TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 15th Lesson జాతీయ ఉద్యమం – మలిదశ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1920 – 22లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాఫత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్లో విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.

బహిష్కరణ:

  1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
  2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
  3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
  4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
  5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం.
  6. విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
  7. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
  8. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

  1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
  2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
  3. అస్పృశ్యతను నిర్మూలించడం.
  4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
  5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
  6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.

ఉద్యమ గమనం: 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

  1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
  2. ఉద్యమ కాలంలో హిందూ – మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
  3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
  4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  5. కాంగ్రెస్లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
  6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
  7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 2.
1935 భారత ప్రభుత్వ చట్టంలోని లక్షణాలను వివరించండి.
జవాబు.
ఈ చట్టంలోని ముఖ్య అంశాలు:

  1. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం.
  2. కేంద్రంలో భారతీయులకు పరిమిత అధికారాలను కల్పించడం.
  3. సమాఖ్య ఏర్పాటు.
  4. ఫెడరల్ కోర్టు ఏర్పాటు.

కేంద్ర ప్రభుత్వం: 1919 చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తూ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.

కేంద్ర శాసనసభ: ఇందులో ఎన్నుకోబడిన సభ్యులు ఉండేవారు. ఓటర్ల సంఖ్య 10 శాతం పెంచబడింది. శాసన సభలో రాష్ట్రం శాసనసభల నుంచి 260 మంది సభ్యులు, సమాఖ్య శాసనసభలో 375 మంది ఉండేవారు. అయితే స్థానిక పాలకులు ఇందులో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో సమాఖ్య శాసనసభ అమలులోకి రాలేదు. ఈ చట్టం భారతదేశం నుంచి బర్మాను వేరు చేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రాంతీయ ప్రభుత్వం: ఈ చట్టం ప్రాంతీయ ప్రభుత్వాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని నిషేధించి ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్గించింది. శాసన సభలోని అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీ నుంచి గవర్నర్ మంత్రులను నియమిస్తాడు. ఈ మంత్రులు బదిలీ చేయబడిన అంశాలకు బాధ్యత వహిస్తారు. వీరు శాసన సభకు మాత్రమే బాధ్యత వహిస్తారు. గవర్నర్లు మంత్రుల సలహాలకై బద్ధులై ఉంటారు. కానీ ఆచరణలో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించేవాడు. స్థానిక ప్రభుత్వంలో 1935 చట్టం అమలు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

ప్రశ్న 3.
క్రిప్స్ రాయబారాన్ని వివరించండి.
జవాబు.
1942లో జపాన్, బర్మాలోని రంగూన్ను ఆక్రమించినపుడు భయపడిన బ్రిటీష్ ప్రభుత్వం కాబినెట్ సభ్యుడు స్టాఫర్డ్ క్రిప్సన్న చర్చల నిమిత్తం భారతదేశానికి పంపింది. యుద్ధంలో బ్రిటీష్వారి పరిస్థితి ఓడిపోయే పరిస్థితిలో ఉంది. భారతదేశం అవసరం తప్పనిసరి అయింది. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్డ్ ఇంగ్లాండ్ ప్రధాని విన్సెంట్ చర్చిల్పై భారతదేశాన్ని యుద్ధంలోకి చేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఫలితంగా 1947లో క్రిప్స్ రాయబారం భారతదేశానికి వచ్చి కొన్ని ప్రతిపాదనలను సూచించింది. అవి:

  1. యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి అధిక దేశ ప్రతిపత్తినియ్యాలి.
  2. నూతన రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ రచన కమిటీని వేయాలి.
  3. కేంద్రంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలు అందులో చేరుతాయా లేదా అనేది వాటి నిర్ణయానికి వదిలివేయాలి.

కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. గాంధీ దీన్ని దివాలా తీసిన బ్యాంకుపై రాబోయే తేదీ వేసిన చెక్కుగా వల్లించాడు. దానిలో పాకిస్థాన్ ప్రస్థావన లేనందున ముస్లింలీగ్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఫలితంగా క్రిప్స్ రాయబారం తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమయింది.

