మాతృభాష Questions and Answers Summary Inter 2nd Year Telugu

Reviewing AP Inter 2nd Year Telugu Study Material పద్యభాగం 5th Poem మాతృభాష Questions and Answers Summary can help students prepare confidently for exams.

AP Inter 2nd Year Telugu మాతృభాష Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు.

ప్రశ్న 1.
మాతృభాష కవిత సారాంశాన్ని వివరించండి.
జవాబు:
మాతృభాష అనేది ఏ జాతి సంస్కృతి సంప్రదాయాలకైనా జీవిక. మాతృభాష అనేది ఏ జాతికైనా బతుకు పతాక. శ్రమశక్తిలోనే అమ్మభాష ఉనికి ఉట్టిపడుతుంది. స్వేద సౌందర్యంలోనే భాషోత్పత్తి ఉద్భవించింది. శిశువు తల్లిద్వారా మాతృభాష ద్వారా మాధుర్యాన్ని చవిచూస్తాడని, తల్లే ఆదిగురువని కవి తెలిపాడు. మాతృభాష విద్యాబోధన సృజనాత్మకతను, మనో వికాసాన్ని వృద్ధి చేస్తుంది. ప్రజల భాషలో పరిపాలన పరిపుష్టి కలిగిస్తుందని, నా కోపం ప్రేమ – శ్రమ మాతృభాషలోనే వ్యక్తం చేయాలని కవి భావించాడు.

ఆకాశం – మట్టి – మనిషి గురించి అమ్మభాషలోనే తెలుసుకోవాలని, పుట్టుక చావు దగ్గర మాతృభాషలోనే స్పందించాలని విశదపరిచాడు. మాతృభాషలో వ్యక్తం చేసే ఏ భావమైనా సంపూర్ణంగా ఉంటుంది. నిప్పులు చెరగడానికి అంటే ధర్మాగ్రహాన్ని వ్యక్తీకరించడానికి, తెలుగుజాతి పౌరుషాన్ని నిలబెట్టడానికి మాతృభాష మూలాధారం కావాలి. మాతృభాషలోనే గ్రహాలతో మాట్లాడతాను’ అని కవి అనడం వెనుక జపాన్ జర్మనీ చైనా వంటి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు మాతృభాషలోనే విద్యనందించి అంతరిక్ష జ్ఞానాన్ని, భౌగోళిక – భూగర్భశాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయని తెలియజేశాడు.

II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మాతృభాష సౌందర్యాన్ని వివరించండి.
జవాబు:
మాతృభాష అనేది ఏ జాతి సంస్కృతి సంప్రదాయాలకైనా జీవిక. మాతృభాష ఏ జాతికైనా బతుకు పతాక. శ్రమశక్తిలోనే అమ్మ భాష ఉనికి ఉట్టిపడుతుంది. స్వేద సౌందర్యంలోనే భాషోత్పత్తి ఉద్భవించింది. శిశువు తల్లి ద్వారా మాతృభాష మాధుర్యాన్ని చవి చూస్తాడు. తల్లే శిశువుకు ఆది గురువు.

మాతృభాష Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 2.
కొంక్యాన ఛాయరాజ్ గురించి వివరించండి.
జవాబు:
సిక్కోలు “ఛాయరాజ్ పేర్గాంచిన కొంక్యాన ఛాయరాజ్ 6.7.1948న సూరమ్మ, సూర్యనారాయణ దంపతులకు శ్రీకాకుళం జిల్లా గారమండలం కొంక్యాన పేటలో జన్మించారు. 1968లో ఉపాధ్యాయునిగా ప్రస్థానం ప్రారంభించి 2005లో ప్రధానోపాధ్యాయునిగా సుమారు మూడున్నర దశాబ్దాలకు పైగా విద్యాసేద్యం కావించారు.

ఉపాధ్యాయ ఉద్యమాలలో ‘ప్రజా సాహితి’ సంపాదకునిగాను తనదైన ముద్ర వేశారు. అనేక రచనలు చేశారు. ఎన్నెన్నో అవార్డులు పొందారు. ఛాయరాజ్ తన ‘మాతృభాష’ అనే కవిత ద్వారా భాషాభిమానుల మన్ననలను చూరగొన్నాడు. “పుట్టుక దగ్గర, చావు దగ్గర పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను” అని అంటూ విశ్వజనీన భావాన్ని వ్యక్తం చేశాడు.

III. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాషోత్పత్తి ఎక్కడ జరిగింది ?
జవాబు:
శ్రమ నుండి శ్రమలోనే భాషోత్పత్తి జరిగింది.

ప్రశ్న 2.
‘మాతృభాష’ కవితలో శ్రమ అంటే ఏమిటి ?
జవాబు:
‘మాతృభాష’ కవితలో శ్రమ అంటే అమ్మ.

