TS Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ? ఒక వస్తువు డిమాండ్ను నిర్ణయించే అంశాలు (కారకాలు) ఏమిటి ?
జవాబు.
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

ఒక వస్తువు డిమాండ్ దాని ధరపైనే కాకుండా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వస్తువు డిమాండ్ను ప్రభావితము చేసే అంశాలు; ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుల ఆదాయం, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు మొదలైనవి. కనుక ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దీనిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలము. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా చూపవచ్చు.

Dn = f (Pn, P1, P2, …………. Pn-1, y, T)
Dn = n వస్తువుల డిమాండ్ పరిమాణం
Pn = n వస్తువు ధర
P1, P1, ………….. Pn-1 = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
y = వినియోగదారుని ఆదాయం
T = వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు మొదలైనవి.
f = ప్రమేయ సంబంధము.

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు :
1. ఆదాయంలో మార్పు :
ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్ లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు :
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు :
ప్రజల అభిరుచులలో, అలవాట్లలో మార్పులవల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు :
జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు :
వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా : వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి :
సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు :
వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము :
ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర :
ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రాన్ని తెలిపి, దాని మినహాయింపులను పరిశీలించండి.
జవాబు.
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనే శక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ఒక వస్తువుకున్న డిమాండ్ ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉండును.

  1. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు
  2. వస్తువుల ధరలు
  3. వినియోగదారుల ఆదాయాలు
  4. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు మొదలైనవి.

డిమాండ్ సూత్రము :
డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరంగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.
Dn = f

డిమాండ్ పట్టిక :

వస్తువు ధర ₹ వస్తువు డిమాండ్ కిలోలలో
1 200
2 150
3 100
4 50
5 25

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టికననుసరించి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 1

పై రేఖాపటంలో ‘X’ అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, ‘Y’ అక్షముపై వస్తువు ధరను చూపినాము. ‘DD’ డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రింది వైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

మినహాయింపులు :
డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులున్నాయి. అవి :

1. గిఫెన్ వైపరీత్యం :
పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు.

కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు.
ఉదా : రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు :
గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు.
ఉదా : విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం :
ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు.
ఉదా : షేర్లు, బాండ్లు.

4. భ్రాంతి :
కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 3.
ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్ భావనలను తగిన పటాల సహాయంతో వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వస్తువును కొనాలనే కోరిక దానితోపాటు కొనే శక్తి ఈ రెండూ జతకూడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు ఉన్న డిమాండ్” అంటారు.

డిమాండ్ను నిర్ణయించే కారకాలను బట్టి డిమాండ్ను మూడు రకములుగా విభజించవచ్చు.

  1. ధర డిమాండ్
  2. ఆదాయ డిమాండ్
  3. జాత్యంతర డిమాండ్.

1. ధర డిమాండ్ :
ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని తెలియజేయునది ధర డిమాండ్. డిమాండ్ను ప్రభావితంచేసే ఇతర అంశాలలో మార్పులేదనే ప్రమేయంపై ఆధారపడి ధర డిమాండ్ నిర్వచించబడుతుంది. దీనిని ఈ విధంగా చూపవచ్చు.
Dx = f(Px)

2. ఆదాయ డిమాండ్ :
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏ విధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dy = f(y)

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు :
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 2

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘0Q’ నుంచి ‘0Q1’ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

నాసిరకం వస్తువులు :
మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 3

పై రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY,’ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

3. జాత్యంతర డిమాండ్ :
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు :
ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. ఉదా : కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా చూపవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 4

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ, డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

పూరక వస్తువులు : ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా : పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 5

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ’ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP’ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 4.
డిమాండ్ వ్యాకోచత్వ భావనను నిర్వచించండి. ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను వివరించండి.
జవాబు.
ఆర్థికశాస్త్రంలో “డిమాండ్ వ్యాకోచత్వం” అనే భావనకు అధిక ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు అనుగుణంగా డిమాండ్ ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చిన అనుపాతపు మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.
డిమాండ్ వ్యాకోచత్వం = డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు / ధరలో వచ్చిన అనుపాతపు మార్పు

ఈ వ్యాకోచత్వ భావన మూడు రకాలు.

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం :
ఆదాయంలో వచ్చే మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయం కొంత శాతం మార్పు చెందినప్పుడు, వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును.

ఈ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మేలు రకం వస్తువుల విషయంలో ధనాత్మకంగా, నాసిరకం వస్తువుల విషయంలో రుణాత్మకంగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 6

జాత్యంతర వ్యాకోచ డిమాండ్ :
ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధరపైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతం మార్పు ఆ వస్తు డిమాండ్లో ఎంత అనుపాత మార్పు కల్గిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును.

ప్రత్యామ్నాయ వస్తువులైన టీ, కాఫీల విషయంలో ధనాత్మక సంబంధాన్ని, పూరక వస్తువుల విషయాలలో రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంటాయి.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 7

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 5.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ? ధర డిమాండ్ వ్యాకోచత్వంలోని రకాలను విపులీకరించండి.
జవాబు.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పువల్ల డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది.
Ep = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ధరలో వచ్చిన మార్పు శాతం

వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఐదు రకాలుగా చెప్పవచ్చు.

