TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 1st Lesson చదువు Textbook Questions and Answers.

చదువు TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana

చదవండి ఆలోచించండి – చెప్పండి

తే॥గీ॥ ఆటలాడు వేళలయందు నాడవలయును
జదువుకొనఁదగు వేళలఁ జదువ వలయు
నట్లుకాకున్న నారోగ్య మంతరించు
దాన, మేధస్సు బలహీన మౌను సుమ్ము.

ప్రశ్న 1.
ఆటలు ఎందుకు ఆడుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి?
జవాబు.
ఆటలు ఆడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మేధస్సు చురుకుగా ఉంటుంది. అందుకనే ఉదయం సాయంత్రం కొంతసేపు ఆటలాడుకోవాలి.

ప్రశ్న 2.
ఏ సమయంలో చదువుకోవాలి? ఎందుకు?
జవాబు.
చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. బుద్ధి చురుకుగా ఉంటుంది. అందుకే తెల్లవారుజామున తప్పక చదువుకోవాలి. మిగతా సమయాలలో అవసరమైనపుడల్లా చదువుకోవాలి.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

ప్రశ్న 3.
ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమౌతుంది?
జవాబు.
ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే సోమరితనం పెరిగిపోతుంది. శరీరానికి వ్యాయామం లేక ఒళ్ళు బరువెక్కి అనారోగ్యం పాలౌతారు. ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి.

ప్రశ్న 4.
చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమౌతుంది?
జవాబు.
చదువు సరిగ్గా చదువుకోకుంటే తెలివితేటలు పెరగవు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి?
జవాబు.
అవివేకి చుట్టాలకు గాని తల్లిదండ్రులకు గాని ఏ విధంగానూ సహాయం చేయడు. సంతోషం కలిగించడు. చదువు సంధ్యలు నేర్వడు. పైకి ఆకారం బాగానే ఉన్నా సంస్కారం లేనివాడు. అడవిలోని మోదుగుపూల వంటివాడు.

ప్రశ్న 2.
కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా! ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు?
జవాబు.
కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు. ఇది సరియైనదే. ఎందుకంటే చదువు సంధ్యలు, సంస్కారం ఏమీ లేకుండా, ఎవ్వరికీ ఉపయోగపడకుండా కులానికి చెడ్డపేరు తెచ్చిపెట్టేట్లు జడాశయుడు ఉన్నాడు. వట్టి మూర్ఖునిలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే కవి అతడిని జడాశయుడు అన్నాడు. కమలాకరం అంటే జలాశయం లేదా నీటిమడుగు. నీటిమడుగు ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది. కమలాకరుడు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నాడు. అందుకే ‘జడాశయుడు’ అని కవి అన్నాడు.

ప్రశ్న 3.
“చదువురాని పిల్లలు వంశానికి తెగులు” అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు.
చదువుకున్నవాడు వివేకి అవుతాడు. తల్లిదండ్రులకు బంధువులకు సంతోషం కలిగిస్తాడు. సత్ప్రవర్తన కలిగి సంస్కారవంతుడై ఉంటాడు. అదే చదువుకోకపోతే పై లక్షణాలేవీ ఉండవు. పదిమందిలో నవ్వులపాలౌతాడు. దానివల్ల ఆ కుటుంబానికి వంశానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కవి.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

ప్రశ్న 4.
తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు?
జవాబు.
చదివే కొద్దీ విజ్ఞానం పెరుగుతుంది. తను చదివింది ఇతరులతో పంచుకుంటే మరింత బాగా మనసుకెక్కుతుంది. ఎంత ఎక్కువమందికి ఆ చదువు పంచితే అంత ఎక్కువగా అది పెరుగుతుంది. అంతేగాక ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్తభావాలు కలిగి మరింత బాగా అర్థమౌతుంది. కనుక తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది అనే మాట నిజం.

ప్రశ్న 5.
“చదువు దొంగలకు కనిపించదు” చర్చించండి.
జవాబు.
చదువు బుద్ధికి సంబంధించినది. నేర్చుకున్న విషయాలు నేరుగా మెదడుకు చేరతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నంతసేపూ ఆ విషయాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞాపకం వస్తాయి. మనం బుద్ధిపూర్వకంగా చెబితే తప్ప ఎవరికీ తెలియవు కనిపించవు. కనిపించని వస్తువును ఎవరు కాజేయగలరు? కాబట్టి చదువు దొంగలకు కనిపించదు.

ప్రశ్న 6.
అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏయే చదువులు చదవాలి?
జవాబు.
అందరూ మెచ్చుకోవాలంటే మనం మంచి చదువులు చదవాలి. విజ్ఞానం పెంచే చదువులు చదవాలి. నలుగురితో ఎట్లా మెలగాలో నేర్పే చదువులు చదవాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకొనడానికి ఉపయోగపడే చదువు చదవాలి. నలుగురికి ఉపయోగపడే చదువు, మన గౌరవం పెంచే చదువు చదవాలి. మనం ఒకరికి భారం కాకుండా, ఆదర్శంగా బతకడానికి అవసరమైన చదువు చదవాలి.

ప్రశ్న 7.
పశువులకు, మనుషులకు తేడాలేమిటి?
జవాబు.
పశువులకు భాష తెలియదు. మాట్లాడలేవు. మనిషి మాట్లాడగలడు. ఆలోచించగలడు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించగలరు. దాన్నే విచక్షణాజ్ఞానం అంటారు. అది పశువులకు ఉండదు. పశువులు మాట్లాడలేవు. మనుషులు తమ భావాలను చెప్పడానికి మాట్లాడగలరు.

