These TS 10th Class Telugu Important Questions 8th Lesson లక్ష్యసిద్ధి will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 8th Lesson Important Questions లక్ష్యసిద్ధి
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ-సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
“ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణులను, దృక్పథాన్ని అర్థం చేసుకో వచ్చు”. దీనిపట్ల మీ అభిప్రాయాలను సోదాహరణంగా
వివరించండి. (Mar. ’15)
జవాబు:
సంపాదకీయం చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణినీ, దృక్పథాన్నీ తెలుసుకోవచ్చు అన్నమాట యథార్థము. మన రాష్ట్రంలో వెలువడే “నమస్తే తెలంగాణా” పత్రిక, ముఖ్యమంత్రి కె.సీ.ఆర్. గారు చేసిన ప్రతి పనినీ సమర్థిస్తుంది. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తుంది. అదే ఈనాడు పత్రిక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఈనాడు పత్రిక తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా రాస్తుంది.
ఈనాడు పత్రిక సంపాదకీయాలు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయి. నమస్తే తెలంగాణ పత్రిక, కే.సీ.ఆర్. పార్టీ పెట్టిన పత్రిక. అందుకే దాని సంపాదకీయంలో కే.సీ.ఆర్ ముఖ్య మంత్రిగా చేసిన తొలి ప్రసంగాన్ని ఆ పత్రిక మెచ్చు కుంటూ రాసింది. కే.సీ.ఆర్. సంక్షేమ రాజ్యానికి అను గుణమైన హామీలు ఇచ్చాడని ఆయనను పొగిడింది. కే.సీ.ఆర్. రుణాలమాఫీ చేస్తానన్నాడనీ, పేదలకు రెండు పడక గదుల ఇల్లు కట్టిస్తానన్నాడనీ మెచ్చుకుంది.
కే.సీ.ఆర్. పరిపాలనా రంగంలో సంస్కరణలు తీసుకు వస్తానని, మొదటిరోజే ప్రకటించాడని, కే.సి.ఆర్.ను సంపాదకీయంలో ఆ పత్రిక మెచ్చుకుంది. నిజానికి
సంక్షేమ పథకాలు, వెనుక పాలించిన కాంగ్రెస్ పార్టీ కాలంలోనూ అమలయ్యాయి. దీనిని బట్టి పత్రికల సంపాదకీయాలు ఆ పత్రిక ఆలోచనా ధోరణినీ, దృక్పథాన్నీ తెలుపుతాయని అన్నమాట నిజమని తేలుతుంది. ఈ రోజుల్లో ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా ఉంటోంది.
ప్రశ్న 2.
తెలంగాణ పోరాటాన్ని స్వతంత్ర పోరాటంతో ఎలా పోల్చగలవు ?
జవాబు:
భారతదేశాన్ని వివిధ దేశాల వారు ఆక్రమించి బానిసలుగా భారతీయులను చేసి పరిపాలించారు. అట్లే తెలంగాణ ప్రాంతాన్ని మొదటి నుంచి ఇతర ప్రాంతాల నాయకులు పాలిస్తూ, విద్య, ఉద్యోగం మొదలైన వాటికి సుదూరంగా నెట్టివేస్తారు. పాలనలో కూడా వివక్ష చూపి బానిసల్లా చూడటంతో భారతీయలంతా తిరుగబడి వందేమాతరం అని నినాదించినట్లు, జై తెలంగాణా అని తెలంగాణా ప్రజలందరూ తిరగబడి మూడుతరాల పాటు ఉద్య మించారు. భారతదేశానికి బ్రిటీష్ వారు అర్థరాత్రి స్వతంత్య్రం ప్రకటించినట్టే. భారత ప్రభుత్వం జూన్ ఒకటిన తెలంగాణకు అర్థరాత్రి పూట స్వాతంత్రాన్ని ప్రకటించింది. ఈ పోలికల్ని చూస్తే తెలంగాణ పోరాటాన్ని స్వతంత్ర పోరాటంతో పోల్చవచ్చు.
ప్రశ్న 3.
పత్రికలెందుకు చదవాలి ? సంపాదకీయాలు ఎందుకు చదవాలి ?
జవాబు:
పత్రికలు ప్రపంచాన్ని అక్షరాల రూపంలో చూపించే గొప్ప అవకాశాలు, పత్రికలు చదవటం వలన లోకజ్ఞానం కలగటమే కాకుండా ప్రాపంచిక మార్పుల నుండి, సామాజిక విషయాల వరకూ అన్నీ అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది.
సంపాదకీయాలు విషయం పట్ల వివరణ అందిస్తూ మేధోమధనానికి అవకాశం కల్పిస్తాయి. ఆలోచనలు రేకెత్తింపజేస్తాయి. అవగాహన కల్పిస్తాయి. అందుకే పత్రిక, సంపాదకీయాలు తప్పక చదవాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న 4.
రుణమాఫీ ఎందుకు చేయాలి ?