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = ∝)
  2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ (Ep = 0)
  3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ (Ep = 1)
  4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ep = > 1)
  5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ (Ep = < 1)

1. పూర్తి వ్యాకోచ డిమాండ్ :
ధరలో స్వల్ప మార్పు వచ్చినా లేదా రాకపోయినా డిమాండ్లో ఊహించలేనంతగా మార్పు కలిగితే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని వ్యాకోచ విలువ అనంతంగా ఉంటుంది. ఇక్కడ ‘ డిమాండ్ రేఖ ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 8

పై రేఖాపటంలో డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. Ed = ∞.

2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ :
ధర పెరిగినా లేదా తగ్గినా డిమాండ్లో ఎలాంటి మార్పు రాకుంటే దానిని పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విషయంలో వ్యాకోచత్వ విలువ ‘0’ గా ఉంటుంది. డిమాండ్ రేఖ ‘y’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 9

‘DD’ రేఖ ‘Y’ అక్షానికి సమాంతరంగా ఉంది. పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు వ్యాకోచత్వం విలువ ‘0’ కు సమానం.
∴ Ed = 0

3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ :
వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పుకు, డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కి సమానంగా ఉంటుంది. ఈ డిమాండ్ రేఖ “లంబ అతిపరావలయంగా” ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 10

పై రేఖాపటంలో OQ1 = PP1 కి సమానం.
అందువల్ల Ed = 1,

4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ :
వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’
కంటే ఎక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 11

పై రేఖాపటంలో ‘DD’ రేఖ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ను సూచించు . OQ > PP గా ఉంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల AP కంటే AQ ఎక్కువగా ఉంటుంది.

5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ :
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో. వచ్చిన అనుపాత మార్పు తక్కువగా ఉంటుంది. దానిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 12

‘DD’ రేఖ సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 6.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలను (కారకాలను) చర్చించండి.
జవాబు.
ఒక వస్తువు ధరలో మార్పు కలిగినప్పుడు ఏ మేరకు డిమాండ్లో ప్రతిస్పందన వస్తుందో తెలియచేసేదే డిమాండ్ వ్యాకోచత్వము. ధర మార్పు శాతానికి, డిమాండ్లో వచ్చే మార్పు శాతానికి మధ్యగల నిష్పత్తినే వ్యాకోచత్వంగా నిర్వచించ వచ్చును. డిమాండ్ వ్యాకోచత్వము అన్ని వస్తువులకు ఒకే విధంగా ఉండదు. ధర డిమాండ్ వ్యాకోచత్వ స్వభావాన్ని లేదా స్థాయిని ఈ క్రింది అంశాలు నిర్ణయిస్తాయి.

డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కారకాలు :
1. వస్తువు స్వభావము :
వస్తువులలో కొన్ని అవసరాలు, మరికొన్ని సౌకర్యాలు, ఇంకొన్ని విలాసాలు ఉంటాయి. నిత్యావసర వస్తువులకు ధర పెరిగినా, డిమాండ్ తగ్గదు. కనుక వాటికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇవి లేకపోతే మానవ మనుగడ కష్టం.

సౌకర్యాలు, విలాసాలకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇవి లేకపోయినా ప్రజలు బ్రతకగలరు. కనుక వీటి ధర మార్పు కంటే డిమాండ్లో వచ్చే మార్పు అధికంగా
ఉంటుంది.

2. ప్రత్యామ్నాయ వస్తువులు :
ప్రత్యామ్నాయ వస్తువులు అధిక సంఖ్యలో ఉన్న వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువులు లేనప్పుడు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

3. కొనుగోలు వాయిదా వేయటానికి అవకాశం :
కొనుగోలును వాయిదా వేయటానికి అవకాశం ఉన్న వస్తువుఁ విషయంలో ధర డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. కొనుగోలును వాయిదా వేయటానికి వీలులేని వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

4. బహుళ ప్రయోజనాలున్న వస్తువులు :
బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలగు బహుళ ప్రయోజనాలు గల వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఒకే ప్రయోజనం లేక ఉపయోగం గల వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

5. కాలము :
స్వల్పకాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. దీర్ఘకాలంలో వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది.

6. పూరక వస్తువులు :
పూర వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

7. ధరస్థాయి :
ధర స్థాయి ఎక్కువగా ఉంటే వ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది. ధర స్థాయి తక్కువగా ఉంటే అవ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది.

8. వినియోగదారుని బడ్జెట్ లో వస్తువుకు గల ప్రాధాన్యం :
వినియోగదారుని ఆదాయంలో ఒక వస్తువుపై చేసే ఖర్చు శాతం తక్కువగా ఉంటే డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఆదాయంలో హెచ్చు శాతం ఖర్చు చేసే వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వస్తువు మన్నికపై ఆధారపడును :
మన్నికగల, నిల్వ చేయటానికి వీలైన అనశ్వర వస్తువులపై చేసే డిమాండ్ అవ్యాకోచంగాను, నశ్వర వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగాను ఉంటుంది.

