TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం పరిచిత గద్యాలు Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్యా’ అనే మహానగరం. ‘అయోధ్యా’ అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథమహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగాగల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగ భాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు. ‘యథారాజా తథా ప్రజాః’ – రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.

ప్రశ్నలు – జవాబులు :
1. అయోధ్యానగరి ఏ దేశంలో ఉంది ?
జవాబు:
అయోధ్యానగరి కోసల దేశంలో ఉంది.

2. అయోధ్యానగర ప్రభువు ఎవడు ?
జవాబు:
అయోధ్యానగర ప్రభువు దశరథ మహారాజు.

3. దశరథుడు ఏ వంశంలోనివాడు ?
జవాబు:
దశరథుడు సూర్యవంశంలోని వాడు.

4. దశరథుని ప్రధాన పురోహితులు ఎవరు ?
జవాబు:
దశరథుని ప్రధాన పురోహితులు వశిష్ఠ, వామ దేవులు.

5. సుమంత్రుడు ఎవరు ?
జవాబు:
దశరథుని మంత్రులలో సుమంత్రుడు ఒకడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వాలి వధకు ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముణ్ణి తొందరపెట్టాడు. అందరూ కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు. ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు. అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. శ్రీరాముడి కొరకు చూశాడు. కనిపించలేదు గుండె గుభేలుమంది. ప్రాణభయంతో ఋష్య మూకానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు. అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో ‘బతికావు పో’ అని మరలిపోయాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వాలిని యుద్ధానికి ఆహ్వానించింది ఎవరు ?
జవాబు:
వాలిని యుద్ధానికి ఆహ్వానించింది సుగ్రీవుడు.

2. సుగ్రీవుడు ఎవరిని శరణు వేడాడు ?
జవాబు:
సుగ్రీవుడు శ్రీరాముడిని శరణు వేడాడు.

3. ఋష్యమూకానికి పరుగులు తీసినది ఎవరు ?
జవాబు:
ఋష్యమూకానికి పరుగులు తీసినది సుగ్రీవుడు.

4. ఒకే పోలికతో ఉన్న వానర వీరులు ఎవరు ?
జవాబు:
ఒకే పోలికతో ఉన్న వానర వీరులు వాలి, సుగ్రీవులు.

5. యుద్ధంలో ఎవరు ఓడిపోయారు ?
జవాబు:
యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోయాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 3.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకు రావడంలో తన వంతు సాయం చేస్తానన్నాడు. రావణుణ్ణి సపరివారంగా హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తా నన్నాడు. దుః ఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుః ఖించవద్దన్నాడు. ఎల్లప్పుడు దుఃఖించేవారికి సుఖముండదు. తేజస్సు క్షీణిస్తుంది. ప్రాణాలు నిలపడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుండి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. శ్రీరాముడు ఎందుకు శోకించాడు ?
జవాబు:
తన భార్య సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి తీసుకొని వెళ్ళాడని తెలిసి రాముడు శోకించాడు.

2. సుగ్రీవుడు దేని కొఱకు తన శక్తిని వినియోగిస్తా నన్నాడు ?
జవాబు:
సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులనన్నింటినీ వినియోగిస్తానన్నాడు.

3. దుఃఖం వలన ఏం కలుగుతుంది ?
జవాబు:
దుఃఖం వలన సుఖము ఉండదు. తేజస్సు క్షీణిస్తుంది. దుఃఖించే వారి ప్రాణాలు నిలవడం కూడా కష్టంగా ఉంటుంది.

4. శ్రీరాముడిని ఓదార్చినవారెవరు ?
జవాబు:
శ్రీరాముడిని సుగ్రీవుడు ఓదార్చాడు.

5. ఈ భాగం ఏ కాండంలోనిది ?
జవాబు:
ఈ భాగం ‘కిష్కింధకాండం’ లోనిది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 4.
క్రింది పేరా చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. అంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి వచ్చింది. ఈమె రావణాసురుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధు రాలైంది. తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటా నన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్న దాసుడనని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సివస్తుందనీ, అందుకే శ్రీరాముణ్ణి చేరడమే సబబని సమాధానమిచ్చాడు. శ్రీరాముడివైపు తిరిగి శూర్పణఖ. సీత ఉండడం వల్లనే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది. సీతాదేవిని అడ్డు తొలగించు కోవాలని ఆమెపై దాడికి దిగింది.
అవగాహన – ప్రతిస్పం

ప్రశ్నలు – జవాబులు :
1. లక్ష్మణుడు శూర్పణఖతో ఏమన్నాడు ?
జవాబు:
తాను అన్నకు దాసుడననీ, శూర్పణఖ తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందనీ లక్ష్మణుడు శూర్పణఖతో అన్నాడు.

2. శ్రీరాముడు శూర్పణఖను ఎందుకు నిరాకరించాడు ?
జవాబు:
తనకు భార్య ఉంది. కాబట్టి రాముడు శూర్పణఖను నిరాకరించాడు.

3. శూర్పణఖ ఎవరు ?
జవాబు:
శూర్పణఖ రావణాసురుని చెల్లెలైన రాక్షసి.

4. సీతారామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారు ?
జవాబు:
సీతారామలక్ష్మణులు పంచవటిలో ఉన్నారు.

5. ఈ పేరాకు శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఈ పేరాకు “శ్రీరాముని అరణ్యవాసం” అనే శీర్షిక తగియుంటుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 5.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞ గుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారుపాత్ర, వెండి మూతతో, అందులో దివ్యపాయస మున్నది. దాన్ని దశరథునకందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లైంది దశరథునికి. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది.

ప్రశ్నలు – జవాబులు :
1. యజ్ఞగుండం నుండి ఉద్భవించిన దివ్యపురుషుడు ఎవరి ఆదేశానుసారం వచ్చాడు ?
జవాబు:
యజ్ఞగుండం నుండి దివ్యపురుషుడు బ్రహ్మ ఆదేశాను సారం వచ్చాడు.

2. దశరథుడు నిర్వహించిన యాగమేది ?
జవాబు:
దశరథుడు నిర్వహించిన యాగం ‘పుత్రకామేష్టి.

3. దివ్యపురుషుడు ప్రసాదించిన పాయసం ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
ఆ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొంది స్తుంది. సంతానాన్ని ప్రసాదిస్తుంది.

4. పేదవానికి పెన్నిధి దొరికినట్లుగా భావించిన దశరథుడు నిజంగా ఏ విషయంలో పేదవాడు ?
జవాబు:
దశరథుడు నిజంగా సంతాన భాగ్యంలో పేదవాడు.

5. ఈ పేరాకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
ఈ పేరాకు శీర్షిక ‘పాయసప్రదానం’ అంటే సరి పోతుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 6.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కిష్కింధకు ప్రయాణమయ్యారందరూ. సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగు ముందుకు వేశాడు. కాని, అతని భార్య తార అడ్డుపడింది. ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనుక ఏదో అంతర్యం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధ దిశగా అడుగులు వేశాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వాలి క్షేమం కోరేవారెవరు ?
జవాబు:
వాలి క్షేమాన్ని అతని భార్య తార కోరుతుంది.

2. వాలి విరోధి ఎవరు ?
జవాబు:
వాలి విరోధి అతని తమ్ముడు సుగ్రీవుడు.

3. పై పేరాను బట్టి జరగబోయే యుద్ధంలో ఎవరు ఓడిపోవచ్చును ?
జవాబు:
పై పేరాను బట్టి జరుగబోయే యుద్ధంలో వాలి ఓడిపోవచ్చు.

4. వాలి తన భార్య మాటను పాటించాడా ?
జవాబు:
వాలి తన భార్య మాటను పాటించలేదు.

5. పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.
జవాబు:
‘హితోపదేశాన్ని తిరస్కరించడం’ అనేది ఈ పేరాకు తగిన శీర్షిక.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 7.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు, గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రి సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమౌతుందని సూచించాడు. ఋష్య శృంగుడు విభాండక మహర్షి కుమారుడు. నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు. మూడు రోజులపాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రశ్నలు – జవాబులు :
1. దశరథుణ్ణి ఏది కుంగదీసింది ?
జవాబు:
దశరథుణ్ణి సంతానం లేదన్న చింత కుంగదీసింది.

2. దశరథుడు ఎవరితో సమావేశమయ్యాడు ?
జవాబు:
దశరథుడు పురోహితులు, గురువులతో సమావేశ మయ్యాడు.

3. ఋష్యశృంగుడు ఎవరి కుమారుడు ?
జవాబు:
ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు.

4. దశరథుని మంత్రి ఎవరు ?
జవాబు:
దశరథుని మంత్రి సుమంత్రుడు.

5. సంతాన ప్రాప్తికై ఏమి చేశారు ?
జవాబు:
సంతాన ప్రాప్తికై అశ్వమేధయాగం చేశారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 8.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు ‘శీతేషువు’ అన్న మానవాస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహకోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకు పోతున్నాడు. మరు నిముషంలో ‘ఆగ్నేయాస్త్రం’ తో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. ‘వాయవ్యాస్త్రం’తో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. రాక్షసబాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు ?

ప్రశ్నలు – జవాబులు :
1. రాముడు ఏ అస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగిం చాడు ?
జవాబు:
రాముడు ‘శీతేషువు’ అనే అస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగించాడు.

2. మారీచుడు ఎక్కడ పడ్డాడు ?
జవాబు:
మారీచుడు సముద్రంలో పడ్డాడు.

3. సుబాహునిపైకి రాముడు ప్రయోగించిన అస్త్రం ఏది ?.
జవాబు:
సుబాహునిపైకి రాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు.

4. రాక్షసులపైన రాముడు ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు ?
జవాబు:
రాక్షసులపై రాముడు వాయువ్యాస్త్రమును ప్రయోగించాడు.

5. ఎవరు యజ్ఞవేదిక వద్దకు అనుచరులతో వచ్చారు ?
జవాబు:
యజ్ఞవేదిక వద్దకు మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 9.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

రథం వేదశ్రుతి, గోమతీ, సనందికా నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్యవైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగాతీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగిబేరపురమున్నది. ‘గుహుడు’ ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామభక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తనవారితో శ్రీరాముని దగ్గరకు బయల్దేరాడు. గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణునితోపాటు ఎదురువెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిధ్యం తీసుకున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. రథం ఏయే నదులను దాటింది ?
జవాబు:
రథం వేదశ్రుతి, గోమతీ, సనందికా నదులను దాటింది.