ప్రశ్న 4.
1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహాన్ని వివరించండి.
జవాబు.
భారత స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం ద్వారా లక్షలాది ప్రజలు స్వతంత్ర పోరాటంలో భాగమయ్యారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ఉపఖండమంతా వ్యాపించింది.

1929 డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ లక్ష్యంగా ప్రకటించారు. రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరించి శాసనోల్లంఘన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:

  1. మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు)
  2. రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు)
  3. మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)

మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

  1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
  2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
  3. హిందూ-ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
  4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

  • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
  • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
  • 1930-32 మధ్యకాలంలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
  • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
    కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:

  1. ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్ను చేపట్టడం జరిగింది.
  2. బ్రిటీష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.
  3. బ్రిటీష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.
  4. ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.
  5. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.
  6. బ్రిటీష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి ఆమోదం
    తెలిపింది.
  7. బ్రిటీష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్లో 1932, నవంబర్ 17 డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:-

  1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటీష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
  2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసింది.
  3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 5.
భారత స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను వివరించండి.
జవాబు.
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్ పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్కు తీవ్రమైన భేదాభిప్రాయాలు -కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోసు “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు), మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్ు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

ప్రశ్న 6.
జాతీయోద్యమంలో ముస్లింలీగ్ పాత్రను విశ్లేషించండి.
జవాబు.
హిందూ ముస్లింల మధ్య ఐక్యతను నాశనం చేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. 1905లో జరిగిన బెంగాల్ విభజన ఒక ఉదాహరణ. అయితే హిందూ, ముస్లింల ఐక్యత ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఇది బ్రిటీష్ వారిలో ఉద్రిక్తతను, ఒత్తిడిని కలుగజేసింది. దాంతో వీరి మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని తొలగించడం కోసం ప్రభుత్వం ‘విభజించు పాలించు’ అనే విధానాన్ని అమలు చేసింది. విచారకరమైన విషయం ఏమిటంటే ఈ విధానంలో వారు సఫలీకృతులయ్యారు. విద్యావేత్త, సంఘసంస్కర్త సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ స్వయంగా హిందూ, ముస్లింల ఐక్యతను కోరినవాడు. వారి ఐక్యతకు కృషి చేశాడు. బ్రిటీష్వారి ప్రభావంతో ముఖ్యంగా అలిఘర్ ఆంగ్లో ముస్లిం పాఠశాల ప్రిన్సిపల్ బెక్ ప్రభావానికి లోనయ్యాడు. ఆయన కాంగ్రెస్తో చేరవద్దని ముస్లింలకు విజ్ఞప్తి చేశాడు.

1906లో డైకానవాబు సలీముల్లాఖాన్, ఆగాఖాన్, మొహిసిన్ ఉలములు బ్రిటీష్వారి సహకారంతో ముస్లింలీగ్ను స్థాపించారు. ఇది ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం, వారికి ప్రత్యేకమత నియోజక వర్గాల కోసం, ముస్లింలకు ప్రత్యేక రక్షణ కోసం విజ్ఞప్తి చేసింది. వైస్రాయ్ మింటో ముస్లింలీగ్ను సమర్థించాడు. ఫలితంగా 1909 చట్టం ద్వారా 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పాకిస్తాన్ అనే ఆలోచనకు భావనకు విత్తనం వేసినట్లు అయింది. బ్రిటీష్వారు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అవలంబించినంత కాంగ్రెస్ హిందూ, ముస్లింల ఐక్యతకు ఎంతో కృషి చేసింది. ఫలితంగా 1916లో లక్నో ఒప్పందం జరిగింది. గాంధీ హిందూ ముస్లింల ఐక్యత కోసం ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపారు.

కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం జారీ చేయబడ్డప్పుడు జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ను వెనుకకు నెట్టి కాంగ్రెస్ ఎన్నో చోట్ల విజయం సాధించింది. దాంతో, జిన్న కాంగ్రెస్ ముస్లింలు భాగస్వాములుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిపాదించాడు. కానీ కాంగ్రెస్ జిన్న ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. అంతేగాక ముస్లింలలో తాము వేరు అన్న భావాలకి పెంపొందించింది. ఫలితంగా ఇద్దరిలో మతతత్వ ద్వేషభావనలు అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 7.
కాబినెట్ మిషన్ ప్రతిపాదనలను వివరించండి.
జవాబు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్ గొప్పదనం బహిర్గతమయింది. దాని సంపద హరించింది. విజయం సాధించినప్పటికీ బలహీనంగా మారింది. దాంతో భారతదేశంలో ప్రభుత్వాన్ని వారికే అప్పగించాలని నిర్ణయించింది. దానికోసం భారతదేశానికి ఒక కమిటీని పంపింది. ఈ కమిటీలో పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్లు సభ్యులు. ఈ కమిటీ భారతదేశంలో ఉన్న నాయకులతో వివిధ పార్టీలతో వివరంగా చర్యలు జరిపి ఈ కింది విష లను ప్రకటించింది.

  1. స్థానిక సంస్థానాలతో కలిపి భారతదేశాన్నంతటిని సమాఖ్యగా ఏర్పాటు చేయడం.
  2. సంస్థానాలకు స్వయం ప్రతిపత్తి నీయడం.
  3. సంస్థానాలను వివిధ వర్గాలుగా చేయడం.
  4. భారతీయులకు ఒక మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
  5. ప్రాంతీయ శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో, సంస్థానాలతో కలిపి రాజ్యాంగ ఏర్పాటు కోసం ఒక రాజ్యాంగ సభను ఏర్పాటుచేయడం.

కాంగ్రెస్, ముస్లింలీగ్ రెండు ఈ ప్రతిపాదనలను అంగీకరించాయి. 1946లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత ప్రభుత్వం ఏర్పడింది. బ్రిటీష్ ప్రభుత్వం రక్షణ రంగంతో సహా అన్ని అధికారాలను నెహ్రూ ప్రభుత్వ హస్తగతం చేసింది. ముస్లింలీగ్ కేంద్ర కేబినెట్లో ముస్లింలీగ్చే ఎంపిక చేయబడిన ముస్లింలు మాత్రమే ఉండాలని డిమాండ్ చేసింది. దానికి నిరసనగా వారు అక్టోబరు వరకు మంత్రివర్గంలో చేరలేదు. లీగ్ రాజ్యాంగ సభను బహిష్కరించింది.

ప్రశ్న 8.
1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని వివరించండి.
జవాబు.
క్రిప్స్ రాయబారం విఫలం కాడంతో కాంగ్రెస్ మరొక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడానికి నిర్ణయించింది. 1942 ఆగస్టు 8న అఖిలభారత కాంగ్రెస్ కమిటీ బొంబాయిలో సమావేశమయింది. ఈ సమావేశం క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అది బ్రిటీష్ వారిని సత్వరమే భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని డిమాండ్ చేసింది. ఇది గాంధీ ఆధ్వర్యంలో అహింసాయుత పద్ధతులలో ప్రారంభించాలని ప్రతిపాదించబడింది. ఈ ఉద్యమంలో గాంధీ ‘డూ ఆర్ డై’ ‘సాధించండి లేదా చావండి’ అనే నినాదాన్ని ఇచ్చాడు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ తీర్మానాన్ని చేసిన వెంటనే బ్రిటీష్ ప్రభుత్వం గాంధీని అరెస్ట్ చేసి పూనలోని ఆగాఖాన్ భవనంలో ఉంచింది. గాంధీతో పాటు నెహ్రూ, పటేల్, అబ్దుల్ కలాం, ఆజాద్, డా॥ పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, సంజీవరెడ్డి మొదలైన నాయకులందరిని చెరసాలలో వేసింది.