10. పేదవారి వస్తువులు :
పేదవారు వినియోగించే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఈ వస్తువుల ధరలు తగ్గినపుడు వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 7.
ధర డిమాండ్ వ్యాకోచత్వం ప్రాముఖ్యాన్ని విశదీకరించండి.
జవాబు.
ధరలోని మార్పుకు ప్రతిస్పందనగా డిమాండులో ఏమేరకు మార్పు వస్తుందనేది ధర డిమాండు వ్యాకోచత్వం తెలియజేస్తుంది. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్’ అనే ఆర్థికవేత్త అభివృద్ధి పరిచాడు.

స్వతంత్ర చలాంకమైన ధరలో వచ్చే మార్పులు ఆధార చలాంకమైన డిమాండ్ పరిమాణంలో కలిగించే మార్పులు ఎప్పుడూ ఇతర కారకాలలో మార్పులు లేకుండా ఉన్నప్పుడు ఒకే రీతిగా ఉండవు.

1. ఉత్పత్తిదార్లకు :
ఉత్పత్తిదార్లు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే అటువంటి వస్తువుల ధరను పెంచి లాభం పొందగలుగుతారు.

2. సమిష్టి వస్తువుల ధర నిర్ణయం :
జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి.
ఉదా : పంచదార, మొలాసిన్, ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. అందువల్ల ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం జరుగుతుంది.

3. ఏకస్వామ్యదార్లు :
ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. అవ్యాకోచత్వం ఉన్న వస్తువులకు ఎక్కువ ధరను, వ్యాకోచత్వం ఎక్కువ ఉన్న వస్తువులకు తక్కువ ధరను నిర్ణయిస్తారు.

4. ప్రభుత్వం :
కొన్ని వస్తువులు ప్రజాసంక్షేమాన్ని పెంపొందిస్తాయి. అందువల్ల ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.
ఉదా : మందులు, రైలు ప్రయాణం మొదలైనవి.

5. ఆర్థిక మంత్రికి :
పన్నులు విధించేటప్పుడు ఆర్థిక మంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగపడుతుంది. అంతేకాక ఆర్థిక మంత్రికి కోశ విధాన రూపకల్పనలో డిమాండ్ వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

6. అంతర్జాతీయ వ్యాపారం :
అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఉదా : ఏ దేశమైనా మూల్యహీనీకరణ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఎగుమతి చేసే వస్తువులకు దిగుమతి చేసుకొంటున్న వస్తువులకు ధర డిమాండ్ వ్యాకోచత్వం ‘1’ కంటే ఎక్కువగా ఉండాలి.

7. పేదరికం :
సంపద మాటున దాగిఉన్న పేదరికంను అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది.

8.వేతనాలు :
శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల యాజమాన్యం వేతనాలను నిర్ణయించేటప్పుడు శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
డిమాండ్ను నిర్ణయించే కారకాలు ఏమిటి ?
జవాబు.
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.
డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు :

1. ఆదాయంలో మార్పు :
ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు :
ప్రజల అభిరుచులలో, అలవాట్లలో మార్పుల వల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు :
జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు :
వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి.
ఉదా : వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి :
సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు :
వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము :
ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర :
ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రాన్ని వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనేశక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండును ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధరవద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ధర డిమాండ్-డిమాండ్ సూత్రము :
డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరముగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ విధంగా పేర్కొనవచ్చును.
Dn = f[Pn]

వస్తువు ధర ₹

వస్తువు డిమాండ్ కిలోలలో

1

200

2

150
3

100

4

50
5

25

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 13

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టిక నుంచి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

డిమాండ్ రేఖ :
పటములో X – అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, Y- అక్షముపై వస్తువు ధరను చూపినాము. DD డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 3.
డిమాండ్ సూత్రానికి మినహాయింపులను విపులీకరించండి.
జవాబు.
డిమాండ్ సూత్రం ప్రకారం వస్తు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాని కొన్ని పరిస్థితులలో ధర, డిమాండ్ అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి మినహాయింపు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 14

ధర ‘OP’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ ధర చేయ కింది. ధర ‘OP’ నుంచి OP1 కు పెరగగా డిమాండ్ OQ1 కు పెరిగింది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి విరుద్ధం.

మినహాయింపులు :
1. గిఫెన్ వైపరీత్యం :
పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు.

కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు.
ఉదా : రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు :
గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు.
ఉదా : విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం :
ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు.
ఉదా : షేర్లు, బాండ్లు మొదలైనవి.

4. భ్రాంతి :
కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 4.
డిమాండ్ రేఖ ఋణాత్మక వాలుకు గల కారణాలను విపులీకరించండి.
జవాబు.
ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని డిమాండ్ అంటారు. పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది.” అని డిమాండ్ సూత్రం తెలియజేస్తుంది. దీనిని బట్టి వస్తువు ధరకు, డిమాండు విలోమ సంబంధం ఉందని తెలుస్తుంది. కనుక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. అవి :

1. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం:
క్షీణోపాంత ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకొని డిమాండ్ సూత్రం చెప్పబడినది. వస్తువు పరిమాణం ఎక్కువైతే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటే వినియోగదారుడు ఆ వస్తువుకు ధర చెల్లించాలనుకున్నాడు. అందువల్ల ధర తక్కువగా ఉంటే ఎక్కువగానూ, ధర ఎక్కువగా ఉంటే తక్కువగాను వస్తు పరిమాణాన్ని బట్టి డిమాండ్ చేస్తాడు.

