Telangana SCERT 7th Class Telugu Guide Telangana 2nd Lesson నాయనమ్మ Textbook Questions and Answers.
నాయనమ్మ TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.
ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.
పై బొమ్మలో ముసలవ్వ, ఆమె కొడుకు, కోడలు, మనుమడు, మనుమరాలు ఉన్నారు.
ప్రశ్న 2.
బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు.
బొమ్మలో ముసలవ్వకు కోడలు బువ్వ తినిపిస్తున్నది. కొడుకు సహాయం చేస్తున్నాడు.
ప్రశ్న 3.
ముసలవ్వకు సేవలు చేస్తున్నవారు ఎవరై ఉంటారు?
జవాబు. ముసలవ్వకు సేవలు చేస్తున్నవారు ఆమె కొడుకు, కోడలు అయి ఉంటారు.
ప్రశ్న 4.
మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎలాంటి సేవలు చేస్తారు?
జవాబు.
మా ఇంట్లో ఉండే వృద్ధులకు మేము త్రాగడానికి నీరిస్తాము. తినడానికి భోజనము అందిస్తాము. తినలేనివారికి తినిపిస్తాము. లేవలేని మా అవ్వను చేయి పట్టుకొని నడిపిస్తాము. వీధిలో అటుఇటు తిప్పుతాము. ఆరోగ్యం సరిగాలేనప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకుంటాము. మందులు టైం ప్రకారం వేస్తాము. వారికి అవసరమైన వాటిని విసుగులేకుండా సమకూరుస్తాము.
ఆలోచించండి – చెప్పండి (TextBook page No.12)
ప్రశ్న 1.
“సాధారణంగా పిల్లలు నాయనమ్మను ఇష్టపడతారు” ఎందుకు?
జవాబు.
నాయనమ్మ పక్కన పడుకోబెట్టుకొని కథలు చెబుతుంది. ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేయించి బడికి పంపుతుంది. కొనుక్కొని తినడానికి డబ్బులిస్తుంది. ఇంట్లో చేసిన పిండివంటలు దాచిపెట్టి మళ్ళీ మళ్ళీ ఇస్తుంది. అందువల్ల పిల్లలకు నాయనమ్మ అంటే ఇష్టం.
ప్రశ్న 2.
“ఏంకాదులే అవ్వా! అన్నింటికీ ఆ దేవుడున్నాడు” అని ఇంటికి వచ్చినవారు అనటంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
నాయనమ్మను బిడ్డలు సుఖంగా చూసుకుంటున్నారు. ఏలోటూ లేదు. కానీ ఆమెకు కళ్ళు కనిపించవు. నడవలేదు. మంచం మీదనే ఉండడం ఆమెకు ఇబ్బందిగా ఉండేది. అందుకే వచ్చిన వారితో ‘ఎవళ్ళకూ పనికిరాని బతుకు’ అనేది. అందుకు వారు “నీవు కష్టపడకుండా ఇలాంటి సమయంలో కూడా బాగా చూసుకునే బిడ్డలున్నారు. సంతోషంగా ఉన్నావు. కొన్నిచోట్ల అలాలేదు. వారితో పోల్చితే నీవే ఎంతో మేలు” అన్నారు. అందుకే ‘ఎవరు ఎలా జీవించాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు’ అని అన్నారు.
ప్రశ్న 3.
“సల్లంగుండు బిడ్డా” అని ఏయే సందర్భాలలో అంటారు?
జవాబు.
పెద్దలకు మొక్కినపుడు, పుట్టినరోజునాడు, ఎవరినైనా ప్రమాదంలో కాపాడినపుడు, మంచిగ మాట్లాడినపుడు, ఆడపిల్లను అత్తవారింటికి సాగనంపేటపుడు, బాగా చదువుచున్నపుడు, అందరిచే పొగడబడినపుడు ‘సల్లంగుండు బిడ్డా’ అని దీవిస్తారు.
ప్రశ్న 4.
మీరు ఏయే ఆటలు ఆడుతారు?
జవాబు.
క్రికెట్టు, కబడ్డి, హాకీ, ఖోఖో, బంతాట, దాగుడుమూతలు, చిర్రగోనె, మేకపులి, వామనగుంటలు మొదలైన ఆటలు మేము ఆడుతాము.
ప్రశ్న 5.
ఈ మీతో ఆడడానికి వస్తానని స్నేహితుడు రాకపోతే మీకేమనిపిస్తుంది?
జవాబు.
ఆడడానికి వస్తానని రాకపోతే స్నేహితునిపై కోపం వస్తుంది. ఎంతో ఆనందంగా ఆడుకోవడానికి వచ్చినపుడు ఆ ఆనందాన్ని దూరం చేస్తూ అతడు రానప్పుడు అతనితో ఎప్పటికీ మాట్లాడకూడదనిపిస్తుంది.
ప్రశ్న 6.
కలసి ఆడడంలో ఉన్న ఆనందం ఎటువంటిది?
జవాబు.
కలసి ఆడడం వల్ల ఉరుకులు, పరుగులు, కేరింతలు, గెలుపు ఓటములు, వెక్కిరింతలు, పొగడ్తల మధ్య సంభాషణలతో కలిగే మానసికోల్లాసం మాటల్లో చెప్పలేనిది.
ప్రశ్న 7.
మీరు ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేశారా? ఎట్లాంటి సహాయం చేశారో చెప్పండి?
జవాబు.