క్విట్ ఇండియా ఉద్యమంలో ఫార్వర్డ్ బ్లాక్, సోషలిస్టు పార్టీ విప్లవకారులు పాల్గొన్నారు. ముఖ్యమైన నాయకులు లేకపోవటం వల్ల ఉద్యమ పగ్గాలను ప్రజలే తీసుకున్నారు. వారు ప్రభుత్వాన్ని లెక్కచేయలేదు. కొందరు అరెస్ట్ కాని యువనాయకులైన జయప్రకాష్ నారాయణ్, రామ్మోహన్ లోహియా, అరుణా అసఫలీ మొదలైనవారు ఉద్యమాన్ని కొనసాగించారు. హర్తాళ్ళు, నిరసన ప్రదర్శనలు, నిరసన సమావేశాలు దేశమంతటా కొనసాగాయి. ప్రజలు అధిక సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బొంబాయి నుండి రహస్య రేడియో ప్రసారాలను కూడా చేసింది. ఉత్తర ప్రదేశ్లోని బాలియాలోను, బెంగాల్లోని మిడ్నపూర్ జిల్లాలోను మహారాష్ట్రలోని సతారాలోనూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉద్యమంలో దేశమంతటా హింస వ్యాప్తి చెందింది. ప్రజలు ఆందోళనలు చెయ్యడమే గాక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్లను, పోస్టాఫీసులను, పోలీస్ స్టేషన్లను కాల్చివేశారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఖిలాఫత్ ఉద్యమం గురించి రాయండి.
జవాబు.
అక్టోబర్ 17, 1919 రోజును ఖిలాఫత్ దినంగా పాటించబడింది. భారతదేశమంతటా హర్తాళ్ పాటించబడింది. గాంధీజి కూడా ఈ ఉద్యమానికి తన మద్దతు తెలిపాడు. హిందూ ముస్లింల ఐక్యతకు ఇది గొప్ప అవకాశం అని భావించాడు. అంతేగాక వారి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముస్లింలను ప్రోత్సహించాడు. ఈ విషయంలో గాంధీ సఫలీకృతుడు గావడమే గాక గొప్ప నాయకునిగా ప్రశంసించబడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 2.
స్వరాజ్ పార్టీ పనిని అంచనా వేయండి.
జవాబు.
1922లో గయలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించాడు.ఇది కాంగ్రెస్ యొక్క శాఖ. దానికి ఆయన అధ్యక్షుడు, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శి. నవంబర్ 1923లో . జరిగిన ఎన్నికలలో స్వరాజ్యపార్టీకి 101 స్థానాలకు 42 నియోజకవర్గ స్థానాలను దక్కించుకుంది. కేంద్ర శాసన సభలో ప్రవేశించి బ్రిటీష్ వారి ప్రతిపాదనలను వ్యతిరేకించాలనుకున్నారు. 1925లో విఠలాభాయి పటేల్ స్వరాజ్ పార్టీ తరుఫున కేంద్ర శాసనసభలో స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. 1925లో చిత్తరంజన్ దాస్ మరణించడంతో ఈ పార్టీ కూడా పతనమైపోయింది.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశంలోని అంశాలను అంచనా వేయండి.
జవాబు.
బ్రిటీష్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. దాంతో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సేమాక్డోనాల్డ్, భారత ప్రతినిధులు లండన్కు ఆహ్వానించాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు నవంబర్ 1930 నుండి జనవరి 1931 వరకు జరిగాయి. దీనికి స్థానిక పరిపాలకులు, రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. కానీ కాంగ్రెస్ హాజరు కాలేదు. కాంగ్రెస్ హాజరుకానందున సమావేశం విఫలమయింది. దాంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 1931లో మొదలై, డిసెంబర్ చివరి వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీ అతనితోపాటు సరోజినినాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీ కేంద్ర, రాష్ట్రాల్లో ఇంగ్లాండు సమానమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. ఈ సమావేశం కేవలం కేంద్రంలో సమాఖ్య ఏర్పాటు, భారతదేశంలో మైనారిటీల హక్కులను గురించి చర్చించింది. కానీ బాధ్యతాయుత ప్రభుత్వమనే అంశంపై ని ‘యం తీసుకోవడంలో విఫలమయింది.

1932 లో జరిగిన మూడవ రౌండ్డేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. తరువాత 1933లో బ్రిటీష్ గ సంస్కరణల ప్రతిపాదనలతో శ్వేతపత్రం విడుదల చేసింది.

