Telangana SCERT 7th Class Telugu Guide Telangana 4th Lesson అమ్మ జ్ఞాపకాలు Textbook Questions and Answers.
అమ్మ జ్ఞాపకాలు TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి మాట్లాడండి.
ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.
పై బొమ్మలో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాశంలో చందమామ ఉన్నాడు.
ప్రశ్న 2.
అమ్మ ఏం చేస్తున్నది?
జవాబు.
అమ్మ ప్రేమతో పిల్లలకు చందమామను చూపి, గోరుముద్దలు తినిపిస్తున్నది.
ప్రశ్న 3.
పిల్లల కోసం అమ్మ ఏయే సేవలు చేస్తుంది?
జవాబు.
పిల్లల కోసం అమ్మ అన్ని సేవలు చేస్తుంది. స్నానం చేయించడం, అన్నం వండడం, బట్టలు ఉతకడం, అన్నం పెట్టడం, నిద్ర పుచ్చడం వంటి సేవలను ఎంతో ప్రేమగా చేస్తుంది.
ప్రశ్న 4.
మీరు మీ అమ్మకోసం ఎప్పుడెప్పుడు ఎటువంటి సేవలు చేశారు?
జవాబు.
మేము అమ్మకోసం గిన్నెలు సర్దడం, ఇల్లుశుభ్రం చెయ్యడం, బట్టలు మడత పెట్టడం వంటి పనులలో సేవలు చేశాము.
ప్రశ్న 5.
మీరు మీ అమ్మకోసం ఏమైనా చేసినపుడు ఎట్లా అనిపించింది?
జవాబు.
అమ్మ నాకోసం అన్నీ చేస్తున్నప్పుడు నేను కూడ ఇంటి పనులలో అమ్మకు సాయం చేయాలనిపించింది. అమ్మ నా పనులు చూచి వద్దన్నా నేను కూడా అమ్మకు సేవలు చేయడం నా బాధ్యత అనిపించింది.
ప్రశ్న 1.
“అమ్మ ముగ్గులేస్తే వాకిలి అద్దకపు చీరలా ఉందనడంలో” కవి ఆంతర్యమేమిటి?
జవాబు.
అమ్మ ముగ్గువేస్తే వాకిలి (ముందరిభాగం) రంగవల్లితో చేనేత వారు చీరమీద వేసిన అద్దకం వలే ఇంటి ముందరి భాగం అందంగా అలంకరిస్తుందని ఆంతర్యం.
ప్రశ్న 2.
అమ్మను నర్సు అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
తన బిడ్డలకు జలుబు, వాంతులు, జ్వరం వస్తే అమ్మ చిన్నిచిన్ని చిట్కాలతో వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. తన ఒడినే తన పిల్లలకు వెచ్చని పక్కలా మార్చుతుంది. అందుకనే అమ్మను నర్సు అన్నారు.
ప్రశ్న 3.
ఈ ఇంటిని హాస్పిటల్గా మార్చటం అంటే మీకేమర్థమైంది?
జవాబు.
ఇంటిలోని వారికి ఆరోగ్యం బాగాలేకపోతే తల్లి చుట్టుప్రక్కల పరిసరాలను హాస్పటల్ కంటే పరిశుభ్రంగా ఉంచుతుంది. తడిగుడ్డతో తుడవడం, పిల్లలకు వేడినీటిని కాచి ఇవ్వడం, మందులు సకాలంలో వేయడం వంటివి చేయడం వలన ఇంటిని హాస్పటల్గా మార్చటం అని అర్థమైంది.
ప్రశ్న 4.
ఆస్థానపు తెల్లకుందేళ్ళు అని కవి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఎందుకు?
జవాబు.
బర్లెపాలను దూడలను తాగనివ్వకుండా దొరల బిడ్డలకు ఇవ్వడం వల్ల వారిని తెల్లకుందేళ్ళతో పోల్చాడు.
ప్రశ్న 5.
అమ్మ పొద్దంతా ఎవరి కోసం కష్టపడుతుంది? మీకెట్లాంటి సేవలు చేస్తుంది?
జవాబు.
అమ్మ పొద్దంతా తన బిడ్డల కోసం కష్టపడుతుంది. మా కోసం ఉదయం నుండి రాత్రి వరకు అన్ని సేవలు చేస్తుంది. పాలు, టిఫిన్, భోజనం, మరలా ఆకలైతే తినడానికి పల్లికాయల్లాంటివి, సాయంత్రం ఇంటికెళ్ళేసరికి మళ్ళీ ఏదో ఒకటి
పెడుతుంది. బట్టలుతకడం, పుస్తకాలు సర్దడం లాంటి అన్ని సేవలు చేస్తుంది.
ప్రశ్న 6.
మీరు కేరింతలు కొడుతూ ఏయే సందర్భాల్లో ఆనందంగా ఉంటారు?
జవాబు.
- మేము స్నానం చేసేటపుడు కేరింతలు కొడుతూ ఉంటాం.
- చెరువుల్లో, కాలువల్లో స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు కేరింతలు కొడతాం.
- పుట్టినరోజున, హాయిగా ఉన్నప్పుడు, సంతోషం కలిగేవార్త విన్నపుడు కేరింతలు కొడతాం.
ప్రశ్న 7.
“అమ్మ జ్ఞాపకాలు తేనెటీగల్లా ముసురుతాయి” అనడంలో కవి ఆంతర్యమేమిటి?
జవాబు.