2. గంగాతీరంలో ఉన్న గ్రామమేది ?
జవాబు:
గంగాతీరంలోని గ్రామం శృంగిబేరపురం.

3. గుహుడు ఎవరు ?
జవాబు:
గుహుడు శృంగిబేరపుర రాజు మరియు శ్రీరామ భక్తుడు.

4. రామలక్ష్మణులు ఎవరి ఆతిథ్యం స్వీకరించారు ?
జవాబు:
రామలక్ష్మణులు గుహుని ఆతిథ్యం స్వీకరించారు.

5. ఈ భాగం ఏ కాండంలోనిది ?
జవాబు:
ఈ భాగం అయోధ్యా కాండంలోనిది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 10.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కాని భర్తను వదలిరావడం ధర్మంకాదన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్తిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది. ‘రామా ! సత్పురుషుల బాటలో నడువు. నీ ధర్మమే నీకురక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్య బలం నీకు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలుగ కుండుగాక’ అని శుభాశీస్సులందించింది.

ప్రశ్నలు – జవాబులు :
1. శ్రీరామునితో వనవాసానికి సిద్ధపడిందెవరు ?
జవాబు:
కౌసల్య శ్రీరామునితో వనవాసానికి సిద్ధపడింది.

2. శ్రీరాముడు కౌసల్యతో ఏమని పలికాడు ?
జవాబు:
భర్తను (దశరథుడిని వదిలి రావడం ధర్మం కాదని కౌసల్యతో రాముడు పలికాడు.

3. కౌసల్య రామునితో ఏమని పలికింది ?
జవాబు:
మంచివారి బాటలో నడవమని నీ ధర్మమే నీకు రక్షయని, తల్లిదండ్రులకు చేసిన సేవ, నీ సత్యబలం నీకు రక్ష అని కౌసల్య పలికింది.

4. కౌసల్యకు గల వ్యామోహమేమి ?
జవాబు:
కౌసల్యకు గల వ్యామోహం పుత్రవ్యామోహం.

5. ఈ గద్యం రామాయణంలోని ఏ కాండంలోనిది ?
జవాబు:
ఈ గద్యం రామాయణంలోని అయోధ్యకాండం లోనిది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 11.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపాసరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయోవృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్య మైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్థ్వలోకాలకు వెళ్ళింది.

ప్రశ్నలు – జవాబులు :
1. రామలక్ష్మణులు ఎక్కడికి చేరారు ?
జవాబు:
రామలక్ష్మణులు పంపాసరస్సు ప్రాంతానికి చేరారు.

2. రామలక్ష్మణులు ఎవరి ఆశ్రమానికి వెళ్ళారు ?
జవాబు:
రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు.

3. శబరి రామునకు ఏమి సమర్పించింది ?
జవాబు:
శబరి రామునకు పంపాతీరంలో దొరికే పండ్లను సమర్పించింది.

4. శబరి ఎక్కడికి వెళ్ళింది ?
జవాబు:
శబరి శ్రీరాముని అనుమతితో దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళింది.

5. శబరి ఎటువంటిది ?
జవాబు:
శబరి తపస్సిద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 12.
క్రింది పేరా చదవండి. సరైన వివరణతో ఖాళీలు పూరించండి.

దండకారుణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూపోతున్నారు సీతారామలక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు. ఇలా పది సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సుతీక్ష మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్యమహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలి బుచ్చారు. సుతీక్ష మహర్షి మార్గాన్ని చెప్పాడు. తన ఆశ్రమానికి దక్షిణంగా నాల్గు యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం, అక్కడికి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు. మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు.

ఖాళీలు – జవాబులు :
1. సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షి వద్దకు రావడానికి కారణం …………………..
జవాబు:
వారిని దర్శించుకోవాలన్న ఆకాంక్ష

2. మహర్షి వద్ద సెలవు తీసుకొని సీతారాములు బయలు దేరిన ప్రదేశం ………………………
జవాబు:
అగస్త్యాశ్రమం

3. సుతీక్ష మహర్షి తన ఆశ్రమానికి అగస్త్యాశ్రమం గురించి తెలిపిన దూరం ……………………….
జవాబు:
4 యోజనాల దూరం

4. ………………. లో ఈ సంఘటన జరిగింది.
జవాబు:
దండకారుణ్యం

5. దండకారుణ్యంలో ఇలా …………………….. సంవత్సరాలు గడిచింది.
జవాబు:
10

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 13.
క్రింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

విశ్వకర్మ కుమారుడైన “నలుడు” శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు (వంతెన)ను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆసేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారిపట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్ళను మోసుకువస్తున్నారు. సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడు తున్నది. నలుని సూచనల ననుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతుంది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు ఉన్న సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.