జవాబు:
ఋణము అంటే అప్పు, వ్యవసాయదారులు పంట వేయడానికి అప్పులు చేస్తారు. అప్పు కోసం భూమిని లేదా బంగారాన్ని తాకట్టు పెడతారు. వడ్డీ పెరిగిపోతుంది. వేసిన పంట చేతికి వచ్చే సమయానికి అతివృష్టి వలన పాడౌతుంది. మిగిలిన దానిని అమ్మితే వచ్చిన డబ్బు కుటుంబపోషణకు కూడా సరిపోదు. అప్పులు తీర్చలేరు. వడ్డీతో కలిపి తడిసి మోపెడు అవుతుంది. అది తీర్చనిదే కొత్త అప్పులు ఇవ్వరు. బయట అప్పులు చేస్తే వడ్డీ చాలా ఎక్కువ అవుతుంది. కొంప గోడూ అమ్మినా అప్పు తీరదు.
కనుక రైతులను, చిన్న వ్యాపారులను కాపాడా లంటే ఋణమాఫీ తప్పనిసరిగా చేయాలి.
ప్రశ్న 5.
పరిపాలనారంగంలో సంస్కరణల వలన ప్రయోజనం ఏమిటి ?
జవాబు:
పరిపాలనారంగం బాగుంటేనే ప్రజలకు చేరవలసిన సంక్షేమ పథకాలు చేరతాయి. ప్రజలు సుఖసంతోషా లతో ఉంటారు. ప్రభుత్వం పనులు సక్రమంగా సాగుతాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. నేరాలు తగ్గుతాయి. ప్రజలు విద్యావంతులవుతారు.
ఉద్యోగులలో కష్టపడి పనిచేసే స్వభావం పెరుగుతుంది. లంచగొండితనం తగ్గుతుంది. సమర్థులైన ఉద్యోగులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బద్దకస్తులైన వారికి బాధలు పెరుగు తాయి. ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది. సమాజం సుసంపన్నం అవుతుంది. అందుకే పరిపాలనా సంస్కరణలు చాలా అవసరం.
ప్రశ్న 6.
తెలంగాణలో సమష్టియజ్ఞం ఏది ? ఎందుకు ?
జవాబు:
అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి చేయడమే సమష్టియజ్ఞం. వలస పాలనలో తెలంగాణ భాష, సంస్కృతులు తీవ్రమైన అణచివేతకు గురయ్యాయి. ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానం ఛిద్రమైంది. తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. తెలంగాణ సమాజం ఎంతో బాధను అనుభవించింది. సంక్షోభాలను చవిచూసింది. సామాజిక సంబంధాలు తెగిపోయేయి.
తెలంగాణ సమాజానికి ప్రశాంతత కావాలి. పచ్చటి బతుకు కావాలి. దానిని సాధించాలంటే సమష్టియజ్ఞంగా భావించాలి. శక్తియుక్తులన్నీ కూడగట్టాలి. కార్యాచరణ రూపొందించుకోవాలి.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)
ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని మైలు రాళ్ళను ‘లక్ష్యసిద్ధి’ సంపాదకీయం ఎలా పరిచయం చేసిందో వివరించండి. (Mar. ’15)
జవాబు:
తెలంగాణ రాష్ట్రంకోసం 1969లో ఉద్యమం మొదలు అయ్యింది. మలిదశ పోరాటంలో లాఠీలు, తూటాలు ప్రయోగించారు. ఉద్యమకారులు ఎందరో మరణించారు. వారికి గాయాలయ్యాయి.
తెలంగాణలో ప్రతి అడుగు, ఉద్యమ చరిత్రతో ముడిపడింది. సచివాలయంలోని నల్లపోచమ్మను మాయం చేసి, బెజవాడ దుర్గమ్మను పెట్టారు. అప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. దానితో తిరిగి, నల్లపోచమ్మను అక్కడ పెట్టారు. ఉద్యమం చివరిదశలో పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టు కోడానికి అనుమతి లభించలేదు.
హైదరాబాదు వీధుల్లో ఉద్యమకారుల ఊరేగింపు పై ఆంక్షలు విధింపబడ్డాయి. ఉస్మానియా క్యాంపస్ లో ఎన్నెన్నో ఉద్రిక్త ఘట్టాలు సంభవించాయి. విద్యార్థులను లాఠీలతో కొట్టారు. తెలంగాణ తల్లులు దాన్ని చూడలేక, తల్లడిల్లిపోయారు.
ఉద్యమం ప్రతి సంఘటనలోనూ, తెలంగాణ ఉద్యమకారులు గనాపార్కు అమరవీరుల స్తూపం దగ్గర కలుసుకొని చర్చించుకొనేవారు. ఉద్యమ కారులు ఆంక్షలకు, లాఠీ దెబ్బలకు, జడువలేదు. వారు ముళ్ళ తీగలను సైతం తెంపుకొని అమరవీరుల స్తూపం దగ్గరకు దుముకుకొని వెళ్ళేవారు.
ప్రశ్న 2.
సంపాదకీయం అంటే ఏమిటో తెలిపి, మంచి సంపాదకుని లక్షణాన్ని తెలపండి. సంపాదకీయం యొక్క ప్రయోజనాన్ని తెలపండి.
జవాబు:
సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకొని, పత్రికలో తమ వ్యాఖ్యానంతో ఆ విషయానికి సంబంధించిన ముందు వెనుకలను పరామర్శిస్తూ సాగే రచనను ‘సంపాదకీయ వ్యాసం’ అంటారు.