ప్రశ్న 8.
కమలాకరుని తీరుగా మీరెప్పుడైనా ప్రతిన పూనారా? ఎందుకు?
జవాబు.
కమలాకరుని తీరుగా నేను ఒకసారి ప్రతిన పూనాను. నాకు బడిలో అన్ని విషయాలలో మంచి మార్కులతో తరగతిలో మొదటి స్థానం వచ్చేది. కాని లెక్కల్లో మాత్రం చాలా తక్కువ మార్కులు వచ్చేవి. నేను 9వ తరగతిలో ఉండగా ఒకసారి మా ఇంగ్లీషు టీచరు మా నాన్నగారిని పిలిచి ” మీ అమ్మాయి తెలివి తేటలకు పదవతరగతి పరీక్షలకు పంపినా ఫస్టు మార్కులు తెచ్చుకుంటుంది. కాని ఆ లెక్కల మూలంగా చాలా వెనకబడుతోంది” అని చెప్పారు. అంతే వెంటనే నాకు పట్టుదల వచ్చింది. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయం లెక్కలు అభ్యాసం చేసి మంచి మార్కులు సాధించాను.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

ప్రశ్న 9.
కమలాకరుడు గురువు సేవచేస్తూ విద్యను నేర్చుకున్నాడు. మీరు మీ ఉపాధ్యాయులకు ఏయే సేవలు చేస్తారు?
జవాబు.
నేను గురువులకు ఎలా సేవ చేస్తానంటే – ప్రతిరోజూ మానకుండా బడికి వెళుతూ శ్రద్ధగా పాఠాలు వింటాను. క్రమశిక్షణతో ప్రవర్తిస్తాను. ఏ రోజు ఇచ్చిన హోంవర్కు ఆ రోజు చేస్తాను. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. నా ప్రవర్తనతో వినయవిధేయతలతో గురువులకు ఆనందం కలిగిస్తాను. గురువులను బాధపెట్టకుండా ఉండడమే పెద్దసేవ.

ఇవి చేయండి

1. విని, అర్ధం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా! అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడంలేదు. దీనివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు? వాళ్ళుకూడా చదువుకోవాలంటే మనమేం చేయాలి?
జవాబు.
అందరికీ చదువు అవసరం. ఒకప్పుడు ఆడపిల్లలను బడికి పంపేవారుకాదు. మగవారిలో కూడా చదువుకొనేవారు తక్కువ. ఇప్పుడు చదువు అవసరం తెలిసి ప్రతివారూ పై చదువులు చదువుతున్నారు. కాని ఇంకా పనిపాట్లు చేసుకొనేవారూ పిల్లలను పనికి పంపి ఇల్లు గడుపుకొనేవారూ కనిపిస్తూనే ఉన్నారు. దీనివల్ల వారు విలువైన బాల్యం కోల్పోతున్నారు. చదువుకోకపోతే వారు ధనవంతుల చేతిలోనూ మోసగాళ్ళ చేతిలోనూ అన్యాయమై పోతారు. కాబట్టి అందరూ చదువుకోవాలి. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. మనందరం బాలకార్మికులు లేకుండా చేయడానికి కృషి చెయ్యాలి. మన ఇళ్ళలో పిల్లలను పనిలో పెట్టుకోకూడదు. ఇలా అందరూ కృషిచేసి అందరూ చదువుకొనేట్లు చూడాలి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.

(అ) చదువు నేర్చుకోని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు.
జవాబు.
చదువుల్ గట్టిగ నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మీ!

(ఆ) విద్య ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు వృద్ధి చెందుతుంది.
జవాబు.
తానెవ్వరికిచ్చినఁగోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య

(ఇ) ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా?
జవాబు.
ధరలో మరి విద్యబోల ధనములు గలవే?

(ఈ) ఏ చదువూ నేర్వనివాడు పశువుతో సమానం.
జవాబు.
సంగీతంబు కవిత్వ తత్త్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్ శృంగ ద్వంద్వము లేని యెద్దతడనం జెలున్.

(ఉ) కష్టపడి సంగీతం సాహిత్యం వంటి కళలు నేర్చుకొని
జవాబు.
తివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి.

(ఊ) ఆ పశువుల అదృష్టం కొద్దీ అతడు గడ్డి తినడు.
జవాబు.
తృణం బాతడు య్యాంగీకంబున మేయడా పసుల భాగ్యం బిచ్చటన్ కల్గుటన్.

2. కింద పద్యాన్ని చదువండి. భావం రాయండి.

చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గల్గున్
చదువగ వలయును జనులకు,
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ! – (పోతన భాగవతం)
జవాబు.
“చదువుకోనివాడు అజ్ఞాని యౌతాడు. చదువుకుంటే మంచి చెడు తెలుసుకొనే తెలివితేటలు కలుగుతాయి. కాబట్టి జనులు తప్పక చదువుకోవాలి. నాయనా! నిన్ను చదివిస్తాను. గురువుల వద్ద చదువుకో”. అని ఈ పద్య భావం.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

(అ). చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు?
(లేదా)
చదువురాని వారికి పశువులకు తేడాలేదని కవి ఎందుకన్నాడు?
జవాబు.
చదువు నేర్వని వారిని కవి పశువుతో పోల్చాడు. ఎందుకంటే పశువులకు మాటలు రావు. భాషరాదు. అవి చదవలేవు. రాయలేవు. ఎక్కడ కట్టేస్తే అక్కడే పడి ఉంటాయి. మనిషి చదువుకోకపోతే చదవలేడు. రాయలేడు. సరిగా మాట్లాడలేడు. పశువుకెంత గౌరవం ఉంటుందో అతనికీ అంతే. పశువులు గడ్డి తింటాయి. అతడు అన్నం తింటాడు. పశువుకున్న తోక, కొమ్ములు అతడికి లేవు. అంతకు మించి చదువురాని వాడికీ, పశువుకూ ఏమీ తేడాలేదు.

(ఆ). త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎట్లాంటివి?
(లేదా)
చదువును గురించి త్రివిక్రముడు ఎలా ఆలోచించాడు?
జవాబు.
చదువు పట్ల త్రివిక్రమునికి గల భావాలు : చదువు ఎవరికీ కనిపించని ఎవరూ దోచుకోలేని గొప్ప సంపద. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనకు సహాయపడుతుంది. అందరినీ మనకు ఆప్తులుగా చేస్తుంది. చదువుకు సమానమైన సంపద మరేదీలేదు. మంచి కావ్యాలు చదవాలి. లలితకళలు నేర్చుకోవాలి. మంచివారితో మంచి మాటలతో కాలం గడపాలి. లోకజ్ఞానం సంపాదించాలి. అలా చదువులు నేర్వని వాళ్ళు పశువులతో సమానం.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

(ఇ). కమలాకరుని స్వభావం ఎటువంటిది?
(లేదా)
కమలాకరుడు ఎలాంటివాడు?
జవాబు.
కమలాకరుడు జడాశయుడు. అంటే ఏ ఆలోచనలు, ఆశయాలు లేకుండా కాలం గడిపేవాడు. చదువు సంధ్యలు లేనివాడు. ఎవరితోనూ కలవడు మాట్లాడడు. స్నేహితులు లేరు. తల్లిదండ్రులకు బంధువులకు ఏనాడూ సంతోషం కలిగించలేదు. అందమైన మోదుగపువ్వు అడవిలోపడి ఉంటే దాన్ని చూసి ఆనందించేవారెవ్వరూ ఉండరు. అలాంటి మూర్ఖుడే కమలాకరుడు.