నేను ఒక ముసలాయనకు సహాయం చేశాను. బడికి వెళ్ళేదారిలో ఒక వ్యక్తి స్కూటరుపై వెళ్తూ అటుగా పోతున్న పెద్దాయనను ఢీకొట్టి వెళ్ళిపోయాడు. అతనికి దాదాపు 65 సంవత్సరాలు ఉంటాయి. మోచేతిపై రక్త గాయం అయింది. కాలువలో పడిపోయాడు. అక్కడ ఎవరూలేరు. నేను పరుగెత్తుకెళ్ళి అతన్ని లేవదీసి, శుభ్రపరచి, ఇటుకల బట్టీ వద్దకు వెళ్ళి వారికి చెప్పి 108కి ఫోను చేయించి, త్రాగడానికి నీరు తెచ్చి తాగించాను. అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళేవరకు అక్కడే ఉండి సేవలు చేశాను.
ప్రశ్న 8.
జ్వరం వచ్చినపుడు ఇంట్లో అందరూ నాయనమ్మతోనే ఉన్నారు కదా! దీనివల్ల నీవేమి గ్రహించావు?
జవాబు.
నాయనమ్మకు జ్వరం వచ్చినపుడు అందరూ ఆమెతోనే ఉన్నారు. దీనినిబట్టి ఆమెపై అందరికీ ప్రేమాభిమానాలు ఎక్కువని, అందరికీ ఆమె అంటే ఇష్టం అనీ, అనారోగ్యముతో ఉన్న వారి దగ్గర మనుషులుంటే వారు ధైర్యంగా ఉండి తొందరగా కోలుకుంటారని నేను గ్రహించాను.
ప్రశ్న 9.
శేఖర్ నాయనమ్మపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు?
జవాబు.
శేఖర్తో రవి ఎక్కువ సమయం ఆడడంలేదు. దానికి కారణం రవి నాయనమ్మకు సేవ చేయడమే. అందుకే నాయనమ్మపై శేఖర్ ద్వేషం పెంచుకున్నాడు.
ప్రశ్న 10.
ఆ నీకు ఎప్పుడైనా ఎవరిమీదైనా కోపం వచ్చిందా? ఏ సందర్భంలో వచ్చిందో తెలపండి.
జవాబు.
మా పక్కింటి రంగన్న అతని 55 సంవత్సరాల తల్లిని పట్టుకొని వీధిలో కొడుతుంటే అతన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది.
ప్రశ్న 11.
శేఖర్ పశ్చాత్తాప పడ్డాడుకదా! మీరు ఏయే సందర్భాలలో పశ్చాత్తాప పడ్డారో చెప్పండి?
జవాబు.
- మా ఇంట్లో పిండివంటలు చేసినపుడు నాకు లేకుండా మా అన్న తినగా నేను ఏడ్చాను. మా అమ్మ అన్నను కొట్టింది. అతను బాధపడుతున్నప్పుడు,
- బడిలో నేను మాట్లాడినందుకు టీచరు నా పక్కన అబ్బాయిని కొట్టినప్పుడు నేను పశ్చాత్తాప పడ్డాను.
ప్రశ్న 12.
శేఖర్ అందరితో మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉండిపోవడానికి కారణాలు వివరించండి.
జవాబు.
శేఖర్ చేసిన పని వల్ల నాయనమ్మ కాలు విరిగింది. దానివల్ల అందరూ బాధపడుతున్నారు. దాన్ని చూసి తాను చేసిన తప్పువల్ల ఇంతమంది బాధకు నేను కారణమయ్యానని భావించి శేఖర్ ముభావంగా ఉన్నాడు.
ప్రశ్న 13.
నాయనమ్మ క్షమించినా శేఖర్ ఎందుకు ఏడ్చాడు?
జవాబు.
శేఖర్ తాను చేసిన తప్పును చెప్తే నాయనమ్మ కోపపడుతుందని, కొడుతుందని భావించి ఉంటాడు. కానీ నాయనమ్మ అలా చేయలేదు. ఏమీ అనకపోగా బుజ్జగించడం, ఆప్యాయతతో వీపుపై నిమరడం చేసింది. దానితో పశ్చాత్తాప భావం ఎక్కువై శేఖర్ భోరున ఏడ్చాడు.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. రవి శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నారుగదా! ఎక్కువమంది పిల్లలు ఎవరివలె ఉంటారు? ఎందుకు?
జవాబు.
సాధారణంగా ఎక్కువమంది పిల్లలు శేఖర్ వలె ఉంటారు. ఎందుకంటే పిల్లలు తన ఈడు వారితో కలసి ఆడుకోవడానికి, ఆనందంగా తిరగడానికి ఇష్టపడతారు. దానికి ఇబ్బంది ఏర్పడినపుడు తీవ్ర అసహనానికి లోనవుతారు. కోపంతో ఆ ఇబ్బందికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అది పిల్లల మనస్తత్త్వం.
2. నాయనమ్మ కథను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
ఒక ఊరిలో రవి కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో రవి అమ్మానాన్నలు, తమ్ముడు, చెల్లెలు, నాయనమ్మ ఉండేవారు. నాయనమ్మకు వయసు అధికమై కళ్ళు కనిపించక, నడవలేక మంచం పట్టింది. ఆ ఇంట్లో అందరూ ఆమెకు సేవలు చేస్తుండేవారు. కొన్ని కొన్ని పనులలో ఇతరులపై ఆధారపడకుండా మంచానికి ఇరువైపులా ఆయా వస్తువులను పెట్టమని చేతితో తడిమి అవ్వే తీసుకొనేది.