జవాబు:
1. విశ్వకర్మ కుమారుడెవరు ?
2. సేతువును నిర్మించడానికి యోగ్యుడెవరు ?
3. శ్రీరాముడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు ?
4. నీరు ఆకాశానికి ఎగిసిపడటానికి కారణం ఏమిటి ?
5. సేతువు పొడవు ఎంత ? దాన్ని కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది ?

ప్రశ్న 14.
కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి అలంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు.
హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినిమ్మన్నాడు హనుమ. తగనిపని, వద్దని వారించింది సీత.

ప్రశ్నలు – జవాబులు :
1. పై పేరాకు శీర్షికను పెట్టండి.
జవాబు:
శ్రీరామ విజయం.

2. విభీషణుడు లంకకు రాజు ఎలా అయ్యాడు ?
జవాబు:
శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకా రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.

3. పై పేరాలోని శుభవార్త ఏది ?
జవాబు:
శ్రీరాముని విజయవార్త శుభవార్త.

4. “ఆనందానికి అవధుల్లేవు” అనే పదాన్ని వివరించండి.
జవాబు:
అవధి అనగా హద్దు అని అర్థం. ఆనందానికి ఎల్లలు లేవు. హద్దులు లేవు. చాలా బాగా సంతోషం కలిగిన సందర్భంలో దీనిని వాడతారు.

5. పై పేరాను బట్టి సీతగుణం ఎలాంటిదని భావిస్తు న్నారు ?
జవాబు:
“అపకారికి ఉపకారం” అనగా తనను బాధించిన వారిని అవకాశం వచ్చినా చంపవద్దని, తగదని హనుమను వారించింది. దీనిని బట్టి సీతాదేవి గుణం క్షమాగుణం అని తెలుస్తుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 15.
క్రింది పేరా చదివి ఐదు జంట పదాలను వ్రాయండి.

అంగరంగ వైభవంగా సీతారాముల పట్టాభిషేక మహోత్సవం జరిగింది. లక్ష్మణ, భరత, శత్రుఘ్నలు మొదలుగా గల వారందరూ అక్కడ ఉన్నారు. యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణున్ని కోరాడు కాని అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేసాడు. యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. శ్రీరాముడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసు కుంటున్నాడు. ఎలాంటి ఈతిబాధలూ లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకొంటున్నారు. ఇలా పదకొండువేల సంవత్సరాల కాలం ప్రజా నురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. అందుకే ‘రామ రాజ్యం’ అన్న మాట నాడూ నేడూ ఆదర్శమై నిలిచింది.

జవాబు:
జంట పదాలు :

  1. అంగరంగ వైభవంగా
  2. యజ్ఞయాగాది క్రతువులు
  3. ఈతిబాధలూ
  4. సీతారాములు
  5. నాడూనేడూ

ప్రశ్న 16.
ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

సముద్రముపై సాగిపోతున్న హనుమంతున్ని చూసి సాగరుడు సహాయపడదలచాడు. తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిపరాయం. ఆ ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళ్తున్న హనుమంతునికి శ్రమ కలగ కూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకున్ని బయటకు రమ్మన్నాడు. అతని బంగారు గిరి శిఖరాల మీద ఒకింతసేపు విశ్రాంతి తీసుకో గలడని భావించాడు.

మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారి సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు. ఆకస్మాత్తుగా పైకిలేచిన మైనాకున్ని తనకు ఆటంకంగా తలచాడు మారుతి. తన యెదతో నెట్టివేసాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు. ఆంజనేయునికి సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో ‘నీ ఆదరపూర్వక మైన మాటలకు తృప్తిపడ్డాను. అతిథ్యం అందు కున్నట్లే భావించు. సమయంలేదు. ఆగడానికి వీలులేదు’ అని చెప్పి చేతితో అతన్ని తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఎవరి కార్యం మీద వెళ్తున్నాడు ?
జవాబు:
హనుమంతుడు ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం మీద వెళ్తున్నాడు.

2. బంగారు శిఖరాలు ఎవరికున్నాయి ?
జవాబు:
సముద్రంలో ఉన్న మైనాకునికి

3. మైనాకుడు అబ్బురపడడానికి కారణం ?
జవాబు:
హనుమ తనయెదతో నెట్టినందుకు మైనాకుడు అబ్బుర పడ్డాడు.

4. ఆతిథ్యం గ్రహించినట్లే, అని తెల్పడానికి హనుమంతుడు ఏం చేసాడు ?
జవాబు:
మైనాకుణ్ణి హనుమ చేతితో తాకాడు.

5. హనుమంతునికి పర్యాయపదాలు ఇక్కడ ఏవి ఉపయోగించారు ?
జవాబు:
మారుతి, ఆంజనేయుడు

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 17.
క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారులేడిగా మారి సహకరించమన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరివిధాల నచ్చజెప్పజూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుని మాటలను పెడచెవిన పెట్టాడు. రావణుడు. నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు. రావణుడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపు తాడు. వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి. చివరికొక నిర్ణయానికి వచ్చాడు. రావణునితో ‘నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడమే నయం. నా జన్మ తరిస్తుంద’ని తేల్చి చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. ‘మారీచుడు శ్రీరాముని చేతిలోనే చావడానికి సిద్ధపడ్డాడు’ ఎందుకని ?
జవాబు:
రావణుని చేతిలోకంటే రాముని చేతిలో మరణిస్తే జన్మతరిస్తుందని శ్రీరాముని చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు.