ప్రశ్న 4.
1947 భారత స్వతంత్ర చట్టంలోని నిబంధనలను వివరించండి.
జవాబు.
4 జులై 1947న బ్రిటీష్ పార్లమెంట్ లోని కామన్స్ సభలో భారత స్వాతంత్ర్య చట్టం ప్రవేశపెట్టబడింది. జులై 15న కామన్స్ సభలో బిల్లు ఆమోదించబడింది. మరుసటి రోజున ప్రభువుల సభ (లార్డ్స్ సభ) లో ఆమోదించబడింది. జులై 10 నాడు రాజు ఆమోదం పొందింది. ఈ చట్టం భారతదేశాన్ని విభజించి రెండు కొత్త అధినివేశ ప్రాంతాలను సూచించింది. అదే ఇండియా, పాకిస్తాన్. ప్రతి అధినివేశ ప్రాంతంలో రాజు చేత నియమింపబడిన గవర్నర్ జనరల్ కూడా ఉంటాడు. ఒకవేళ వారికిష్టమైతే రెండు అధినివేశ ప్రాంతాలకు ఒకే గవర్నర్ జనరల్ కూడా ఉండవచ్చు.

రెండు ప్రాంతాల్లో శాసనాలు చేయడం కోసం శాసనసభలు ఏర్పాటు చేయబడతాయి. భారతదేశంలో బ్రిటీష్ పార్లమెంట్ అధికార పరిధి 15, ఆగస్ట్ 1947 నుంచి నిలుపుచేయబడుతుంది. ఈ చట్టానికి అనుగుణంగా ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఏర్పడింది. దానికి జిన్న గవర్నర్ జనరల్ అయ్యాడు. భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం ఇయ్యబడింది. మౌంట్ బాటిన్ గవర్నర్ జనరల్, నెహ్రూ ప్రధానిగా స్వతంత్ర భారతదేశంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రశ్న 5.
స్వతంత్రోద్యమ కాలంలోని విప్లవకారులు కార్యకలాపాలను వివరించండి.
జవాబు.
కాంగ్రెస్ నిష్క్రియాత్మక విధానాలు నచ్చని కొందరు యువకులు విప్లవవాదులుగా మారారు. వారి లక్ష్యం భయోత్పాతాన్ని సృష్టించి తొందరగా బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. వీరు చాలా నిర్భయస్థులు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా స్థిరపడినవారు. అటువంటి వారిలో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్వారి నియంతృత్వం నుండి గిరిజనులను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేశాడు. 1922 నుండి 1924 వరకు ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటీష్ వారి పరిపాలన దాదాపుగా అంతమయిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించడానికి బ్రిటీష్ ప్రభుత్వం రూథర్ ఫర్డ్ అనే ప్రత్యేక అధికారిని నియమించింది. బెంగాల్లో సూర్యాసేన్ అతని అనుచరుడు సాహు క్రియాశీల పాత్ర వహించారు. సాహు బ్రిటీష్ అధికారి డేని చంపాడు. ఉత్తరప్రదేశ్కి చెందిన రాంప్రసాద్ బిస్మిల్ తన సహచరులతో కలిసి అలంపూర్కు వెళ్తున్న రైలును కాకోరి దగ్గర ఆపి గార్డు దగ్గర నుండి నగదు పెట్టెలను దోచాడు. ఇదే కాకోరి కుట్రకేసుగా ప్రసిద్ధి. ప్రభుత్వం రాంప్రసాద్ బిస్మిల్ను అతని అనుచరుడు అశ్వకుల్లాఖాన్ ను ఉరితీసింది. 1930 – 32లో హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ తరఫున సూర్యాసేన్ చిటగాంగ్, ఇతర ప్రాంతాలలో దాడులను రచించాడు. అతన్ని ప్రభుత్వం ఉరితీసింది. ఉత్తరప్రదేశ్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్లు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను స్థాపించారు. తదనంతరం భగత్సింగ్ పోలీసు అధికారి సాండర్స్ను చంపాడు. బతుకేశ్వర్ దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి ఏప్రిల్ 8, 1929న బాంబులు, కరపత్రాలు విసిరారు. ప్రభుత్వం భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్లను 23 మార్చి 1931న ఉరితీసింది.

