Telangana SCERT 10th Class Telugu Grammar Telangana Sandhulu సంధులు Questions and Answers.
TS 10th Class Telugu Grammar Sandhulu సంధులు
I. సంస్కృత సంధులు :
1. సవర్ణదీర్ఘసంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘము ఏకాదేశ మగును.
అ, ఆలకు అ, ఆలు
ఇ, ఈలు ఇ, ఈలు
ఉ, ఊలకు ఉ, ఊలు
ఋ, ఋలకు ఋ, ౠలు సవర్ణములు. సవర్ణములకు దీర్ఘము ఆదేశముగా వచ్చును. కనుక సవర్ణదీర్ఘ సంధి.
ఉదా :
నర + అంతకుడు – నరాంతకుడు
దివ్య + ఆనందము – దివ్యానందము
యతి + ఇంద్రుడు – యతీంద్రుడు
ముని + ఈశ్వరుడు – మునీశ్వరుడు
గురు + ఉపదేశము – గురూపదేశము
పితౄ + ఋణము – పితౄణము
కుల + ఆచార్యుడు – కులాచార్యుడు
దిశ + అంచలము – దిశాంచలము
శ్రావణ + అభ్రము – శ్రావణాభ్రము
ఆంధ్ర + అంబిక – ఆంధ్రాంబిక
విభ + ఆవళులు – భావళులు
సచివ + ఆలయం – సచివాలయం
శీత + అమృతము – శీతామృతము
అశ్వ + ఆరూఢుడు – అశ్వారూఢుడు
పుణ్య + అంగన – పుణ్యాంగన
ముని + ఈశ్వర – మునీశ్వర
2. గుణసంధి:
అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైనపుడు వరుసగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశ మగును.
ఏ, ఓ, అర్లకు గుణములని పేరు.
ఉదా :
నర + ఇంద్రుడు – నరేంద్రుడు
మహా + ఇంద్రుడు – మహేంద్రుడు
మహా + ఈశుడు – మహేశుడు
సూర్య + ఉదయము – సూర్యోదయము
మహా + ఋషి – మహర్షి
గర్వ + ఉన్నతి – గర్వోన్నతి
రమ్య + ఉద్యానములు – రమోద్యానములు
వదాన్య + ఉత్తముడు – వదాన్యోత్తముడు
సర్వ + ఈశ్వరా – సర్వేశ్వరా
భాగ్య + ఉదయం – భాగ్యోదయం
సత్య + ఉక్తి – సత్యోక్తి
దానవ + ఇంద్రుడు – దానవేంద్రుడు
నవ + ఉదయం – నవోదయం
3. వృద్ధిసంధి:
అకారమునకు ఏ, ఐలు పరమగునపుడు ‘ఐ’ కారమును, ఓ, ఔలు పరమగునపుడు ‘ఔ’ కారమును ఏకాదేశమగును.
ఉదా :
ఏక + ఏక – ఏకైక
లోక + ఐక్యము – లోకైక్యము
గంగ + ఓఘము – గంగౌఘము
గ్రామ + ఔన్నత్యము – గ్రామౌన్నత్యము
నాటక + ఔచిత్యం – నాటకౌచిత్యం
ఏక + ఏక – ఏకైక
వసుధ + ఏక – వసుధైక
దివ్య + ఐరావతం – దివ్యైరావతం
దేశ + ఐశ్వర్యం – దేశైశ్వర్యం
వన + ఓషధి – వనౌషధి
సమ + ఐక్యత – సమైక్యత
4. యణాదేశసంధి :
ఇ, ఉ, ఋలకు సవర్ణములు కాని అచ్చులు పరమగునపుడు క్రమముగా య, వ, ర, లు ఆదేశమగును.
ఉదా :
ప్రతి + ఏకము – ప్రత్యేకము
వస్తు + ఐక్యము – వస్వైక్యము
పితృ + అంశము – పిత్రంశము
అతి + అంత – అత్యంత
అభి + ఆగతులు – అభ్యాగతులు
అణు + ఆయుధాలు – అణ్వాయుధాలు
అతి + అద్భుతం – అత్యద్భుతం
(ఇ + ఇ కాని అచ్చు – య
ఉ + ఉ కాని అచ్చు – వ
ఋ + ఋ కాని అచ్చు – ర)
5. జస్త్వసంధి :
క, చ, ట, త, పలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరములు గాని, శ, ష, సలు గాక మిగిలిన హల్లులుగాని, అచ్చులుగాని పరమైనపుడు క్రమముగా గ, జ, డ, ద, బలు ఆదేశమగును.
