TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు Textbook Questions and Answers.

TS 10th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 13)

తెలంగాణ భాషంతా ‘తౌరక్యాంధ్ర’మని ఎవడో అన్నడు. అంత అగ్వకున్నదా తెలంగాణ భాష ? ఇక సహించవద్దు. అందుకనే నేను గిట్లనే మాట్లాడ, గిట్లనే రాస్త అని జిద్దుకు రాయాలె. జిద్దేంది అసలు మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్ళల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషల్నన్న నువ్వు రాసే ధైర్నం జేయి.

మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలె, దానికి, బాస చాన ముఖ్య మయింది. ఎవని యాసల, ఎవని భాషల వాడు రాయాలె. తెలుస్తదా అన్నది లేనే లేదు. మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించు కోవాలె. ఇట్లరాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు – ఒకటి బడిపలుకుల భాష రెండోది పలుకుబడుల భాష పలుకుబడుల భాషగావాలె.
– కాళోజి నారాయణరావు

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలోని మాటలు ఎవరన్నారు?
జవాబు:
కాళోజి నారాయణరావు గారు అన్నారు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 2.
ఇట్లా ఎందుకు అని ఉంటాడు ?
జవాబు:
తెలంగాణ భాషను ఎవరో ‘తౌరక్యాంధ్ర’మని అన్నారు. దానితో కాళోజీగారికి చాలా కోపం వచ్చింది. ఎవరైనా తమ భాషను, యాసను, పలుకుబడిని చాలా ఇష్టపడతారు. తాము ఉగ్గుపాలతో నేర్చిన భాషను ఎవరైనా హేళన చేసినా, కించపరిచినా, విమర్శించినా సహించలేరు. అందునా కవులకు, రచయితలకు భాషాభిమానం, ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అందుకే కాళోజీగారు అలా అని ఉంటారు.

ప్రశ్న 3.
ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడడం, రాయడం అంటే ఏమిటి ?
జవాబు:
ఎవరి భాషలో వాళ్లు మాట్లాడడం, రాయడం అంటే తమ మాతృభాషలో వ్యవహరించడం. తల్లి నుండి ఉగ్గుపాలతో నేర్చుకొన్న భాషను మాతృభాష అంటారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పరిసరాల వారూ, స్నేహితులు మొదలైన వారు ఉపయోగించే భాష, యాస, పదజాలం, మాండలి కాలు మొదలైనవి ఎవరికైనా ఇష్టంగా ఉంటాయి. అంటే అది వారి వ్యవహారభాష. ఎవరి వ్యవహార భాషలో వారు మాట్లాడడం, రాయడం చేస్తే ఆనందంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది.

ప్రశ్న 4.
ఎవరి భాష వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది ?
జవాబు:
ఎవరి భాష వాళ్లకు చాలా మధురంగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. తియ్యగా ఉంటుంది. పద ప్రయోగంలో సౌఖ్యంగా ఉంటుంది. ఎవరి భాష వాళ్లకు తల్లిలా అనిపిస్తుంది. తమ మాండలిక పదజాలానికి తాము గర్వంగా అనుభూతి చెందుతారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 17)

“తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని ……… ఉద్యోగ విరమణ చేసినారు.

ప్రశ్న 1.
“ఏ ప్రాంతపు వాళ్ల తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది” సమర్థించండి.
జవాబు:
ఎవరి ప్రాంతంలో వారు అయినా, ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు, జాతీయాలు, నుడికారాలు, పలుకుబడులు తాము ఉపయోగించే భాషలో ప్రయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ తెలుగు భాషనే మాట్లాడతారు. కాని, రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాకు ‘యాస’ మారి పోతుంది. ఉపయోగించే మాండలికాలు మారి పోతాయి. ఇతర ప్రాంతాల మాండలికాలు, కొన్ని పదాలు అర్థం కావు.

అందుచేత అవి కొత్తగా ఉంటాయి. తమ ప్రాంతపు మాండలికాలపైనా, భాషపైనా, యాసపైనా పట్టు ఉంటుంది. అందుచేత ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది.

ప్రశ్న 2.
రచయిత కొందరు పండితులను గురు స్థానీయులని చెప్పాడు. గురువులనగానే వాళ్ళలో ఏయే ప్రత్యేకత లుండాలని మీరు ఆశిస్తున్నారో తెలుపండి.
జవాబు:
‘మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ’ అని గురువుకు తల్లిదండ్రులతో సమాన స్థానం ఇచ్చారు. గురువును దైవంగా భావించే సంప్రదాయం మనది.