2. రామబాణం రుచి చూడటమంటే ఏమిటి ?
జవాబు:
రాముని యొక్క బాణం శక్తిని రుచి చూడటమని అర్థం.

3. రావణుడు మారీచుని ఏవిధంగా సహకరించ మన్నాడు ?
జవాబు:
సీతాపహరణకు బంగారు లేడిగామారి సహకరించ మన్నాడు.

4. రావణుణ్ణి ఆలోచన విరమించుకోమని మారీచుడు ఎందుకు చెప్పాడు ?
జవాబు:
రామునిశక్తి తెలిసినవాడు కనుక.

5. పై పేరాలోని ఒక జాతీయాన్ని రాయండి.
జవాబు:
పెడచెవిన పెట్టు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 18.
క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడు కోవాలో అని మథనపడ్డాడు. రామకథా గానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు. సీతాదేవి అన్నివైపులా చూచింది. చెట్టు మీదున్న హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యానికి లోనైంది. హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. “అమ్మా ! నీవెవరవు ? ఒక వేళ సీతాదేవివే అయితే శుభమగుగాక ! దయతో విషయాలు చెప్పమ”ని ప్రార్ధించాడు. తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి తన వృత్తాంతమంతా వివరించింది. హనుమంతుడు తాను శ్రీరామ దూతనని చెప్పుకున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఏ మార్గమును ఎన్నుకున్నాడు ?
జవాబు:
రామకథా గానమే సరైన మార్గమని.

2. హనుమంతుడు సీతకు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు ?
జవాబు:
శ్రీరామదూతగా పరిచయం చేసుకున్నాడు.

3. హనుమంతుడు ఎందుకు మథనపడ్డాడు ?
జవాబు:
సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మథనపడ్డాడు.

4. హనుమంతుడు సీతతో ఏమని అన్నాడు ?
జవాబు:
అమ్మా ! నీవెవరవు ? ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక ! దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు.

5. పై పేరా ఏ కాండం నుండి తీసుకోబడినది ?
జవాబు:
సుందరకాండ నుండి తీసుకోబడింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 19.
కింది పేరాను చదివి, ప్రశ్నలను తయారు చేయండి.

విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరకి చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీత. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపు కోవడానికి దుష్ట రావణుని చెర నుంచి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది. కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చునని శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముని మాటలు నీతకు ములుకుల్లా గుచ్చుకున్నాయి. స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రాముడితో అంది. శ్రీరాముడికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది. శ్రీరాముడి మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడి వారంతా ఆందోళన చెందారు. అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి. ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు. ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు.

జవాబు:

  1. సీతను శ్రీరాముడి దగ్గరకు చేర్చింది ఎవరు ?
  2. నీ ప్రవర్తనపై సందేహముందని ఎవరు అన్నారు ?
  3. చితిని ఎవరు సిద్ధపరిచారు ?
  4. సీత గొప్పతనం గురించి వెల్లడించినవారు ?
  5. ఈ పేరాకు శీర్షికను సూచించండి.

ప్రశ్న 20.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది. హనుమంతుడికి రావణుడి గురించి, అతని సైన్యం శక్తి సామర్థ్యాల గురించి కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంత చేశాడు ఆ కపి వీరుడు. రాక్షస స్త్రీలు పరుగు పరుగున వెళ్లి లంకేశునికి విషయం చెప్పారు.

రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు. హనుమంతుడు వారందరినీ మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని, మంత్రి పుత్రులు ఏడుగురిని, రావణుడి సేనాధిపతులు అయిదు గురిని, అక్ష కుమారుణ్ని అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, హనుమంతుణ్ని బంధించాడు.

బ్రహ్మవరం కారణంగా అది హనుమంతుడి మీద క్షణ కాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుడి ముందు ప్రవేశపెట్టారతడిని. రావణుడు అడగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముడి పరాక్రమ మెలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దండించవచ్చన్నాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఎవరి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవా లనుకున్నాడు ?
జవాబు:
హనుమంతుడు రావణుడి సైన్యం శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకున్నాడు.

2. రావణుడి సేనాపతులు ఎంతమంది ?
జవాబు:
రావణుడి సేనాపతులు అయిదుగురు.

3. ఏ ప్రయోగంతో హనుమంతుడిని బంధించారు ?
జవాబు:
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని బంధించాడు.

4. శ్రీరాముడి పరాక్రమం విన్న రావణుడు ఏమని ఆజ్ఞాపించాడు ?
జవాబు:
శ్రీరాముడి పరాక్రమం విన్న రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞాపించాడు.

5. దూతను చంపడం మంచిదికాదని ఎవరన్నారు ?
జవాబు:
దూతను చంపడం మంచిది కాదని విభీషణుడు అన్నాడు.

ప్రశ్న 21.
కింది గద్యాన్ని చదువండి. అర్థాలను వివరించండి.

సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వచ్చారు. హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. దీనికోసం కిష్కింధకు రమ్మని ప్రార్థించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ గ్రామంలో గాని, నగరంలో గాని, తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోమారు చాటు కున్నాడు శ్రీరాముడు. సుగ్రీవునికి శుభం పలికాడు. తాను ప్రసవణగిరి మీదే ఉంటానన్నాడు. వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు. సరేనన్నాడు సుగ్రీవుడు. కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తుల య్యారు. కాలం గడుస్తూన్నది. శరత్కాలం వచ్చింది. సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు.

అర్థాలు – జవాబులు :
1. శుభం పలుకడం
జవాబు:
ఏదేని ఒక మంచి పని గూర్చి క్షేమకరంగా మాట్లాడటం.

2. ప్రస్తావన
జవాబు:
ఏదైనా ఒక విషయాన్ని తెలియజెప్పడం.

3. పితృవాక్య పరిపాలన
జవాబు:
తండ్రి ఆదేశాలను ఎల్లవేళలా శిరసా పాటించడం.

4. అన్వేషణ
జవాబు:
ఏదైనా ఒక వ్యక్తిని, వస్తువును వెదకడం.

5. కార్యభారం
జవాబు:
చేయదలచిన పనిని నిర్వహించే శక్తిసామర్థ్యం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 22.
కింది గద్యాన్ని చదివి ఖాళీలు పూరించండి.

రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛ పోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో హనుమంతుని బలంగా చరచాడు రావణుడు. మారుతి చలించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా ! భళా !, నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు.

ఖాళీలు – జవాబులు :
1. రావణుడు …………………….. మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు.
జవాబు:
వానరసేన మీద

2. రావణుని దెబ్బకు చలించిపోయిన వాడు ……………..
జవాబు:
మారుతి

3. రావణుడు ………………. దెబ్బతో చలించిపోయాడు.
జవాబు:
హనుమంతుని

4. మారుతి ……………… చేత మెచ్చుకోబడ్డాడు.
జవాబు:
రావణుని

5. లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి …………….. ను వారించాడు.
జవాబు:
అన్నను

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 23.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2015)

రావణుడు మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించ మన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశుని పరిపరి విధాల నచ్చజెప్పజూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుడి మాటలను రావణుడు పెడచెవిన పెట్టాడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు. “నేను చెప్పినట్లు చేయకుంటే నాచేతిలో చావు తప్పదని” రావణుడు హెచ్చరించాడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు. వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. “ముందు నుయ్యి వెనుక గొయ్యి” లా ఉంది మారీచుని స్థితి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు.

“నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడం నయం. నా జన్మ తరిస్తుంది” అని తేల్చి చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. రావణుడు మారీచుణ్ణి ఎలా సహకరించమన్నాడు ?
జవాబు:
మారీచుణ్ణి బంగారు లేడిగా మారి, తనకు సహకరించమని మారీచుడికి రావణుడు చెప్పాడు.

2. రామబాణం రుచి చూడటమంటే ఏమిటి ?
జవాబు:
రామబాణం రుచి చూడటమంటే, రాముని బాణం వల్ల తగిలే తీవ్రమైన బాధను అనుభవించడం అని అర్థం.

3. పై పేరాలోంచి ఒక జాతీయాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
“ముందు నుయ్యి, వెనుక గొయ్యి” అన్నది, పై పేరాలో గల ఒక జాతీయము.

4. రావణుణ్ణి ఆలోచన విరమించుకోమని మారీచుడు ఎందుకు చెప్పాడు ?
జవాబు:
విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో మారీచుడు రామబాణం రుచి ఏమిటో తెలిసికొన్నాడు. అందుకే రాముని జోలికి వెళ్ళడం మంచిది కాదని, రావణునికి మారీచుడు సలహా చెప్పాడు.

5. మారీచుడు శ్రీరాముని చేతిలో చావడానికే సిద్ధపడ్డాడు. ఎందుకు ?
జవాబు:
తాను చెప్పినట్లు చేయకపోతే మారీచుణ్ణి రావణుడు చంపుతానన్నాడు. రావణుని చేతిలో చావడం కన్న, రాముని చేతిలో చస్తే, తన జన్మ తరిస్తుందని, మారీచుడు రాముని చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 24.
క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (June 2015)

జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి ఇంకేముంది ? హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగు తున్నాడు. వానరులతో “నేను మహా సముద్రాలను అవలీలగా దాటగలనని” ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతివారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. జాంబవంతుడు హనుమంతుణ్ణి ఎలా ప్రేరేపించాడు ?
జవాబు:
జాంబవంతుడు హనుమంతుని శక్తియుక్తులు ఎంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు.

2. ప్రేరణ వలన ఏమి బయటపడుతుంది ?
జవాబు:
ప్రేరణ వలన ఆత్మశక్తి బయటపడుతుంది.

3. హనుమంతుడు వానరులతో ఏమన్నాడు ?
జవాబు:
తాను మహాసముద్రాలను అవలీలగా దాటగలనని హనుమంతుడు వానరులతో అన్నాడు.