ఒకసారి రవి చుట్టాలబ్బాయి శేఖర్ అమ్మానాన్నలతో కలిసి వీరింటికి వచ్చాడు. శేఖర్కు రవితో ఆడుకోవడం ఇష్టం. అవ్వకు జ్వరం రావడంతో రవి ఎక్కువ సమయం శేఖర్తో ఆడలేదు. అందుకు కోపించిన శేఖర్ అవ్వపై ద్వేషం పెంచుకున్నాడు. మంచంపక్కన వస్తువులను తారుమారు చేశాడు. అవ్వ మంచం దిగబోయి చెప్పులనుకొని నీళ్ళబిందెలో కాలుపెట్టింది. అవ్వకాలు విరిగింది. అవ్వ కిందపడింది. నెలరోజులు ఆసుపత్రిలో ఉండింది.
ఆ కుటుంబ సభ్యులు, అవ్వ బాధపడడం చూసి తనవల్లనే ఇదంతా జరిగిందని శేఖర్ పశ్చాత్తాప పడ్డాడు. ఎవరూలేని సమయంలో తాను చేసిన పనివల్లనే నీకీ కష్టం వచ్చిందని చెప్పి భోరున ఏడ్చాడు. నాయనమ్మ అతన్ని హత్తుకొని కన్నీళ్ళు తుడిచి, నవ్వింది. “నేను కష్టపడడం చూసి నీలో మార్పు వచ్చింది. “అందరితో కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండు” అంటూ వీపుపై నిమిరింది.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కిందిపేరా చదవండి. ముఖ్యమైన పదాలు రాయండి.
ఒక శివరాత్రినాడు శివుడిని దర్శించడానికి జనం సముద్రంలాగ వచ్చారు. ఆ జనసమ్మర్థంలో కండ్లు సరిగా కనపడని ఒక వృద్ధురాలు కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలోని గిన్నె గోతిలో పడింది. నుదిటిమీద దెబ్బతోని అవ్వ స్పృహ తప్పింది. ఎవ్వరూ ఆ ముసలమ్మను పట్టించుకోలేదు. శివుడిని చూడడానికి ఎగబడ్డారు. ఇద్దరు ఆడపిల్లలు అది చూశారు. అవ్వను లేవదీసి కూర్చోబెట్టారు. దుమ్ముధూళి దులిపి గాయానికి కట్టుకట్టారు. అవ్వకు చల్లని నీళ్ళు తాగించారు. శివపూజకు తెచ్చిన అరటిపండ్లను తినిపించారు. “బంగారు తల్లులారా! సేవచేసి నా ప్రాణం కాపాడారు” అని అవ్వ ఆనందభాష్పాలు రాలుస్తూ ఆ పిల్లల్ని దీవించింది. ఉదా : జనసమ్మర్ధం, దీవించటం.
జవాబు.
- దర్శించటం
- శివరాత్రి
- జనసమ్మర్ధం
- కాలుజారి పడిపోవడం
- స్పృహతప్పడం
- పట్టించుకోకపోవడం
- దుమ్ముదులపడం
- గాయానికి కట్టుకట్టడం
- నీరుతాగించడం
- అరటిపండ్లు తినిపించడం
- దీవించడం
- ఆనందబాష్పాలు
2. కింది వాక్యాలు చదవండి. వీటిలో మీరు చేసేవాటికి ‘✓’ లేకుంటే ‘X’ గుర్తు పెట్టండి.
(అ) నాకు ముసలివాళ్ళంటే బాగా ఇష్టం. (√)
(ఆ) నేను ముసలివాళ్ళకు ఎప్పుడైనా పనులు చేసిపెడతాను. (√)
(ఇ) ఎవరి వస్తువులైనా నాకిష్టమైతే తీసుకుంటాను. (X)
(ఈ) ఇంటికి వచ్చిన చుట్టాలు పిల్లలతో ఎప్పుడూ కలిసి ఆడుకుంటాను. (√)
(ఉ) ముసలివాళ్ళకు మంచినీళ్ళివ్వడం, మందులు ఇవ్వడం వంటివి చేస్తాను. (√)
(ఊ) అమ్మానాన్నలకు పనులలో సహాయం చేస్తాను. (√)
(ఎ) ఎవరైనా నాతో ఆడుకోకుంటే నాకు కోపం వస్తుంది. (√)
(ఏ) నావల్ల ఎవరికైనా బాధ కలిగితే నేను కూడా బాధపడతాను. (√)
(ఐ) నేను చేసిన తప్పులను ఒప్పుకుంటాను. (√)
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
(అ) రవి, శేఖర్ మంచిమిత్రులు కదా! నీకున్న మంచి మిత్రుడెవరు? ఎందుకు?
జవాబు.
నాకున్న మంచి మిత్రుడు మధు. ఆతడు వరంగల్లులో ఉంటాడు. నాఈడు వాడే. అతడు అందరివలె తుంటరి కాదు. నేను చేసే తప్పులను సరిదిద్దుతాడు. చదువు విషయంలో సహాయం చేస్తాడు. పెద్దలతో ఎలామెలగాలో చెబుతాడు. అతనివల్ల నేనెంతో పరివర్తన చెందాను. అందుకే అతడు నాకు మంచిమిత్రుడు.
(ఆ) మీరు వృద్ధులకు ఎటువంటి సేవచేస్తారో తెలుపండి?
జవాబు.
మేము వృద్ధులకు రోడ్డుదాటటంలో సహాయం చేస్తాము. ఆరోగ్యం సరిగాలేనివారిని దవాఖానాకు తీసుకెళ్తాము. స్పృహ కోల్పోయేస్థితిలో ఉంటే ప్రథమచికిత్సగా వారికి సపర్యలు చేసి నీరు తాగించి, తినడానికి ఏదైనా ఇచ్చి తినిపిస్తాము. వారికి మా చేతనైనంత వరకు సేవ చేస్తాము. అవసరమైతే పెద్దల సహాయం తీసుకుంటాము.
(ఇ) “కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి” ఎందుకో రాయండి.
