్లె = మల్లె
మొల్ల = మొల్ల
గన్నేరులు = గన్నేరు
దాసనల్ = దాసన మొ॥ పూలమొక్కలు
వెలసి = వలసిల్ల
నిశ్చలతన్ = నిశ్చలముగా
తమకార్తులు+అందు = తమ కాలములలో
ఇంపార – నిండుగా
ఫలాల – పండ్లను
పూవులను – పూలను
సంతరించి – వెలయించి
మా + ఉఈకి – మా ఉరికి
నిత్యమున్ – ఎల్లప్పుడు
దంపతులు+అట్లు – దంపతుల వలె
ఉప+అయనంబు – కానుకలుగా
ఇడుచును+ఉండును – సమర్పిస్తుంటాయి.

తాత్పర్యం : ఆయా కాలాల్లో మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన వృక్షాలు వివిధ ఫలాలనూ; అందమైన గులాబీ, మల్ల, మొల్ల, గన్నేరు, దాసన మొదలైన మొక్కలు వివిధ పుష్పాలనూ; దంపతులవలె మా ఊరికి ఎల్లవేళలా కానుకగా సమర్పి స్తుంటాయి.

6. తే. గీ. మావులున్నవి – మధురముల్ మంచినీటి
బావులున్నవి, అందాలు పరిమళించు
తొవులున్నవి, పుణ్యాల ప్రోవులైన
యావులున్నవి, మాయూర నతిశయముగ.

ప్రతిపదార్థం

మా+ఊరన్ = మా ఊరిలో
మావులు+ఉన్నవ = మామిడి తోటలున్నవి
మధురముల్ = తీయనైన
మంచొనీటి = మంచినీటి
బావులు+ఉన్నవి = బావులు చాలా ఉన్నాయి
అందాలు = సుందరమైన
పరిమళించు = పూలతో సుహాసనలు వెదజల్లే
తావులు = ప్రదేశాలు
ఉన్నవి = ఉన్నాయి
పృణ్యాల = పుణ్యాల
(ప్రోవులు+ఐన = రాశులైన
ఆవులు = ఆవులు
అతిశయముగ = ఎక్కువగా
ఉన్నవి = ఉన్నాయి

తాత్పర్యం: మా ఊరిలో ఎన్నో మామిడి తోటలున్నాయి. తీయని మంచినీటి బావులు అనేకమున్నాయి. అందాల పూల పరిమళం వెదజల్లే (ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పుణ్యరాశులైన అవృలు అసంఖ్యాకంగా ఉన్నాయి.

7. ఉ. నేయుదురెన్నియేని కమనీయపు నాగరికాంబరమ్మ్లులన
వేయుదు రద్దకంబులతి వేల పృరాతన చిత్రవర్ణముల్
సోయగమైన నేతపని సొంపుల నేర్పరులైన పద్మశా
లీయ కుటుంబముల్ రుచిరలీల వసించును మా పురమ్మునన్.

ప్రతిపదార్థం

మా పురమ్మునన్ = మా ఊరిలో
పద్మశాలీయ కుటుంబముల్ = పద్మశాలీ కుటుంబాల వారు
నాగరిక = నేటి నాగరికతకు సరిపడే
కమనీయపు = అందమైన
అంబరమ్ములన్ = వస్త్రములన్
ఎన్నియేన = ఎన్నో
నేయుదురు = నేతనేస్రారు
అతి = మిక్కిలి
వేల పురాతన = చాలా పూర్వకాలపు
చిత్రవర్ణముల్ = ఆకర్షణీయమైన రంగులతో
అద్దకంబులు = అద్దకం
వేయుదురు = వేస్తారు
సోయగము+ఐన = అందమైన
నేతపని = చేనేతపని
సొంపుల = అందములో
నేర్పరులు+ఐన = నైపుణ్యము గల
పద్మశాలీయ కుటుంబముల్ = పద్మశాలి కులానికి చెందిన కుటుంబాలు
రుచిరలీల = మనోహరముగా
వసించును = నివసించుచున్నాయి.

తాత్పర్యం: మా ఊర్లో ఉండే పద్మశాలీ కుటుంబాల వాళ్ళు నేటి నాగరికతకు సరిపోయే ఎన్నో అందమైన వస్త్రాలను చక్కగా నేస్తారు. చాలా పురాతనమైన బొమ్మలను కూడ ఎన్నో ఆకర్షణీయమైన రంగులతో అద్దకం వేస్తారు. అందమైన నేతపనిలో నేర్పరులైన ఈ పద్మశాలీ కుటుంబాలు మా గ్రామంలో ఎన్నో ఉన్నాయి.

TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

8. ఉ. గోదలు పాడిగేదెలును కొట్టము నిండుగ దుక్కిట్ద్దులన్
భేదము లేక సాకుచును బిడ్డల బోలెను-కారుకారు కిం
పాదిక భూమి దున్నుకొని హాయిగ నుందురు పాడిపంట లా
హ్లాదము గూర్పు మాపురమునందలి కాపు కుటుంబముల్ తగన్.