4. హనుమంతుడి మాటలు ఏమి తెలియజేస్తున్నాయి ?
జవాబు:
హనుమంతుడి మాటలు అతని ఆత్మశక్తిని, సముద్రం దాటగలడనే ఉత్సాహాన్ని తెలియజేస్తున్నాయి.

5. పై పేరాకు తగిన శీర్షికను సూచించండి.
జవాబు:
సముద్ర లంఘనం అనేది తగిన శీర్షిక.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 25.
క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (March 2016)

అప్పుడప్పుడే నిద్రకుపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. చూసుసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటపడ్డాడు. జటాయువు రావణుణ్ని ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరుహోరుగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జాటాయువు రెక్కలను, కాళ్ళను నరికివేశాడు. నేలపై కూలాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దయిన అతణ్ణి చూసి ఆత్మ బంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది.

ప్రశ్నలు – జవాబులు :
1. జటాయువు రావణుణ్ణి ఎందుకు ఎదిరించాడు ?
జవాబు:
రావణుడు సీతాదేవిని అపహరించుకుపోతున్నాడు. అందువల్ల జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.

2. జటాయువుకి సీతాదేవి ఆర్తనాదాలు ఎప్పుడు వినబడ్డాయి ?
జవాబు:
జటాయువు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి.

3. సీతాదేవి ఎందుకు ఆక్రందించింది ?
జవాబు:
రావణుడు తనను అపహరించుకుపోతున్నాడు. అందువల్ల సీతాదేవి ఆక్రందించింది.

4. పై పేరాలో పోరు ఎవరెవరికి మధ్య జరిగింది ?
జవాబు:
పై పేరాలో రావణుడికి, జటాయువుకు మధ్య పోరు జరిగింది.

5. పై పేరాలోని జాతీయాలు గుర్తించి రాయండి.
జవాబు:
పై పేరాలో (1) హోరాహోరిగా (2) తడిసి ముద్దయిన అనేవి రెండు జాతీయాలు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 26.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (June 2016)

రామలక్ష్మణులు దండకారణ్యం నుండి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని తల, మెడ కనబడడం లేదు. కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు. ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని పేరు కబంధుడు.

తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరం కాదు. కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు. అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో ఆనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలాడు. రామలక్ష్మణుల గురించి తెలుసు కున్నాడు. తన గురించి చెప్పుకున్నాడు. శాప కారణంగా తనకీ వికృతరూపం ప్రాప్తించిందన్నాడు.

శ్రీరాముడు కబంధునితో ‘మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు. వాటిని చెప్ప వలసిందని’ అడిగాడు. సమాధానంగా కబంధుడు ‘శ్రీరామా ! నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు. నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది. అప్పుడు చెప్పగల’ నన్నాడు. కబంధుని శరీరానికి అగ్నిసంస్కారం చేశారు రామలక్ష్మణులు. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు.

ప్రశ్నలు – జవాబులు :
1. రామలక్ష్మణులను పట్టుకున్న రాక్షసుడి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రామలక్ష్మణులను పట్టుకున్న కబంధుడు అనే రాక్షసుడికి తల, మెడ కనబడలేదు. అతడి కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. అతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు.

2. ‘కబంధ హస్తాలు’ అనే జాతీయం ఎలా పుట్టింది ?
జవాబు:
కబంధుడు అనే రాక్షసుడికి, యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోడం ఎవరితరమూ కాదు. తప్పించుకోడానికి వీలు కాని చేతులు అనే అర్థంలో, ఈ విధంగా కబంధ హస్తాలు అనే జాతీయం పుట్టింది.

3. కబంధుడికి దివ్యజ్ఞానం తిరిగి ఎట్లా వస్తుంది ?
జవాబు:
కబంధుని శరీరాన్ని దహిస్తే అతడి నిజరూపమూ, దివ్యజ్ఞానమూ వస్తాయి.

4. కబంధుడు రామలక్ష్మణులను ఎట్లా పట్టుకున్నాడు ?
జవాబు:
కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను, అమాంతంగా తన రెండు చేతులతోనూ, పట్టుకున్నాడు.

5. రామలక్ష్మణులు కబంధున్ని ఏ సహాయం అడిగారు ?
జవాబు:
రామలక్ష్మణులు, తమకు, రావణుని రూపం గురించి, అతడు ఉండే చోటును గురించి, రావణుని శక్తి సామర్థ్యాలను గురించి చెప్పవలసిందని, కబంధుణ్ణి అడిగారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 27.
కింది గద్యాన్ని చదువండి. (March 2017)

సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వచ్చారు. హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. దీనికోసం కిష్కింధకు రమ్మని ప్రార్థించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ గ్రామంలో గాని, నగరంలో గాని, తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోమారు చాటుకున్నాడు శ్రీరాముడు. సుగ్రీవునికి శుభం పలికాడు. తాను ప్రసవణగిరి మీదే ఉంటానన్నాడు. వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు. సరేనన్నాడు సుగ్రీవుడు. కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు. కాలం గడుస్తూన్నది. శరత్కాలం వచ్చింది. సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు.

