నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

Reviewing AP Inter 2nd Year Telugu Study Material పద్యభాగం 4th Poem నాన్నకోసం Questions and Answers Summary can help students prepare confidently for exams.

AP Inter 2nd Year Telugu నాన్నకోసం Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నాన్న కోసం పాఠ్యభాగ సారాంశాన్ని తెలపండి.
జవాబు:
నాలుగు సంవత్సరాలున్న పిల్లవాడు తన తల్లితో – “అమ్మా ! నాన్న ఎక్కడికి వెళ్ళాడు ?” అని ప్రశ్నించాడు. కాని తల్లి పిల్లవాడి తల నిమురుతూ పార్కులోనున్న రేడియోలో వార్తలు వింటోంది. ఆమె కళ్ళముందు విమానాల రెక్కలు కదలుతున్న నీడలు, మర ఫిరంగులు పేలిన జాడలు కదలాడినాయి. కాశ్మీర్లో యుద్ధం చేస్తున్న భర్త ఆమె కళ్ళముందు కనిపించాడు. సైనికుని భార్య రోజూ వార్తల కోసం పార్కుకి వస్తుంది. రేడియో వార్తలు’ వింటోంది. జాతుల మధ్య మత దురహంకారం వైషమ్యాలను సృష్టిస్తుంది. భారత్ పాకిస్తాన్ పై చేస్తున్న యుద్ధం సాధారణమైనది కాదు. ప్రపంచంలో విలువలను కాపాడటానికి చేసే ప్రయత్నం అది. భారతదేశం లా హెూర్పై చేసే యుద్ధాన్ని, సైన్యం చూపే ధైర్య సాహసాలను జాతి అంతా మెచ్చుకొని కృతజ్ఞతలు తెలియజేసింది.

ఆ యుద్ధంలో తన భర్త మరణించడం వల్ల ఆమె సర్వస్వాన్ని కోల్పోయానన్న బాధతో పార్కుకు వచ్చింది. ఆ రోజు యుద్ధంలో భారతసైన్యం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్కడున్న సమూహంతో పాటు సైనికుని భార్య కూడా కుమారుని కౌగిలించుకుంటూ భావోద్రేకానికి గురియై జైహింద్ అని పల్కింది.

II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘నాన్న కోసం’ కవితలో తల్లి స్పందనను తెలపండి.
జవాబు:
తల్లి సునాయాసంగా నాలుగేళ్ళ కొడుకుని తల నిమురుతూ రేడియోలో వార్తలు వింటోంది. కాశ్మీర్ సరిహద్దుల్లో పొగల మధ్య కాలూని నిల్చున్న సైనికుడు ఆమె కళ్ళ ముందు నిలిచాడు. ఆమె కళవళ పడింది. నిట్టూర్చింది. పైట సరిచేసుకుంది. అంతలో మృదు గర్వ రేఖ ఆమె పెదాల చిరునవ్వుతో కలసి పోయింది.

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 2.
నాన్న కోసం కవితలో సైనికుడి భార్య ఆవేదన తెల్పండి.
జవాబు:
భారత సైన్యాలు లా హెూర్ సరిహద్దుల మీద విరుచుకుపడింది. నిద్రలేని సింహంలా విజృంభించారు. లక్షలాది అజ్ఞాత సైనికులకు ఆబాలగోపాలం కృతజ్ఞతాంజలి సమర్పించింది. ఆమె చీటికి మాటికి అదిరే పెదవిని మునిపంట నొక్కుతోంది. అక్కడ చేరిన గుంపులు జైహింద్ అన్న నినాదం చేశారు. సైనికుని భార్య తన కుమారుణ్ణి అక్కున చేర్చుకుని బాధాతప్త హృదయంతో ‘జైహింద్’ అని మెల్లగా పలికింది.

III. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతికి మతావేశం పొదిగితే ఏమవుతుంది ?
జవాబు:
జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది.

ప్రశ్న 2.
పాకిస్తాన్ – చైనాల మధ్య మైత్రి ఎలాంటిది ?
జవాబు:
పాకిస్తాన్ – చైనాల మధ్య మైత్రి పామూ తోడేలు కలసినట్టు అవుతుంది.

ప్రశ్న 3.
పార్కులో చేరిన గుంపులు ఏమని నినాదం చేశారు ?
జవాబు:
పార్కులో చేరిన గుంపులు “జైహింద్” అన్న నినాదం చేశారు.

ప్రశ్న 4.
నాలుగేళ్ళ పిల్లవాడు తల్లిని ఏమని ప్రశ్నించాడు ?
జవాబు:
నాలుగేళ్ళ పిల్లవాడు తల్లిని “అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు ? అని ప్రశ్నించాడు.