ప్రతిపదార్థం

మా పురమున్ + అందలి = మా ఊరిలోని
కాపు కుటుంబముల్ = కాపు కులానికి చెందిన కుటుంబముల వారు
తగన్ = తగినట్లు
గోదలు = ఎడ్లు
పాడిగేదెలును = పాలిచ్చే ఆవులను, గేదెలను
దుక్కి+ఎద్దులన్ = పొలం దున్నే ఎద్దులను
కొట్టము నిండుగ = పశువుల పాక నిండునట్లు అన్నిటిని

భేదము లేక = తేడా లేకుండునట్లు
బిడ్డల+పోలెను = తమ సొంత పిల్లల వలె
సాకుచును = పోషించుదురు
కారు కారుకు = ప్రతి పంట కాలంలో
ఇంపాదిక = తగినట్లు
భూమి దున్నుకొని = పొలం దున్నుకొస
పాడిపంటలు = పాడి సమకూరుస్తూ, పంటలలు పండిస్తూ
ఆహ్లాదము = ఆనందం
కూర్పు = కలుగుచుండగా
హాయిగన్+ఉందురు = సంతోషంగా జీవిస్తారు

తాత్పర్యం: మా ఊరి కాపు కుటుంబాలవారు ఎడ్ల, పాలిచ్చే బర్రెలు, దున్నే ఎడ్లు అనే భేదం లేకుండా పశువుల నన్నింటిని తమ బిడ్డలవలె పోషిస్తారు. ప్రతి పంటకాలంలో భూమిని దున్ని, పంటలు పండిస్తూ, పాడిని సమకూరుస్తూ సంతోషంగా జీవిస్తారు.

9. తే. గీ. బహుళవస్తు ప్రధాన సంపన్నమగుచు
నెలమి క్రయ విక్రయార్థి సంకులమునగుచు
జనగతాగత కల్లోల సాంద్రమగుచు
జెలయు మా యంగడులు నన్నివేళలందు

ప్రతిపదార్థం

మా+అంగడులను = మా ఉరిలోని దుకాణాలు
అన్నివేళలు + అందు = అన్ని సమయాలలో
బహుళ = అనేక
వస్తు = వస్తువులతో
ప్రధాన సంపన్నము+ అగుచున్ = నిండినదై
ఎలమి = ఎక్కువైన
క్రయ = అమ్మకము
విక్రయ + అర్థి = కొనుగోలు చేయువారితో
సంకులమున్ + అగుచు = కిక్క్కిరిసినదై
జనగత + ఆగత = ప్రజల రాకపోకల వలన
కల్లోల = సందడితో
సాంద్రము+అగుచు = దట్టమైనదై
వెలయు = విలసిల్లుచున్నాయి

తాత్పర్యం: మా ఊరిలోని అంగళ్ళు అన్నివేళలా అనేక వస్తువులతో సంపన్నమై, అమ్మకానికి, కొనడానికి వచ్చిన జనంతో క్రిక్కిరిసి, జనం రాకపోకల సందడితో వెలుగొందు తాయి.

పాఠం నేపథ్యం /ఉద్దేశం:

పల్లెటూర్లు శాంతి సౌభాగ్రాలకు నిలయాలు. (పేమాసురాగాల కోవెలలు. పచ్చని ఏప్రకికి ఆలవాలం పల్లె. అటువంటి పల్లెటూరి సౌందర్యాన్ని తెలుపడే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం పద్యప్రక్రియకు చెందినది. దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతోపాటు, పల్లెసోయగాన్ని కవి వర్ణించాడు. ఈ పాఠ్యభాగం ఆచ్చి వేంకటాచార్యులు రచించిన ‘మా ఊరు’ లఘుకావ్యంలోనిది.

కవి పరిచయం:

కవి : ఆచ్చి వేంకటాచార్యులు.
కాలం : 1914 – 1985వ సం॥
జన్మస్థలం : నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాదు మండలం, ఆవునూరు గ్రామం.
రచనలు : బుర్రకథ, రాగమాల, మా ఊరు.
విశేషాలు : ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.

ప్రవేశిక:

పల్లెటూర్లో ఎటుచూసినా పచ్చదనం కసిప్త్రుంది. పల్లె ఆనందాన్ని కలిగిస్తుంది. పల్లేసీమలు సౌందర్య నిలయాలు, జాలువారే సెలయేళ్ళు, చెరువులు, నీటిలో తేలియాడే తాముయు, రకరకాల పుష్పాలు, వృక్షాలు, ఒకటేమిటి? అడుగకుండానే అన్నీ ఇచ్చే పల్లెతల్లి ఎంతో స్వచ్ఛమైంది. గగామసీమల సుందర దృశ్లాలు అక్కడి వ్యాపార విధానాలు, వవిధ వృత్తుల వారి జీవనం ఎంత నిష్కల్మషంగా ఉంటాయో చూద్దాం.

నేనివి చేయగలనా?

  • పద్యాలను రాగంతో, భావంతో చదువగలను. అవును,/ కాదు
  • పద్యాలను చదివి వాటి భావాలను సొంత మాటలలో చెప్పగలను. అవును /కాదు
  • ఊరి అందాలను వర్ణిస్తూ రాయగలను. అవును /కాదు
  • పల్లెటూర్ల స్థితిగతులను గురించి సొంతంగా రాయగలను. అవును/ కాదు
  • ఊరి బొమ్మగీసి రంగులు వేయగలను. అవును/ కాదు

Leave a Comment