తక్కువ మాటలలో పాఠకులను ఆకట్టుకొనే విధంగా, ఆలోచించే విధంగా, చేయగలగడం, మంచి సంపాదకీయానికి గల లక్షణం.
దినపత్రికల్లోని సంపాదకీయాలు ‘వ్యాఖ్యలు’ సంఘ చైతన్యానికి తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని, ఆసక్తిని పెంపొందించాలి.
ఈ సంపాదకీయ వ్యాసాలు, ఆ కాలానికే సంబంధించినవే అయినా, ఒక్కొక్క సందర్భంలో వీటిని వేర్వేరు కాలాలకు అనువర్తింపచేసుకోవచ్చు.
ప్రశ్న 3.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా, స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనించ డానికి పత్రికా సంపాదకుడు చేసిన సూచనలను వివరించండి.
జవాబు:
- తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి జాతి అన్ని రంగాలలో అభివృద్ధికై పాటుపడాలి.
- తెలంగాణ భాషా సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలి.
- తెలంగాణ జీవన విధానాన్ని తిరిగి ఉద్దరించు కోవాలి.
- తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తియుక్తులన్నీ కూడ దీసుకొని, కార్యాచరణకు దిగాలి.
- జనానికి కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, గుబులు లేని జీవితం కావాలి.
- సంక్షేమ పథకాల రూపంలో ప్రజలను ఆదు కోవాలి.
- రుణాల మాఫీ చేసి రెండు పడక గదుల ఇల్లు బీదవారికి కట్టించాలి.
- తెలంగాణకు నీటి పారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి.
- పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాలి.
ఇలా చేస్తే స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రశ్న 4.
“మూడు తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళీ సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి.” – సమర్థించండి. (Mar. ’17)
జవాబు:
సమాజం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల స్థాపన జరగాలి. పరిశ్రమలు స్థాపిస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. నిరుద్యోగం మటుమాయమౌతుంది.
పరిశ్రమల స్థాపనకు చాలా చిక్కులు ఉన్నాయి. మొట్టమొదటి తలపోటు అనుమతులు. అనుమతుల కోసం ఇంక తెలంగాణలో ప్రభుత్వం చుట్టూ తిరగ నక్కర్లేదు. పరిశ్రమలకు అనుమతులను హక్కుగా నిర్ధారిస్తూ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
దీనికి చట్టబద్దత కల్పించింది. భారీ పరిశ్రమలకు 15 రోజుల అనుమతులు మంజూరు చేస్తారు. మిగిలిన పరిశ్రమలకు అనుమతులు నెలలో మంజూరు అవుతాయి. జాప్యం జరిగితే అధికారులపై చర్యలుంటాయి. గడువు దాటితే అనుమతి మంజూరు అయినట్లే భావిస్తారు. 2.34 లక్షల ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటు చేసింది. మౌలిక వసతులకు 100 కోట్ల నిధిని విడుదల చేశారు.
తెలంగాణలో పరిశ్రమలకు విద్యుత్ కోత లుండవు. సింగపూర్, మలేషియా, చైనా వంటి దేశాలలో పర్యటించి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. అన్ని సదుపాయాలు ఉన్న హైదరాబాద్, చుట్టు పక్కల జిల్లాలు, ఔటర్ రింగురోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలు ప్రత్యేక ఆకర్షణ. ఖనిజ నిల్వలు మనకొంగు బంగారం. ఈ పారిశ్రామిక ఉత్సాహంతో మన బంగారు తెలంగాణ కల సాకారమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.
ప్రశ్న 5.
“తెలంగాణ భాష, సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలె” అని పత్రికా సంపాదకులు అనడంలో ఆంతర్యమేమిటి ? (June ’16)
జవాబు:
ఎందరో మహనీయుల, కళాకారులు, నాయకుల, కవుల త్యాగం ఫలితంగా మనం కలలుగన్న తెలంగాణ మనకు సిద్ధించింది. మన తెలంగాణా లోని తెలుగు భాష తియ్యదనం జాతికి ఆదర్శంగా నిలుస్తుంది. మన సంస్కృతి వన్నె తగ్గనిది. సోదర ప్రేమ, ఆత్మీయతానుబంధాలు, విశ్వాసం, సనాతన ధార్మిక విధానం మొదలైనవి మన సంస్కృతిలో ఒక భాగం.
మనం మన తెలంగాణ సాధించుకున్నాం. అంతటితో ఆగిపోకూడదు. మన భాషను రక్షించు కోవాలి. మన భాషలోని నుడికారాలను పరి రక్షించాలి. కల్మషంలేని మన సంస్కృతిని పరిరక్షించాలి. ఇది మనందరి కర్తవ్యంగా భావించాలి.
ప్రశ్న 6.
స్వీయ రాష్ట్రం సిద్ధించడం వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
స్వీయరాష్ట్రం సిద్ధించడం వలన తెలంగాణ జాతి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అణచి వేతకు గురైన తెలంగాణ భాష సుసంపన్నం అవుతుంది. వివక్షకు గురైన తెలంగాణ జాతి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ పచ్చపచ్చని పంటపొలాలతో కలకలలాడు తుంది.
కనీస అవసరాలు తీరతాయి. గౌరవమైన బ్రతుకు ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మన తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు మనమే రూపొందించుకోవచ్చు. మన తెలంగాణ అమరవీరుల త్యాగఫలమైన మన రాష్ట్రాన్ని నందనవనంగా మార్చుకోవచ్చును.