జవాబు.
కుటుంబంలో అవ్వ, తాత, అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, పినతండ్రి, పిన్నమ్మ, వారి పిల్లలు అందరూ కలిసి ఉండాలి. ఎంత చదివినా జీవితంలో కొన్ని పెద్దల ద్వారా అనుసరించి నేర్చుకోవాలి. అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు అనుకరణ ద్వారానే నేర్చుకుంటాము. పిల్లలు చేసే తప్పులను సరిదిద్దుతారు. దండనలు, బుజ్జగింపులు, కీచులాటలు, అన్యోన్యతలు, ప్రేమాభిమానాలు సమిష్టికుటుంబంలోనే ఉంటాయి. స్వార్థంతో విడిపోయి ఇలాంటి అనుభూతులకు దూరంగా బతకడంలో ఏ మాత్రము సుఖసంతోషాలుండవు.
(ఈ) “ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషంవంటిది” దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
విషం మనిషి నాడీవ్యవస్థపై తీవ్రప్రభావాన్ని చూపి తొందరగా మనిషిని చంపేస్తుంది. ఈర్ష్యకూడా అలాంటిదే. ఈర్ష్య మనసుకు సంబంధించినది. ఓర్వలేనితనంవల్ల మనిషి మంచి ఆలోచన చేయడు. మంచి పనులు చేయడు. ప్రతీకారంతో చెడు ఆలోచనలు, చెడుపనులు చేస్తాడు. చెడు ఫలితాలను పొందుతాడు. సమాజంలో చెడ్డవానిగా గుర్తింపు పొందుతాడు. గౌరవ మర్యాదలు కోల్పోయి, అందరిచే దూషింపబడతాడు. అంటే ఈర్ష్యకలవాడు నైతికంగా చచ్చిపోతాడన్నమాట. అందుకే ఈర్ష్య మనసుకు విషం.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
శేఖర్ మార్పురావడానికి కారణాలేమిటి? నేటికాలంలో ఎక్కువమంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు? దుస్థితికి కారణాలు వివరించండి ?
జవాబు.
శేఖర్ రవి తనతో ఎక్కువ సమయం ఆడుకోలేదనే కోపంతో నాయనమ్మ కాలు విరగడానికి కారణమయ్యాడు. తర్వాత అవ్వ బాధపడడం చూచి అవ్వ స్థానంలో అమ్మను ఊహించుకొని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు.
నేటి కాలంలో వృద్ధులు చాలామంది వృద్ధాశ్రమాల్లో గడుపుచున్నారు. దానికి కారణం ఉమ్మడి కుటుంబాలు విడిపోయి చిన్నకుటుంబాలుగా మారడం.
జీవన విధానంలో డబ్బుసంపాదనే ధ్యేయంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని హాస్టళ్ళలో విడిచిపెడుతున్నారు. దీంతో వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఉద్యోగం నుండి ఇంటికి వచ్చిన దంపతులు విశ్రాంతి తీసుకోవాలి. వారికి వృద్ధులను పట్టించుకునే తీరిక లేదు కనుక వృద్ధాశ్రమాల్లో వదిలి వస్తున్నారు. ఇంకనూ వృద్ధుల వద్ద సంపద లేకపోవడం, వారి పనులు వారు చేసుకోలేకపోవడం నాగరికత పేరుతో నాజూకు అధికమై పరిశుభ్రత పేరుతో వృద్ధులను అసహ్యించుకోవడం వంటి కారణాలు నేటి దుస్థితికి తోడై వృద్ధాశ్రమాలను పెంచుతున్నాయి.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.
హన్మకొండ
తేది : XXXX
ప్రియమిత్రుడు మధుకు,
రాజు రాయులేఖ. ఉభయ కుశలోపరి. మీ నాయనమ్మ బాగుందా? లేచి తిరుగుతుందా? అవ్వను బాగా చూసుకో? కావలసినవి అన్నీ తెచ్చిఇవ్వు. పెద్దలకు ఏ ఇబ్బంది లేకుండా చూచుకోవడం మన ధర్మం. వృద్ధులు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. వయసు పెరిగే కొద్ది మరీ చిన్నపిల్లల వలే మారాం చేస్తారు. వారు మనం పిల్లలుగా ఉన్నపుడు మన తల్లిదండ్రులకంటె ఎక్కువగా మనకు సేవ చేసి ఉంటారు.
చిన్నపిల్లలు ఏ విధంగా పనులు చేసుకోలేక తల్లిదండ్రుల మీద ఆధారపడుతారో అదేవిధంగా ముసలివాళ్ళు వారి పిల్లలపై ఆధారపడతారు. మనం మారాం చేసినపుడు అమ్మానాన్నలు విసుగుచెందకుండా మనల్ని బుజ్జగించి మన అవసరాలు తీర్చినట్లే మనం కూడా వృద్ధుల అవసరాలు తీర్చాలి. అదే మనకు శ్రీరామరక్ష. మరచిపోవు కదా! మీ అవ్వాతాతలను సుఖంగా చూసుకో. మీ అమ్మానాన్నలను అడిగినట్లు చెప్పు. మీ తమ్మునికి నా ముద్దులు. ఇంతే సంగతులు.
ఇట్ల
నీ ప్రియమైన తమ్ముడు
యం. మధు,
ఏడవ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
హన్మకొండ,
వరంగల్ జిల్లా.
చిరునామా :
బి. రాజు
ఏడవ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
సిద్దిపేట, మెదక్ జిల్లా.
V. పదజాల వినియోగం
1. ఈ కింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి.