ప్రశ్న 6.
వేవెల్ ప్రణాళికను వివరించండి.
జవాబు.
1943లో లిన్లిత్అ అనంతరం వేవెల్ వైస్రాయ్ అయ్యాడు. అతని పరిస్థితి చాలా క్లిష్టతరంగా మారింది. బెంగాల్ ఒకవైపు కరువుకోరలు మరియు మతపరమైన ప్రశ్నలు ఉదయించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠంభన ఏర్పడింది. 1944లో వేవెల్ గాంధీని విడుదల చేశాడు. భారతదేశంలోని ఐక్యతలో ఒత్తిడిని ప్రతిష్ఠంభనను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. అనంతరం గాంధీ జిన్నతో కలిసి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని అనుకున్నాడు. కాం దీని పరిష్కారానికి 1945లో వేవెల్ లండన్ వెళ్ళాడు. రాజకీయ ప్రతిష్ఠంభనను తొలగించి భాగ లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడే ప్రణాళికతో తిరిగి వచ్చాడు.

ద్విపరిపాలనా నూతన రాజ్యాంగం ఏర్పడి భారతీయుల ఆమోదం పొందే లోపల ఒక తాత్కాలిక ఏర్పాటును ప్రణాళిక ప్రతిపాదించింది. వివిధ రాజకీయ సంస్థల ప్రతినిధులతో వైస్రాయ్ ఒక కార్య నిర్వాహక సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో అధ్యక్షుడుగా వైస్రాయ్, యుద్ధ వ్యవహారాలను చూస్తున్న ముఖ్య సైన్యాధిపతి ఇద్దరు మాత్రమే ఆంగ్లేయులు ఉంటారు. మిగిలిన వారు వివిధ పార్టీల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళుంటారు. వారిలో హిందూ, ముస్లింలు సమాన సంఖ్యలో ఉంటారు. కార్యనిర్వాహక సంస్థలకు ఎన్నుకోబడిన సభ్యులకు వేవెల్ ఒక సమావేశాన్ని సిమ్లాలో ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఎంపికను జిన్నా అంగీకరించలేదు. దాంతో సిమ్లా సమావేశం విఫలమయ్యింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంపారన్ సత్యాగ్రహం.
జవాబు.
చంపారన్ బీహార్ రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లా. ఇక్కడి రైతులు బ్రిటీష్ వారి బలవంతంతో ‘నీలిమందు (ఇండిగో) పండించేవారు. ఈ రైతులు ఆంగ్లేయుల ఆధీనంలో ఉండేవారు. నీలిమందును ఆంగ్లేయులు పండించిన ధరకే అమ్మాలి. ఆంగ్లేయులు రైతులను ఎంతగానో పీడించేవారు.

దక్షిణాఫ్రికాలో గాంధీ నిర్వహించిన ఉద్యమాలను గురించి విన్న చంపారన్ రైతులు తమకు సహాయం చేయాల్సిందిగా గాంధీని ఆహ్వానించారు. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం ఆరంభించాడు. వేలాది రైతులు జత కలవడంతో, చివరకు ప్రభుత్వం చంపారన్ వ్యవసాయ బిల్లును ఆమోదించింది. ఇది గాంధీకి, సత్యాగ్రహానికి లభించిన విజయం.