ప్రశ్న 7.
లక్ష్యసిద్ధి అంటే ఏమిటి? తెలంగాణ ప్రజల లక్ష్యసిద్ధి
జవాబు:
సాధించవలసిన దానిని లక్ష్యం అంటారు. ఆ లక్ష్యం నెరవేరడాన్ని లక్ష్యసిద్ధి అంటారు.
తెలంగాణ ప్రజల లక్ష్యం ఒక్కటే. తమకు బాధల నుండి విముక్తి కలగాలి. ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి. తెలంగాణాను అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేసుకోవాలి. అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు కంటినిండా నిద్ర, కడుపు నిండా తిండి కావాలి. తమ నిర్ణయాలు తామే తీసుకొనే స్వేచ్ఛ కావాలి. వలస పాలకుల పీడ వదలాలి. ఇవి తెలంగాణా ప్రజల లక్ష్యాలు.
ఈ లక్ష్యాలు సిద్ధించాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. అదొక్కటే మార్గం. ఆ లక్ష్యం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
ప్రశ్న 8.
ఉద్యమం అంటే ఏమిటో నీకేం తెలుసు ? తెలంగాణ ఉద్యమానికి, ఇతర ఉద్యమాలకు తేడాలు ఏమిటి వివరించ
జవాబు:
ఒక లక్ష్యం కోసం అందరం కలసి పోరాటం చేయాలన్నే ఉద్యమం అంటాం. వ్యక్తిగా కష్టపడితే సాధించే విజయం వ్యక్తిగతం. సమిష్టిగా పోరాడి సాధించే విజయం సామాజికం. సామాజిక అభివృద్ధి కుంటుబడినపుడు, బలవంతుడి చేతిలో బలహీనుడు ఇబ్బందులు పాలు అవుతున్నప్పుడు. ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఒంటరిగా సాధించలేని లక్ష్యాన్ని గుంపుగా సాధించేందుకు సాధనం ఉద్యమం. స్వాతంత్ర పోరాట కాలం నుండి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.
ఉద్యమాలలో అన్ని ఒకే లక్ష్యంతో సాగవు. కొన్ని ఉద్యమాలు ఒక కులానికి చెందిన వెనుక బాటును. అన్యాయాన్ని ప్రశ్నించటానికి మొదలవుతాయి. కొన్ని తెగ లేదా .జాతి అభ్యున్నతి కోసం ప్రారంభమవు తాయి. ఉదాహరణకు దళిత, స్త్రీ, వాద ఉద్యమాలు. అవి కుల అభ్యున్నతి కోసం, దళితుల అస్థిత్వ పోరాటం కోసం, మరియు ‘స్త్రీ’ల జీవన విలువల కోసం మొదలైనాయి. కొన్ని కొనసాగుతుండగా, కొన్ని కాల ప్రవాహంలో అదృశ్య మైనాయి.
తెలంగాణ ఉద్యమం, ఒక జాతి ఆత్మగౌరవమే లక్ష్యంగా తమగడ్డ బిడ్డల బతుకు పోరాటమే ఆలంబనగా ప్రారంభమైంది. సకల జనులూ పాల్గొనే ఉద్యమంగా రూపొంది, నవ తెలంగాణా ఆవిర్భా వానికి దారితీసింది. అందుకే తెలంగాణా ఉద్యమం. మిగిలిన ఉద్యమాల కంటే భిన్నమైనదీ, విజయ వంతమైనదీ అని భావిస్తున్నాను.
ప్రశ్న 9.
“అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు” అని సంపాదకుడు అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమై ఉంటుందో మీ పాఠాన్ని ఆధారంగా చేసుకొని విశ్లేషించండి. (June ’17)
జవాబు:
2వ జూన్, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఆవి ర్భవించింది. ఆ రోజున దినపత్రికలు అన్నీ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక, ఆనాడు సంపాదకీయం రాస్తూ పై మాటలను రాసింది.
తెలంగాణ ప్రాంతము, మూడు తరాల పరిపాల కుల చేతుల్లో నలిగిపోయింది. అక్కడి ప్రజల గోడును పట్టించుకొనే పరిపాలకులు లేకపోయారు. దానితో తెలంగాణ ప్రజలు అన్ని విధాలా వెనుక బడ్డారు, అణచివేయబడ్డారు.
తెలంగాణ ప్రాంతాన్ని కొంతకాలము కుతుబ్ షాహి వంశపు నవాబులు పాలించారు. 1687 లో ఔరంగజేబు చక్రవర్తి మోసంగా గోల్కొండ సామ్రాజ్యాన్ని వశపరుచుకున్నాడు. తరువాత నైజాం నవాబులు పాలించారు. తెలంగాణ ప్రాంతము, 1956లో ఆంధ్ర రాష్ట్రంతో కలసి ‘ఆంధ్రప్రదేశ్’గా ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రులుగా ఎక్కువ మంది ఆంధ్రప్రాంతము వారే ఉన్నారు. వారి వలస పరిపాలనా కాలంలో తెలంగాణ రాష్ట్రము, అన్ని విధాలా వెనుకబడింది. నవాబుల కాలం లోనూ, నిజాంపాలనలోనూ, రాష్ట్రములోని ప్రజలు, అన్ని విధాల అణచివేతకు గురి అయ్యారు.