(ఈ). చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.
(లేదా)
“చదువు లేకపోవడమే కష్టాలన్నిటికీ మూలం” ఎలా? వివరించండి.
జవాబు.
చదువు రాకపోతే అన్నీ కష్టాలే. మహాపండితుడు పురోహితుడు అయిన త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. కాని అక్షరం నేర్వలేదు. అందుకే అతన్నెవరూ ఆదరించలేదు. అతనికి స్నేహితులు లేరు. తల్లిదండ్రులు, బంధువులు ఎవ్వరూ అతనివల్ల సంతోషించలేదు. చివరికి కమలాకరుడు ఒంటరిగా ఏ తోడూ లేకుండా మిగిలిపోయాడు. తండ్రిచేత మాటలు పడ్డాడు. చదువు గొప్పదనం తెలిసికొని చదువుకొని మనిషిలా మారాడు. కాబట్టి చదువుకోకపోతే అన్నీ కష్టాలే.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

1. చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
పరిచయం : కొఱవి గోపరాజు ‘చదువు’ పాఠంలో చదువు అవసరాన్ని చాలా చక్కగా చెప్పాడు.

నేపథ్యం : విక్రమార్కుని ఆస్థానంలో పురోహితుడుగా ఉన్న త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. అతడు చదువులేక జడపదార్థంగా ఉండటం వలన అతడిలో మార్పు తేవడానికి తండ్రి కుమారుని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపులో భాగంగా చదువు అవసరాన్ని వివరించాడు.

ఎటువంటి చదువు? : చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషం కలిగించే చదువులు పిల్లలు చదవాలి. అటువంటి చదువు చదవకపోతే ఆ పిల్లలు వంశానికి తెగులువంటివారు.

మూర్ఖులు : ఎంత మంచి రూపం కలిగి ఉన్నా, ఉత్తమ వంశంలో జన్మించినా మూర్ఖుడు కుటుంబానికి వెలుగునివ్వలేడు.

చదువు గొప్పతనం : మన అధీనంలో విద్యను దొంగలు దోచుకోలేరు. అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. ఎంతమందికి దానం చేసినా ఆ చదువు కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య మన సొంత ధనం. ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటుంది. అది భారమేమి కాదు. అందరినీ మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం వేరేదీ లేదు.

చదువుకోనివాడు? : ఏ చదువులూ నేర్చుకోనివారు పశువుల వంటివారు. వచన, పద్య కావ్యాలు చదవాలి. సంగీత నాట్య సాహిత్య జ్ఞానం పొందాలి. మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. లోకజ్ఞానం పొందాలి. ఇవేవీ చేయనివాడు తోక, కొమ్ములు లేని పశువు అని చెప్పవచ్చు.

ముగింపు : తండ్రి మాటలకు కమలాకరుడు అభిమానపడ్డాడు. చదువు గొప్పదనం గ్రహించాడు. కాశ్మీరదేశం వెళ్ళి అక్కడ చంద్రకేతుడు అనే పండితుని ద్వారా వేదవేదాంగాలు, నీతిశాస్త్రాలు, దర్శనాలు, కావ్యనాటకాలు, సంగీతసాహిత్య కళలు నేర్చుకున్నాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

(అ) బాగా చదివేటట్లు మిమ్ములను ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
(లేదా)
(ఆ) చదువు ఆవశ్యకత తెలిసేటట్లు కొన్ని నినాదాలు రాయండి.

లేఖ

కోదాడ,
తేది : XXXX

ప్రియమైన అన్నయ్యా !
ఇక్కడ అంతా క్షేమం. నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. మా పరీక్ష ఫలితాలు వచ్చాయి. నాకు తరగతిలో రెండవ స్థానం లభించింది.
అన్నయ్యా ! ఇదంతా నీ ప్రేరణ వల్లనే జరిగింది. క్లాసులో ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చుకుంటూ అందరూ ఎగతాళి చేస్తే ఏడుస్తూ కూర్చునేవాణ్ణి. నువ్వు చెప్పిన మంచిమాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. చదువుపట్ల ఆసక్తిని పెంచాయి. ఏమైనా సరే మంచిమార్కులు సాధించి తీరాలని పట్టుదల నాలో పెరిగింది. గట్టిగా కృషిచేశాను. తగిన ఫలితం లభించింది. ఇదంతా నీ వల్లనే సాధ్యపడింది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సగౌరవంగా నేను చెప్పే ధన్యవాదాలు స్వీకరించు. ఉంటాను.

ఇట్లు
నీ ప్రియమైన తమ్ముడు,
కార్తికేయ.

చిరునామా :
ఎ.వి.కె. ప్రసాద్,
బి.టెక్. ఫైనలియర్,
రీజనల్ ఇంజినీరింగ్ కాలేజి, వరంగల్లు.

(ఆ) చదువు ఆవశ్యకతపై నినాదాలు :
జవాబు.

  • చదువుకుంటే కలదు లాభం.
  • ఎంత చదివితే అంత జ్ఞానం.
  • అభ్యాసము కూసు విద్య.
  • చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను.
  • ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.
  • చదువు వల్ల సంస్కారం కలుగును.
  • రాజుకు తన దేశంలోనే గౌరవం. పండితుని ప్రపంచమంతా గౌరవిస్తుంది.
  • చదువు అంటిపెట్టుకొని ఉండే స్నేహితుడు.
  • చదువు లేకపోవటమే అసలైన గుడ్డితనం.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి.