2. ఆదాయ ప్రభావము :
ఒక వస్తువు ధర పెరిగితే వినియోగదారుని వాస్తవిక ఆదాయం ధర పెరిగిన మేరకు తగ్గుతుంది. అందువల్ల వాస్తవిక ఆదాయం తగ్గినమేరకు ఆ వస్తువును తక్కువ పరిమాణంలో డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర తగ్గితే ధర తగ్గిన మేరకు వాస్తవిక ఆదాయం పెరిగినట్లే అవుతుంది. కనుక ఆ మేరకు డిమాండ్ పెరుగుతుంది. దీనినే డిమాండ్పై ఆదాయ ప్రభావం అంటారు.
ఉదా : ఒక వస్తువుకు వినియోగదారుడు 5 రూపాయలు కేటాయిస్తే వస్తువు ధర ఒక రూపాయిగా ఉంటే 5 యూనిట్లు కొనుగోలు చేస్తాడు. వస్తువు ధర అర్థ రూపాయికి తగ్గితే 10 యూనిట్లను కొనుగోలు చేస్తారు.

3. ప్రత్యామ్నాయాల ప్రభావం :
రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఒక వస్తువు ధర తగ్గి | మరొక వస్తువు ధర స్థిరంగా ఉంటే ధర తగ్గిన వస్తువుకు, ధర స్థిరంగా ఉన్న వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయం చేస్తారు.
ఉదా : పెప్సి, థమ్సప్ శీతల పానీయాలు. పెప్సి ధర పెరిగితే వినియోగదార్లు దానికి ప్రత్యామ్నాయంగా థమ్సప్ కొనుగోలు చేస్తారు.

4. పాత, నూతన కొనుగోలుదార్లు :
ఒక వస్తువు ధర తగ్గగానే ముందు నుంచి ఆ వస్తువును కొనుగోలు చేస్తున్న పాత వినియోగదారుల వాస్తవిక ఆదాయం పెరిగి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఆకర్షితులైన కొత్త వినియోగదార్లు ఆ వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందువల్ల ధర తగ్గినప్పుడు వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది.

5. వస్తువుకున్న బహుళ ఉపయోగాలు :
కొన్ని వస్తువులకు బహుళ ఉపయోగాలుంటాయి. మరికొన్ని వస్తువులు ఒక ప్రత్యేకమైన ఉపయోగానికి మాత్రమే వినియోగించబడతాయి. అనేక ఉపయోగాలున్న వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఉదా : పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలైనవి.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 5.
ఆదాయ డిమాండ్ భావనను చర్చించండి.
జవాబు.
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏవిధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dx = f(y)
ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉంటే ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండును అనుసరించి వస్తువులలో |మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు:
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ‘ ఉన్నప్పుడు ‘0Q’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘0Q’ నుంచి ‘001’ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 15

నాసిరకం వస్తువులు :
మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘OD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 16

ప్రశ్న 6.
జాత్యంతర డిమాండ్ భావనను వివరించండి.
జవాబు.
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 17

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు : ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు.
ఉదా : కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని రేఖాపటం ద్వారా చూపవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 18

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY,’ కు పెరిగినప్పుడు టీ డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ్క’ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.
పూరక వస్తువులు : ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా : కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.

ప్రక్క రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP2‘ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 7.
డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ?
జవాబు.
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది. ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేయును.

అంటే ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను కీరనీట్, మిల్ రూపొందించినప్పటికీ, మార్షల్ అభివృద్ధిపరిచారు.

మార్షల్ అభిప్రాయంలో “ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిందా లేదా తక్కువ పెరిగిందా, ధర పెరిగినప్పుడు డిమాండ్ తక్కువ తగ్గిందా లేదా ఎక్కువ తగ్గిందా అనే దాని ఆధారంగా మార్కెట్ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగాని, తక్కువగాని ఉంటుంది.”

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చే అనుపాత మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.

డిమాండ్ వ్యాకోచత్వం = డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు / ధరలో వచ్చిన అనుపాతపు మార్పు

డిమాండ్ వ్యాకోచత్వాన్ని మూడు రకాలుగా చెబుతారు. అవి :

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 8.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్వచించండి.
జవాబు.
ఇతర కారకాలలో ఎలాంటి మార్పులు లేవనే ప్రమేయంతో, ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు వల్ల డిమాండ్లో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో ధర డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేస్తుంది. ధర కొంత శాతం మార్పు చెందినప్పుడు వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుంది అనే దాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది.

వస్తువు ధర పెరిగితే డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. అయితే అన్ని సందర్భాల్లో ధరలో వచ్చిన మార్పు ఫలితంగా డిమాండ్లో వచ్చే ప్రతిస్పందన ఒకే రీతిగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ధరలో వచ్చిన స్వల్ప మార్పు వల్ల డిమాండ్లో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి.

ఈ పరిస్థితిని వ్యాకోచ డిమాండ్ అంటారు. మరి కొన్నిసార్లు ధరలో గణనీయమైన మార్పులు సంభవించినప్పటికీ డిమాండ్లో స్వల్ప మార్పులు మాత్రమే రావచ్చు. ఈ పరిస్థితిని అవ్యాకోచ డిమాండ్ అంటారు. వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని అయిదు రకాలుగా చెప్పవచ్చు.

ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ప్రొఫెసర్ మార్షల్ కింది సమీకరణాన్ని రూపొందించాడు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 19

ఇచ్చట, Ed = ధర డిమాండ్ వ్యాకోచత్వం
Q = వస్తువు డిమాండ్
ΔQ = వస్తువు డిమాండ్లో వచ్చిన మార్పు
P = వస్తువు (ప్రారంభ) ధర
ΔP = వస్తువు ధరలో వచ్చిన మార్పు.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 9.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే ముఖ్య అంశాలు (కారకాలు) ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు డిమాండ్ వ్యాకోచత్వంగా ఉందా లేదా అవ్యాకోచంగా ఉందా అనే విషయాన్ని సులభంగా చెప్పలేం. ఎందుకంటే ఒక వస్తువుకు ఒక ప్రాంతంలో, ఒక వ్యక్తికి ఒక కాలంలో వ్యాకోచ డిమాండ్ ఉండవచ్చు. అదే వస్తువుకు మరో ప్రాంతంలో, మరో వ్యక్తికి మరో కాలంలో అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. వ్యాకోచత్వం విలువను అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ఒక వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కొన్ని అంశాలను కింద పేర్కొన్నాం.

1. వస్తువు స్వభావం :
వస్తువు స్వభావం ఆధారంగా డిమాండ్ వ్యాకోచత్వం మారుతూ ఉంటుంది. నిత్యావసర వస్తువులైన బియ్యం, ఉప్పు, పప్పులు, పంచదార మొదలైన వాటికి డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఆ వస్తువుల ధరలు మారినా డిమాండ్ మారదు. అలాగే విలాస వస్తువులైన బంగారం, డైమండ్స్ మొదలైన వాటికి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

2. ప్రత్యామ్నాయాల (Substitutes) లభ్యత :
ఒక వస్తువుకున్న డిమాండ్ను దానికున్న ప్రత్యామ్నాయాల ధరలు కొంతమేరకు ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు కోల్గేట్ ధర పెరిగితే క్లోజప్కు డిమాండ్ పెరుగుతుంది. అట్లాగే కోల్గేట్ ధర తగ్గితే క్లోజపు డిమాండ్ తగ్గుతుంది. ఒక వస్తువుకు ఎక్కువ సంఖ్యలో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఏ వస్తువుకైతే ప్రత్యామ్నాయ వస్తువులు తక్కువగా ఉంటాయో అది అవ్యాకోచ డిమాండ్ను కలిగి ఉంటుంది.

3. పూరక (Complementaries) వస్తువులు :
కోరికలను సంతృప్తి పరచుకోవడానికి కొన్ని వస్తువులను కలిపి ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకు, కారు ఇంధనం.
ఉదా : కారు ధర పెరిగితే ఇంధనానికి డిమాండ్ తగ్గుతుంది. అట్లాగే కారు ధర తగ్గితే ఇంధనానికి డిమాండ్ పెరుగుతుంది. కార్ల డిమాండ్ వ్యాకోచంగా ఉంటే ఇంధనం డిమాండ్ కూడా వ్యాకోచంగా ఉంటుంది. అలాగే కార్ల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటే ఇంధనం డిమాండ్ కూడా అవ్యాకోచంగా ఉంటుంది.

4. వస్తువుకు ఉన్న బహుళ ఉపయోగాలు :
ఏ వస్తువుకైతే బహుళ ఉపయోగాలు ఉంటాయో, ఆ వస్తువుకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే ధర తగ్గినప్పుడు ఆ వస్తువును అనేక ఉపయోగాలకు వాడుకోవచ్చని ఎక్కువగా కొంటారు. ధర పెరిగినప్పుడు ఆ వస్తువును ఒక ప్రత్యేక ఉపయోగానికి మాత్రమే పరిమితం చేసి తక్కువగా కొంటారు.

ఉదాహరణకు పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి, పాల ధరలు తక్కువగా ఉన్నప్పుడు పాలను ఎక్కువగా కొనుగోలు చేసి పెరుగు, క్రీమ్, నెయ్యి, స్వీట్స్ మొదలైన ఉపయోగాలకు వాడతారు. అందుకు భిన్నంగా, ధర ఎక్కువగా ఉన్నప్పుడు పాలను చిన్న పిల్లలు, వృద్ధులకు ఆహారంగా మాత్రమే వాడతారు, ఇతర ఉపయోగాలకు తగ్గిస్తారు.

5. వినియోగాన్ని వాయిదా వేయగలగడం :
ఒక వస్తువు వినియోగాన్ని వాయిదా వేయడానికి వీలున్నట్లయితే ఆ వస్తువు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు వాహనాలు, నగలు, AC యూనిట్ల కొనుగోలు వాయిదా వేయగలం. మరికొన్ని వస్తువుల వినియోగాన్ని వాయిదా వేయలేం. ఉదాహరణకు ప్రాణరక్షణ మందులు. వీటి ధర పెరిగినా వినియోగాన్ని వాయిదా వేయలేం. ఈ వస్తువుల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

6. ఆదాయంలో వస్తువుపై ఖర్చు పెట్టే అనుపాతం :
వినియోగదారులు మొత్తం ఆదాయం నుంచి ఏ వస్తువులపై తక్కువ అనుపాతంలో ఖర్చు చేస్తారో ఆ వస్తువుల ధర, డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు, ఉప్పు, వార్తాపత్రికలు మొదలైనవి. ఆదాయంలో ఎక్కువ భాగం ఏ వస్తువుల వినియోగంపై ఖర్చు చేస్తారో వాటి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు ఎయిర్ కండిషనర్స్, వాహనాలు.