ఉదా :
వాక్ + అధిపతి – వాగధిపతి
అచ్ + అంతము – అజంతము
షట్ + రసములు – షడ్రసములు
సత్ + రూపము – సద్రూపము
6. శ్చుత్వసంధి :
సకార తవర్గలకు శకార చవర్గలు పరమైనప్పుడు శకార చవర్గములే ఆదేశమగును.
ఉదా :
సత్ + జనులు – సజ్జనులు
మనస్ + చంద్రికలు – మనశ్చంద్రికలు
7. ష్టుత్వసంధి :
సకార తవర్గాలకు, షకార టవర్గలు పరమైనచో షకార టవర్గలే ఆదేశమగును.
ఉదా :
మనస్ + షట్పదము – మనష్షట్పదము
దనుస్ + టంకము – ధనుష్టంకము
తత్ + టీకా – తట్టీకా
8. అనునాసిక సంధి:
క, చ, ట, త, పలకు న, మలు పరమైనప్పుడు ఆయా వర్గ పంచమాక్షరములే వైకల్పికముగా ఆదేశమగును.
ఉదా :
వాక్ + మహిమ – వాఙ్మహిమ, వాగ్మహిమ
రాట్ + నిలయము – రాణ్ణిలయము, రాడ్నిలయము
కకుప్ + నేత – కకుమ్నేత, కకుబ్నేత
9. విసర్గసంధి :
i) హస్వ అకారము మీది విసర్గకు వర్గ ప్రథమ, ద్వితీయాక్షరములు గాని, శ, ష, సలు తప్ప మిగిలిన హల్లులు గాని పరమైనచో విసర్గకు ముందున్న అకారమునకు “ఓ”కారమాదేశ మగును.
ఉదా :
మనః + గతి – మనోగతి
తపః + ధనము – తపోధనము
మనః + రథము – మనోరథము
శిరః + రత్నము – శిరోరత్నము
ii) విసర్గాంత శబ్దములకు అచ్చులు గాని, వర్గ తృతీయ, చతుర్ధ, పంచమాక్షరములు గాని, హ, య, వ, రలు గాని పరమైనపుడు విసర్గకు రేఫము ఆదేశమగును.
ఉదా :
చతుః + ఆత్మ – చతురాత్మ
చతుః + భుజుడు – చతుర్భుజుడు
ధనుః + వేదము – ధనుర్వేదము
పునః + దర్శనము – పునర్దర్శనము
iii) విసర్గకు క, ఖ, ప, ఫలు పరమైనపుడు విసర్గకు మార్పురాదు.
ఉదా :
యశః + కాయము – యశఃకాయము
తపః + ఫలము – తపఃఫలము
10. సకారాంత సంధి:
i) ‘అస్’ అంతమున గల పదమునకు అకారము పరమైనచో రెండింటికిని కలిపి ‘ఓ’ కారమాదేశ మగును.
ఉదా :
మనస్ + అభిలాష – మనోభిలాష
యశస్ + అబ్ధి – యశోబ్ధి
ii) సకారాంత శబ్దములకు శ, షలు పరమైనచో శ, షలు గాని, విసర్గము గాని వచ్చును.
ఉదా :
మనస్ + శక్తి – మనశ్శక్తి, మనఃశక్తి
చతుస్ + షష్టి – చతుష్షష్టి, చతుఃషష్టి
iii) సకారాంత శబ్దములకు ట, ఠలు పరమైనప్పుడు ‘ష’ వర్ణమాదేశమగును.
ఉదా :
అయస్ + టంకము – అయష్టంకము
ధనుస్ + టంకారము – ధనుష్టంకారము
II. తెనుగు సంధులు :
తెలుగు అజంత భాష. అనగా తెనుగు పదములు అచ్చుతో అంతమగును. సంధి అనగా పూర్వపర స్వరములకు పరస్వరము ఏకాదేశ మగుట.