(అ) పశువులు శృంగాలతో పొడుస్తాయి. – కొమ్ములు
(ఆ) గణపతి వక్త్రమున తొండము ఉంటుంది. – ముఖాన
(ఇ) తృణము తిని ఆవు పాలిస్తుంది. – గడ్డి
(ఈ) ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. – కుమారుడు, కొడుకు

2. కింది పదాలను వివరిస్తూ రాయండి.

(అ) మృదుభాషలు
జవాబు.
మృదు అంటే మెత్తని. భాషలు అంటే మాటలు. మృదుభాషలు అంటే మెత్తనైన మాటలు. అంటే అందరికీ నచ్చేమాటలు.

(ఆ) ప్రబంధ సంపద
జవాబు.
ప్రబంధములు అంటే కావ్యాలు. ప్రబంధముల యొక్క సంపద. అంటే కావ్యాలు అధికంగా ఉండటం.

(ఇ) సౌజన్యభావం
సౌజన్యం అంటే మంచితనం. సౌజన్యభావం మంచి ఆలోచనలు కలిగి ఉండటం.

(ఈ) సత్సాంగత్యం
జవాబు.
సాంగత్యం అంటే సమీపం. మంచివారితో కలిసి ఉండటమే సత్సాంగత్యం.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

3. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.

పర్యాయ పదాలు

(అ) ధర = ఇల, భూమి
(ఆ) ఆత్మజుడు = కుమారుడు, పుత్రుడు
(ఇ) వనం = అడవి, అరణ్యం
(ఈ) శోకం = దుఃఖం, వ్యథ

VI. భాషను గురించి తెలుసుకుందాం

కింది పేరాను చదవండి. అందులోని భాషాభాగాలను గుర్తించి పట్టికను పూరించండి.

మా ఊరి చెరువుగట్టున సంగమేశ్వర దేవాలయం ఉన్నది. పచ్చని ప్రకృతిలో పక్షుల కిలకిలారావాలతో అలరారే ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటుంది. అక్కడి వనంలో జింకలు, కుందేళ్ళు తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రని సూర్యకిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ అద్భుతదృశ్యాన్ని చూడటానికి రెండుకండ్లు చాలవు. అబ్బో! ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో, ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ కథనాలు చదువుతూంటే మనస్సు ఆహా! అంటూ ఆనందడోలికల్లో తేలిపోతుంది కదా!

నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం
జింకలు మా సుందరంగా ఉన్నది అబ్బో
కుందేళ్ళు ఎర్రని అలరారే ఆహా
కండ్లు అద్భుత ఉంటుంది కిలకిల
సంగమేశ్వర పచ్చని చాలవు అక్కడి
సూర్యుడు శోభాయమానంగా వర్ణిస్తూ

ప్రాజెక్టు పని:

చదువు ప్రాముఖ్యత తెలిపే పద్యాలు / పాటలు సేకరించి, వాటిని చదివి వినిపించండి.

పద్యాలు

1. హర్తకుడుగాదు గోచరమహర్నిశమున్ సుఖపుష్టి సేయుస
త్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనంబఖిలార్థికోటికిం
బూర్తిగ నిచ్చినన్ పెరుగు పోదు యుగాంతపువేళనైన భూ
భర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్.

2. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
అక్షరంబు జిహ్వ కిక్షురసము
అక్షరంబు నిన్ను రక్షించు గావున
నక్షరంబు లోకరక్షితంబు.

విశేషాంశాలు:

సారస్వతం : సరస్వతీ సంబంధమైన సారస్వతం. చదువును, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని సారస్వతమని వ్యవహరిస్తున్నాం.

ధ్రువా ప్రబంధం : ప్రబంధ విశేషం, గీత ప్రబంధ కావ్యం (సంగీత నాట్య సాహితీ విశేషం)

కళలు : మానవ జీవన పరిణామంలో నైపుణ్యంతో, సౌందర్యదృష్టితో సాధించిన ప్రజ్ఞావిశేషమే కళ. ఇది మానసిక ఆనందాన్నిస్తుంది. కళలు అరవైనాలుగు.

TS 7th Class Telugu 1st Lesson Important Questions చదువు

ప్రశ్న 1.
కష్టపడి సంగీతం సాహిత్యం వంటి కళలు నేర్చుకొని
జవాబు.
తివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి.

ప్రశ్న 2.
ఆ పశువుల అద్షష్టం కొద్దీ అతడు గడ్డి తినడు.
జవాబు.
తృణం బాతడు య్యాంగీకంబున మేయడా పసుల భాగ్యం బిచ్చటన్ కల్గుటన్.

ప్రశ్న 3.
‘బడి ఈడు పిల్లలు బడిలోనే’ – చదువుల పండుగ పై 12 లైన్ల వ్యాసం రాయండి.

శీర్షిక : చదువుకోవలసిన వయసులో ఉన్న పిల్లలు ఉండవలసింది బడిలోనే కాని ఇంటిలోనో, పనిలోనో కాదు అని ఈ శీర్షిక తెలుపుతుంది.

ప్రవేశిక : మనదేశంలో చాలామంది బీదరికంలో జీవించేవారున్నారు. వారు పనిపాట్లు చేసుకొని ఎలాగో కాలం గడుపుతున్నారు. ఎక్కువమంది పిల్లలను కనటం, వారందరినీ పనికి పంపించితే డబ్బు ఎక్కువగా వచ్చి కాలం గడపటం సుఖంగా ఉంటుందని అనుకుంటున్నారు. అందువల్ల చదివించటానికి బడికి పంపటంలేదు. చదువు పిల్లల హక్కు వారి హక్కు వారికి దక్కాలి.

ప్రస్తుత స్థితి : బడికిపోయి చదువుకోవలసిన తియ్యని బాల్యంలో పిల్లలు తమలేత శరీరంతో కాయకష్టం చేస్తున్నారు. ధనికుల దుర్మార్గానికి బలియై గనుల్లోనూ, కార్ఖానాల్లోనూ కూడా పనిచేస్తున్నారు. వారిని చదువుకోడానికి బడికి పంపడం మనందరి కర్తవ్యం.

ప్రయోజనాలు : పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవడం వల్ల వారికి జ్ఞానం కలుగుతుంది. మంచిచెడు తెలుసుకోగలుగుతారు. బడిలో చదువుతోపాటు ఆటలు, పాటలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో పాల్గొని మానసిక ఆనందం పొందగలుగుతారు. మంచి వ్యక్తులుగా తయారౌతారు. తమ కాళ్ళమీద తాము నిలబడగలుగుతారు.