తేనెటీగలు ముసిరితే ఆగకుండా శబ్దం చేస్తాయి. అమ్మ కనబడే దేవత. తన కోసం ఏమీ చేసుకోదు. అన్నీ పిల్లలకోసమే ఆలోచిస్తుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఒకసారి తన తల్లిని గుర్తుకు చేసుకుంటే, అమ్మ చేసిన పనులన్నీ మనసారా తలచుకుంటే, మనసున్న మనిషికి అమ్మ జ్ఞాపకాలు తేనెటీగల్లా ఆగకుండా ముసురుతాయి అని కవి ఆంతర్యం.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
అమ్మ జ్ఞాపకాలను కవి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా! మీరు మీ అమ్మ గురించి చెప్పండి.
జవాబు.
మా అమ్మ నా బాల్యంలో నాకు నీళ్ళు పోసేది. పాలిచ్చేది. ఆకలివేస్తే అన్నంకాని ఏదో ఒకటిగాని పెట్టేది. దెబ్బ లేదా బాధ పడి వెళ్ళి ‘అమ్మా!’ అంటే ఓదార్చేది. నొప్పి వెంటనే పోయేది. జ్వరం, జబ్బు చేస్తే నిద్రపోయేదికాదు. రాత్రి, పగలు నావెంటే ఉండేది. అమ్మ పక్కనే ఉంటే ఎంతో హాయిగా ఉండేది. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు. అమ్మ లేనపుడే అమ్మ విలువ తెలుస్తుంది. మేమెప్పుడూ మా అమ్మను మరచిపోము.
ప్రశ్న 2.
మీరు మీ అమ్మను సంతోషపెట్టడానికి ఏమేమి చేస్తారు?
జవాబు.
మేము మా అమ్మను సంతోషపెట్టడానికి మంచి పనులు చేస్తాము. మంచి ప్రవర్తనతో ఉంటాము. బాగా చదువుకొంటాము. ఇతరులతో తగాదాలకు వెళ్ళము. అమ్మ చెప్పిన పనులు చేస్తే అమ్మకు చాలా ఇష్టం కదా! అవే చేస్తాము. మా అమ్మ ఇంటి పనులలో సహాయపడతాము. అమ్మ కోరుకున్నది సాధించడానికి ఏమి చేయడానికైనా సిద్ధపడతాము.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
1. పాఠం చదవండి. వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో పట్టికలో రాయండి.
అంశం | పోలిక |
ముగ్గులేసిన ప్రాంగణం | అద్దకపు చీర |
పండ్లు | పాల బలపాలు |
ఇల్లు | దవాఖానా |
దొరలబిడ్డలు | తెల్లకుందేళ్ళు |
ముక్కుపోగు | నెలవంకలా అర్ధచంద్రాకారం |
వడ్లు దంచే చప్పుడు | మద్దెల మోత |
ముక్కు పుల్ల | విష్ణువు ముట్టెమీద ఎత్తిన భూగోళం |
గంటీలు | గడియారంలోని లోలకం |
అమ్మ ఒడి | గుమ్మి |
2. కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే. లవకుశులు వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ శిక్షణలోనే. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశసమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడా తల్లి ఆర్యాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు.
భారతజాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతులనందుకొనిన వీరశివాజీ తన తల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్య బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి, పెంచి, పోషించి గాంధీని మహాత్మునిగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి పుతిలీబాయి. ప్రపంచ చరిత్రను సునిశితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.
(అ) సీతమ్మ లవకుశులను ఎట్లా తీర్చిదిద్దింది?
జవాబు.
సీతమ్మ లవకుశులను వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తీర్చిదిద్దింది.
(ఆ) ఆదిశంకరుల తల్లి పేరేమిటి?
జవాబు.
ఆదిశంకరుల తల్లిపేరు ఆర్యాంబ.
(ఇ) శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచింది?
జవాబు.
శివాజీని జిజియాబాయి వీరుడిగా, శూరుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లు పెంచింది.
(ఈ) గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం ఎవరు?
జవాబు.
గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం అతని తల్లి పుతిలీబాయి.
(ఉ) జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు?
జవాబు.
జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు అంతా ఆ మహనీయుల తల్లులే!
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. కవి రచనా శైలిని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ఈ కవితలోని రచయిత రచనాపద్ధతి ఎట్టిది?
జవాబు.
కవి ఈ గేయాన్ని వచనకవితా ప్రక్రియలో రాశాడు. గేయాన్ని ఎలాంటి ఛందో నియమాలను పట్టించుకోకుండా భావానికి ప్రాధాన్యత నిస్తూ రాశాడు. ‘అమ్మ’ను కవితా వస్తువుగా తీసుకొని ప్రతి వాడి మనసులో అమ్మ స్థానాన్ని, విలువను నింపాడు. సరళమైన భాషతో, తేలికైన పదాలతో చెప్పదలచుకొన్న అభిప్రాయాన్ని చక్కగా తెలిపాడు. తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత రాసిన వాడుగా గుర్తింపు పొందాడు.
ఆ. కాలుష్య నిర్మూలన కార్యకర్తగా అమ్మ పనిచేసింది’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
(లేదా)
అమ్మ కుటుంబంలో పరిశుభ్రతను ఎలా పాటిస్తుంది ?
జవాబు.