(అ) అంధులు, ద్వేషం, జ్ఞాపకం, తుంటరి, జపమాల, ఆతృత
పగ | గుర్తు | గుడ్డివారు |
జపంచేసుకునే మాల | అల్లరిచేసేవాడు | తొందరపడు |
జవాబు.
అంధులు = గుడ్డివారు
ద్వేషం = పగ
జ్ఞాపకం = గుర్తు
తుంటరి = అల్లరిచేసేవాడు
జపమాల = జపం చేసుకునే మాల
2. పాఠాన్ని చదవండి. పట్టికలో సూచించిన పదాలను వెతికి రాయండి.
ఆటకు సంబంధించినవి | ఆసుపత్రికి సంబంధించినవి కుటుంబ పదాలు | కుటుంబ పదాలు | అన్యభాషా పదాలు |
చిర్రగోనె | దవాఖానా | ఇల్లు | బీరువా |
దాగుడుమూతలు | మందులు | అమ్ల్, నాన్న | డాక్టరు |
ఈబడ్డి | డాక్టరు | తమ్ముడు | ఎక్స్-రే |
ఎక్స్-రే | చెల్లెలు | ఆపరేషన్ | |
ఆపరేషన్ | నాయసమ్మ | ||
అవ్న |
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది వాక్యాలను సరియైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి.
(అ) నాయనమ్మ కు మందులు వేసుకోవడం చాతనవుతుంది.
(ఆ) కోపం వలన ఇట్లా జరిగింది.
(ఇ) శేఖర్ కొరకు (కోసం) రవి ఎదురు చూశాడు.
(ఈ) అందరి తో కలసి ఆడుకో!
జవాబు.
(అ) నాయనమ్మ కు మందులు వేసుకోవడం చాతనవుతుంది.
(ఆ) కోపం వలన ఇట్లా జరిగింది.
(ఇ) శేఖర్ కొరకు (కోసం) రవి ఎదురు చూశాడు.
(ఈ) అందరి తో కలసి ఆడుకో!
2. ఈ కింది వాక్యాలలో క్రియలను గుర్తించి పక్కనే రాయండి.
(అ) రాజు ఆసుపత్రికి వెళ్ళాడు.
జవాబు.
వెళ్ళాడు.
(ఆ) శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది.
జవాబు.
చదివి నిద్రపోయింది.
(ఇ) మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు.
జవాబు.
పరిగెత్తుతున్నాడు.
(ఈ) సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
జవాబు.
చేసి, వెళ్ళాడు.
పై వాక్యాలలో రెండు క్రియలున్న వాక్యాలు ఏవి? ఈ రెండు క్రియల్లో భేదం గమనించారా?
(ఆ) చదివి, నిద్రపోయింది.
(ఈ) చేసి, వెళ్ళాడు.
పనిని తెలిపే పదాలను ‘క్రియలు’ అంటారు. సాధారణంగా తెలుగులో క్రియలు వాక్యాల చివర ఉంటాయి. ఇవి అసమా పక క్రియలు, సమాపక క్రియలు అని రెండు విధాలు. వాక్యం చివర ఉన్న క్రియలు పని పూర్తయినట్లుగా తెలుపుతాయి. వాటిని “సమాపక క్రియలు” అంటారు. పని పూర్తి కానట్లు తెలిపే క్రియలను “అసమాపక క్రియలు” అంటారు.
ఉదా:
అసమాపక క్రియలు | సమాపక క్రియలు |
వచ్చి | వచ్చాడు, వచ్చారు, వచ్చింది |
చేసి | చేశారు, చేశాడు, చేసింది |
తిని | తిన్నాడు. తిన్నది |
చూచి | చూచాడు, చూచింది. |
చదివి | చదివాడు, చదివింది |
3. కిందివాక్యాల్లో సమాపక, అసమాపక క్రియలు గుర్తించండి.
(అ) చెంబుతో నీళ్ళుముంచుకొని, తాగుతుంది.
జవాబు.
అసమాపక క్రియ : ముంచుకొని
(ఆ) ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు.
జవాబు.
అసమాపక క్రియ : ఆపివేసి
(ఇ) పరీక్షచేసి, కాలువిరిగిందని చెప్పాడు.
జవాబు.
అసమాపక క్రియ : చేసి
(ఈ) దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.
జవాబు.
అసమాపక క్రియ : తీసుకొని
సమాపకక్రియ : తాగుతుంది.
ప్రాజెక్టు పని:
1. మీ ప్రాంతంలోని ఒకరిద్దరు వృద్ధులను కలవండి. ఏమేమి పనులవల్ల సంతోషం కలుగుతుందో తెలుసుకొని రాయండి.
జవాబు.
నా పేరు మధు. 7వ తరగతి చదువుచున్నాను. మాది వరంగల్లు పక్కనే ఉన్న హన్మకొండ. నేను ఒకరోజు అనుకోకుండా మా యింటి ప్రక్కనున్న రంగస్వామి, లక్ష్మక్క దంపతులను కలిశాను. వారికి దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి. అసలు నేను వాళ్ళింటికి వెళ్ళింది వాళ్ళ మనుమడు కుప్పుస్వామితో ఆడుకోవాలని. అతడు లేకపోయేసరికి వారితో పిచ్చాపాటి మాట్లాడాను. వారు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిలో వారికి సంతోషం కలిగించేవి కొన్ని తెలియజేస్తాను.
- తమ బిడ్డలు ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఉమ్మడికుటుంబంగా జీవిస్తుండడం.
- ఇప్పటికీ వీరి సలహాలు తీసుకొని, వాటి ప్రకారం పనులు చేయడం.
- వారు అధిక పని ఒత్తిడితో ఉన్నప్పటికీ తమని ఇంట్లోనుండి బయట కాలుపెట్టకుండా సుఖంగా చూసుకోవడం.