ముగింపు : బడి ఈడు పిల్లలను బడిలోకి పంపించే బాధ్యత సమాజంలోని పౌరులుగా మనందరిపైన ఉన్నది. పిల్లలను పనిలో పెట్టుకోగూడదని అలాచేసే వారికి బోధించడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయటం మనకర్తవ్యం.

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

పర్యాయ పదాలు:

  • ఆత్లజుడు = కుమారుడు, పుత్రుడు
  • కమలం = తామర, పద్మం
  • శోకము = దుఃఖము, వ్యథ, ఏడుపు
  • వివేకము = తెలివి, జ్ఞానము
  • దూఱ్ల = తిట్టు, నిందించు
  • తండ్రి = నాన్న, పిత, జనకుడు
  • వనము = అరణ్యం, అడవి,కోన
  • భవనము = మేడ, సౌధము
  • భూవరులు = రాజులు, భూపతులు
  • తస్కరుడు = దొంగ, చోరుడు
  • (వ్రేగు = భారము, బరువు

నానార్థాలు:

  • వాసన – పరిమళము
  • సంజ్ఞ – పేరు, గుర్తు
  • దూఱు – నిందించు, ప్రవేశించు
  • వనము – అడవి, నీరు
  • గుణము – స్వభావము, అల్లెత్రాడు, రెట్టించు
  • ధర – భూమి, వెల
  • ప్రియము – ఇష్టము, ఎక్కువ ఖరీదు

ప్రకృతి – వికృతులు:

  • సంజ్ఞ – సన్న
  • రూపము – రూపు
  • మూర్ఖుడు – మొఱకు
  • బ్రధ్నుడు – ప్రొద్దు
  • భాష – బాస
  • పద్యము – పద్దెము, పద్దియము
  • పశువు – పసువు, పసరము
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • భాగ్యం – బాగ్గెం
  • విద్య – విద్దె, విద్దియ
  • శాస్త్రము – చట్టము
  • కావ్యము – కబ్బము
  • ఆజ్ఞప్తి – ఆనతి

I. కింద పద్యానికి భావం రాయండి. (ఈ ప్రశ్న కంఠస్థ పద్యాల నుండే అడుగబడుతుంది)

పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరి కిచ్చినఁ గోటి గుణో
త్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్.
భావం:
పూర్తిగా తన అధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పూడూ మన సొంత ధనం.

II. పదజాలం

(అ) కింది పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.

అ) 1. పరఘూమి : పరభూమిని తనదిగా చెప్పుకోవడం గొప్ప అనిపించుకోదు.
2. జడాశయుడు : జడాశయుడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా ప్రయోజనం లేదు.
3. కమలాకరము : కమలాకరములతో నిండిన సరస్సును చూస్తుంటే మనసు ఆనందంతో సిండిపోతుంి.
4. లోకోద్యమ లక్షణం : లోకోద్యమ లక్షణం ఉన్నవాడే ఉన్నతిని సాధిస్తాడు.

(ఆ) సరైన జవాబు గుర్తు (A/B/C/D) బ్రాకెట్లలో రాయండి.

5. పరుల మేలు కోరేవాడు సజ్జనుడు. – గీతగీసిన పదానికి అర్థం
(A) గొప్పవాళ్ళు
(B) మేలు చేసేవాళ్ళు
(C) ఇతరులు
(D) స్నేహితుల
జవాబు.
C (ఇతరులు)

6. భూవరులు ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తారు. ‘భూవరులు’ అంటే …………
(A) తల్లులు
(B) తండ్రులు
(C) గొప్పవాళ్ళు
(D) రాజులు
జవాబు.
D (రాఖులు)

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

7. మనం మాట్లాడే మాటలు అందరికీ ప్రియంగా ఉండాలి. – ప్రియం అంటే ……….
(A) ఇష్ట
(B) తీపి
(C) నచ్చడం
(D) సుందరం
జవాబు.
A (ఇష్టం)

8 దేశభక్తి లేనివారి ‘పుట్టువు’ వ్యర్థం. – గీతగీసిన పదానికి అర్థం
(A) పుట్టుక
(B) ధనం
(C) గతం
(D) పట్టు
జవాబు.
A(పుట్టుక)

9. ‘దూఱు’ కు పర్యాయపదాలు
(A) దూది, పత్తి
(B) దూరం, దవ్వు
(C) దొర, రాజు
(D) ప్రవేశించు, చొరబడు
జవాబు.
D (ప్రవేశించు, చొరబడు)

10. దొంగ, చోరుడు అనే అర్థాలనిచ్చే పదం
(A) సత్కరుడు
(B) తస్కరుడు
(C) గూండా
(D) విపత్కరుడు
జవాబు.
B (తస్కరుడు)

11. మామిడిపండ్ల వ్రేగు ఎక్కువయ్యి గున్నమామిడి వంగింది. ‘వ్రేగు’ అనే పదానికి సమానార్థక పదాలు
(A) కరువు, పెద్ద
(B) ఎక్కువ, అధికం
(C) బరువు, భారం
(D) కొమ్మలు, శాఖలు
జవాబు.
C (బరువు, భారం)

TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

12. అది పురాతన భవనం. ఆ మేడంటే కొందరికి భయం. అది ఆ ఊరిలో ఎత్తైన సౌథం – ఈ వాక్యాల్లోని సమానార్థక పదాలు

(A) అది, ఆ, ఊరు
(B) భవనం, భయం, మేడ
(C) సౌథం, భవనం, మేడ
(D) పురాతన, భయం, సౌథం
జవాబు.
C (సౌథం, భవనం, మేడ)

వ్యాకరణం :

13. దధీచి గొప్ప తపశ్శక్తి గలవాడు. ఇందులోని విశేషణం …………….
(A) తపశ్శక్తి
(B) దధీచి
(C) కలవాడు
(D) గొప్ప
జవాబు.
D (గాప్ప)

14. రాక్షసులు దేవతల అస్త్రాలు లాక్కొనిపోయారు. – గీతగీసిన పదం
(A) నామవాచకం
(B) సర్వనామం
(C) క్రియ
(D) విశేషణం
జవాబు.
A (నామవాచకం)

15. కిందివానిలో అవ్యయం
(A) భద్రం
(B) తమ
(C) దధీచి
(D) ఆహా !
జవాబు.
D (అహా!)