అటువంటి గురువు ఆదర్శవంతంగా ఉండాలి. సమయానికి పాఠశాలకు రావాలి. విద్యార్థులకు అర్థం అయ్యేలా ప్రతి పాఠం చెప్పాలి. అబద్ధం ఆడకూడదు. కోప్పడకూడదు. మంచి మంచి కథలు చెప్పాలి. మా గురువుగారిలా ఉండాలి.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
‘పసందైన ప్రాంతీయ భాష’ – దీనిని ఎట్లా అర్థం చేసుకున్నారో వివరించండి.
జవాబు:
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితులు. వారు కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. అటువంటి శాస్త్రిగారు, తిరుమల రామచంద్రగార్కి తిరుపతి లడ్డు ఇస్తూ, “వారీ రామచంద్రా” అని సంబోధించి ‘ఇగపటు’ అనటం వింతగా అనిపిస్తుంది. అయితే ‘ఇగపటు’ అనగా ‘ఇదిగో తీసుకో” అని అనడం, వారీ రామచంద్రా అని పిలవడం, లక్ష్మణశాస్త్రిగార్కి పసందైన వారి ప్రాంతీయ భాషపై, వారికి గల అభిమానాన్ని తెలియపరుస్తాయి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 17)

మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం ……….. ప్రభుత్వం జప్తు చేస్తుంది.

ప్రశ్న 1.
“వారి రాతలోను, మాటలోను ప్రాంతీయత కనిపించేది” దీని గురించి చర్చించండి.
జవాబు:
మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కల్గి ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డిగారిది కూడా మహబూబ్నగర్ జిల్లానే. వారి రాతలోనూ, మాటలోనూ మహబూబ్నగర్ జిల్లా ప్రాంతీయత కన్పించేది. వారి స్వగ్రామం నీళ్ళులేని ఇటిక్యాలపాడు.

ప్రశ్న 2.
‘ఏకలవ్య శిష్యుడ’నే పదంలోని అంతరార్థాన్ని వివరించండి.
జవాబు:
కౌరవ పాండవులకు ద్రోణాచార్యుడు విలువిద్యలు నేర్పాడు. కాని, ఆయనకు పాండవులంటే ఇష్టం. అందులోను తను చెప్పినది చెప్పినట్లు చేర్చుకొనే అర్జునుడు అంటే చాలా ఇష్టం. అర్జునుడిని మహావీరుడిగా తయారుచేయాలని విలువిద్యలు నేర్పుతున్నాడు.

ఇంతలో ‘ఏకలవ్యుడు’ అనే గిరిజన బాలుడు తనకూ విలువిద్యలు నేర్పమన్నాడు. కాని, ద్రోణుడు నేర్పను అన్నాడు. అయినా ఏకలవ్యుడు తన పంతం విడిచి పెట్టలేదు. ద్రోణుని బొమ్మను తయారు చేసుకొన్నాడు. దానిని గురువుగా చేసుకొని విలువిద్యలు తనకు తానే సొంతంగా నేర్చుకొన్నాడు. అర్జునునితో సమానమైన వీరుడయ్యాడు. అందుచేత గురువు దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోకపోయినా, ఆయనపై గురుత్వ భావన ఉంచి నేర్చుకొనే వారిని ఏకలవ్య శిష్యులు అంటారు.

ప్రశ్న 3.
“పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాలవంటివి “ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
పలుకుబడి : పలుకుబడి అంటే ‘నుడి’, అంటే మాట్లాడబడేది. మాట్లాడబడేది భాష, భాషకు ‘యాస’ ప్రధానం. మాండలికాలు, ఆయా ప్రాంతాలలో ఉపయోగించే స్థానిక పదజాలం పలుకుబడి అనవచ్చు. ఈ పలుకుబడి వలన భాషకు చాలా అందం వస్తుంది. వినసొంపుగా ఉంటుంది. ఇది వినగానే ఆనందం కలుగుతుంది.

నుడికారం : చమత్కారాన్ని నుడికారం అంటారు. ఎవరి భాషలోని చమత్కారాలు వారికే బాగా తెలుస్తాయి. చమత్కారం వలన కూడా భాషకు చాలా అందం వస్తుంది. చమత్కారంగా మాట్లాడే వారంటే ఎవరికైనా ఇష్టమే కదా ! ఇది కొద్దిగా ఆలోచిస్తేనే ఆనందం కలుగుతుంది.

జాతీయం : ఒక భాషను ఉపయోగించే వారందరికీ ఆనందాన్ని కలిగించేవి జాతీయాలు. వాటి పూర్వకథలు తెలియకపోతే ఆనందం కలగదు. అంటే బాగా పరిజ్ఞానం ఉంటేనే ఆనందం కలుగుతుంది. ఉదాహరణకు భగీరథ ప్రయత్నం, శ్రీరామరక్ష . మొదలైనవి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 18)

ఆడవాళ్ళ నోట అసలైన భాష
మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ ……… విశేషమే కదా !

ప్రశ్న 1.
“మొదలు మీకళ్లకు నీళ్లు పెట్టుకోండి” అని మరాఠీ పురోహితుడు అన్నాడు గదా! మీ నిత్యజీవితంలోని ఇట్లాంటి సంఘటనలను వివరించండి.
జవాబు:
భాష చాలా విలువైనది. పద ప్రయోగాలు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. నేను అందర్ని ఒక సభలో రండి, రండి అని పిలుస్తున్నాను. (అనగా రమ్మని అర్థం) అది రండలాగా ఒక ముస్లింకు వినబడింది. అతను వెంటనే కోపంతో ఎగిరాడు. “రండ” అంటే ఉర్దూలో తప్పు అర్థం అని తెల్సింది. అతను నా స్నేహితుడే అవ్వటం వల్ల సమస్య సమసిపోయింది.