‘ఇక ఆంధ్ర ప్రాంతపు ముఖ్యమంత్రులు తెలంగాణ అభివృద్ధిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. అందువల్ల ప్రజలను సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవాల్సిన బాధ్యత నేటి తెలంగాణ ప్రభుత్వానికి ఉందని, సంపాదకీయంలో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక రాసింది.
PAPER – II : PART- A
I. అవగాహన – ప్రతిస్పందన
అపరిచిత గద్యాలు (5 మార్కులు)
ప్రశ్న 1.
క్రింది గద్యాన్ని చదువండి. ఖాళీలను పూరించండి. ఇక కాలానికి సంబంధించి ఆలోచించినప్పుడు సామాజికంగా స్త్రీలు తెచ్చిన పెద్ద మార్పులు ఈ శతాబ్దంలో ప్రముఖంగా ఉన్నాయి. కాబట్టి ఈ శతాబ్దాన్నంతా తీసుకోవాలనుకున్నాం. వీలైనంత వరకూ అన్ని రంగాలనూ దృష్టిలోకి తీసుకురావాలి అనుకున్నాం. ఇక సంఖ్య విషయానికి వస్తే ఏదో ఒక సంఖ్యకు కట్టుబడక తప్పదు. పుస్తక ప్రచురణలో ఉండే ఆర్థిక పరిమితుల దృష్ట్యా వంద మందిని ఈ పుస్తకంలో ఉంచాలనుకున్నాం. కానీ ఆ సంఖ్యతో ఏమీ తృప్తిలేదు. ఆర్థికంగా ఎంత కష్టమనిపించినా మరికొంతమందిని చేర్చక తప్ప లేదు. ఎంపిక చాలా కష్టమనటంలో సందేహం లేదు. ప్రతి రంగంలో తమదంటూ ఒక ముద్ర వేసిన వారిని ఎంచుకోవాలి.
ప్రశ్నలు – జవాబులు
1. వీలైనంత వరకు …………………. దృష్టిలోకి తీసుకొన్నారు.
జవాబు:
అన్ని రంగాలను
2. కనీసం వందమందికి ……………… లో స్థానం కల్పించారు.
జవాబు:
పుస్తకం
3. ఈ పుస్తకం రచయిత్రులకు ……………….. ని ఇవ్వలేదు.
జవాబు:
తృప్తి
4. ………… చాలా కష్టమైనది.
జవాబు:
ఎంపిక
5. ఒక ………………….. వేసిన వారిని ఎంచుకోవాలి.
జవాబు:
ముద్ర
ప్రశ్న 2.
కింది పేరా చదివి సరైన సమాధానాలు రాయండి.
పరభాషల ద్వారా కాక మాతృభాష ద్వారా విద్యా బోధన చేయుటయే సహజమైన పద్ధతి అని వాదించి వంగ భాషలో బాలురకు ఉపయుక్తములగు వాచకములను, శాస్త్ర గ్రంథములను రచించిన విద్యావేత్త ఈశ్వర చంద్రుడు.
అతనివలే ఒక వైపు సంఘసంస్కరణ చేయుచు, మరొకవైపు భాషాసేవ చేసిన మహానీయుడు మన వీరేశలింగం పంతులుగారు. పంతులుగారికి దక్షిణ దేశ విద్యా సాగరుడను బిరుదు కలదు. విద్యా సాగరుడు, పంతులుగారు పరస్పరం ఉత్తరములు రాసుకునేవారు. ఈశ్వరచంద్రుని వలన వంగ దేశము, పంతులుగారి వలన తెలుగు దేశము వాసి గాంచినది.
ప్రశ్నలు – జవాబులు
1. విద్యాబోధన చేయుటకు సహజమైన పద్ధతి ఏది ?
జవాబు:
మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుట సహజమైన పద్ధతి.
2. ఈశ్వరచంద్రుడు ఏ భాషలో వాచకములను రాసెను ?
జవాబు:
ఈశ్వరచంద్రుడు వంగభాషకు వాచకములను రాసెను.
3. పంతులు గారి బిరుదు ఏమిటి ?
జవాబు:
‘దక్షిణదేశ విద్యాసాగరుడు’ అని పంతులుగారికి బిరుదు ఉంది.
4. ఈశ్వరచంద్రుని వలన ఏ దేశము వాసిగాంచెను ?
జవాబు:
ఈశ్వరచంద్రుని వలన వంగదేశము వాసిగాంచెను.
5. దక్షిణ దేశంలో భాషా వ్యాప్తికి కృషిచేసిన వారెవరు?
జవాబు:
కందుకూరి వీరేశలింగం పంతులుగారు.
ప్రశ్న 3.
కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
గాంధీజీ తన ప్రసంగాలలో సత్యం, అహింస అనే రెండు పదాలను తరచుగా ఉపయోగించే వారు. అయితే ఈ రెంటిలో మొదటి దానికే ప్రాధాన్యమిచ్చారు. అతడు సత్యాన్వేషకుడు కాదు. సత్యాన్ని ఆరాధించే భక్తుడు. తన జీవితాన్ని “సత్య | మార్గంతో పరిశోధనలు” గా అభివర్ణించాడు. ప్రారంభంలో భగవంతుడే సత్యమని ప్రకటించారు. కానీ చివరకు “సత్యమే భగవంతుడు” అని ప్రకటించే స్థితికి వచ్చారు. “ఎందుకంటే భగవంతుని ఉనికిని నిరాకరించవచ్చు. కానీ, సత్యమును కాదనడం కష్టం.”
జవాబు:
ప్రశ్నలు
- గాంధీజీ తన ప్రసంగాలలో తరచుగా ఉపయోగించేవి ఏవి ?
- ఆయన జీవితాన్ని ఏమని అభివర్ణించారు ?
- ప్రారంభంలో ఆయన దేనిని సత్యమని ప్రకటించారు?
- చివరకు ఆయన దేనిని భగవంతునిగా ప్రకటించారు?
- భగవంతుని ఉనికిని నిరాకరించినా దేనిని కాదన లేరు?
ప్రశ్న 4.
ఈ క్రింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవి మధ్యలో ‘చిలకల గుట్ట’ ఉన్నది. చుట్టు దట్టమైన అడవి ఇక్కడ రెండేండ్ల కొకసారి మూడు రోజులపాటు జాతర జరుగు| తుంది. మాఘశుద్ధ పౌర్ణమి (ఫిబ్రవరి నెలలో) మొదలుకొని మూడు రోజులపాటు జరిగే ఈ జాతరనే సమ్మక్క-సారక్క జాతర అంటారు. ఇది పూర్తిగా గిరిజన సంప్రదాయ రీతిలో జరిగే జాతర. కేవలం మన రాష్ట్రం కాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలనుండి కూడా లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
ప్రశ్నలు – జవాబులు
1. ‘చిలకల గుట్ట’ ఎక్కడ ఉన్నది ?
జవాబు:
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర ‘చిలకల గుట్ట’ ఉన్నది.
2. జాతర ఏ నెలలో ఎప్పుడు ప్రారంభమవుతుంది ?
జవాబు:
జాతర ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది.
3. మూడు రోజులపాటు జరిగే ఈ జాతర పేరేంటి ?
జవాబు:
మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరపేరు సమ్మక్క సారక్క జాతర
4. దాదాపు ఎన్ని రాష్ట్రాల వాళ్ళు జాతరలో పాల్గొంటారు?
జవాబు:
ఐదు రాష్ట్రాల వాళ్ళు ఈ జాతరలో పాల్గొంటారు.
5. పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు:
మేడారం జాతర.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)
ప్రశ్న 1.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి వార్షిక సమావేశంపై నివేదిక తయారుచేయండి.
జవాబు:
నివేదిక
మా గ్రామంలో అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్రా అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచిగారు, పెద్దలు హాజ రయ్యారు. గ్రామ ప్రజలందరూ హాజరయ్యారు.
తెలంగాణ గీతంతో సభ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన వారి సేవలను వక్తలు చెప్పారు. అమరవీరుల త్యాగాలను వక్తలు కొని యాడారు.
తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామని సభలోని వారు ప్రతిజ్ఞ చేశారు. వందన సమర్పణతో సభ ముగిసింది.
ప్రశ్న 2.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన శుభసందర్భంలో జరిగే అమరవీరుల సంస్మరణ సభకు పిలుపునిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
రండి
రండి ! తరలి రండి ! తెలంగాణ ప్రజలారా ! తరలి రండి. మనకోసం జీవితాలను తృణ ప్రాయంగా పరిత్యజించిన అమరవీరులను సంస్మ రిద్దాం. రండి. అమరవీరుల వారసులను ఘనంగా సత్కరిద్దాం.
అమరవీరులకు నివాళినర్పిద్దాం. వారి పట్ల మన భక్తి ప్రపత్తులను చాటుకొందాం.
ఇదే అందరికీ ఆహ్వానం.
ఇట్లు,
ఆహ్వాన సంఘం,
అమరవీరుల సంస్మరణ కమిటీ.
ప్రశ్న 3.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన శుభసమయంలో మీరు పొందిన ఆనందాన్ని లేఖ ద్వారా మీ మిత్రునితో
జవాబు:
భద్రాచలం,
XXXXXX
మిత్రమా ! కిరణ్,
కుశలమా !
మన కలలు నిజమయ్యాయి. మన అమరవీరుల కలలు ఫలించాయి. మన తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. నిజంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన రాగానే ఎంత ఆనందించామో తెలుసా !
ఆ రోజు పొందిన ఆనందం వర్ణించడానికి మాటలు చాలవురా !
నువ్వూ ఆనందపడి ఉంటావు కదా ! దీనిని మీరెలా సెలబ్రేట్ చేసుకొన్నారో రాయి. ఉంటా మరి.
ఇట్లు,
నీ స్నేహితుడు,
XXXX.
చిరునామా :
పి. కిరణ్, నెం. 16,
10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నల్గొండ.
ప్రశ్న 4.
తెలంగాణ ఏర్పడిన సందర్భంలో సంభాషణ రాయండి.
జవాబు:
శ్రీరాజ్ : మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డం చాలా ఆనందంగా ఉంది కదూ !