కవి తన రచనలో అమ్మను స్వచ్ఛభారత్లో కాలుష్య నిర్మూలనా కార్యకర్తగా చూపాడు. ఇంటి ముందరి ముగ్గులో రంగులద్దిన చీరను చూపాడు. అమ్మ పళ్ళను తెల్లని పాలబలపాలుగా చిత్రీకరించాడు. పిల్లలకు జ్వరం వస్తే ఇంటినే దవాఖానాగా మార్చాడు. దొరల కొట్టంలో బర్లను శుభ్రంచేసి, పెండను తీసే కార్యకర్తగా వర్ణించాడు. అమ్మ పిల్లల పెంపకంలో ఆరోగ్య కార్యకర్తగా చూపాడు.
ఇ. మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంత మాటలో రాయండి.
(లేదా)
మీ అమ్మ ఆలోచనలను, కోరికలను గూర్చి వ్రాయండి.
జవాబు.
మా అమ్మకు తన పిల్లలంటే చాలా ఇష్టం. తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, బాగా ఎదగాలని కోరేది. తన పిల్లలు అందరికంటే బాగా చదివితే ఇష్టం. తన పిల్లలు తన ముందే ఆటలలోను, పాటలలోను బాగా రాణిస్తే ఇష్టం. తన బిడ్డలు తన కళ్ళముందే ఎదుగుతుంటే లోలోపల ఆనందంతో మురిసిపోవడం తన కిష్టం. అమ్మ ఇష్టాలను తీర్చడం కష్టమైనా మా కిష్టం.
ఈ. అమ్మచేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి.
(లేదా)
మీ ఇంట్లో నీ తల్లికి సాయం చేయడంలో నీ పాత్ర ఏమిటి?
జవాబు.
అమ్మ తన బిడ్డలు కష్టపడకూడదని అన్ని పనులు తనే చేసుకుంటుంది. పిల్లలు పెద్దయిన తర్వాత వారే నేర్చుకుంటారని ఏ పనీ మనకు చెప్పదు. మనం ఇంట్లో అన్ని పనుల్లోను ఎంతో కొంత అమ్మకు సాయం చేయాలి. అమ్మకు సాయం చేస్తే అందులో మనకు కూడా పనులు అలవాటవుతాయి. నేర్చుకుంటాము. తృప్తి మిగులుతుంది. అమ్మ శిక్షణలో చేసేపనుల వలన పెద్దయిన తర్వాత మన పనులు మనమే చేసుకోగలుగుతాం. ఒక పని అందరూ చేస్తే ఎవరికీ ఎక్కువ శ్రమ, ఆయాసం ఉండదు. త్వరగా కూడా పూర్తవుతుంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
ప్రశ్న 1.
అమ్మ గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
అమ్మ పరిశుభ్రత : అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులు అద్దిన చీరలా కనిపించేది. నవ్వితే పళ్ళు బలపాల్లా ఉండేవి. పిల్లలకు జలుబుచేస్తే, జ్వరం వస్తే ఇంటినే దవాఖానా (హాస్పటల్)గా మార్చేది. ఒక నర్సులాగా మందు బిళ్ళలు వేసేది. అమ్మ కష్టం : అయ్య పాలు పిండితే అమ్మ దొర కొట్టంలో పెండ తీసేది. భూస్వాముల ఇళ్ళముందు కుందీలో పోసి వడ్లను దంచేది.
అమ్మ అందం : అమ్మ ముక్కు పోగు ఆకాశానికి హత్తుకొన్న నెలవంకలాగా అందంగా ఉంది. అమ్మ ముక్కుపుల్ల ముట్టె మీద ఎత్తిన భూగోళంలా ఉంది. గంటలు గడియారంలోని లోలకంలాగా ఊగేవి. అమ్మకు కాళ్ళకు కడియాలు వేసుకోవడం, మట్టెలు తొడుక్కోవడం చాలా ఇష్టం.
అమ్మ ప్రేమ : అమ్మ రోజంతా పనిచేసి సోలెడు నూకలను చీరకొంగున మూటగట్టి తెచ్చేది. అమ్మ పిల్లలు ఎదురు చూస్తారని ఒడిలో పల్లికాయలు, పెసరకాయలు తెచ్చి పెట్టేది. అమ్మ ఒడి నుండి ఎన్ని తీసుకొన్నా ఇంకా మిగిలే ఉంటాయి. అమ్మ గొప్పదనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యంకాదు.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. మీ అమ్మ బొమ్మ గీయండి. అమ్మ గొప్పతనం తెలిపేటట్లు చిన్న కవిత రాయండి.
అమ్మ ప్రేమ చాలా మధురం
తీయని మాటల సమూహం
చక్కని అందాల సమస్తం
తన పలుకులతో పిల్లలను
ఉత్తమ రత్నాల్లా తీర్చేది అమ్మ
తన శ్రమనంతా కూర్చి
వారి కెలాంటి బాధ, వ్యధ లేకుండా చేసేది అమ్మ
తన శరీరాన్ని స్థానంగా చేసి, అమృత ధారలను పంచి
హాయినీ, ఆనందాన్ని కుటుంబానికిచ్చేది అమ్మ
2. పాఠ్యభాగం ఆధారంగా క్రింది ఖాళీలను పూర్తిచేయండి. (అదనపు ప్రశ్న)
1. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం …………………. లా కన్పించేది.
2. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు …………….తాగేవి.
3. గోవుల ప్రక్కన ……………. ఇంటిముందు ఆడుకొనేవాళ్ళు.
4. చెవుల గెంటీలు గడియారంలోని ……………….. లా ఊగేవి.
5. ……………… అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.
జవాబు.
1. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీర లా కన్పించేది.
2. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్ళు తాగేవి.