ప్రశ్న 2.
“ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం” దీన్ని సమర్థిస్తూ చర్చించండి.
జవాబు:
సాధారణంగా పిల్లలంతా ‘అమ్మ’ నుండే మాట్లాడడం నేర్చుకొంటారు. స్త్రీలు ఇంటి వద్ద ఉండి ఎక్కువ మందితో మాట్లాడతారు. మగవారి కంటే స్త్రీలు నుడికారాలు, పలుకుబళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారు. ప్రాంతీయమైన మాండలికాలు ఎక్కువ ఉపయోగిస్తారు. అందుకే అసలైన భాషను ఆడవాళ్ళ నోటనే వినగలం.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
కవిసమ్మేళనం అంటే మీకు తెలుసా ? ఎపుడైనా కవి సమ్మేళన సభలో పాల్గొన్నారా ? మీ అనుభవాన్ని తెలుపండి.
జవాబు:
కవులయొక్క కూడిక, తమ అభిప్రాయాలను, తమ రచనలను చర్చించే వేదిక “కవి సమ్మేళనం”. నాకు తెలుసు. నేను “రవీంద్ర భారతి”లో చూశాను. స్నేహితులందరం కలిసి కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. మా తెలుగు పంతులుగారి ఆధ్వర్యంలో దానిని నిర్వహించాము. చాలా బాగుంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 20)

“ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి ……… సామాన్య ప్రజలతోనే” అని.

ప్రశ్న 1.
“నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని రచయిత అనడంలో ఆంతర్య మేమిటి?
జవాబు:
ఒక షేర్లో “ఖాస్ – ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమయినది. దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపద లోనో, హోదా లోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. కవి ఏమంటున్నాడంటే “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు -కాని నేను మాట్లాడు తున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని దీని అర్థం.

ప్రశ్న 2.
“పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషవేరు. బళ్లో చదివే భాషవేరు.” అనడం నిజమా ? కాదా ? కారణాలు చర్చించండి.
(లేదా)
తెలుగు “పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషవేరు. బళ్లో చదివే భాషవేరు.” అనే వాక్యాలు మీరు సమర్థిస్తారా ? ఎందుకు ? (June 2017)
జవాబు:
వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు, మాండలిక భాషలు వచ్చాయి. గ్రాంథిక భాష రాసేకాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులు కాబట్టి వ్యావహారికం గూర్చి మాట్లాడేవారు. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బళ్ళో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాషవేరు. ఇది చాలా ఘోరం. వ్యావహారిక భాషావాదం వచ్చాక ఇది సమసిపోయింది. ఇది వాస్తవం.

ప్రశ్న 3.
ప్రాంతీయ భాషా భేదాలను ఎట్లా సరిచేసుకోవాలి ? మాట్లాడండి.
జవాబు:
మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటం కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకోవటం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఉంటుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది అంశాలను గూర్చి చర్చించండి.

అ) మన తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడండి. ఐతే ఒక్క ఆంగ్లపదం కానీ, హిందీ, ఉర్దూ ….. ఇలా ఇతర భాషాపదాలు వాడకుండా మాట్లాడాలి. ప్రయత్నం చేయండి. ఎవరు బాగా మాట్లాడుతారో చూద్దాం.
జవాబు:
నేను లంగర్ హౌజ్ పాఠశాలలో చదువుచున్నాను. ఒకసారి మా పాఠశాలలో “ఒక నిమిషం” అనే కార్యక్రమం నిర్వహించారు. మా తరగతిలో అందరూ మాట్లాడటానికి ప్రయత్నించారు. నేను బాగా మాట్లాడానని నాకు బహుమతి ఇచ్చారు. ఆ కార్యక్రమానికి పోలీస్ కమీషనర్గారు వచ్చారు. ఒక్క ఆంగ్ల, ఉర్దూ, హిందీ పదం రాకుండా అచ్చ తెలుగులో మాట్లాడాను. మీరూ
ప్రయత్నించండి.

ప్రశ్న 2.
క్రింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.

గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్
పర్ మెరీ గుప్తగూ అవామ్ సేహై
“ఖాస్ – ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాన్ అంటే ప్రత్యేకమైనది. (స్పెషల్) దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు (కామన్ పీపుల్), కవి ఏమంటున్నాడంటే, “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని.

ప్రశ్నలు

అ) ‘ఖాస్ అనే ఉర్దూ పదానికి అర్థం
ఎ) కవిత
బి) ప్రత్యేకమైన
సి) సాధారణమైన
డి) సామాన్యం
జవాబు:
బి) ప్రత్యేకమైన

ఆ) సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు ?
ఎ) అవామ్
బి) ఆమ్
సి) ఖాస్
డి) ఖవాస్
జవాబు:
బి) ఆమ్

ఇ) నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ జేస్తున్నారు. క్రింద గీత గీసిన పదానికి సమానార్థక ఉర్దూపదం.
ఎ) సంబంద్
బి) అవామ్
సి) ఖవాస్
డి) పసంద్
జవాబు:
సి) ఖవాస్

ఈ) పై కవితలో కవి ఎవరి భాషను ఉపయోగించాడు ?
ఎ) గ్రాంథికభాష
బి) ఉర్దూభాష
సి) ప్రజలభాష
డి) ఏవీకాదు
జవాబు:
సి) ప్రజలభాష

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
క్రింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాష. కాని ఏదో ఒక కులానికో, మతానికో చెందిన భాష కాదన్నారు ప్రొఫెసర్ రఫియా సుల్తానా. ఆ తరం వాళ్లందరూ అట్లాగే అనుకున్నారు. ఇప్పటికీ ఉన్న ఆ తరం వాళ్లు అట్లాగే అనుకుంటున్నారు. అందుకే నా ముచ్చట్లలో ఉర్దూతో మాకు గల సంబంధాన్ని యాది చేసుకుంటున్నాను.