ఉదా :
రాముడు + అతడు – రాముడతడు
ఏమి + ఏమి – ఏమేమి
సీత + అయ్య – సీతయ్య
1. అకార సంధి :
అత్తునకు సంధి బహుళము.
ఉదా :
రామ + అయ్య – రామయ్య
సీత + అక్క – సీతక్క
మేన + అత్త – మేనత్త
పుట్టిన + ఇల్లు – పుట్టినిల్లు, పుట్టినయిల్లు
దూత + ఇతడు – దూతయితడు
అమ్మ + ఇచ్చెను – అమ్మయిచ్చెను
ఒక + ఒక – ఒకానొక అన్యవిధము
ముచ్చట + ఆడు – ముచ్చటాడు
పుట్టిన + ఇల్లు – పుట్టినిల్లు
ముత్త + ఐదువ – ముత్తైదువ
పొత్తుల + ఇల్లు – పొత్తులి
2. ఇకార సంధి:
i) మధ్యమ పురుష క్రియలయందు ఇత్తునకు సంధియగు.
ఉదా :
చేసితివి + అపుడు – చేసితినపుడు
ఏలితిరి + ఇపుడు – ఏలితిరిపుడు
ii) ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగాను.
ఉదా :
ఏమి + అంటివి – ఏమంటివి, ఏమియంటివి
మఱి + ఏమి – మఱేమి, మఱియేమి
దారిని + ఇచ్చిరి – దారినిచ్చిరి
వేయి + ఏటికిన్ – యేటికిన్
అక్కడికి + అక్కడ – అక్కడికక్కడ
గెల్చితిమి + అమ్మ – గెల్చితిమమ్మ
iii) క్త్వార్థంబైన ఇత్తునకు సంధిలేదు.
ఉదా :
వచ్చి + ఇచ్చెను – వచ్చియిచ్చెను
3. ఉకారసంధి:
ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధి యుగు.
ఉదా :
రాముడు + అతడు – రాముడతడు
అతడు + ఎక్కడ – అతడెక్కడ .
మనము + ఉన్నాము – మనమున్నాము
యుద్ధము + అడి – యుద్ధమాడి
పేరు + అవుతుంది – పేరవుతుంది
ధరాతలము + ఎల్ల – ధరాతలమెల్ల
సయ్యాటలు + ఆడెన్ – సయ్యాటలాడెన్
జగమ + ఎల్ల – జగమెల్ల
దారి + అవుతుంది – దారవుతుంది
ఎత్తులకు + ఎదిగిన – ఎత్తులకెదిగిన
4. అపదాదిస్వర సంధి :
అంద్వవగాగమంబులం దప్ప నపదాది స్వరంబు పరంబగునప్పుడచ్చునకు సంధియగు.
ఉదా :
మూర + ఎడు – మూరెడు
ఆర్థి + ఇంచు – అర్ధించు
III. ఆగమ సంధులు :
1. యడాగమ సంధి: సంధిలేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
మా + అమ్మ – మాయమ్మ
వచ్చి + ఇచ్చెను – వచ్చియిచ్చెను
2. రుగాగమ సంధి
i) పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు.
ఉదా :
పేద + ఆలు – పేదరాలు
మనుమ + ఆలు – మనుమరాలు
జవ + ఆలు – జవరాలు
ముద్ద + ఆలు – ముద్దరాలు
జవ + ఆలు – జవరాలు
బాలింత + ఆలు – బాలింతరాలు
బీద + ఆలు – బీదరాలు
ii) కర్మధారయమునందు తత్సమంబులకు ఆలు శబ్దము పరంబగునపుడు అత్వంబునకు ఉత్వంబును రుగాగమంబు నగు.
ఉదా :
ధీర + ఆలు – ధీరురాలు
గుణవత + ఆలు – గుణవంతురాలు
ధైర్యవంత + ఆలు – ధైర్యవంతురాలు
శ్రీమంత + ఆలు – శ్రీమంతురాలు
3. టుగాగమ సంధి
i) కర్మధారయములందుత్తునకు అచ్చు పరంబగు నపుడు టుగాగమంబగు.