- వారి ఆలనాపాలనా ప్రతినిత్యం పర్యవేక్షించడం.
- మనుమళ్ళు, మనుమరాళ్ళు, మునిమనమళ్ళతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండడం. అవ్వాతాతలు వారితో ఆడుకోవడం.
- ఇరుగు పొరుగు వారితో తగాదాలు లేకుండా ఉండడం.
- వయసులో పెద్దవారు కనుక వీధిలోవారు, చుట్టాలు వీరి వద్ద తగిన సూచనలు తీసుకోవడం.
- సాయంకాలం అందరూ కలసి ఆరుబయట పురాణకాలక్షేపం చేయడం.
- అందరు కలసి భోంచేయడం.
- ఇంత వయసు వరకు ఆరోగ్యంగా ఉండడం, దానికోసం చిన్నచిన్న వ్యాయామాన్నిచే ఇంటి పనులు చేసుకోవడం వంటి విషయాలు వృద్ధులకు సంతోషాన్నిస్తాయని వారి మాటలవల్ల తెలిసింది.
(లేదా)
మీ ప్రాంతంలోని తాత, నాయనమ్మలతో కలసి ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబాన్ని కలిసి, వారితో మాట్లాడండి. మీ కెట్లా అనిపించిందో రాయండి.
జవాబు.
నాపేరు మధు. 7వ తరగతి చదువుచున్నాను. మాది వరంగల్లు సమీపంలో హన్మకొండ. నేనీవేసవి సెలవుల్లో మా అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళఊరు సిద్ధిపేట. అక్కడ నా మిత్రుడు రాజు ఇంటికి వెళ్ళాను. వాళ్ళింటిలో తాత, నాయనమ్మ, వారి ఇరువురు కుమారులు, వారి పిల్లలు ఆరుగురు మొత్తం పన్నెండుమంది ఉంటారు. వారు చాలా అనందంగా ఉన్నారు. ఒకరికొకరు పనులలో సహాయం చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవిస్తున్నారు.
వారి మాటల్లో సంతృత్తి, ఆనందం మాటల్లో చెప్పలేనిది. వారితో మాట్లాడిన తర్వాత మా కుటుంబంలో కూడా అవ్వాతాతలు, చిన్నాన్న చిన్నమ్ములు, వారి పిల్లలు అందరూ మాతో కలిసి ఒకే ఇంట్లో ఉంటే బాగుండేదనిపించింది. మా తల్లిదండ్రులు అవ్వాతాతలతో ఎప్పుడో విడిపోయారు. ఇప్పుడు వారు మాకు చుట్టాలే. అందరం కలిసి ఉండుంటే రాజువలె నేను కూడా పురాణకథలు చెప్పించుకునేవాడిని. అనేక నీతి, ధర్మం, జీవనసత్లాలకు సంబంధించిన విషయాలు తెలిసేవి. ఒంటరితసంతో బాధపడేవాడినికాదు అనిపించింది. మా నాన్నతో చెప్పి వెంటనే మా అవ్నాతాతలను మా ఇంట్లోసే ఉండమని బ్రతిమిలాడుతాను. అందరూ కలసి ఉంటే ఆ ఆనందమే వేరు.
TS 7th Class Telugu 2nd Lesson Important Questions నాయనమ్మ
అర్థాలు:
- దవాఖానా = ఆసుపత్రి
- బుగులైంది = బాధ కలిగింది
- తీరు = విధము
- ఈర్ష్య = ఓర్వలేనితనము
- మాల = దండ
- డూస్తూ = దువ్వుతూ
- మందుగోలీలు = మాత్రలు
- నయం = బాగుకావడం
సమానార్థక పదాలు ( పర్యాయపదాలు):
- కన్ను = నేత్రము, అక్షి, లోచనం, చక్షువు
- అమ్మ = తల్లి, మాత, జనని
- ఈర్య్య = అసూయ, ఈసు, ఈసరము
- ఆట = తాండవము, నాట్యము, లాస్యము
- చీకటి = అంధకారము, తిమిరము, ధ్వాంతము
నానార్థాలు:
- అవ్వ = తల్లితల్లి, తం(డ్డితల్లి, పూజ్యురాలు
- కన్ను = నేత్రము, వలరంధ్రము
- మాల = పూలదండ, వరుస, జాతివిశేషము
- మెత్త = పరుపు, మృదువైనది
ప్రకృతి – వికృతి:
- ఈర్య – ఈసు, ఈసము
- సహాయం – సాయం
- వృద్దులు – పెద్దలు
- గౌరవం – గారవం
- రాత్రి – రాతిరి, రేయి
- అంబ – అమ్మ
- మంచము – మంచె
- ఆశ – ఆస
- సంతోషము – సంతసము
- స్నేహము – నెయ్యము
- పయత్రము – జతనము
- నిటలము – నొసలు
- విషం – విసం
వ్యతరేక పదాలు:
- కష్టం × సుఖం
- కోపం × శాంతం
- సంతోషం × దుఃఖం, బాధ
- నవ్వు × ఏడుపు
- (పేమ × పగ, ద్వేషం
- తప్ప × ఒప్పు
- కొద్ది × చాలా
సంధులు:
నాయనమ్మ = నాయన + అమ్మ = అకారసంధి
పెట్టినపుడు = పెట్టిన + అపుడు = అకారసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళము.
తినుమని = తినము = ఉకారసంధి
వినడమన్నా = వినడము = ఉకారసంధి
వస్తాడేమో = వస్తాడు = ఉకారసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చుపరమగునపుడు సంధి నిత్యము.