మా చదువు ఉర్దూ మీడియంలో జరిగింది. హెడ్మాస్టర్ అన్వరుద్దీన్ సాహెబు. ఉర్దూ చెప్పే మౌల్వీ సాహెబులు ఇద్దరో, ముగ్గురో ఉండేవాళ్లు. అయితే, పై తరగతిలో చదివే మాకు రామనాథరావుసార్ ఉర్దూ చెప్పేవారు. వారు మంథెన బ్రాహ్మణులు. ఎఫ్.ఎ. (ఇంటర్మీడియట్) చదివిన ఆ సారుకు తెలుగు, సంస్కృతం, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో మంచి పాండిత్యం వుండేదనేవాళ్లు.

ఉర్దూలో ఏదో పెద్ద పరీక్ష పాసయినారు. వారు పెద్ద తరగతికి ఉర్దూ చెప్తుంటే ఉర్దూ డిగ్రీలు గల మౌల్వీ – సాహెబులెవరూ అభ్యంతరం లేవదీయలేదు. పైగా తమకు సరిగా అర్ధం కుదరని ఉర్దూ పేర్ల తాత్పర్యం మా ముందరే రామనాథరావుసార్తో చెప్పించుకునేవాళ్లు.

ప్రశ్నలు

అ) రఫియా సుల్తానా తరంవాళ్ళు ఏమని అను కున్నారు ?
జవాబు:
ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాషని, ఏదో ఒక కులానికో, మతానికో చెందిన భాష కాదన్నారు.

ఆ) రచయిత తన ముచ్చట్లలో ఏ భాషా సంబంధాన్ని యాది చేసుకున్నాడు ?
జవాబు:
ఉర్దూతో గల సంబంధాన్ని యాది చేసు కున్నాడు.

ఇ) రామనాథరావుసార్ ఎక్కడివారు ? ఏ విషయాన్ని బోధించేవారు ?
జవాబు:
రామనాథరావు సార్ మంథెన బ్రాహ్మణులు. ఉర్దూ బోధించేవారు.

ఈ) ఉర్దూ డిగ్రీలున్న మౌల్వీలు రామనాథరావు సార్న ఏ విషయమై సంప్రదించేవాళ్లు ?
జవాబు:
అర్థం కుదరని ఉర్దూ పేర్ల తాత్పర్యంపై సంప్రదించేవాళ్లు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు ?
(లేదా)
మనుమరాలి మాటలు తాతయ్యకు ఎందుకు ఆశ్చర్యం కలిగించాయి ?
జవాబు:
మనుమరాలు లావణ్య 4 సంవత్సరాల అమ్మాయి. ఇంకొక మనుమరాలు కావ్య. సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వచ్చారు. వాళ్ళు హిందీ మాట్లాడుతారు. తెలుగురాదు. హిందీలోంచి అనువదించుకొని మాట్లాడుతారు. కాని తెలుగు పలుకుబడి, నుడి కారము వాళ్ళకు తెలియదు. 4 సంవత్సరాల లావణ్య “తాతా ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని తాత చేతికిచ్చింది. లావణ్య ఇగపటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుపడ్డందుకు తాత అబ్బురపడ్డాడు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ఆ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారిని రచయిత గురుస్థానీయులుగ ఎందుకు భావించారో వివరిం
జవాబు:
సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండపండితులు, సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్ర అనే ప్రౌఢకావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించిన గొప్పకవి శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు. ఆయన రాసిన అనేక కావ్యాలకు మహాపండితుల ప్రశంసా పూర్వకాలయిన అభిప్రాయాలు డా॥ సామల సదాశివగారు చదివారు. వారిదగ్గర (లక్ష్మణశాస్త్రి) శిష్యరికం చేయకపోయినా, ఆయన సన్నిధానంలో కూర్చొని తరుచుగా జాబులు రాసేవారు. అప్పుడు అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి శాస్త్రిగారిని సదాశివగారు గురుస్థానీయులుగా భావించారు.

ఇ) “అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి ?” అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది ?
జవాబు:
వరంగల్లు తెలుగు గురించి చెప్పిన విషయం ఇది. పెద్ద కాళోజీ వర్ధంతి సభ జరుగుతోంది. రచయిత కాళోజీ ఇంట జరిగే వర్ధంతి, జయంతి సభల్లో పాల్గొనేవారు. ఆ సభల్లో చిన్నపాటి కవిసమ్మేళనం, చిన్నపాటి ముషాయిరా ఉండేవి. కొన్ని ప్రసంగాలు జరిగేవి. షాద్ గజల్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూకవి. కలం పేరు ఫాద్. రచయిత వెళ్ళేటప్పటికి సాహితీ మిత్రమండలి కవులు, కవితలు వినిపిస్తున్నారు.