ప్రశ్న 5.
“నాన్న కోసం” పాఠ్యభాగం రచయిత ఎవరు ?
జవాబు:
“నాన్న కోసం” పాఠ్యభాగ రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్.

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 6.
“నాన్న కోసం” పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహింపబడింది ?
జవాబు:
‘నాన్న కోసం’ పాఠ్యభాగం “అమృతం కురిసిన రాత్రి” అనే వచన కవితా సంపుటి నుండి గ్రహింపబడింది.

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
ఆమె కళ్ళ ముందు నిలిచాడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము దేవరకొండ బాలగంగాధర తిలక్చే రచించబడిన “అమృతం కురిసిన రాత్రి” అనే వచన కవితా సంపుటి నుండి గ్రహింపబడిన “నాన్న కోసం” అను పాఠంలోనిది.
సందర్భము : కాశ్మీర్ సరిహద్దుల్లో పొగల మధ్య కాలూని నిల్చున్న సైనికుడు ఆమె కళ్ళముందు నిల్చున్నాడని వివరిస్తూ కవి పల్కిన సందర్భము. భావము : ఆమె కళ్ళముందు సైనికుడు నిలిచాడు.

ప్రశ్న 2.
నిర్ణిద్ర హర్యక్షమై జాతి నిలబడి గర్జించింది.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము దేవరకొండ బాలగంగాధర తిలకే రచించబడిన “అమృతం కురిసిన రాత్రి” అనే వచన కవితా సంపుటి నుండి గ్రహింపబడిన “నాన్న కోసం” అను పాఠంలోనిది.
సందర్భము : సాహసోపేతమైన భారతసైన్యాలు లా హెూర్ సరిహద్దుల పై నిద్రలేని సింహంలా విజృంభిస్తూ విరుచుకుపడ్డారని వివరిస్తూ కవి పల్కిన సందర్భము.
భావము : భారత జాతి నిద్రలేని సింహంలా విజృంభించింది.

ప్రశ్న 3.
ఒక వీరునికి హాయిగా, తీయగా వినపడింది.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము దేవరకొండ బాలగంగాధర తిలక్చే రచించబడిన “అమృతం కురిసిన రాత్రి” అనే వచన కవితా సంపుటి నుండి గ్రహింపబడిన “నాన్న కోసం” అను పాఠంలోనిది.
సందర్భము : భారత – లాహెూర్ మధ్య జరిగిన ఘోర యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుని భార్య బాధాతప్త హృదయంతో “జైహింద్” అని మెల్లగా పలికిందని వివరిస్తూ కవి పల్కిన సందర్భము.
భావము : సైనికుని భార్య జైహింద్ అన్న మాట ఆ సైనికునికి హాయిగా, తీయగా వినబడింది.

విశేషాంశాలు

భారత్ – పాక్ యుద్ధాలు :
1947 దేశ విభజన మొదలు పాకిస్తాన్ భారతదేశంపై దాడులు, ఉగ్రవాద దాడులను ప్రోత్సహించడం, ఏర్పాటువాదాన్ని సమర్థించడం లాంటి చర్యలు నిరంతరం చేస్తూనే ఉంది.

  1. 1947-48 : మొదటిసారి కాశ్మీర్ విషయంలో భారత్ – పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది.
  2. 1965 : కాశ్మీరు కాపాడుకోవడం కోసం రెండోసారి భారత్ – పాకిస్తాన్ప యుద్ధం చేయవలసి వచ్చింది.
  3. 1971 : మూడవసారి జరిగిన యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం విషయంపై భారత్ – పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ను ఏర్పరిచింది.
  4. 1999 : కాశ్మీర్లో చొరబడిన పాకిస్తాన్ చొరబాటుదారులకు వెనుకకు తరిమి వేయడానికి నాల్గవసారి భారత్ – పాకిస్తాన్పై ‘కార్గిల్ యుద్ధం చేసింది.

1965 సెప్టెంబర్ నెలలో జరిగిన భారత్ – పాకిస్తాన్ యద్ధంలో భారత సైన్యం వీరోచితంగా పోరాడి సరిహద్దు దాటివెళ్ళి సెప్టెంబర్ 6న లాహెూర న్ను చుట్టుముట్టింది. 17 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో భారత్ – పాకిస్తాను గట్టిగా బుద్ధి చెప్పింది.