7. కాలం :
స్వల్ప కాలంలో వస్తువులు అవ్యాకోచ డిమాండు, దీర్ఘ కాలంలో వ్యాకోచ డిమాండ్ను కలిగి ఉంటాయి. ఎందుకంటే స్వల్ప కాలంలో వస్తువుల ధరలు పెరిగిన తక్షణమే ప్రత్యామ్నాయ వస్తువులను తయారు చేయలేం. ఉదాహరణకు స్వల్ప కాలంలో పెట్రోలు ధర పెరిగిన తక్షణమే పెట్రోలు ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజన్లు తయారు చేయలేరు. కానీ దీర్ఘకాలంలో డీజిల్ ఇంజన్లు తయారు చేయగలరు.

8. ధరల స్థాయి :
వస్తువుల ధరలు చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉన్నా డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. అదే వస్తువుల ధరలు సాధారణ స్థాయిలో ఉంటే వాటి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వ్యసనానికి దోహదపడే వస్తువులు :
కొన్ని వస్తువుల వినియోగం వ్యసనానికి దారితీస్తుంది. ఆ వస్తువుల ధర పెరిగినప్పటికీ వాటిని వినియోగించాలనే కోరిక బలంగా ఉంటుంది. అందువల్ల ఈ వస్తువుల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.
ఉదా : పొగాకు, ఆల్కహాల్.

10. ఆదాయ వర్గాలు :
అధిక ఆదాయ వర్గానికి చెందిన వినియోగదార్లు కొనుగోలు చేసే వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే వీరు ధర పెరిగినా వస్తువులను కొనగలరు. అల్ప, మధ్య ఆదాయ వర్గాలకు చెందినవారు కొనుగోలు చేసే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ధర పెరిగితే వీరు వస్తువులను కొనలేరు. ఒక వస్తువుకు వ్యాకోచ డిమాండ్ ఉందా లేదా అవ్యాకోచ డిమాండ్ ఉందా అనేది చెప్పడం కష్టం.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 10.
ధర డిమాండ్ వ్యాకోచత్వ ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు, ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ధర డిమాండ్ వ్యాకోచత్వ భావన ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగా ఉపయోగపడే రంగాలను కొన్నింటిని కింద చూడవచ్చు.

1. ఏకస్వామ్య మార్కెట్ :
వివిధ మార్కెట్లలో డిమాండ్ వ్యాకోచత్వం వేరుగా ఉంటే దీన్ని బట్టి ఏకస్వామ్యదారుడు వివిధ ధరలను నిర్ణయిస్తాడు. వ్యాపారస్తులు వస్తువులకు ధర నిర్ణయించేటప్పుడు ఆ వస్తువుకున్న ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. వ్యాకోచత్వం ఎక్కువగా ఉన్న మార్కెట్లో వస్తువులకు తక్కువ ధరను, అవ్యాకోచత్వం ఉన్న మార్కెట్లో వస్తువులకు ఎక్కువ ధరను నిర్ణయిస్తారు.

2. సంయుక్త (Joint) వస్తువుల ధర నిర్ణయం :
జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి. ఉదాహరణకు మాంసం, ఉన్ని, పంచదార, మొలాసిస్. ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధరను నిర్ణయించడం జరుగుతుంది.

3. ప్రభుత్వం :
కొన్ని వస్తువులు ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తాయి. సాధారణంగా ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ వస్తూత్పత్తి పరిశ్రమలను ప్రజోపయోగాలుగా ప్రకటిస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణగా రైల్వేలని చెప్పవచ్చు.

4. అంతర్జాతీయ వ్యాపారం :
రెండు దేశాల మధ్య వ్యాపారం జరగాలంటే రెండు దేశాల వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని చూడాలి. అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

5. వస్తువులపై పన్ను విధింపు :
ప్రభుత్వం తన రాబడిని పెంచుకోవడానికి సాధారణంగా పన్నులను విధిస్తుంది. పన్నులను విధించేటప్పుడు ఆర్థికమంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది. అంటే డిమాండ్ అవ్యాకోచంగా ఉన్న వస్తువులను ఎన్నుకొని ఎక్కువ పన్నులను విధిస్తారు.

6. వేతనాల నిర్ణయం :
శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. వీరికున్న డిమాండ్ అవ్యాకోచంగా ఉంటే వేతనాల పెంపుదలకు కార్మిక సంఘాల ప్రయత్నం సఫలం అవుతాయి. శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచంగా ఉంటే వేతనాల పెంపుదలకు కార్మిక సంఘాల ప్రయత్నం విఫలం కావచ్చు.