ఆ సాహిత్యసభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారు రచయితకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులుండగా అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించటమేమిటీ అని రచయిత అనుకున్నారు. కాళోజీకి ఆప్తుడనుకున్నారు రచయిత. రెవెన్యూవాళ్ళకు తెలుగుసాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవారు కాని అలా ఉత్తమ కవితలూ, కథలు రాసిన రెవెన్యూ, పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించారు.

ఈ) రచయిత రచనా శైలిని ప్రశంసిస్తూ వ్రాయండి.
జవాబు:
రచయిత డా॥సామల సదాశివగారు సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో పండితులు. అనేక భాషలు రచయితల, కవుల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ఉర్దూ సాహిత్య చరిత్ర, అన్జద్ రుబాయీలు, మలయమారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి వీరి ఇతర రచనలు. అన్జద్ రుబాయీలు అనువాదానికి ‘ఉత్తమ అనువాద రచనా పురస్కారం, “స్వరలయల” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ – కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమయిందో రాయండి.
(లేదా)
ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్యభాగం ద్వారా కవి ఏమి చెప్పదలచుకున్నారు ?
జవాబు:
ఈ పాఠం ద్వారా సామల సదాశివగారి వ్యక్తిత్వం, పాండిత్యం, వినయం మొదలైన ఎన్నో విషయాలు తెలిశాయి.

1. వ్యక్తిత్వం : సామల సదాశివగారు అల్పసంతోషి, ప్రాంతీయ భాషాభిమానం ఎక్కువ కలవారు. అందుకే తమ మనుమరాలు ‘ఇగపటు’ అనగానే చాలా ఆనందించారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని యాది చేసుకొన్నారు. ఎంత గొప్ప పండితుడైనా తమ ప్రాంతీయతను, ప్రాంతీయ భాషను విడిచిపెట్ట కూడదని సామల సదాశివగారి అభిప్రాయంగా తెలిసింది.

2. పాండిత్యం : మరాఠీ పురోహితుని గురించి చెప్పిన సందర్భంలో ‘మాకూ మరాఠీ వచ్చు కదా” అనే రచయిత మాటలను బట్టి, ఆయన మరాఠీలో మంచి పండితుడని తెలిసింది.
“పెద్ద కాళోజీ వర్ధంతి సభలో ఊర్దూలో ప్రసంగించాన”న్నాడు. అందుచేత ఉర్దూలో కూడా గొప్ప పండితుడని తెలిసింది.

“నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాడినే” అని రచయిత అన్నాడు. దీనిని బట్టి సదాశివగారు ప్రాచీన తెలుగు సాహిత్యంలో మంచి పండితులని తెలిసింది.

3. వినయం : తను బహు భాషాపండితుడైనా గర్వం లేనివాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారి వద్ద తను ఎన్నో సాహిత్య విషయాలు తెలుసుకొన్నానని వినయంగా చెప్పారు. లక్ష్మణశాస్త్రిగారికి తను ఏకలవ్య శిష్యుడినని వినయంగా ప్రకటించు కొన్నారు. పండితుల గురించి చెప్పవలసి వచ్చినపుడు గొప్ప గొప్ప మాటలలో చెప్పారు. వీటన్నిటినీ బట్టి సదాశివగారి దగ్గర పాండిత్యంతో బాటు వినయం కూడా ఎక్కువ ఉందని చెప్పవచ్చు. “తెలుగులోను, ఉర్దూలోనూ,ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకొన్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకమవుతుంది” అనడంలో ఆయన వినయం తెలిసింది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరిచి పోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా వ్రాయండి.
జవాబు:
నా ప్రాథమిక విద్యాభ్యాసం నల్గొండ జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. మాకు తెలుగుకు వేమూరి విజయశ్రీగారు వచ్చేవారు. ఆమె చక్కటి వేషధారణ, భాషపై పట్టుకల వ్యక్తి. వారు తెలుగు పద్యాలను ధారాళంగా చెప్పేవారు.

ఒకసారి వేమన సుమతీ శతక పద్యాలకు కంఠస్థ పోటీ నిర్వహించారు. దానిలో నేను ప్రథమ బహుమతిని పొందాను. మునగాల మండల విద్యాశాఖాధిగారు, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఆ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బహుమతి పొందిన ప్రథమ ద్వితీయ, తృతీయ పోటీదారులను సత్కరించారు. నాకు తెలుగు నిఘంటువు ఇచ్చారు. ఇది నా ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మరచిపోలేని సంఘటన.

(లేదా)

ఆ) మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా వ్రాయండి.
జవాబు:
(మేము ఖమ్మం జిల్లా మధిరలో ఉండేవారము. మా ఇంటి ప్రక్కనవారు, మేము బాగా కలిసి ఉండేవారం. భార్యాభర్తలు చిన్న చిన్న పనులు చేసుకొని జీవించేవారు. వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు. మా నాన్నగారు, అమ్మగారు టీచర్లుగా పనిచేసేవారు. వారు ఎంతో నచ్చచెప్పిన వినకుండా ముగ్గురు పిల్లల్ని కన్నారు.