తరుణ్ : నిజమేరా ! ఇది మన పెద్దలందరి కోరిక.
శ్రీరాజ్ : మనందరం కష్టపడి చదవాలిరా.
తరుణ్ : చదువుతున్నాంగా ! ఇంకా కష్టపడాలా!
శ్రీరాజ్ : ఇంకా చాలా కష్టపడాలి.
తరుణ్ : ఎందుకు ?
శ్రీరాజ్ : మనం బాగా చదువుకోవాలి. మన తెలంగాణ పేరు ప్రఖ్యాతులు పెంచాలి.
తరుణ్ : నిజమే. నిన్న మా తాతయ్య కూడా ఇలాగే అన్నాడు.
శ్రీరాజ్ : ఏమన్నాడు ?
తరుణ్ : చాలామంది మనరాష్ట్రం కోసం ఉద్యమాలు చేశారుట, ప్రాణాలు కోల్పోయారుట. వాళ్ళ ఋణం తీర్చు కోవాలన్నాడు.
ఉత్తేజ్ : ఇది మన స్నేహితులందరికీ చెబుదాం, కష్టపడదాం. నవ తెలంగాణను నిర్మించుకొందాం.
తరుణ్ : అలాగే
ఉత్తేజ్ : వెళదాం. పద.
ప్రశ్న 5.
తెలంగాణ ఏర్పడినపుడు నీ మనోభావాలను వర్ణిస్తూ కవిత రాయి.
జవాబు:
నా తెలంగాణ
వచ్చింది వచ్చింది నవ తెలంగాణ – తెచ్చింది
తెచ్చింది బంగారు నజరానా
ఆనందంతో నా మనసు పురివిప్పిన నెమలిలా –
చేసింది చేసింది నాట్యం
ఆనందంతో నా శరీరం పులకించింది పూలపొదలా
– విరిసింది విరిసింది పువ్వులా
ఏనాటి కలలో ఫలించిన శుభ తరుణంలో –
మురిసింది మురిసింది తెలంగాణ.
బాధల్లేవ్ ! భయాల్లేవ్ ! కన్నీళ్ళు లేవ్ ! కష్టాలన్నీ దూరం, దూరం
అన్నీ ఆనందాలే ! సుఖాలే !
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు
- రాచఠీవి : ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో, ప్రజలు రాచఠీవితో తిరుగుతున్నారు.
- ఆదుకోవడం : తుఫాను, బాధితుల్ని ప్రభుత్వాలు ఆదు కోవాలి.
- అక్షరాలా : మీరు చెప్పిన మాట, అక్షరాలా సరి పోయింది.
- ఆవిర్భవించు : 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ వించింది.
- ప్రాణంపోయు : మంచి మందులిచ్చి, డాక్టరుగారు నాకు ప్రాణం పోశారు.
- భాషా సంస్కృతులు: ప్రతి రాష్ట్ర ప్రభుత్వము తమ భాషా సంస్కృతులను కాపాడాలి.
- నివాళులు అర్పించు : తెలంగాణ అమరవీరులకు ప్రజలు నివాళులర్పించారు.
- ఆనందోత్సాహాలు : తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణం కాగానే ప్రజలు ఆనందోత్సాహాలతో పొంగులెత్తారు.
2. పర్యాయపదాలు
ఇంద్ర ధనుస్సు = అధనాశ్రము, ఇంద్రచాపము, ఐరావతం, కొటీరం, శక్రధనువు
సూర్యుడు = దివాకరుడు, భాస్కరుడు, భానుడు
భూమి = విశ్వంభర, అచల, ధరణి, పృథ్వి
హృదయము = ఎద, ఎడద, డెందము
దుఃఖము = పీడ, బాధ, కష్టము, అఘము
సంబురం = సంతోషం, ఆనందం
చంద్రుడు = రాజు, విధుడు, జాబిల్లి, చందమామ
పోరాటం = యుద్ధం, సమరం, సంగ్రామం
మాట = పలుకు, వచనం, ఉక్తి
పతాకం = జెండా, ధ్వజం, కేతనం, టెక్కియం
సంస్కరణ = బాగు చెయ్యడం, చెడును రూపు మాపడం
ప్రశంస = పొగడ్త, స్తోత్రం
3. వ్యుత్పత్త్యర్థాలు
సౌధము = సుధతో నిర్మింపబడినది (మేడ)
సంతానము = లెస్సగా కోరికలను తీర్చునది (ఒక కల్ప వృక్షం)
సంప్రదాయము = గురుపరంపర చేతను వంశక్రమము చేతను వచ్చిన వాడుక (వంశా చారము)
సత్యము = సత్పురుషుల యందు పుట్టునది. (నిజము)
అక్షరములు = క్షరములు (నాశనము) కానివి – అక్షరాలు
ఆదర్శము = దీనియందు తనమీద కనులుకను (అద్దము)
భాష = భాషింపపడేది, భాష
4. నానార్థాలు
చిత్రము = అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు
జీవన = బ్రతుకు, గాలి
ఉత్తరం = జాబు, ఒక దిక్కు, అగ్ని
రాష్ట్రము = రాజ్యము, ఉపద్రవము
జాతి = వర్ణము, ఛందస్సు, సంతానము
5. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
రాత్రి – రాతిరి
చరిత్ర – చరిత
స్వతంత్ర – సొంతము
హృదయం – ఎద, ఎడద
అక్షరాలు – అక్కలు
ఆకాశం – ఆకసము
వర్ణము – వన్నె
గౌరవము – గారవము
కార్యము – కర్జము
స్థలము – తలము
పుత్రుడు – బొట్టె
భాష – బాస
సందేహము – సందియము
శక్తి – సత్తి
యజ్ఞము – జన్నము
నిద్ర – నిదుర
ప్రాణం – పానం
చంద్రుడు – చందురుడు
PAPER – II : PART – B
1. సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగునపుడు వాని దీర్ఘములు ఏకాదేశ మగును.