ప్రశ్న 2.
రౌలట్ చట్టం.
జవాబు.
1917లో బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో జరుగుతున్న విప్లవాత్మక నేరాలపై దర్యాప్తు చేయడానికి న్యాయాధికారి సిడ్నిరౌలత్ నాయకత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ వీటన్నింటిని అణచివేయమని సిఫార్సు చేసింది. ఫలితంగా 1919లో రౌలత్ చట్టం అమలు చేయబడింది. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా వారంటు లేకుండా అరెస్ట్ చేసే అధికారం, వారి ఇంటిని సోదా చేసి ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా భారత సాక్ష్యాల చట్టం ఆధారంగా కోర్టులో అప్పీల్ చేయడం గానీ, సాక్ష్యాలను విచారించడం మొదలైన నిబంధనలేవీ లేవు. విచారణ లేకుండా రెండేళ్ళ కంటే ఎక్కువ సమయం నిర్బంధించవచ్చు అనే నిబంధన భారత పౌరుల ప్రాథమిక హక్కులను హరించివేసింది. ఇది భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ పరిస్థితులు గాంధీ మొదటి అఖిల భారత ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ప్రముఖ నాయకులు స్వామి శ్రద్ధానంద కూడా పాల్గొన్నారు. దేశమంతటా నిరసన ఉద్యమాలు జరిగాయి. గందరగోళాన్ని అల్లర్లను సృష్టిస్తున్నాడన్న నెపంపైన గాంధీ అరెస్ట్ చేయబడ్డాడు.

ప్రశ్న 3.
రౌండ్ టేబుల్ సమావేశాలు.
జవాబు.
1930- 32 సంవత్సరాల మధ్యకాలంలో సైమన్ కమీషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో జరపవలసిన రాజ్యాంగ సంస్కరణలను చర్చించడానికి ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో వివిధ పార్టీలు, సంస్థానాల ప్రతినిధులతో మూడు సమావేశాలను లండన్లో ఏర్పాటు చేశారు. వీటిని రౌండ్ టేబుల్ సమావేశాలు అంటారు.

మొదటి సమావేశం: 1930లో శాసనోల్లంఘన జరిగే సమయంలో ఏర్పాటైన ఈ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది. 1931లో జరిగిన గాంధీ – ఇర్విన్ ఒప్పందం ఫలితంగా రాజకీయ ఖైదీలను బ్రిటీష్ వారు విడుదల చేశారు.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం: రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొన్నారు. ఈ సమావేశం ఎలాంటి సత్ఫలితాలివ్వలేదు. తిరిగి వచ్చిన గాంధీ మరల శాసనోల్లంఘన చేపట్టారు.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ వారు, బ్రిటీష్ లేబర్ పార్టీ కూడా దీనిని బహిష్కరించింది.
ఈ సమావేశాల ఫలితంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది.

TS Inter 1st Year History Study Material Chapter 15 జాతీయ ఉద్యమం – మలిదశ

ప్రశ్న 4.
సైమన్ కమీషన్,
జవాబు.
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటీష్ ప్రభుత్వం 1927లో జాన్ సైమన్ అధ్యక్షుడిగా సైమన్ కమీషన్ ను నియమించింది. ఈ సంఘంలో అందరూ ఆంగ్లేయులే ఉండటం, అందులో భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో దేశవ్యాప్తంగా కమీషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, హర్తాళ్లు జరిగాయి. సైమన్ కమీషన్ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలు దేశమంతటా మార్మోగాయి. అయినప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.

ప్రశ్న 5.
మౌంట్ బాటెన్ ప్రణాళిక.
జవాబు.
1947లో వేవెల్ స్థానంలో మౌంట్బాటెన్ వైస్రాయ్ గా నియమింపబడ్డాడు. అట్లే ప్రభుత్వం అతనికి అధికార బదిలీ కార్యక్రమాన్ని పూర్తి చేయమని అనుజ్ఞనిచ్చింది. మౌంట్బాటెన్ కాంగ్రెస్, ముస్లిం లీగుతో చర్చించాడు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంతో కష్టపడ్డాడు. అయినా చివరికి దేశ విభజన అనివార్యమయింది. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో పాకిస్థాన్ ను ఏర్పాటు చెయ్యాలని అతను ప్రతిపాదించాడు. వీటిలో సింధ్, బలూచిస్థాన్ వాయువ్య ప్రావిన్సులు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు బెంగాల్లున్నాయి. పరిస్థితి దిగజారుతుండటంతో తప్పనిసరై కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను ఒప్పుకోవలసి వచ్చింది. విభజనకు అనుగుణంగా మౌంట్బాటెన్. నిర్ణయాలు తీసుకున్నాడు.

Leave a Comment