కిరణ్కు తాగుడు అలవాటు అయింది. ఆసుపత్రిలో చేర్చారు. మా నాన్నగారు రక్తదానం చేసారు. అయినా కిరణ్ గారు బతుకలేదు. వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యారు. తాగుడుకు బానిసై ఆ కుటుంబం ఇంటి యజమానిని కోల్పోయింది. ఈ సంఘటన నాకు ఎంతో బాధ కల్గించింది.) (ఇది సంభాషణగా రాస్తాను.)

శ్రావ్య : అన్నయ్య ప్రక్క ఇంటిలో ఏదో జనం గోలగా ఉన్నారు ? ఏమయింది ?
రవి : అవును శ్రావ్య ! చూసివస్తాను ఉండు – (చూసి వస్తాడు).
శ్రావ్య : ఏం జరిగిందన్నయ్యా ?
రవి : : ప్రక్క ఇంటిలో కిరణ్ గారు పడిపోయారు. అందరూ గుమిగూడారు. నేను ఆసుపత్రికి వెళ్ళి వస్తాను ………? సరేనా …….. ?
శ్రావ్య : సరే ! నేను వస్తాను పద ! (ఇద్దరు) కలిసి ఆసుపత్రికి వెళతారు.) (డాక్టర్గారు పరీక్షించి రక్తం అవసరం అన్నారు.)
డాక్టర్ : రవి, శ్రావ్య మీరు వెళ్ళి “రక్తదానం” చేసేవారిని తీసుకురండి. (రవి, శ్రావ్య వెళతారు) (రవి వాళ్ళ నాన్నగారితో చెపుతాడు).
రవి : నాన్న ! కిరణ్ గారికి రక్తం ఎక్కించా లని అన్నారు. నీవు ఇస్తావా నాన్నా!
రాజు : ఓ! అలాగే ! నేను ఇస్తాను. ఇప్పుడే వెళ్ళి రక్తదానం చేసి వస్తాను. (ఆసుపత్రికి వెళతాడు)
డాక్టర్ : పేషెంట్కి రక్తదానం చేయటానికి ఎవరు వచ్చారు ?
రాజు : నేను సార్ ! నేను స్కూల్ మాష్టార్ని. ఇంతకు పూర్వం చాలాసార్లు ఇచ్చాను.
డాక్టర్ : సరే పదండి (రాజు రక్తం ఇస్తాడు).
రాజు : డాక్టర్గారు ఇక నేను వెళ్ళవచ్చా!
డాక్టర్ : ఓ వెళ్ళవచ్చు.
రాజు : పేషెంటు పరిస్థితి (కిరణ్కి) ఎలా ఉంది ?
డాక్టర్ : చాలా దారుణంగా ఉంది. కొద్ది సేపటిలో అతను చనిపోవచ్చు.
రాజు : అయ్యో ! పోవచ్చా ! (అంటూ బాధ పడుతూ ఇంటికి వెళతాడు)
శ్రావ్య, రవి : నాన్నా ! రక్తం ఇచ్చావా ?
రాజు : ఇచ్చానమ్మా ! కానీ కిరణ్ పరిస్థితి బాగోలేదని చెప్పారు ?
(కిరణ్ చనిపోయాడని ఇంటికి తీసుకు వస్తారు. అందరూ ప్రక్క ఇంటికి వెళతారు.
శ్రావ్య : నాన్నగారు ! కిరణ్ ఎందుకు చనిపోయారు ?
రవి : త్రాగుడుకు బానిసలైతే జీవితం ఇలా అవుతుందా ?
రాజు : తాగుడు వల్ల చనిపోయాడు.
రాజు : అవును రవి ! ఫలితం ఇలా దారుణంగా ఉంటుంది. మీ స్నేహితులకు చెప్పండి. “మద్య పానం మనిషికి శత్రువు” అని.
శ్రావ్య, రవి : సరే నాన్నగారు! మా స్నేహితులకు చెబుతాం (ముగింపు).

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : యాదిచేసుకొను = గుర్తు చేసుకొను

నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం.

అ) పసందు = ఇష్టం
జవాబు:
పసందైన మామిడి పండ్లను మేము ఇష్టపడతాం.

ఆ) రమ్యం = అందమైన
జవాబు:
రమ్యమైన ప్రకృతి, సుందర జలపాతాలకు కేరళ రాష్ట్రం ప్రసిద్ది చెందినది.

ఇ) క్షేత్రం = చోట
జవాబు:
నా తెలంగాణ క్షేత్రం ఉద్యమాలకు ఆలవాలమైంది.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 2.
నిఘంటువు సాయంతో క్రింది పదాలకు నానార్థాలు వ్రాయండి.

అ) కవి = కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి, నీటికాకి
ఆ) క్షేత్రం = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం

ప్రశ్న 3.
క్రింది పర్యాయపదాలకు పాఠం ఆధారంగా సరియైన పదాన్ని వ్రాయండి.

అ) ఇల్లు, గృహం = ఆలయం
ఆ) పొగడ్త, స్తోత్రం = ప్రశంస

ప్రశ్న 4.
క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి – వికృతులను వ్రాయండి.