సమాసములు | విగ్రహావాక్యం | సమాసం పేరు |
సమాసపదం | రెండు సంఖ్యగల దిక్కులు | ద్విగుసమాసం |
రండు దిక్కులు | రెండు సంఖ్రగల రోజులు | ద్విగుసమాసం |
రెండు రోజులు | అమ్మయును, నాన్నయును | ద్వంద్వసమాసం |
అమ్మానాన్నలు | విగ్రహావాక్యం | సమాసం పేరు |
కింది వాక్యాలను సరయఝైన విభక్తి ప్రత్యయాలతో పూరంచండి.
(అ) నాయనమ్మ శేఖర్ ను దగ్గరకు తీసుకున్నది.
(ఆ) నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఉంది.
(ఇ) శేఖర్ రవి కి దగ్గరి చుట్టం.
(ఈ) నాయనమ్మ తో నే ఉన్నాడు రవి.
(ఉ) పెద్ద వయసులో పెద్ద (పమాదం జరిగింది.
(ఊ) శేఖర్కి రవి కంటె అవ్వపై కోపం పెరిగింది.
(ఎ) స్నేహితులతో కలిసి ఆడుకుంటే ఆనందం.
(ఏ) ఆడుకోవాలని ఎంతో ఆశత్తో ఉన్నారు.
(ఐ) నాయనమ్మ తనను (పేమగా చూస్తున్నది.
1. కింది గద్యాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు రాయండి.
రవి నాయనమ్మకు మందులిస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. రవి సేవలు చూస్తున్నకొద్దీ శేఖర్కు కోపం పెరిగిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది. చుట్టుపక్కల ఎవరూలేకుండా చూసి నాయనమ్మ మంచానికి రెండుదిక్కులా ఉన్న వస్తువులను మార్చాడు. బిందె, చెంబు ఉన్న దిక్కు చెప్పులను, చెప్పులు ఉన్న దిక్కున బిందెను ఉంచాడు. తర్వాత ఏమి తెలియనట్లు దూరంగ కూచుని నాయనమ్మనే చూడసాగాడు.
ప్రశ్నలు :
1. రవి ఏమి చేస్తున్నాడు?
2. శేఖర్కు కోపం ఎందుకు కలిగింది?
3. నాయనమ్మ ఎప్పుడు నిద్రపోయింది?
4. శేఖర్ ఏమి చేశాడు?
5. శేఖర్ కోపంతో ఏమి అలోచించాడు?
2. క్రింది గద్యాన్ని చదవండి. దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఒకరోజు రవి వాళ్ళింటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు. వాళ్ళు దగ్గరి చుట్టాలు. వాళ్ళకొడుకు శేఖర్, రవి ఒకే ఈడువాళ్ళు. ఒకరితో ఒకరు కలసి ఆడుకోవడమంటే వాళ్ళకు చాలా ఇష్టం. కలిసి ఎగురుతారు, దుంకుతారు, ఆడుతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు. శేఖర్ వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశాడు. శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరకు పోదామా, ఎప్పుడు రవితో కలసి ఆడుకుందామా అని ఆతృతతో ఉన్నాడు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
ఈ గద్యం ఏ పాఠంలోనిది ?
జవాబు.
ఈ గద్యం నాయనమ్మ పాఠంలోనిది.
ప్రశ్న 2.
శేఖర్ ఎందుకు ఆతృతతో ఉన్నాడు?
జవాబు.
రవితో కలిసి ఆడుకోవాలని శేఖర్ ఆతృతతో ఉన్సు.
ప్రశ్న 3.
చుట్టాలు ఎక్కడివారు?
జవాబు.
చుట్టాలు కరీంసగర వారు.
ప్రశ్న 4.
రవి, శేఖర్లు ఎప్పుడు ప్రపంచం మొత్తం మర్చిపోతారు?
జవాబు.
ఆద్దరు కలిసి ఆడుకునేటపుడు ర్రపంచం మొత్తం మర్చిటోశారు.
ప్రశ్న 5.
ఎవరెవరు సమ ఈడువారు?
జవాబు.
రవ, శేఖర్ సమ ఊడువారు,
ప్రశ్న 6.
శేఖర్ నచ్చని విషయం ఏది?
జవాబు.
రవి నాయనమ్మకు సేవచేస్తూ తనతో ఆడుకోవడం శేఖర్ నచ్చని విషయం.
3. క్రింది గద్యాన్ని చదివి ఐదు ప్రశ్నలు రాయండి.
నాయనమ్మ ఏమనలేదు. “నాయనమ్మా! నాకు రవితో ఆడుకోవడమంటే బాగా ఇష్టం. కాని రవి ఎప్పుడూ నన్ను విడిచిపెట్టి నీతోనే ఉంటే నాకు కోపం వచ్చింది. అందుకే అట్లాచేసిన. ఇంక నువ్వు కొట్టినా నాకేం బాధలేదు” అన్నాడు ఏడ్చుకుంట. నాయనమ్మ శేఖర్ను దగ్గరకు తీసుకున్నది. అతని కన్నీళ్ళు తుడిచి నవ్వింది. నాయనమ్మ నవ్వంగనే శేఖర్ ఏడువడం ఆపాడు.
“అంతా మంచే జరిగిందిరా నేను కష్టపడడం చూసి నీలో మార్పువచ్చింది. రవి నాతోనే ఉండడంతో నీకు నామీద ఈర్ష్య కలిగింది. ఇప్పుడా ఈర్ష్య పోయింది. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది. నువ్వింక అందరితో కలిసి ఆడుకో సంతోషంగ ఉండు” అంటూ శేఖర్ వీపుమీద తన అరచేత్తో రాస్తూ ఓదార్చింది.