3. గోవుల ప్రక్కన ల్యాగల్లా ఇంటిముందు ఆడుకొనేవాళ్ళు.
4. చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యులం లా ఊగేవి.
5. తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.
3. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని గూర్చి నీ స్నేహితురాలికి లేఖ వ్రాయుము.
జవాబు.
ఆదిలాబాద్,
తేది : XXXX.
ప్రియమైన స్నేహితురాలు సరళకు,
నేనిక్కడ కుశలం. నీ కుశలములు తెలుపుము. మా పాఠశాల తెరచి నెలరోజులైంది. బాగా చదువుకుంటున్నాను. నేను నీకు ఈ లేఖలో అమ్మ గొప్పతనాన్ని చెప్పదలచుకున్నాను. అమ్మ జ్ఞాపకాలు పాఠం మా మాష్టారుగారు చెప్పారు. నేను మా అమ్మ గూర్చి చాలా రకాలుగా ఆలోచించాను. అమ్మ ఇంట్లో చాలా ముఖ్యమైన వ్యక్తి. అందరి అవసరాలు తీర్చేది. ఎవరికీ బాధ కలగకుండా, ఏమీ మన నుండి కోరకుండా తన పని తానే చేసుకుంటూ పోతుంది. అమ్మ లేకపోతే ఒక నిముషం గడవదు. అన్నిరకాలా, అందరికీ అవసరమైన వ్యక్తి. మనమంతా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ విలువ తెలుసుకొని మెలగాలి. అక్కడి విశేషాలతో నీవు గూడా లేఖ వ్రాయాలి సుమా!
ఇట్ల
నీ మిత్రురాలు
విమల,
7వ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
ఆదిలాబాద్.
చిరునామా :
కరణం సరళ
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
వరంగల్.
4. కింది ప్రశ్నలకు ఇవ్వబడిన జవాబులలో సరైనదానిని గుర్తించండి.
1. అమ్మ ఇంటిని ఇలా మార్చింది
(అ) కుంపటి
(ఆ) హాస్పిటల్
(ఇ) వంటశాల
(ఈ) పాఠశాల
జవాబు.
(ఆ) హాస్పిటల్
2. అమ్మ ముక్కుపోగు ఇలా ఉంది
(అ) రత్నం
(ఆ) వజ్రం
(ఇ) నెలవంక
(ఈ) కంఠాభరణం
జవాబు.
(ఇ) నెలవంక
3. చెవుల గెంటీలు ఇలా ఊగేవి
(అ) గడియారంలోని పెడ్యులంలా
(ఆ) ఆకాశంలో నక్షత్రాల్లా
(ఇ) ఎద్దు మెడలోని గంటల్లా
(ఈ) మెడలోని రత్నాలహారాల్లా
జవాబు.
(అ) గడియారంలోని పెడ్యులంలా
4. అమ్మ జ్ఞాపకాలు ఇలా ముసురుతాయి
(అ) సినిమా కథల్లాగా
(ఆ) నిద్రలో కలలా
(ఇ) చందమామ బొమ్మల్లాగా
(ఈ) తేనెటీగల్లా
జవాబు.
(ఈ) తేనెటీగల్లా
5. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం ఇలా ఉంటుంది
(అ) రంగవల్లిలా
(ఆ) ముగ్గుల తోరణంలా
(ఇ) అద్దకపు చీరలాగా
(ఈ) రత్నాల హారంలా
జవాబు.
(ఇ) అద్దకపు చీరలాగా
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి.
1. జెండావందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం.
(అ) బయట
(ఆ) లోపల
(ఇ) ముంగిలి
(ఈ) ఇంటిలో
జవాబు.
(ఇ) ముంగిలి
2. మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు.
(అ) గోడకు వేసే సున్నం
(ఆ) బట్టలకు రంగు వేసే విధానం
(ఇ) రంగు వేయడం
(ఈ) రంగు తీసివేయడం
జవాబు.
(ఆ) బట్టలకు రంగు వేసే విధానం
3. బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది.
(అ) కట్ట
(ఆ) గోడ
(ఇ) తీరం
(ఈ) దూరం
జవాబు.
(ఇ) తీరం
2. కింద గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.
(అ) కంచు మోగునట్టు కనకంబు మోగునా?
జవాబు.
కంచం, కాంస్యం
(ఆ) కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది.
జవాబు.
చెవులపిల్లి, శశం, శరభం
(ఇ) అంబా అని తల్లి పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది.
జవాబు.
అమ్మ, తల్లి, మాత
3. కింద గీతగీసిన ప్రకృతి పదాలకు వికృతిపదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.
(అ) కుల్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు.
జవాబు.
కాలువ / కయ్య
(ఆ) ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
జవాబు.
ఆకసం
(ఇ) శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది
జవాబు.
ముఖం
VI. భాషను గురించి తెలుసుకుందాం
ఈ కింది పదాలను విడదీయండి.
(అ) అతడెక్కడ = అతడు + ఎక్కడ
(ఆ) బొమ్మనిచ్చెను = బొమ్మను + ఇచ్చెను
(ఇ) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు
2. ఈ క్రింది పదాలను కలపండి.
(అ) మేన + అల్లుడు = మేనల్లుడు
(ఆ) పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు
(ఇ) ఏమి + అంటివి = ఏమంటివి
ఈ క్రింది పదాలను గమనించండి.