ఉదా :
సచివాలయం – సచివ + ఆలయం
సర్వతోముఖాభివృద్ధి – సర్వతోముఖ + అభివృద్ధి
కార్యాచరణ – కార్య + ఆచరణ
దశాబ్దము – దశ + అబ్దము
2. గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశమగును.
ఉదా :
ఆనందోత్సాహాలు – ఆనంద + ఉత్సాహాలు
భావోద్వేగం – భావ + ఉద్వేగం
3. యణాదేశ సంధి
సూత్రం :ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఉదా :
అత్యద్భుతం – అతి + అద్భుతం
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు
కొత్తదనం – కొత్తదైన దనం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పవిత్రస్థలం – పవిత్రమైన స్థలం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
తెలంగాణ జాతి – తెలంగాణ అనుపేరు గల జాతి – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
ఉస్మానియా క్యాంపస్ – ఉస్మానియా అను పేరుగల – క్యాంపస్ సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
తెలంగాణ భాష – తెలంగాణ అను పేరుగల భాష – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
తెలంగాణ సంబురాలు – తెలంగాణ యొక్క సంబురాలు – షష్ఠీ తత్పురుష సమాసము
సచివాలయం – సచివుల యొక్క ఆలయం – షష్ఠీ తత్పురుష సమాసము
హైద్రాబాద్ వీధులు – హైద్రాబాద్ యొక్క వీధులు – షష్ఠీ తత్పురుష సమాసము
ఉద్యమ చరిత్ర – ఉద్యమము యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసము
తెలంగాణ బిడ్డలు – తెలంగాణలోని బిడ్డలు – షష్ఠీ తత్పురుష సమాసము
ఆనందోత్సాహాలు – ఆనందమును, ఉత్సాహమును – ద్వంద్వ సమాసము
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు – స్వేచ్ఛయు, స్వాతంత్ర్యమును – ద్వంద్వ సమాసము
భాషా సంస్కృతులు – భాషయు, సంస్కృతియు – ద్వంద్వ సమాసము
సంక్షేమ పథకాలు – సంక్షేమము కొరకు పథకాలు – చతుర్థీ తత్పురుష సమాసము
అత్యద్భుతం – మిక్కిలి అద్భుతం – అవ్యయీభావ సమాసం
ఉద్వేగభరితం – ఉద్వేగంతో భరితం – తృతీయా తత్పురుష సమాసం
పంచవన్నెలు – పంచ సంఖ్యగల వన్నెలు – ద్విగు సమాసం
మూడుతరాలు – మూడైన తరాలు – ద్విగు సమాసం
అన్యాయము – న్యాయము కానిది – నఞ తత్పురుష సమాసం
3. వాక్య పరిజ్ఞానం
అ) క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగాను, కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగాను రాయండి.
ప్రశ్న 1.
వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 2.
ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 3.
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)
ప్రశ్న 4.
నాచే రచింపబడిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)
ఆ) క్రింది పరోక్ష కథనాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చి రాయండి.
ప్రశ్న 1.
తనను చూస్తే అందరు భయపడతారు కాని తన దగ్గరకు రాకుండా పోరు’ అని సుబ్బారావు అన్నాడు.
జవాబు:
“నన్ను చూస్తే అందరూ భయపడతారు”. కానీ నా దగ్గరకు రాకుండా పోరు.
ప్రశ్న 2.
తన పాటలంటే అందరికీ ఇష్టమేనని అయితే తనకంటే బాగా పాడగలిగినవారు ఎందరో ఉన్నారని ఒక గాయకుడన్నాడు.
జవాబు:
నా పాటలంటే అందరికీ ఇష్టమే అయితే నాకంటే బాగా పాడగలిగినవారు ఎందరో ఉన్నారు అని ఒక గాయకుడన్నాడు.
ప్రశ్న 3.
‘తన రచనలలో తన జీవితం ఉంటుందని’ ఒక రచయిత తన మిత్రునితో అంటున్నాడు.
జవాబు:
ఒక రచయిత తన మిత్రునితో ‘నా రచనల్లో నా జీవితం ఉంటుంది’ అని అన్నాడు.
ప్రశ్న 4.
జైల్లో ఖైదీలందరికి కవర్లిచ్చినప్పుడు తనకెవరున్నారని తానెవరికి కావాలని లక్ష్మీబాయి కుమిలిపోయింది.
జవాబు:
“నాకెవరున్నారు ? నేనెవరికి కావాలి ?” అని జైలులో ఖైదీలందరికీ కవర్లు ఇచ్చినప్పుడు లక్ష్మీబాయి కుమిలి పోయింది.