ఉదా :
నిగ్గు + అద్దము – నిగ్గుటద్దము
కఱకు + అమ్ము – కఱకుటమ్ము
సరసపు + అలుక – సరసపుటలుక
కర్మధారయములందు అనుటచే ఉకారములేని వాటికి కూడా కొన్ని చోట్ల టుగాగమంబు వచ్చును.
దుక్కి + ఎద్దు – దుక్కిటెద్దు
పల్లె + ఊరు – పల్లెటూరు
ii) కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాషనగు.
ఉదా :
పేరు + ఉరము – పేరుటురము , పేరుమ
పొదరు + ఇల్లు – పొదరుటిల్లు, పొదరిల్లు
4. దుగాగమ సంధి :
నీ, నా తన శబ్దములకు ఉత్తర పదము పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
ఉదా :
నీ + చెలిమి – నీదుచెలిమి
నా + నేరము – నాదునేరము
తన + కోపము – తనదుకోపము
5. నుగాగమ సంధి:
1) సమాసంబుల ఉదంతంబులగు స్త్రీ సమంబులకును, పంపులకును పరుష సరళములు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా :
చిగురు + కయిదువు – చిగురుంగయిదువు చిగురుఁగయిదువు చిగురున్దయిదువు
2) షష్ఠీ సమాసమునందుకార, ఋకారములకు అచ్చు పరంబగునపుడు నుగాగమంబగు.
ఉదా :
రాజు + ఆనతి – రాజునానతి
విధాతృ + ఆజ్ఞ – విధాతృనాజ్ఞ
3) ఉదంత తద్ధర్మార్థక విశేషణమునకు అచ్చు పరంబగునపుడు నుగాగమంబగు.
ఉదా :
చేయు + అతడు – చేయునతడు
చదువు + అతడు – చదువునతడు
IV. ఆమ్రేడిత సంధులు :
1) అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.
ఉదా :
ఔర + ఔర – ఔరౌర
ఆహా + ఆహా – ఆహాహా
2) ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబైన ద్విరుక్త టకారంబగు.
ఉదా :
కడ + కడ – క + ట్ట + కడ – కట్టకడ
ఎదురు + ఎదురు – ఎట్టఎదురు
మొదలు + మొదలు – మొట్టమొదట
3) ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ పురుష ‘ము’, ‘డు’ లకు లోపంబు విభాషనగు.
ఉదా :
నిలుము + నిలుము – నిలునిలుము, నిలుమునిలుము
కొట్టుడు + కొట్టుడు – కొట్టుకొట్టుడు, కొట్టుడుకొట్టుడు
4) ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తి లోపంబు బహుళంబుగా నగు.
ఉదా :
నాడు + నాడు – నానాడు, నాడునాడు
ఇంచుక + ఇంచుక – ఇంచించుక, ఇంచుకించుక
5) అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు.
ఉదా :
అదుకు + అదుకు – అందదుకు
చెదరు + చెదరు – చెల్లాచెదరు
తునియలు + తునియలు – తుత్తునియలు
మిట్లు + మిట్టు – మిఱుమిట్లు
V. ఆదేశ సంధులు :
1. ద్విరుక్తటకారాదేశ సంధి:
కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఱ, డలకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.
ఉదా :
కుఱు + ఉసురు – ‘కుట్టుసురు
చిఱు + ఎలుక – చిట్టెలుక
కడు + ఎదుట – కట్టెదుట
నడు + ಇల్లు – నట్టిల్లు
నిడు + ఊరుపు – నిట్టూరు
2. సరళాదేశ సంధి :
ద్రుత ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు,
ఉదా :
తోచెను + చుక్కలు – తోచెను + జుక్కలు
పూచెను + కలువలు – పూచెను + గలువలు
మూటన్ + కట్టు – మూట + గట్టు
ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
తోచెను + జుక్కలు – తోచెంజుక్కలు , తోచెఁజుక్కలు (బిందువు) , తోచెన్జుక్కలు (సంశ్లేష)
పూచెను + గలువలు – పూచెంగలువలు , పూచెఁగలువలు(బిందువు) , పూచెన్గలువలు (సంశ్లేష)
3. గసడదవాదేశ సంధి:
i) ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వలు బహుళంబుగానగు.