(అ) రాముడు + అతడు = రాముడతడు = ఉ + అ = అ
(ఆ) సోముడు + ఇతడు = సోముడితడు = ఉ + ఇ = ఇ
(ఇ) మనము + ఉంటిమి = మనముంటిమి = ఉ + ఉ = ఉ
(ఈ) అతడు + ఎక్కడ = ఉ + ఎ = ఎ = అతడెక్కడ
మొదటి పదంలోని చివరి అచ్చు ‘ఉ’, రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినపుడు మొదటి పదంలోని అచ్చు (ఉ) లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ‘ఉత్త్వసంధి’ అంటాం. ‘ఉ’ కారాన్ని ఉత్తు అంటారు. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది.
4. ఈ కింది పదాలను కలిపి రాయండి.
(అ) చెట్టు + ఎక్కి= చెట్టెక్కి
(ఆ) వాడు+ఎక్కడ = వాడెక్కడ
ఇ) ఎదురు + ఏగి = ఎదురేగి
5. ఈ క్రింది పదాలను విడదీయండి.
(అ) నూకలేసుకొని = నూకలు + ఏసుకొని
(ఆ) చూరెక్కి = చూరు + ఎక్కి
(ఇ) ఎట్లున్నది = ఎట్లు + ఉన్నది
ప్రాజెక్టు పని:
1. ఒకరోజు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు అమ్మను గమనించండి. ఏమేమి పనులు చేసింది? ఆయా పనులు చేసేటప్పుడు ఆమె ఎట్లా ఉన్నది? మీకేమనిపించింది? ఈ వివరాలతో నివేదిక రాయండి.
జవాబు.
ఉదయం : అమ్మ ఉదయం 5 గంటలకే నిద్రలేచింది. తన పనులు చేసుకొన్న తర్వాత పిల్లలకు, భర్తకు ఆ రోజు ఏయే పనులు చేయాలో నిర్ణయించుకొన్నది. ఉదయం పిల్లలకు పాలిచ్చింది. ఆకలికి ఉండలేరని చద్ది అన్నంలో పచ్చడి/పెరుగు కలిపి పిల్లలకు ఆహారంగా పెట్టింది. వంటలో ఏమేమి వండాలో నిర్ణయించి తరిగింది. భర్తకు అల్పాహారం తయారుచేసి పెట్టింది. ఉతకవలసిన బట్టలు ఉతికి ఆరవేసింది. ముందరిరోజు అంట్లు తానే తోముకుంది. పిల్లలకు ఉతికిన బట్టల వేసి పాఠశాలకు పంపింది.
మధ్యాహ్నం : 1గంటకు ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి కావలసిన ఆహార పదార్థాలు వండి సిద్ధం చేసింది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకొంది. మధ్యాహ్నం పిల్లలు, భర్త రాగానే వారికి అందరికీ ప్రేమతో పెట్టి పంపించింది. అన్ని పనులు తానే చేసుకోవడం వలన కొంత అలసిపోయింది.
సాయంత్రం : గం 5.30లకు బడి నుండి పిల్లలు, ఆఫీసు నుండి భర్త రావడానికి ముందే వారి ఆకలి తీర్చడానికి అల్పాహారం తయారుచేసింది. ఉతికిన బట్టలు మడతపెట్టింది. సాయంత్రం వారిని కొంతసేపు ఆడుకొనిన తర్వాత వారిని పాఠశాల ఇంటిపని చేయడానికి సిద్ధం చేసింది. వారితో పాఠాలు చదివించింది.
రాత్రి : 8.30లకు పిల్లలకు, భర్తకు మరల కావలసిన పదార్థాలు సిద్ధం చేసి వారికి పెట్టి తాను తిని, పిల్లలు, భర్త ముఖంలోని తృప్తిని చూచి తాను ఆనందంతో, అలసిన దేహంతో చక్కగా నిద్రపోయేది. మాకోసం శ్రమపడే మా అమ్మను చూస్తే మా కెంతో ఇష్టం.
విశేషాంశాలు:
ఆయుర్వేదం : వనమూలికల ఔషధాల ద్వారా చికిత్సచేసి ఆయుష్షును పెంచే వైద్యవిధానం ఇది.
జమీందారు : జమీన్ అంటే ఉర్దూభాషలో భూమి అని అర్థం. భూమితోపాటు పాలనాధికారాలు కూడా వీరి సొంతం. వీరినే భూస్వాములు అంటారు.
వరాహావతారం : దశావతారాల్లో మూడో అవతారం. హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి వధించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే వరాహావతారం.
TS 7th Class Telugu 4th Lesson Important Questions అమ్మ జ్ఞాపకాలు
ప్రశ్న 1.
‘అమ్మ జ్ఞాపకాలు’ పాఠం ద్వారా నీవేం తెలుసుకున్నావు?
జవాబు.
‘అమ్మ జ్ఞాపకాలు’ పాఠం ద్వారా అమ్మ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, తన సేవలను కుటుంబం కోసం ఎలా చేస్తుందో తెలుసుకొన్నాను. దేవుడు తనరూపం అంతటా ఉండాలని అమ్మను సృష్టించాడు. చిన్నతనంలో అమ్మపట్ల ప్రేమను, విలువను పెంచే విధానాన్ని మాకు తెలిపాడు. తల్లికి కుటుంబంలో విలువను, స్థానాన్ని తెలిపాడు. పిల్లల అవసరాలను తీర్చడంలో తల్లి ఎంత తపన పడుతుందో వారికి తేనెవంటి తీయని మాటలు, ప్రవర్తన, స్పర్శ మొ॥ విషయాలు మాకు జీవితమంతా గుర్తుండేటట్లు, మనసులలో నాటుకొనేటట్లు చెప్పాడు.