ప్రశ్న 3.
తెలుగు పౌరుషాన్ని రాజేయడానికి ఏమి కావాలి ?
జవాబు:
తెలుగు పౌరుషాన్ని రాజేయడానికి మాతృభాష కావాలి.

మాతృభాష Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 4.
మాతృభాష పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
మాతృభాష పాఠ్యభాగ రచయిత కొంక్యాన ఛాయరాజ్.

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
అన్నం కావాలి రైస్ వద్దు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము “కొంక్యాన ఛాయరాజ్” చే రచింపబడిన “కొంక్యాన ఛాయరాజ్ సమగ్ర సాహిత్య గ్రంథం” నుండి గ్రహింపబడిన “మాతృభాష” అను పాఠంలోనిది.
సందర్భము : మాతృభాషలోనే మాట్లాడతానని సూరమ్మతో ఆమె కొడుకు అన్నాడని చెప్తూ కవి పల్కిన సందర్భము.
భావము : నాకు అన్నమే కావాలి. ఇంగ్లీషులో పలికే మాట నాకు వద్దు.

ప్రశ్న 2.
పుట్టుక దగ్గర, చావు దగ్గర పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము “కొంక్యాన ఛాయరాజ్” చే రచింపబడిన “కొంక్యాన ఛాయరాజ్ సమగ్ర సాహిత్య గ్రంథం” నుండి గ్రహింపబడిన “మాతృభాష” అను పాఠంలోనిది.
సందర్భము : జన్మించినా, మరణించినా మాతృభాషలోనే ఏడుస్తారు/నవ్వుతారు కాని పరభాషలో జరుగదని వివరిస్తూ కవి పల్కిన సందర్భము.
భావము : జన్మించినా, మరణించినా పరభాషలో ఏడ్వలేరు, నవ్వలేరు అని భావము.

మాతృభాష Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 3.
శ్రమకు పుట్టిన శబ్ద సౌందర్యం మాతృభాష.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము “కొంక్యాన ఛాయరాజ్”చే రచింపబడిన “కొంక్యాన ఛాయరాజ్ సమగ్ర సాహిత్య గ్రంథం” నుండి గ్రహింపబడిన “మాతృభాష” అను పాఠంలోనిది.
సందర్భము : మాతృభాష అయిన తెలుగుభాష యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ కవి పల్కిన సందర్భము.
భావము : శ్రమలో నుండి పుట్టిన పదముల సొంపే మన మాతృభాష అయిన తెలుగు భాష.

మాతృభాష Summary in Telugu

కవి పరిచయం

పాఠ్యభాగము : మాతృభాష
గ్రహింపబడిన గ్రంథము : కొంక్యాన ఛాయరాజ్ “సమగ్ర సాహిత్య గ్రంథం” నుండి గ్రహింపబడింది.
కవి: కొంక్యాన ఛాయరాజ్
తల్లిదండ్రులు : సూరమ్మ, సూర్యనారాయణ దంపతులు
కాలము : 20వ శతాబ్దము
నామాంతరము : సిక్కోలు ఛాయరాజ్ పేరొందారు.
పదవి : ‘ప్రజాసాహితి’ సంపాదకులు

రచనలు :

  1. శ్రీకాకుళం – ఉద్యమ కథాకావ్యం
  2. గుమ్మ
  3. దర్శిని
  4. నిరీక్షణ వంటి కావ్యాలు.

బుదడు, దుఖ్కేరు వంటి స్మృతి కావ్యాలు; రస స్పర్శ – కవిత ; మట్టి నన్ను మౌనంగా ఉండనీదు; కవితా సంపుటి; ‘కారువాకి’ అనే చారిత్రక కళింగ యుద్ధ నవల ; అనుపమాన కథా రూపకాలు – దృశ్యరూపకం ; వివిధ పత్రికలలో 300లకు పైగా కవితలు.

విశిష్టిత : ప్రకృతితో పరవశించి, గిరిజన గూడెం గుండెల ఆర్తనాదాలను అక్షరబద్దం చేసి శ్రీకాకుళ ఉద్యమ పోరాటాన్ని గేయ కావ్యంగా మలిచిన తీరు ప్రశంసనీయం.

అవార్డులు :

  1. 2000 సం||రం ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
  2. 2006 సం||రం తెలుగు వికాసం అవార్డు
  3. 2005 సం॥రం లాంగుల్యా మిత్రుల పురస్కారం
  4. 2004 సం||రం డా॥ ఆవంత్స సోమసుందర్ సత్కారం, పిఠాపురం.
  5. 2010 సం||రం నవంబర్లో కృష్ణశాస్త్రి కావ్య పురస్కారం

కవితలో ప్రత్యేకత : “మాతృభాష” అనే కవిత ద్వారా భాషాభిమానుల మన్ననలను చూరగొన్నాడు. “పుట్టుక దగ్గర, చావు దగ్గర పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను” అని అంటూ విశ్వజనీన భావాన్ని వ్యక్తం చేశాడు.