7. సంపద మాటున దాగి ఉన్న పేదరికం :
సంపద మాటున దాగి ఉన్న పేదరికం అనే వైపరీత్యాన్ని అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఆహార ధాన్యాలు బాగా పండితే రైతులు అధిక ఆదాయాన్ని పొందాలి. ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండినప్పటికీ వాటికి ఉన్న డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. అందువల్ల ఆహార ధాన్యాల డిమాండ్ స్థిరంగా ఉండి, సరఫరా పెరిగినందువల్ల వాటికి తక్కువ ధర నిర్ణయించబడుతుంది.

8. వస్తూత్పత్తి నిర్ణయం :
‘ఉత్పత్తిదార్లు’ వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే వాటి ధరలను పెంచి లాభం పొందగలుగుతారు. కాబట్టి ఉత్పత్తి ఎంత చేయాలని నిర్ణయించడానికి వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 11.
ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను విశదీకరించండి.
జవాబు.
అర్థశాస్త్ర సిద్ధాంతాల్లో ‘డిమాండ్ వ్యాకోచత్వం’ అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. డిమాండ్ను నిర్ణయించే ఒక అంశంలో వచ్చిన మార్పు శాతానికి ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత శాతం మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

వస్తువు ధర, ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుని ఆదాయం, అభిరుచులు, ప్రాధాన్యతలు మొదలగునవి ఒక వస్తువు డిమాండ్ను నిర్ణయిస్తాయని ఇంతకు ముందే చర్చించుకున్నాం.

ఒక వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చిన మార్పు శాతాన్ని డిమాండ్ను నిర్ణయించే అంశాలలోని ఒక అంశంలో వచ్చిన మార్పుల శాతంతో భాగిస్తే డిమాండ్ వ్యాకోచత్వం వస్తుంది. డిమాండ్ వ్యాకోచత్వం అన్ని వస్తువులకు, అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో, అందరు వ్యక్తులకు ఒకేలా ఉండదు.

ఉదా : నిత్యావసర వస్తువులైన బియ్యం, ఉప్పు, కూరగాయలు మొదలైన వాటి ధరలలో గణనీయమైన మార్పులు వచ్చినా డిమాండ్లో పెద్దగా మార్పు రాదు. కానీ విలాస వస్తువులైన రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు మొదలైన వాటి ధరలలో కొద్ది తగ్గుదల వచ్చినా, డిమాండ్లో గణనీయమైన మార్పులు వస్తాయి.

ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేస్తుంది. అంటే ఒక వస్తువు ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది.

ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం :
ఆదాయంలో వచ్చే మార్పు వల్ల (పెరుగుదల లేదా తగ్గుదల) డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయంలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పును ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటారు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 20

జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం :
ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధర పైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, | పూరక వస్తువుల ధర పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇతర కారకాలు మారకుండా ఉండి, ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతపు మార్పు ఆ వస్తువు డిమాండ్లో ఎంత అనుపాతపు మార్పు లేదా శాతపు మార్పు కలిగిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 21

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ధర డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు, కొనగలిగే శక్తి ఉంటే దానిని అర్థశాస్త్రంలో ఆ వస్తువుకు గల డిమాండ్ అంటారు. ఒక నిర్ణీతకాలంలో మార్కెట్లోని వివిధ ధరల వద్ద ఒక వినియోగదారుడు కొనే వస్తువుల లేదా సేవల పరిమాణాలను ధర డిమాండ్ తెలియజేస్తుంది. ఇతర అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు ధరకు, దాని డిమాండుకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది.

ప్రశ్న 2.
వైయుక్తిక డిమాండ్ పట్టిక తయారు చేయండి.
జవాబు.
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తాడో తెలియజేయునది వైయుక్తిక డిమాండ్. దానిని పట్టిక రూపంలో తెలియజేస్తే అది వైయుక్తిక డిమాండ్ పట్టిక.

ప్రశ్న 3.
మార్కెట్ డిమాండ్ పట్టిక తయారు చేయండి.
జవాబు.
మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారందరి డిమాండ్ పట్టికలను కలిపితే మార్కెట్ డిమాండ్ పట్టిక వస్తుంది. మార్కెట్ డిమాండ్ వివిధ వినియోగదార్ల వస్తువులను వివిధ ధరల వద్ద ఒక వస్తువును ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 4.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దానిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని డిమాండ్ ఫలం తెలియజేయును. డిమాండ్ ఫలాన్ని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు.
DX = f (PX, PY, Y, T).
DX = X వస్తువు డిమాండ్
PX = x వస్తువు ధర
PY = ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు
Y = వినియోగదారుని ఆదాయం
T = అభిరుచులు, అలవాట్లు.

ప్రశ్న 5.
గిఫెన్ వైపరీత్యం / గిఫెన్ వస్తువులు భావనను వివరించండి.
జవాబు.
ధర పెరిగినప్పటికి డిమాండ్ తగ్గకపోగా, పెరగటం లేదా అదే విధంగా డిమాండ్ను కలిగి ఉండే వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. నాసిరకపు వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. వాటి ధర పెరిగితే ఇతర వస్తువులపై ఖర్చు తగ్గించి ఈ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీనిని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఆర్థికవేత్త పరిశీలించడం వల్ల దీనిని “గిఫెన్ వైపరీత్యం” అంటారు.