లోకంలోని గొప్పవారైన సీతమ్మ, ఆదిశంకరులు శివాజి, గాంధీజీ మొ॥ వారంతా తల్లి ఇచ్చిన స్ఫూర్తితో గొప్పవారైన వారే! తల్లి ఎలాంటి ప్రేరణ ఇస్తుందో పిల్లలు అలా తయారౌతారని ఈ పాఠం నేర్పుతోంది. ఆణిముత్యాల వంటి రత్నాలు ప్రపంచంలోకి రావాలంటే తల్లి ప్రత్యేకత ఈ కవిత తెలుపుతోంది. అమ్మ గొప్పతనం మాటలకు అందనిది. అమ్మ విలువ ఉన్నప్పటి కంటే, లేనప్పుడు ఇంకా తెలుస్తుంది. తేనెటీగలు తేనెకోసం పూల చుట్టూ తిరిగినట్లు అమ్మజ్ఞాపకాల మాధుర్యం మన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.
పర్యాయపదాలు:
- అమ్మ = మాత, తల్లి, జనని
- దూడ = లేగ, (కేపు, పెయ్య)
- పాలు = క్షీరము, పయస్సు, దుగ్ధము
- అయ్య = తండి, నాన్న, పిత
- ముక్కు = నాసిక, ఘ్ణము
- ఇల్లు = గృహము, నివాసము
- గోవు = ఆవు, ధేనువు
- ఆనందం = సంతోషం, హాయి, సుఖం
- పొద్దున = ఉదయం, ఉషఃకాలం
- కుందేలు = చెవులపిల్లి, శశం
ప్రకృతి – వికృతి:
- (ప్రకృతి – వికృతి
- ధర్మము – దమ్మము
- కుడ్యము – గోడ
- పక్షి – పక్కి
- ముఖం – మొగం
- ఆకాశం – ఆకసం
- రాత్తి – రేయి, రాతిరి
- సంతోషం – సంతసం
- కవిత – కైత
సంధులు:
నవ్వుతున్నప్పుడు | నవ్వుతు + ఉన్నప్పుడు | ఉత్వసంధి |
మీకేమి | మీకు + ఏమి | ఉత్వసంధి |
నూకలేసుకొని | నూకలు + ఏసుకొని | ఉకారసంధి |
చంద్రాకారము | చంద్ర + ఆకారము | సవర్ణదీర్ఘసంధి |
మహాత్ముడు | మహా + ఆత్ముడు | సవర్ణదీర్ఘసంధి |
చూరెక్కి | చూరు + ఎక్కి | ఉకారసంధి |
జె్టై | చెట్టు + ఎక్కి | ఉకారసంధి |
ఎదురేగి | ఎదురు + ఏగి | ఉకారసంధి |
అతడెక్కిన | అతడు + ఎక్కిన | ఉకారసంధి |
రామయ్య | రామ + అయ్య | అత్వసంధి |
మాటలకందనిది | మాటలకు + అందనిది | ఉత్వసంధి |
సమాసాలు:
ఉచ్ఛ్రాస నిశ్వాసాలు | ఉచ్ఛ్రాసము మరియు నిశ్వాసము | ద్వంద్వ సమాసం |
పదాలు అర్థాలు | పదాలు మరియు అర్థాలు | ద్వంద్వ సమాసం |
లవకుశులు | లవుడు మరియు కుశుడు | ద్వంద్వ సమాసం |
పేరు ప్రఖ్యాలులు | పేరు మరియు ప్రఖ్యాతి | ద్వంద్వ సమాసం |
వీరులు, శూరులు | వీరులు మరియు శూరులు | ద్వంద్వ సమాసం |
మూడడుగులు | మూడు అను సంఖ్యగల అడుగులు | ద్విగు సమాసం |
ద్వంద్వ సమాసం :
సూత్రం : సమాసపదంలో రెండు పదాలు ప్రధానమై ఉన్న ఆ సమాస పదం ద్వంద్వ సమాసం అవుతుంది.
ద్విగుసమాసం :
సూత్రం : సమాసపదంలో మొదటి పదం అంకెను తెలుపు పదం ఉంటే అది ద్వీగు సమాసం ఔతుంది.
1. క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించి రాయండి.
(అ) ఆవు సాధుజంతువు. గోవుపాలు పిల్లలకు చాలా మంచిది. ధేనువులను హిందువులు పూజిస్తారు.
జవాబు.
ఆవు, గోవు, ధేనువు
(ఆ) మా నాన్నగారు మాకు పూజనీయులు. తండ్రి ఇంటిలోని వారికి అన్నీ సమకూరుస్తాడు. మా అయ్యను విడచి ఉండలేము.
జవాబు.
నాన్న, తండ్డి, అయ్య
(ఇ) ప్రతివారికి ఇల్లు చాలా అవసరం. గృహం కొనాలంటే చాలా డబ్బు కావాలి. నివాసం శాంతంగా ఉండాలంటే అందరూ కలసి ఉండాలి.
జవాబు.
ఇల్లు, గృహము, నివాసం
(ఈ) గాలి ముక్కుతోనే పీల్చాలి. నాసికలోని నరాలు సున్నితంగా ఉంటాయి. మనం ఎలాంటి వాసననైనా పసికట్టడానికి ఘ్రాణం అవసరం.
జవాబు.