16. ఆయుధాలు దధీచి వద్ద భద్రంగా దాచారు. ‘దాచారు’ అనేది
(A) సర్వనామం
(B) క్రియ
(C) విశేషణం
(D) అవ్యయం
జవాబు.
B (కిరియ)

17. వాళ్ళు తమ ఆయుధాలను కాపాడమని దధీచిని ప్రార్థించాడు. ఈ వాక్యంలో ‘వాళ్ళు’ అనే పదం భాషా భాగం ?
(A) సంస్కృతం
(B) నామవాచకం
(C) సర్వనామం
(D) అవ్యయం
జవాబు.
C (సర్వనామం)

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1. ఆ॥వె॥ భట్టి మంత్రి; సైన్యపాలి గోవింద చం
ద్రుఁడు; త్రివిక్రముడు పురోహితుండు;
నప్పురోహితునకు నాత్మజుండగు కమ
లాకరుండను నవివేకి గలఁడు.

ప్రతిపదార్థం:

మంత్రి = విక్రమార్క మహారాజు యొక్క మంత్రి
భట్టి = భట్టి అను పేరుగల వాడు
సైన్యపాలి = సైన్యాధిపతి
గోవింద చంద్రుడు = గోవింద చంద్రుడు అనువాడు
పురోహితుండు = బ్రాహ్మణుడు
త్రివిక్రముడు = త్రివిక్రముడనే పేరు గలవాడు
ఆ+పురోహితునకు = ఆ పురోహితునికి
కమలాకరుండు + అనన్ = కమలాకరుడను పేరుగల
అవివేకి అగు = మూర్ఖుడైన
ఆత్మజుండు = కుమారుడు
కలడు = ఉన్నాడు

తాత్పర్యం: విక్రమార్క మహారాజు యొక్క మంతిత్ భట్టి. ఆ రాజు వద్ద గోవిందచంద్రుడనే సైన్యపాలకుడున్నాడు. విక్రమార్కుని పురోహితుడే త్రివిక్రముడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి.

2. కం. ఆ కమలాకరుఁ డా కమ
లాకర సాదృశ్యముగ జడాశయుఁడైనన్
శోకము మదిఁ బొదలంగ వి
వేకము పుట్టింపఁ దండ్రి వెరవున దూతెన్.

ప్రతిపదార్థం

ఆ కమలాకరుడు = ఆ కమలాకరుడనేవాడు
ఆ కమల + ఆకర = తామరలకు నిలయమైన నీటిమడుగుతో
సాదృశ్యముగ = సమానముగ
జడ + ఆశయుడు + ఐనన్ = ఏ ఆశయాలు లేకుండా మంద బుద్ధిగా ఉండేసరికి
తండ్రి = తండ్రియైన త్రివిక్రముడు
శోకము = దుఃఖము
మదిన్ = మనసులో
పొదలగ = వ్యాపించగా
వెరపున = భయముతో
వివేకము = తెలివితేటలను
పుట్టింపగన్ = కలిగించాలని
దూఱెన్ = మందలించాడు

తాత్పర్యం: కమలాకరం అంటే జలాశయం. అది నిశ్చలంగా ఉంటుంది. ఆ విధంగానే కమలాకరుడు జడాశయుడు. ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉన్నాడు. కొడుకుని చూసి తండ్రి మనసులో దుఃఖించాడు. కొడుకును వివేకిని చేయాలని ఈ విధంగా మందలించాడు.

3. కం॥ చుట్టములకుఁ దలిదండ్రుల
కెట్టి యెడం బ్రియము నెఱపనెడపని చదువుల్
గట్టిగ నెఱుఁగని పుత్రుఁడు
పుట్టుట కులమునకుఁదెవులు పుట్టుటచుమ్మీ.

ప్రతిపదార్థం

చుట్టములకు = బంధువులకు
తలిదండ్రులకు = అమ్మానాన్నలకు
ఎట్టి+ఎడన్ = ఎప్పుడూ కూడా
ప్రియంబు = సంతోషాన్ని
నెఱపనెడపన = కలిగించనివాడు
చదువుల్ = విద్యలను
గట్టిగన్ = క్షుణ్ణంగా
ఎఱుగని = నేర్వని
పుతుడు = కుమారుడు
పుట్టుట = కలుగుట
కులమునకు = వంశానికి
తెవలు = చీడ
పుట్టుట సుమ్మీ = పుట్టినట్లే కదా!

తాత్పర్యం: చుట్టాలకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అటువంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులువంటివారు.

4. కం|| విను ముత్తమమగు పుట్టువు
గనుపట్టెడు నట్టిరూపు గల మోదుగుఁ బూ
వును మూర్ఖుండును బ్రబలెడు
వనమున భవనమునఁ దగిన వాసన గలదే.

ప్రతిపదార్థం

వినుము = నేను చెప్పేది విను
ఉత్తమము+అగు = (శేష్ఠమైన
పుట్టువు = జన్మము
కనుపట్టెడు+అట్టి = చక్కగా కనిపించే
రూపు+కల = ఆకారం గల
మోదుగు+పూవును = ఎర్రగా ఉండే మోదుగు చెట్టు పువ్వు
మూర్జుండును = అవెవేకియు
వనమున = అడవిలోను
భవనమునన్ = మేడలోను
ప్రబలెడున్ = పెరుగుతారు
తగిన = కాపలసిన
వాసన = సుగంధము / సంస్కారము
కలదు + ఏ = ఉన్నదా? (లేదు)

తాత్పర్యం : చక్కని రూపం ఉన్నా కూడా మోదుగు పువ్వు సువాసనలు వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన జన్మ, ఎంత మంచి రూపమున్నవాడైనప్పదికీ మూర్ఖడు కుటుంబంలో వెలుగును నింపలేడు.

5. కం|| పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరి కిచ్చినఁ గోటి గుణో
త్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్.