అ) మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ వున్నది.
జవాబు:
భాష బాస

ఆ) నాది ప్రజా కవిత కద !
జవాబు:
కవిత – కైత

ఇ) మా అమ్మమ్మ రోజూ కత చెప్పుతుంది.
జవాబు:
కత – కథ

ఈ) కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది.
జవాబు:
ఇంతి – స్త్రీ

ప్రశ్న 5.
క్రింది వ్యుత్పత్త్యర్థాలకు తగిన పదాలు వ్రాయండి.

అ) అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు: గురువు
ఆ) భాషింపబడునది : భాష

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
క్రింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.

అ) తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్ర భాషలలో పండితుడు.
జవాబు:
సామాన్య వాక్యాలు :

  1. తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు.
  2. తిరుమల రామచంద్ర గారు ఆంధ్రభాషలో పండితుడు.

ఆ) నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
జవాబు:
సామాన్య వాక్యాలు :

  1. నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
  2. నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.

ఇ) ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు.
జవాబు:
సామాన్య వాక్యాలు :

  1. ఇంట్లో మాట్లాడే భాష వేరు.
  2. బడిలో చదివే భాష వేరు.

ప్రశ్న 2.
క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.

అ) తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచు కోవడం లేదు.
జవాబు:
తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.

ఆ) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు.
జవాబు:
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులూ, పత్రికా విలేకరులు ఉన్నారు.

ఇ) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు.
జవాబు:
నమాజు (చేయడానికి) చదవడానికి ఎందరో వచ్చిపోతుంటారు.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రశ్న 3.
క్రింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు.
జవాబు:
అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి, అచ్చు వేయించాడు.

ఆ) గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు పొందాడు.
జవాబు:
గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.

ఇ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణనుందరి నాటకాన్ని ప్రచురించాడు.
జవాబు:
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.

రుగాగమ సంధి 

ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.

అ) పేదరాలు
ఆ) బీదరాలు
ఇ) బాలింతరాలు
పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం.
ఎట్లా మారాయో పరిశీలిద్దాం.
అ) పేద + ఆలు → పేదరాలు
ఆ) బీద + ఆలు → బీదరాలు
ఇ) బాలింత + ఆలు → బాలింతరాలు
పేద + ఆలు → పేద + ర్ + ఆలు → పేదరాలు
బీద + ఆలు → బీద + ర్ + ఆలు → బీదరాలు
బాలింత + ఆలు → బాలింత + ర్ + ఆలు → బాలింతరాలు

  • పై మూడు సందర్భాలలో పర పదం ‘ఆలు’
  • ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడమే ‘ఆగమం’.
  • పేద, బీద, బాలింత పదాలకు ‘ఆలు’ పరమైంది.
  • పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను ‘పేదాదులు’ అంటారు.
  • పేదాదిపదాలకు ‘ఆలు’ అనే పదం కలిసినప్పుడు ‘ర్’ అనే అక్షరం అదనంగా వచ్చింది.
  • ‘ర్’ అనేది అదనంగా రావడాన్ని ‘రుగాగమం’ అంటారు.
  • దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు.
    పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు రుగాగమమవుతుంది.

పైన చెప్పిన మూడు పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం) ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మ ధారయమంటారు.

కర్మధారయమందు పేదాది శబ్దాలకు “ఆలు” శబ్దం పరమైతే రుగాగమమౌతుంది.

పై పద్ధతి ప్రకారం క్రింది పదాలను విడదీసి గమనించండి. విశ్లేషించండి.

అ) ముద్దరాలు = ముద్ద + ఆలు = రుగాగమసంధి
ఆ) జవరాలు = జవ్వని + ఆలు = రుగాగమసంధి
ఇ) మనుమరాలు = మనుమ + ఆలు = రుగాగమసంధి
ఈ) కొమరాలు = కొమ + ఆలు = రుగాగమసంధి

పైన చెప్పిన పేదాది పదాలు తెలుగుపదాలు. ఇప్పుడు సంస్కృతానికి సమానమైన (తత్సమ) పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.

గుణవంత + ఆలు → గుణవంతురాలు
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంతురాలు

ఈ సందర్భాలలో కూడా ‘ర్’ వస్తుంది. కానీ స్వల్పమైన తేడా వచ్చింది గమనించారా ? అదేమిటో పరిశీలిద్దాం !
గుణవంత + ఆలు → గుణవంత + ఉ + ఆలు
→ గుణవంతు + ఆలు → గుణవంతు + ర్ + ఆలు → గుణవంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంత + ఉ + ఆలు → శ్రీమంతు + ఆలు → శ్రీమంతు + ర్ + ఆలు →
అలాగే
శ్రీమంతురాలు
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంత + ఉ + ఆలు → బుద్ధిమంతు + ఆలు → బుద్ధిమంతు + ర్ + ఆలు → బుద్ధిమంతురాలు

పై మూడుచోట్ల తత్సమపదాలకు ‘ఆలు’ కలిస్తే మొదటిపదం చివర ఉన్న అచ్చు ‘అకారానికి బదులు ‘ఉ’ కారము వచ్చి తరువాత రుగాగమమయింది, దీన్ని ఇట్లా చెప్పవచ్చు.