ముక్కు, నాసిక, ఘాణం
(ఉ) నా పుట్టిన రోజున ఆనందంగా గడుపుకొంటాను. సంతోషాన్ని నల్గురితోను పంచుకోవాలి. మనం సుఖంగా ఉండాలంటే ఇతరులను గూడా హాయిగా ఉంచాలి.
జవాబు.
ఆనందం, సంతోషం, సుఖం
2. క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి వేరుగా వ్రాయండి.
(అ) రాముడు ధర్మమును ఆచరించెను. దమ్మము తప్పనివారు ఎపుడూ గెలుస్తారు.
జవాబు.
ధర్మము – దమ్మము
(ఆ) పక్షి రెక్కల సాయంతో ఎగురును. పక్కి తన పిల్లలకు ముక్కుతో ఆహారాన్ని అందించును.
జవాబు.
పక్షి – పక్కి
(ఇ) ఆకాశంలో విమానం ఎగురుతోంది. ఆకసంలో ఇంద్రధనుస్సు ఏర్పడును.
జవాబు.
ఆకాశం – ఆకసం
(ఈ) కవులు కవితలు రాస్తారు. కైతలో విషయం ఉంటేనే అందరూ చదువుతారు.
జవాబు.
కవిత – కైత
(ఉ) రాత్రిళ్ళు బయట తిరగరాదు. అడవిలో రాతిరిపూట అంతా చీకటిగా ఉంటుంది.
జవాబు.
రాత్తి – రాతిరి
3. క్రింది వాక్యాలలోని గీతగీసిన సంధిపదాలను విడదీసి, సంధి పేరు గుర్తించండి.
(అ) సీత ముఖం చంద్రాకారం లో ఉంది.
జవాబు.
చంద్రాకారం = చంద్ర + ఆకారం – సవర్ణదీర్ఘసంధి
(ఆ) కమల నవ్వుతున్నపుడు అందంగా ఉంటుంది.
జవాబు.
నవ్వుతున్నపుడు = నవ్వుతు + ఉన్నపుడు- ఉత్వసంధి
(ఇ) మహాత్ముల రచనలు చదవాలి.
జవాబు.
మహాత్ములు = మహా + ఆత్ములు – సవర్ణదీర్ఘసంధి
(ఈ) పెద్దవారు వచ్చినపుడు ఎదురేగి గౌరవించాలి.
జవాబు.
ఎదురేగి = ఎదురు + ఏగి – ఉత్వ సంధి
(ఉ) గోపి చెట్టెక్కి కాయలు కోస్తున్నాడు.
జవాబు.
చెట్టెక్కి = చెట్టు + ఎక్కి – ఉత్వ సంధి
(ఊ) రామయ్య మాటలు చాలా వినాలనిపిస్తుంది.
జవాబు.
రామయ్య = రామ + అయ్య – అత్వసంధి
4. క్రింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు విగ్రహవాక్యాలు వ్రాసి సమాసాలు గుర్తించండి.
(అ) సీతారాముల పిల్లలు లవకుశులు
జవాబు.
లవకుశులు – లవుడు మరియు కుశుడు – ద్వంద్వ సమాసం
(ఆ) మా ఇల్లు పదిగజాల దూరంలో ఉంది.
జవాబు.
పదిగజాలు – పది అను సంఖ్య గల గజాలు – ద్విగు సమాసం
(ఇ) వేసవిలో కూరగాయల ధర ఎక్కువ.
జవాబు.
కూరగాయలు – కూర మరియు కాయలు – ద్వంద్వ సమాసం
(ఈ) తల్లిదండ్రులను గౌరవించాలి.
జవాబు.
తల్లిదండ్డులు – తల్లి మరియు తండ్డి – ద్వంద్వ సమాసం
(ఉ) బ్రహ్మవిష్ణుమహేశ్వరులను త్రిమూర్తులు అంటారు.
జవాబు.
త్రిమూర్తులు – త్రి అను సంఖ్యగల మూర్తులు – ద్విగు సమాసం
5. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అమ్మ జ్ఞాపకాలు పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఆంగ్లంలో దీనిని ‘Free Verse’ అంటారు. వచన శైలిలో రాసే ఈ విధానాన్ని వచన కవితగా పిలుస్తున్నాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన ‘శబ్నం’ కవితా సంపుటిలోనిది. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి, సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన సామాజిక కవి టి.కృష్ణమూర్తి యాదవ్. కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. తన తొలి కవితా సంపుటి “తొక్కుడుబండ”తో సాహితీక్షేత్రంలో ప్రవేశించాడు. “శబ్నం” వీరి రెండవ కవితా సంపుటి.
(అ) అమ్మ జ్ఞాపకాలు రచయిత పేరు ?
జవాబు.
టి. కృష్ణమూర్తి యాదమ్
(ఆ) వచన కవితను ఆంగ్లంలో ఏమంటారు ?
జవాబు.
Free Verse
(ఇ) అమ్మ జ్ఞాపకాలు ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది ?
జవాబు.
శబ్నం
(ఈ) కవి తొలి కవితా సంపుటి పేరేమి?
జవాబు.
తొక్కుడుబండ
(ఉ) పాఠ రచయిత ఏ జిల్లాకు చెందినవాడు?
జవాబు.
కరీంనగర్
6. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి. (అదనపు ప్రశ్న)
ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని తెలుగు నేలను గొప్ప స్థితిలో ఉంచిన కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అతడు మంచి పరిపాలకుడేకాదు. మానవ ధర్మం, కళాధర్మం తెలిసిన సాహితీవంతుడు. తెలుగు, సంస్కృత భాషలలో పండితుడు. సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పకళలకు గౌరవమిచ్చాడు. అతడికి ఉన్న బలహీనత జంతువులను వేటాడం.