నాన్నకోసం Summary in Telugu

కవి పరిచయం

పాఠ్యభాగము : నాన్న కోసం
గ్రహింపబడిన గ్రంథము: “అమృతం కురిసిన రాత్రి” అనే వచన కవితా సంపుటి నుండి గ్రహింపబడింది.
కవి : దేవరకొండ బాలగంగాధర తిలక్
జననం : 1 ఆగష్టు 1921
మరణం : 1 జూలై 1966
కాలము : 19వ శతాబ్దము
జన్మస్థలము : తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా
తల్లిదండ్రులు : రామసోదెమ్మ, సత్యనారాయణమూర్తి
రచనలు : గోరువంకలు, స్వయంవరం, మధురవిరహం మున్నగు ఖండకావ్యాలు ‘ఊరి చివర ఇల్లు’ (కథా సంపుటం) ‘సుశీల పెళ్ళి’, ‘సాలెపురుగు’ (నాటకాలు) ‘అమృతం కురిసిన రాత్రి’ (వచన కవితా సంపుటి)

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

పాఠ్యభాగ ఉద్దేశ్యం

భయంకరమైన యుద్ధాలు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. రేడియోల్లో, వార్తా పత్రికల్లో యుద్ధ బీభత్సాల వార్తలు వస్తుంటాయి. అవి విన్న బాలగంగాధర తిలక్ భావోద్వేగంతో చలించిపోయేవాడు. యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాలు పడే ఆవేదనను అర్థం చేసుకొన్నాడు. తనకు కల్గిన భావావేశానికి తిలక్ కవితా రూపం ఇచ్చాడు. జరిగినటువంటి పాషాణమైన వాస్తవాలను సమాజం కళ్ళ ముందుంచాడు. వీర సైనికులు చేసిన త్యాగానికి అక్షరంతో అభిషేకం చేసి అమరత్వాన్ని కల్గించాడు. నేటి విద్యార్థులో దేశభక్తిని కలుగజేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

పాఠ్యభాగ నేపథ్యం

ఒక సైనికుడు భార్యను, కొడుకును వదలి దేశ సరిహద్దులో నివసిస్తూన్నాడు. ఇంతలో భారతదేశం లా హెూర్పై చేసే యుద్ధంలో మరణిస్తాడు. అతని గురించి రేడియో వార్తల్లో దేశభక్తిని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన విధానాన్ని చెబుతుంటే అతని భార్య విని కుమారుని కౌగిలించుకుని జైహింద్ అని పల్కిందని కవి వివరిస్తున్న సందర్భము.

పాఠ్యభాగ సారాంశం

నాలుగు సంవత్సరాలున్న పిల్లవాడు తన తల్లితో – “అమ్మా ! నాన్న ఎక్కడికి వెళ్ళాడు ?” అని ప్రశ్నించాడు. కాని తల్లి పిల్లవాడి తల నిమురుతూ పార్కులోనున్న రేడియోలో వార్తలు వింటోంది. ఆమె కళ్ళముందు విమానాల రెక్కలు కదులుతున్న నీడలు, మర ఫిరంగులు పేలిన జాడలు కదలాడినాయి. కాశ్మీర్లో యుద్ధం చేస్తున్న భర్త ఆమె కళ్ళముందు కనిపించాడు.

సైనికుని భార్య రోజూ వార్తల కోసం పార్కుకి వస్తుంది. రేడియో వార్తలు వింటోంది. జాతుల మధ్య మత దురహంకారం వైషమ్యాలను సృష్టిస్తుంది. భారత్ పాకిస్తాన్ పై చేస్తున్న యుద్ధం సాధారణమైనది కాదు. ప్రపంచంలో విలువలను కాపాడటానికి చేసే ప్రయత్నం అది. భారతదేశం లా హెూర్పై చేసే యుద్ధాన్ని, సైన్యం చూపే ధైర్య సాహసాలను జాతి అంతా మెచ్చుకొని కృతజ్ఞతలు తెలియజేసింది. యుద్ధంలో తన భర్త మరణించడం వల్ల ఆమె సర్వస్వాన్ని కోల్పోయానన్న బాధతో పార్కుకు వచ్చింది. ఆ రోజు యుద్ధంలో భారతసైన్యం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్కడున్న సమూహంతో పాటు సైనికుని భార్య కూడా కుమారుని కౌగిలించుకుంటూ భావోద్రేకానికి గురియై జైహింద్ అని పల్కింది.

పదాలు – అర్థాలు

అవలీలగా = సునాయాసంగా
జాడలు = గుర్తులు
కాలూని = ప్రవేశించడం
మృదు = సుకుమారమైన
గర్వ రేఖ = గర్వ మనెడి చంద్రరేఖ
మత + ఆవేశం మతావేశం = మతము యొక్క ఆవేశం
మైత్రి = స్నేహము
ప్రపంచ భవితవ్యానికి = ప్రపంచం యొక్క భవిష్యత్తు
సాహస+ఉపేతము+ఐన సాహసోపేతమైన = సాహసంతో కూడిన
నిర్ణిద్ర = నిద్ర లేనిది
హర్యక్షము = సింహం
బాధాతప్త = బాధతో కూడిన
కళవళపడుట = కలత చెందుట