ప్రతిపదార్థం

విద్య – చదువు
ఏపుడున్ – ఎల్లప్సం
తన ధనము – తన సంపద
పరులకు – ఇతరులకు
సోదరులకు – అన్నదమ్ములకు
భూవరులకున్ – రాజులకు
కొనరాదు – తీసుకోడానికి సాధ్యంకాదు
సర్వ – సమస్తముగా
వశ్యము – తన అధీనంలో ఉంటుంది
తాను – స్వయంగా
ఎవ్వరికి + ఇచ్చినన్ – ఎవరికైనా ఇచ్చినా
కోటిగుణ + ఉత్తర – కోటిరిట్లు కంటె ఎక్కువగా
వృద్ధి భజించు – అభివృద్ధి చెందుతుంది

తాత్పర్యం: పూర్తిగా తన అధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడూ మన సొంత ధనం.

6. కం|| పరభూమికిఁ జనుచోఁ ద
స్కరులకు నగపడదు వ్రేగుగా దెచ్చట నె
వ్వరినైన హితులఁ జేయును
ధరలో మఱి విద్యఁ బోల ధనములు గలవే.

ప్రతిపదార్థం

పరభూమికిన్ = ఇతర దేశములకు
చనుచోన్ = వెళ్ళినప్పుడు
తస్కరులకున్ = దొంగలకు
అగపడదు = కనిపించదు
(వ్రేగుకాదు = బరువుకాదు
ఎచ్చటన్ = ఎక్కడైనా సరే
ఎవ్వరిన్ + ఐనన్ = ఎవరినైనా సరే
హితులన్ + చేయును = మనకు మంచివారిగా (స్నేహితులుగా) చేస్తుంది
ధరలో = భూమిపైన
విద్యన్ + ఏోల = చదువు వంటి
ధనములు = సంపదలు
మరి = ఇంకేవైనా
కలవు + ఏ = ఉన్నాయా? (లేవు)

తాత్పర్యం: వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు విద్యాధనం దొంగలకు కనబడదు. అది మనకు భారం కూడా కాదు. ఎక్కడనైనా, ఎవ్వరినైనా మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం మరొకటిలేదు.

7. ఉ॥ గద్యముఁ బద్యముం బెనుపఁ గైకొను టొండె, ధ్రువాప్రబంధసం
పద్యుతుఁ డౌట యొండె, మృదుభాషలఁ బ్రొద్దులు పుచ్చుటొండె,లో
కోద్యమ లక్షణం బెఱుఁగు టొండె, గడున్భజియించుఁగాక యే
విద్యలు నేరఁడేనిఁ పశువే యగుఁ గాదె గణించి చూచినన్.

ప్రతిపదార్థం

గద్యమున్ – వచన కావ్యాలు
పద్యమున్ – పద్య కావ్యాలు
పెనుపన్ – ఎక్కువగా
కైకొనుట + ఒండు + ఎ – చదవటం ఒకటి
ధ్రువా (పబంధ = సంగీత, సాహిత్య, నాట్యప్రబంధాల
సంపత్ యుతుడు + ఔట + = సంపదతో
ఒండు + ఎ = గడుపుట ఒకటి
లోక + ఉద్యమ = ప్రజల పనిపాటుల యొక్క
లక్షణంబు = పద్ధతి
ఎఱుగుట + ఒడడు + ఎ = తెలిసికొనుట ఒకటి (ఈ పద్ధతులు)
కడున్ = మిక్కిలి
భజియించున్ = అందరికీ ఇష్టమౌతాయి
కాక = అంతే తప్ప
ఏ విద్యలు = ఏ విధమైన చదువులు
నేరడు + ఏని = సేర్చుకోకపోతే
గణించి చూచిన = ఎంచి చూస్తే
పశువు + ఏ + అగున్ = (అతడు) జంతువుతో సమానము

తాత్పర్యం: వచనకావ్యాలు, పద్యకావ్యాలు చదువాలి. లేదా ధ్రువాప్రబంధ సంపదను (సంగీత నాట్యసాహిత్య జ్ఞానాన్ని) పొందాలి. లేదా మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. లేదా లోకజ్ఞానమైనా పొందాలి. ఇవి ఏవీ చేయకుండా ఎవరిని ఎంత సేవించినా ఏ చదువులూ నేర్చుకోనివారు పశువుల వంటివారే.

8. శా॥ సంగీతంబుఁ గవిత్వ తత్త్వమును సౌజన్యంబు భావంబు స
త్సాంగత్యంబు నెఱుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్
శృంగ ద్వంద్వము లేని యెద్దతఁడనం జెల్లుం దృణం బాతఁడ
య్యాంగీకంబున మేయఁ డాపసుల భాగ్యం బిచ్చటం గల్గుటన్.

ప్రతిపదార్థం

సంగీతంబున్ – సంగీతమును
కవిత్వ తత్త్వమును – కవిత్వంలోని సారమును
సౌజన్యంబు – మంచితనము
భావంబ – మంచి ఆలోచనలు
సత్సాంగత్యంబున్ – మంచివారితో స్నేహమున్
ఎఱంగడు+ఏని – లేకపోయినట్లైతే
ఆశ్చర్యంబుగా – ఆశ్చర్యకరముగా
భువిన – ఈ లోకంలో
అతడు – ఆ మనిషి
హాలమన్ – తోకయు
శృంగద్వంద్వంబులేని – రెండు కొమ్ములును లేని
ఎద్దుఅనన్ – ఎద్దు అని పిలవడం
చెల్లున్ – తగియున్నది
ఆ+ఆంగీకంబున – ఆ శరీరముతో
ఆతడు – ఆ మనిషి
వాలమున్ – తోకయు
శృంగద్వంద్వంబులేని – రెండు కొమ్ములును లేని
ఎద్దుఅనన్ – ఎద్దు అని పిలవడం
చెల్లున్ – తగియున్నది
ఆ+ఆంగీకంబున – ఆ శరీరముతో
ఆతడు – ఆ మసిషి
తృణంబు – గడ్డి
మేయడు – తినడు
ఇచ్చటన్ – ఈ విషయంలో
ఆ పసుల – ఆ జంతువులు
భాగ్యంబు – అదృష్టము
కల్గుటన్ – కలిగియుండుట వలన

తాత్పర్యం : సంగీతం, కవిత్వంలోని సారం, మంచితనం, మనసులోని భావం, సజ్జనులతోడి స్నేహం వీటిని గ్రహించలేని వాడిని భూమిపై తోక, కొమ్ములు లేక తిరుగాడే ఎద్దు అని అనవచ్చు. అటువంటివాడు గడ్డిమేయకపోవడం అనేది పశువుల పాలిటి అదృష్టమని చెప్పాలి.