ప్రశ్న 6.
వెబ్లెన్ వస్తువులు (గౌరవ సూచిక వస్తువులు) అనగానేమి ?
జవాబు.
దీనిని గూర్చి చెప్పిన ఆర్థికవేత్త వెల్లెన్.. గౌరవ సూచిక వస్తువులయిన వజ్రాలు, బంగారు నగలు మొదలైనవి. కలిగి ఉండటం సమాజంలో ప్రతిష్టగా భావిస్తారు ధనికులు. వీటి ధర తగ్గితే వారి గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయని కొనుగోలు తగ్గిస్తారు. కనుక ఈ వస్తువుల విషయంలో ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గును.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 7.
ఆదాయ డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ఆదాయానికి, కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ పరిశీలిస్తుంది. సాధారణంగా ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఆదాయ డిమాండ్ను బట్టి వస్తువులను మేలురకం అని, నాసిరకమని విభజించవచ్చు.
ఆదాయ డిమాండ్ Dn = f(y).

ప్రశ్న 8.
జాత్యంతర డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.
Dx = f(Py).

ప్రశ్న 9.
ప్రత్యామ్నాయాలు (ప్రతిస్థాపక వస్తువులు) వస్తువులను వివరించండి.
జవాబు.
సన్నిహిత సంబంధం ఉన్న వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులంటారు.
ఉదా : కాఫీ, టీ. ఈ వస్తువుల విషయంలో ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వస్తే, మరో వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది. కనుక ఈ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 10.
పూరక వస్తువులను వివరించండి.
జవాబు.
సంయుక్త వస్తువులను పూరక వస్తువులంటారు. ఉదా : కారు, పెట్రోలు. వీటిలో ఒకటి లేకపోయినా మరొకటి ఉపయోగపడదు. పూరక సంబంధం ఉన్న వస్తువు ధర పెరిగితే, ఇతర వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే ఇతర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. పూరక సంబంధం ఉన్న వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ క్రిందికి వాలి ఉంటుంది.

ప్రశ్న 11.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు ధరలోని శాతం మార్పుకు, వస్తు డిమాండ్లో డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
Ep = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ధరలో వచ్చిన మార్పు శాతం

ప్రశ్న 12.
ధర డిమాండ్ వ్యాకోచత్వ రకాలు తెల్పండి.
జవాబు.
ధరలోని మార్పుకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఏ మేరకు మార్పు వస్తుందనేది, ధర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది. ఈ భావనను మార్షల్ అభివృద్ధి పరచినాడు. దీనిని క్రింది విధంగా కొలవవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ విశ్లేషణ 22

ధర డిమాండ్ వ్యాకోచత్వపు రకాలు 5. అవి :

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = ∞)
  2. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ed >1)
  3. పూర్తి అవ్యాకోచ డిమాండ్
  4. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్
  5. ఏకత్వ వ్యాకోచ డిమాండ్

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 13.
ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ?
జవాబు.
వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతంకు, అతని డిమాండ్లో వచ్చిన శాతం మార్పును “ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
Ey = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ఆదాయంలో వచ్చిన మార్పు శాతం

ప్రశ్న 14.
జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వంను వివరించండి.
జవాబు.
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన శాతం మార్పుకు, డిమాండ్లో కలిగే శాతం మార్పును “జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
Ec = డిమాండ్లో వచ్చిన మార్పు శాతం / ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలో వచ్చిన మార్పు శాతం

ప్రశ్న 15.
పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ధరలో ఏ మార్పు వచ్చినా లేకున్నా డిమాండ్లో అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = ∞.

TS Board Inter First Year Economics Study Material Chapter 3 డిమాండ్ విశ్లేషణ

ప్రశ్న 16.
పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో ఏ మాత్రము మార్పు ఉండదు. దీనినే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ Y – అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = 0.

ప్రశ్న 17.
ఏకత్వ వ్యాకోచ డిమాండ్ను వివరించండి.
జవాబు.
ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విలువ ఒకటికి సమానము.
Ep = 1
ఇక్కడ డిమాండ్ రేఖ లంబ అతిపరావలయ ఆకారంలో ఉంటుంది.

ప్రశ్న 18.
సాపేక్ష వ్యాకోచ డిమాండ్ గురించి తెల్పండి.
జవాబు.
ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 19.
సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ గురించి తెల్పండి..
జవాబు.
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాతపు మార్పు తక్కువగా ఉన్నట్లయితే దీనిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 20.
మేలురకం వస్తువులను నిర్వచించండి.
జవాబు.
ఆదాయం పెరిగితే మేలు రకం వస్తువులు లేదా సాధారణ వస్తువులు డిమాండ్ పెరుగుతుంది. మేలు రకం వస్తువుల డిమాండ్ విషయంలో డిమాండుకు, ఆదాయానికి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. కాబట్టి ఆదాయ డిమాండ్ రేఖ ధనాత్మక వాలును కలిగి ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తుంది.

ప్రశ్న 21.
నాసిరకం వస్తువులను నిర్వచించండి.
జవాబు.
ఆదాయం పెరిగేకొలది కొన్ని రకాల వస్తువులకు డిమాండ్ తగ్గును. ఆదాయం తగ్గితే డిమాండ్ పెరుగును. ఇటువంటి వస్తువులను నాసిరకం వస్తువులంటారు. ఈ వస్తువుల విషయంలో ఆదాయానికి, వస్తువు డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది.
ఉదా : సజ్జలు, రాగులు.

Leave a Comment