ఉదా :
వాడు + కొట్టె – వాడుగొట్టె, వాడుకొట్టె
నీవు + టక్కరివి – నీవుడక్కరివి, నీవుటక్కరివి
నాల్కలు + చాచును – నాల్కలు సాచుచు
ప్రాణాలు + కోల్పోవు – ప్రాణాలుగోల్పోవు
ఆసు + పోయుట – ఆసువోయుట
కాలు + చేతులు – కాలుసేతులు
ii) ద్వంద్వంబునం బదంబుపై పరుషములకు గ, స, డ, ద, వలగు.
ఉదా :
కూర + గాయ – కూరగాయలు
కాలు + చేయి – కాలుసేతులు
తల్లి + తండ్రి – తల్లిదండ్రులు
4. పుంప్వాదేశ సంధి :
కర్మ ధారయములందలి ‘ము’ వర్ణమునకు పుంపులగు.
ఉదా :
సరసము + వచనము – సరసపువచనము – సరసంపువచనమ
విరసము + మాట – విరసపుమాట , విరసంపుమాట
VI. లోప సంధులు :
1. పడ్వాది సంధి :
పడ్వాదులు పరంబగునపుడు ‘ము’ వర్ణంబునకు లోపపూర్ణబిందువులు విభాషనగు.
ఉదా :
భయము + పడు – భయపడు , భయంపడు, భయముపడు
సూత్రము + పట్టె – సూత్రపట్టె, సూత్రంపట్టె , సూత్రముపట్టె
2. డు వర్ణలోప సంధి (లేక) సమానాధికరణ సంధి :
సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబ గునపుడు మూడు శబ్దము ‘డు’ వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు.
ఉదా :
మూడు + లోకములు – ముల్లోకములు
మూడు + జగములు – ముజ్జగములు
(ద్విరుక్తంబగు హల్లు ………. అను సూత్రముచే దీర్ఘమునకు హ్రస్వము)
3. ప్రాతాది సంధి :
i) సమాసంబుల ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.
ఉదా :
ప్రాత + ఇల్లు – ప్రాయిలు, ప్రాతయిల్లు
పూవు + రెమ్మ – పూరెమ్మ, పూవురెమ్మ
ii) లుప్త శేషంబునకు పరుషములు పరంబగునపుడు నుగాగమంబగు.
ఉదా :
పూవు + తోట – పూన్ తోట
సరళాదేశ దృత సంధులు రాగా పూఁదోట అగును.
అట్లే, కెంపు + తామర – కెందామర
iii) క్రొత్త శబ్దమునకు ఆద్యక్షర శేషంబునకు కొన్ని యెడల నుగాగమంబును, కొన్ని యెడల మీది హల్లునకు ద్విత్వంబు నగు.
ఉదా :
క్రొత్త + పసిడి – క్రొంబసిడి
క్రొత్త + తావి – క్రొత్తవి
iv) అన్యంబులకు సహితము ఇక్కార్యంబులు కొండొకచో కానంబడియెడి
ఉదా :
పది + తొమ్మిది – పందొమ్మిది
నిండు + వెఱ – నివ్వెఱ
నెఱ + నడుము – నెన్నడుము
4. లు, ల, నల సంధి :
లు, ల, నలు పరంబగునపుడు ఒకానొకచో ముగాగమంబునకు లోపంబును, తత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషనగు.
ఉదా :
మీసము + లు – మీసాలు, మీసములు
వజ్రము + లు – వజ్రాలు, వజ్రములు
చుట్టము + లు – చుట్టాలు, చుట్టములు
పగడము + లను – పగడాలను, పగడములను
5. త్రిక సంధి :
i) ఆ, ఈ, ఏలు త్రికములు.
ii) త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
ఉదా :
ఆ + కన్య – ఆ + క్కన్య
ఈ + కాలము – ఈ + క్కాలము
ఏ + వాడు – ఏ + వాడు
iii) ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. అక్కన్య, ఇక్కాలము, ఎవ్వాడు.