1. కాకతీయ రాజులలో చివరివాడు ఎవరు?
2. రెండవ ప్రతాపరుద్రుని సా|మాజ్యానికి రాజధాని నగరం ఏది?
3. ప్రతాపరుద్రునికి ఏ భాషలలో పాండిత్యం ఉంది?
4. పతరపరరుద్రుడు గౌరవించే కళలు ఏవి?
5. అతని బలహీనతలు ఏవి?
కవిత – అర్దాలు
1. అమ్మ ముగ్గులేస్తే
ప్రాంగణం అద్దకపు చీరలా కన్పించేది
చాయ నలుపు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు
పండ్లు పాలబలపాల్లా కన్పించేవి
మాకు పడిషంపట్టి జ్వరమొచ్చినపుడు
అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది
తానే నర్సయి మంచాల చుట్టూ తిరుగుతూ
ఆయుర్వేదపు మందుబిళ్ళలేస్తూ ఉండేది
పొద్దున్నే అయ్య
దొరల బర్లపాలు పిండేవాడు
కాలుష్య నిర్మూలన కార్యకర్తలా
అమ్మ కొట్టంలో పెండకళ్ళు తీసేది
దూడల నోళ్ళుకొట్టి పితికినపాలు
ఆస్థానపు తెల్లకుందేళ్ళు తాగేవి
అమ్మ ముక్కుకు ముక్కుపోగు
ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది.
అర్దాలు
ప్రాంగణం = ఇంటి ముందరి భాగం
పడిషం = జలుబు
దొరలు = డబ్బున్నవారు
బర్లు = పాడిఆవులు, గేదెలు
పెండకళ్ళు = పేడ
నెలవంక = చందమామ
II. జమీందారు ఇండ్లముందు కుందెనలో వడ్లు పోసి
రోకలితో దంపుతున్నప్పుడు మద్దెల దరువులిన్పించేది
అమ్మ ఒడిలో సోలెడు నూకలేసుకొని ఇంటికి వచ్చేది
గోవుల పక్కన ల్యాగల్లా ఇంటిముందు ఆడుకునేవాళ్ళం
అమ్మ ముక్కుపుల్ల వరహావతారం
ముట్టెమీద ఎత్తిన భూగోళంలా కన్పించేది
చెవుల గెంటీలు
గడియారంలోని పెండ్యూంలా ఊగేవి
అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని కోతలకు పోయేది
కాల్వగట్ల పొంటి కాళ్ళు కడుక్కొని
(శమను మరచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు
కేరింతలు కొడ్యూ ఎదురేగేహ్ళ్రం
గుమ్ముల్లో వడ్లున్నట్టే మాకోసం
అమ్మ ఒడిలో పల్లికాయలు, పెసరకాయలు దొరకేవి
అమ్మకు కాళ్ళకడియా లేసుకోవడం
కంచు మట్టెలు తొడుక్కోవడమంటే చాల ఇష్టం
అమ్మ ఎప్పుడూ పట్టుచీరలు కట్టుకోనూలేదు
పరుపుల్లో నిదపోనూ లేదు
నులక మంచంమీద నిద్ర
చేనేత చీరలతోనే కాలం గడిపేది
సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినపుడు
తేనెటగల్లా అమ్మ జ్ఞాపకాలు
నా చుట్టూ ముసురుతాయి.
అర్దాలు
కుందెన = కుంది (రోలు లాంటిది)
వడ్లు = బియ్యం మొదటి ఆకారం
దరువులు = శబ్దాలు
ల్యాగ = లేగదూడ
సోల = పూర్వకాలపు కొలమానం
ముట్టె = పందిముక్కు
వరాహం = పంది
పెండ్యాలం = ముల్లు
అంబలి = = రాగులపిండితో వండిన ద్రవాహారం
మట్టె = పెళ్ళి అయినవారు కాలి రెండవ వేలికి ధరించే ఆభరణం
గుమ్మి = ఎపుడూ ఖాళీ కాని రాశి (అమ్మ ఒడి)
పాఠ్యభాగ ఉద్దేశం:
అమ్మంటే (పేమ. అమ్మంటే ఆప్యాయత. అమ్మంటే అనురాగం. అమ్మ నిరంతరం తన కుటుంబం కోసం సేవలు చేస్తుంది. దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మను స్ష్టించాడు. అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ, అమ్ము సేవలను, అమ్మ (ప్రాధాన్యతను, విలువలను తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం వచన కవిత (ప్రక్రియకు చెందినది. తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య (ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీనిని ‘Free Verse’ అంటారు. పద్యగేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. వచనశైలిలో రాసే ఈ విధానాన్ని వచన కవితగా పిలుస్తున్నాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన ‘శబ్నం’ కవితా సంపుటిలోనిది.
కవి పరిచయం:
కవి : టి. కృష్ణమూర్తి యాదవ్.
కాలం : 1914 – 1985.
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా, భీమదేవరపల్లి.
రచనలు : ఈయన తన తొలి కవితా సంపుటి “తొక్కుడు బండ”తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. ‘శబ్నం’ వీరి రెండవ కవితాసంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి.
రచనా శైలి : సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత.
ప్రవేశి :
అమ్మంటే ఆత్మీయత అనురాగాల కలబోత. అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటలకందనిది. కుటుంబంకోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితరసాధ్యం. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి ఎట్లా వర్ణించాడో చూద్దాం.