పాఠ్యభాగ ఉద్దేశ్యం

శ్రమ జీవితానికి, మాతృభాషకు అవినాభావ సంబంధం ఉందని, శ్రమంటే అమ్మ అని, శ్రమలోనే భాషోత్పత్తి జరిగిందని భావించాడు కవి. ఛాయరాజ్ తన “మాతృభాష” కవిత ద్వారా అమ్మ భాషతోనే విజ్ఞానం వికసిస్తుందని, సంస్కృతి ప్రతిబింబిస్తుందని తెలియజేశాడు.

మాతృభాష Questions and Answers Summary Inter 2nd Year Telugu

పాఠ్యభాగ నేపథ్యం

అనివార్యమైన ప్రపంచీకరణ “సంస్కృతి – సంప్రదాయాల”తో పాటు భాషను కూడా తీవ్ర ఒడిదుడుకులకు గురి చేసింది. పాశ్చాత్యీకరణ హెూరులో మాతృభాష మూలాలకు ముప్పు పొంచి ఉండకూడదనే భావనతో, భాషపైన మమకారంతో “మాతృభాష” కవితకు శ్రీకారం చుట్టి ఆంధ్రావనిని జాగృతం చేసే ప్రయత్నానికి కంకణం కట్టుకున్నారు కవి ఛాయరాజ్.

పాఠ్యభాగ సారాంశం

మాతృభాష అనేది ఏ జాతి సంస్కృతి సంప్రదాయాలకైనా జీవిక. మాతృభాష అనేది ఏ జాతికైనా బతుకు పతాక. శ్రమశక్తిలోనే అమ్మభాష ఉనికి ఉట్టిపడుతుంది. స్వేద సౌందర్యంలోనే భాషోత్పత్తి ఉద్భవించింది. శిశువు తల్లిద్వారా మాతృభాష ద్వారా మాధుర్యాన్ని చవిచూస్తాడని, తల్లే ఆదిగురువని కవి తెలిపాడు. మాతృభాష విద్యాబోధన సృజనాత్మకతను, మనో వికాసాన్ని వృద్ధి చేస్తుంది. ప్రజల భాషలో పరిపాలన పరిపుష్టి కలిగిస్తుందని, నా కోపం – ప్రేమ – శ్రమ మాతృభాషలోనే వ్యక్తం చేయాలని కవి భావించాడు. ఆకాశం – మట్టి – మనిషి గురించి అమ్మభాషలోనే తెలుసుకోవాలని, పుట్టుక – చావు దగ్గర మాతృభాషలోనే స్పందించాలని విశదపరిచాడు.

మాతృభాషలో వ్యక్తం చేసే ఏ భావమైనా సంపూర్ణంగా ఉంటుంది. నిప్పులు చెరగడానికి అంటే ధర్మాగ్రహాన్ని వ్యక్తీకరించడానికి, తెలుగుజాతి పౌరుషాన్ని నిలబెట్టడానికి మాతృభాష మూలాధారం కావాలి. మాతృభాషలోనే గ్రహాలతో మాట్లాడతాను అని కవి అనడం వెనుక జపాన్ – జర్మనీ చైనా వంటి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు మాతృభాషలోనే విద్యనందించి అంతరిక్ష జ్ఞానాన్ని, భౌగోళిక – భూగర్భశాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయని తెలియజేశాడు.

పదాలు – అర్థాలు

అర్థాలు :

స్వరపేటిక = మనిషి గొంతులో ఉండే శబ్ద ఉత్పత్తి కేంద్రం (వాయిస్ బాక్స్)
ఉచ్చరించుట = మాట్లాడుట
శిల్పం = ప్రతిమ
స్వేద సాగరం = చెమట అనెడి సముద్రం
సౌందర్యం = అందం
సముదాయం = సమూహం
భాష + ఉత్పత్తి భాషోత్పత్తి = భాష అభివృద్ధి జరుగుట
సరళం = తేలిక
నాడీమండలం = మెదడు
మువ్వలు = కాలి గజ్జలు (నాట్యం చేసేటప్పుడు ధరించే చిన్న చిన్న గంటలు)
తుళ్ళుట = ఎగిరిపడుట
ఊసులాడుట = ముచ్చట్లు
శపథం = ప్రతిజ్ఞ
కార్మికుడు = కర్మాగారాలలో పనిచేసే శ్రమజీవి
కర్షకుడు = రైతు
రైసు = బియ్యం
స్టడీస్ = చదువుట
పరభాష = అన్య భాష
సత్తువ = బలము
విత్తు = విత్తనము
సృజన = సృష్టి
హర్షం = సంతోషం
శబ్ద సౌందర్యం = పదముల సొంపు
ఘర్షణ = రుద్దుట, రాపిడి
సవ్వడి = ధ్వని
పౌరుష + అగ్ని పౌరుషాగ్ని = పౌరుష మనెడి అగ్ని
పౌరుషము = పరాక్రమము