9. సీసః అనుచు నెగ్గించిన నా కమలాకరుం
డభిమానియై తన యాత్మలోన
విద్యలు నేర్చి వివేకినై కాని యీ
జనకు వక్త్రము చూడననుచు వెడలి
కాశ్మీర దేశంబు కడ కేఁగి యొక యోర
జంద్రకేతుండను సంజ్ఞఁ బరఁగు
నుత్తమ ద్విజుఁ గొల్చియుండగా నాతండు
క్రమమున సిద్ధ సారస్వతంబు
తే.గీ॥ కరుణ నొసఁగిన నతఁడు సాంగంబు గాఁగ

నాల్గు వేదములును గావ్య నాటకములు
దర్శనంబులు నీతిశాస్త్రములు దివిరి
కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి

ప్రతిపదార్థం

అనుచున్ – ఇలా పలుకుతూ
ఎగ్గించినన్ – తండడడి మందలించగా
ఆ కమలాకరుండు – కుమారుడైన ఆ కమలాకరుడు
అభిమాని + ఐ – రోషము కలవాడై
తన ఆత్మలోన = తన మససులోనే
విద్యలు నేర్చి = చదువు నేర్బుకొని
వివేకిని+ఐ కాని = పండితుడనైతేనే తప్ప
జనకు = తండ్డి యొక్క
వక్త్రము = ముఖము
చూడను = చూడను
అనుచు = అనుకుంటూ
కాశ్మీరదేశంబు కడకు = కాశ్మీరదేశం సమీపానికి
ఏగి = వెళ్ళి
ఒక+ఓరన్ = ఒకవైపు
చంద్రకేతుండు+అను = చంద్రకేతుడు అనే
సంజ్ఞన + పరగు = పేరుతో (ప్రసిద్ధి పొందిన
ఉత్తమ ద్విజున్ = గొప్ప బాహ్మణుని
కొల్చి+ ఉండగా = సేవించుచుండగా
ఆతండు = ఆ చంద్రకేతుడు
క్రమమున = వరుసగా
సిద్ధసారస్వతంబు = తనకు సిద్ధించిన సాహిత్యాన్ని
కరుణన్ = దయతో
ఒసగిన = ఇవ్వగా
అతడు =కమలాకరుడు
స+అంగంబు కాగ = వేదాంగములతోసహా
నాల్గు వేదములు = నాలుగైన వేదాలను
కావ్యనాటకములు = కావ్యాలను సాటకాలను
దర్శనంబులు = దర్శనాలు
నీతిశాస్త్రములు = నీతిశా[శాత్రాలను
కలయ = చకగ్రా
సంగీత, సాహిత్య కళలు = సంగీతము సాహిత్యము మొదలైన కళలను
తివిరి = చక్కని ప్రయత్నంతో
నేర్చి= నేర్చుకొని

తాత్పర్యం : తండడడి వ్యంగ్యపు మాటలకు కమలా కరుడు అభిమానపడ్డాడు. విద్య నేర్చుకొని వివేకియైన తరువాత కాని తండ్డి ముఖం చూడనని మనసులో అనుకున్నాడు. కాశ్మీరదేశంలోని చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణ గురువును చేరి సేవ చేశాడు. ఆ పండితుని ద్వారా క్రమంగా నాలుగు వేదాలు, వేదాంగాలు, కావ్యనాటకాలు, దర్శనాలు, నీతిశాస్త్రాలు, సంగీత సాహిత్యకళలు నేర్చుకున్నాడు.

10. వ. అఖిజ్ఞుండై గురునానతి వడసి తిరిగి
దేశవిశేషంబులం జూడం జరియించుచు….

ప్రతిపదార్థం

అభిజ్ఞుండు+ఐ = అన్నియు నేర్చినవాడై
గురు + ఆనతి = గురువుగారి అనుమతిని
పడసి = పొంది
తిరిగి = మరల
దేశవిశేషంబలన్ = దేశంలోని విశేషాలను
చూడన్ = చూడటానికి
చరియించుచు = తిరుగుతూ

తాత్పర్యం: ఆ తర్వాత గురువుగారి అనుమతితో దేశంలోని విశేషాలు చూడాలని బయలు దేరాడు. (ఈ విధంగా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఎవ్వరు నిందించినా కోపాన్ని తెచ్చుకోరాదు. దానిని (పేరణగా తీసుకొని ఎదగాలి అని పాఠ్యాంశ భావం).

పాఠం నేపథ్యం /ఉద్దేశం:

ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని తర్వాత కాలంలో థోజరాజు రాజ్యాన్ని పరిపాలించాడు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువుపట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి తతివి(క్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. కమలాకరుడు మారిన పద్ధతి, తండడడి మందలించిన విధానం, ఈ పాఠంలో చూడగలం. చదువు ఆవశ్యకతను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం.

ఈ పాఠం “కథాకావ్యం” (ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహారకావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ట్రధానం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వా(తింశిక చతుర్థాశ్వాసంలోనిదీ కథ. భోజరాజుకు తొమ్మిదవ సాలభంజిక ఈ కథను చెప్పింది.

కవి పరిచయం:

కవిపేరు : కొఱవి గోపరాజు
పాఠ్యభాగం పేరు : చదువు
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం
రచన : సింహాసన ద్వాత్రింశిక
తల్లిదండ్రులు : తండ్రిపేరు కొఱవి కసవరాజు, తల్లిపేరు కామాంబిక
విశేషాంశాలు : నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతోపాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత.

ప్రవేశిక:

చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొలిపి విజ్ఞానవంతుడిని చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయం, ఇతరులకు సహాయం చేసే బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శజీవనం వంటి ఉత్తమగుణాలు అలవడుతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. చదువుపట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు. విక్రమార్క మహారాజు పురోహితుడైన త్రివిక్రముడు తన కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని మధన పడ్డాడు. కొడుకుకు ఎట్లా హితవు పలికాడో పాఠం ద్వారా తెలుసుకుందాం!

Leave a Comment