కింది కీలక పదాల అర్థాలను ఒక్క వాక్యంలో వివరించండి.
1. శుభం పలుకడం : ……………………..
జవాబు:
శుభము కలగాలని ఆశీర్వదించడం.

2. ప్రస్తావన : ……………………
జవాబు:
ముచ్చటించుట

3. పితృవాక్య పరిపాలన : ……………………
జవాబు:
తండ్రి చెప్పిన మాటను పాటించడం.

4. అన్వేషణ : …………………
జవాబు:
వెదకడం

5. కార్యభారం : …………………
జవాబు:
పని యొక్క బరువు

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 28.
కింది గద్యాన్ని చదివి ఖాళీలు పూరించండి. (June 2017)

రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో హనుమంతుని బలంగా చరచాడు రావణుడు. మారుతి చలించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా ! భళా !, నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు.

ప్రశ్నలు – జవాబులు:
1. రావణుడు …………………. మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు.
జవాబు:
వానరసేన మీద

2. రావణుని దెబ్బకు చలించిపోయిన వాడు ……………………
జవాబు:
మారుతి (హనుమంతుడు)

3. రావణుడు ………………. దెబ్బతో చలించి పోయాడు.
జవాబు:
హనుమంతుని ఒక్క అరచేతి

4. మారుతి …………………. చేత మెచ్చుకోబడ్డాడు.
జవాబు:
రావణుని

5. లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి ………………….. ను వారించాడు.
జవాబు:
అన్న

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 29.
క్రింది గద్యాన్ని చదువండి. (March 2018)

పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్ళీ బ్రతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముణ్ణి అభ్యర్ధించాడు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళమని చెప్పి, విభీషణుని వీడ్కోలు అందుకున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజా శ్రమాన్ని సందర్శించారు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి, గుహునికి ముందుగా వెళ్ళి తెలియ జేశాడు. వాళ్ళెంతో ఆనందించారు.

ప్రశ్నలు – జవాబులు :

క్రింది ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించి రాయండి.
1. లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముని అభ్యర్థించినది.
అ) శివుడు
ఆ) విభీషణుడు
ఇ) గుహుడు
జవాబు:
ఆ) విభీషణుడు

2. భరద్వాజ ఆశ్రమాన్ని చూసినవారు.
అ) శ్రీరాముడు
ఆ) సీతారాములు
ఇ) సీత
జవాబు:
ఆ) సీతారాములు

3. వానరులను బతికించినది.
అ) భరద్వాజుడు
ఆ) ఇంద్రుడు
ఇ) శ్రీరాముడు
జవాబు:
ఆ) ఇంద్రుడు

4. శ్రీరాముడు సంహరించినది.
అ) శిష్టులను
ఆ) ఇష్టులను
ఇ) దుష్టులను
జవాబు:
ఇ) దుష్టులను

5. శ్రీరాముని రాకను ముందుగా భరతునికి తెలియ జేసినది.
అ) హనుమంతుడు
ఆ) గుహుడు
ఇ) విభీషణుడు
జవాబు:
అ) హనుమంతుడు

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

ప్రశ్న 30.
క్రింది గద్యాన్ని చదువండి. (June 2018)

సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశమున్నది. అందులోనిదే ‘అయోధ్యా’ అనే మహానగరం. అయోధ్యా అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీనిని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథమహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకొనేవాడు. వసిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.

ప్రశ్నలు – జవాబులు :

క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన దానికి (✓) గుర్తు పెట్టి సూచించండి.
1. అ) శ్రీరాముడు సూర్యవంశం వాడు. ( )
ఆ) సూర్యవంశానికి చెందినవాడు కాదు దశరథుడు. ( )
జవాబు:
అ) శ్రీరాముడు సూర్యవంశం వాడు. (✓)

2. అ) దశరథునికి సుమంత్రుడు మంత్రి. (  )
ఆ) సుమంత్రుడు దశరథుని కొలువులో లేడు. (  )
జవాబు:
అ) దశరథునికి సుమంత్రుడు మంత్రి. (✓)

3. అ) యోధులు జయించటానికి శక్యమైన నగరం కోసల. (  )
ఆ) అయోధ్య యోధులు జయించటానికి శక్యం కానిది. (  )
జవాబు:
ఆ) అయోధ్య యోధులు జయించటానికి శక్యం కానిది. (✓)

4. అ) కోసలదేశపు రాజ పురోహితులలో వసిష్ఠుడు ఒకర ( )
ఆ) దశరథుడి పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు కార.
జవాబు:
అ) కోసలదేశపు రాజ పురోహితులలో వసిష్ఠుడు ఒకర (✓)

TS 10th Class Telugu Guide ఉపవాచకం పరిచిత గద్యాలు

5. అ) పై గద్యం ప్రకారం రాక్షసులతో యుద్ధం చేసింది దశరథుడు. (  )
ఆ) శ్రీరాముడు రాక్షసులతో యుద్ధం చేసినట్లు పై గద్యంలో ఉంది. (  )
జవాబు:
అ) పై గద్యం ప్రకారం రాక్షసులతో యుద్ధం చేసింది దశరథుడు. (✓)

Leave a Comment