1. శేఖర్ బాగా ఇష్టమైనదేది?
2. రవికి కోపం ఎందుకు వచ్చింది?
3. ఈర్జ్య ఎటువంటిది?
4. నాయనమ్మ శేఖర్ని ఎలా ఓదార్చి౦ది?
5. ఎవరు ఎవరికి కన్నీళ్ళు తుడిచారు?
4. (అ) క్రింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి.
ప్రశ్న 1.
పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఆతృతతో ఎదురుచూశారు.
జవాబు.
త్తొందరపాటు
ప్రశ్న 2.
ఈర్ష్య మనసుకు విషం వంటిది.
జవాబు.
ఓర్వతేనితనం
ప్రశ్న 3.
దవాఖానాలు ఆరోగ్య ప్రదాయినిలు.
జవాబు.
ఆసుపత్తి
ప్రశ్న 4.
విద్యార్థుల ప్రవర్తనాతీరులో పరివర్తన కలిగించేదే విద్య.
జవాబు.
విధము
ప్రశ్న 5.
రుద్రాక్షలతో జపమాలను చేస్తారు.
జవాబు.
జపం చేసుకొనే మాల
(ఆ) క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ప్రశ్న 1.
ఈర్ష్య
జవాబు.
రాజకీయనాయకులు ఒకరిపై ఒకరు ఈర్జత్తో సందించుకుంటారు.
ప్రశ్న 2.
మూలుగుట
జవాబు.
దెబ్బలు తగిలన వ్యక్తి బాధతో మూలుగు తున్నాడు.
ప్రశ్న 3.
అవసరం
జవాబు.
ఏద్యార్దుకు క్రమశిక్షణ అవసరం.
5. (అ) క్రింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి.
1. మందులుంటాయి
జవాబు.
మందులు + ఉంటాయి (ఉకార సంధి)
2. నాయనమ్మ
జవాబు.
నాయన + అమ్మ (అకార సంధి)
(ఆ) క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1. కూరగాయలు
జవాబు.
కూరయును, కాయయును
2. రెండుదిక్కులు
జవాబు.
రెండు సంఖ్యగల దిక్కులు
(ఇ) కింది ఖాళీలలో సరియైన విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.
శేఖర్ అమ్మానాన్నలు తమ్ముని ……….. కలిసి ఇంటికి రాగానే రవి ……….. ఎంతో సంబరమైంది. ఆడుకుంటూ రవి నాయనమ్మదగ్గర ………… వెళ్ళాడు. దానిని చూసిన శేఖర్కు రవి …………. నాయనమ్మపై కోపం కలిగింది. దానితో శేఖర్
చెడు ఆలోచన …………. మంచం పక్కన వస్తువులను తారుమారు చేశాడు.
జవాబు.
శేఖర్ అమ్మానాన్నలు తమ్ముని తో కలిసి ఇంటికి రాగానే రవి కి ఎంతో సంబరమైంది. ఆడుకుంటూ రవి నాయనమ్మదగ్గర కు వెళ్ళాడు. దానిని చూసిన శేఖర్కు రవి కంటె నాయనమ్మపై కోపం కలిగింది. దానితో శేఖర్
చెడు ఆలోచన తో మంచం పక్కన వస్తువులను తారుమారు చేశాడు
(ఈ) కిందివాక్యాలలో అసమాపక క్రియలు, సమాపక క్రియలు వేరు చేసి రాయండి.
1. సమ్మక్క సారక్క జాతరకు ముఖ్యమంత్రిగారు వచ్చి, జనంతో కలిసి ఆడి, పాడి, గంతులు వేశారు.
జవాబు.
అసమాపక క్రియలు : వచ్చి, ఆడి, పాడి
సమాపక క్రియ : వేశాడు
2. ఖమ్మంజిల్లాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
జవాబు.
అసమాపక క్రియలు : చేరుస్తూ
సమాపక క్రియ : చేసింది
3. నీవు బడికి వచ్చి, పాఠం చదివి, జ్ఞానాన్ని పెంచుకున్నావు.
జవాబు.
అసమాపక క్రియలు : వచ్చి, చదివి
సమాపక క్రియ : పెంచుకున్నావు
4. ఆటలు ఆడి, శారీరక వ్యాయామం చేసి, మానసిక ఆనందం పొందావు.
జవాబు.
అసమాపక క్రియలు : ఆడి, చేసి
సమాపక క్రియ : పొందావు
5. సీతమ్మ వంటచేసి, బట్టలు ఉతికి, విశ్రాంతి తీసుకున్నది.
జవాబు.
అసమాపక క్రియలు : చేసి, ఉతికి
సమాపక క్రియ : తీసుకున్నది
పాఠం ఉద్దేశం:
వృద్ధుల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకొని వారిని వెక్కిరించకుండా అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. వారిపట్ల మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపముతో క్షమాపణ అడగాలి. పిల్లలు ఈర్ష్యభావాన్ని విడిచిపెట్టి మానసిక పరివర్తన కలిగి పెద్దలకు ఎటువంటి అపకారం చేయకుండా వారితో గౌరవ భావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ ‘నాయనమ్మ’ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం ‘కథానిక’ (ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక (ప్యేయత. మానవతా ఏలువలను తెలియజెప్పే కథానిక ఇది.
ప్రవేశిక:
కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. “అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారికోసమే నా జీవితం” అనే భావన భారతీయ కుటుంబానికి (ప్రాతిపదిక. అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, తాతయ్యనాయనమ్మ… ఇదే కుటుంబం. ఇది సుఖసంతోషాల వాకిలి. ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహాసరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పలల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్భూర్తి ఈ పాఠం చదివి పొందుదాం.