కర్మధారయమందు తత్సమ శబ్దములకు ‘ఆలు’ శబ్దము పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న ‘అకారానికి’ ఉకారము వచ్చి రుగాగమం అయింది.

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రాజెక్టు పని

గాంధీజీ “సత్యశోధన”, సామల సదాశివ “యాది”, కాళోజి “నా గొడవ”, దాశరథి రంగాచార్య “జీవనయానం”, గడియారం రామకృష్ణశర్మ “శతపత్రము” మొదలగు వాటిలో వారివారి జ్ఞాపకాలు, అనుభవాలు గ్రంథస్థమై ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక గ్రంథాన్ని సేకరించి అందులోని విషయాలను చదువండి. వాటిలో మీకు నచ్చిన ఒక సంఘటనను పేర్కొంటూ ఎందుకు నచ్చిందో తెలుపుతూ నివేదిక వ్రాయండి.
జవాబు:
కాళోజి నారాయణరావు రచించిన ‘నా గొడవ’ కావ్యం నాకు నచ్చింది. దానిలో కోరిక అను గేయం (ఈప్స) నాకు నచ్చింది. దానిని రాస్తున్నాను.

నివేదిక

నాకున్నది ఒక కోరిక. నేను రాసే కవిత నా మనసులోని భావాల అలజడిని మిత్రుడికి రాసిన ఆత్మీయ ఉత్తరంగా ఉండాలి. పుస్తక ప్రియులను ఆహ్లాదపరిచే కవిత్వంగా, సౌందర్యారాధకులను ఆలోచింపజేసేదిగా, మేధావుల మనసులను కదిలించేదిగా, తార్కికుల్లో సైతం భావోద్వేగాలు పుట్టించేలా, అమాయకులు ప్రమాదాల్లో పడిపోకుండా కాపాడేదిగా ఉండాలనేది నా కోరిక. సాహిత్యవిలువలు, రస సౌందర్యం, కవి సమయాల గురించి తెలియనివారి వెక్కిరింతలు ఆగిపోయే విధంగా భావగాఢతగల కవితగా ఉండాలని, ఆడంబర మనస్తత్వాల్ని సైతం ఆకర్షించేదిగా ఉండాలని, జడత్వం ఆవరించిన స్నేహరాహిత్య హృదయాలకు ప్రాణం పోసే సంజీవనిగా ఉండాలని, కోపంతో నిండిన కనులను శాంతపరచేదిగా, విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతూ అమాయకులను గాయపరిచే ఆంబోతుల్లాంటి మనుష్యుల అకృత్యాలకు కళ్ళెం వేసేలా నా కవిత ఉండాలి.

కవిత్వం గాలిలో తేలివచ్చే సువాసనలాగా, మధురమైన భావాలను మోసుకు రావాలి. పొదుగుల నుండి కారుతున్న పాలధారలా కవిత ఉపయోగకరంగా ఉండాలి. అమ్మ కంటి చూపుల్లోంచి కురిసే మమతానురాగాలు, పంటను సంరక్షించే రైతు చూపుల్లోని జాగ్రదావస్థ కవిత్వంలో నిక్షిప్తమై ఉండాలి.

నిరాశతో కుంగిపోయిన మనసుకు ఆనందాన్ని కలిగించి, జీవితంలోని అభద్రతాభావాన్ని తొలగించి జీవనానికి ఆధారంగా కవిత ఉండాలి. అనవసరపు మృత్యుభయాల్ని తొలగిస్తూ యమునికే మృత్యుభీతి కలిగించే విశ్వాసాన్ని కవిత్వం అందించాలి.

దాహంతో గొంతెండిపోయిన వారికి చెలిమనీరులా, చలికి వణికిపోయేవారికి ఆరిపోని కుంపటి వెచ్చదనంలా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల కష్టనష్టాలలో ఆదుకునేలా కవిత్వం ఉండాలి.

పక్షిప్రాణాన్ని కాపాడటం కోసం తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి దాతృత్వాన్ని, ఆడిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాన్నే ఇచ్చిన బలిచక్రవర్తి త్యాగాన్ని ప్రబోధించేలా కవిత ఉండాలి. దేశ సరిహద్దుల్ని నిరంతరం పరిశీలిస్తూ పహారాకాసే సైనికుడిలా, చావంటే భయం వదలిపెట్టి పోరాడే వీరుడిలా, అమరవీరుడి మెడలో మెరిసే పూలదండలా కవిత ఉండాలి.

పవిత్రమైన వేదం చదివితే కలిగే బహుళ ప్రయోజనాల్లా కవితలోని వేదన పఠితలో గుణాత్మకమయిన మార్పుల్ని కలిగించాలి. జీవనదిలా ప్రవహించే నిర్మల గంగానదిలా మనిషి జీవనం నిత్యచైతన్యంతో ముందుకు కదలాలని, నదిలో కొట్టుకుపోతున్న వాడికి తీరం తగిలినట్లుగా, కష్టాల్లో, బాధల్లో మునిగిపోయిన వారికి ఒక ఓదార్పు, ఉపశమనం కలిగించే తీరంలా కవిత్వపుతీరు ఉండాలి.

పాతాళాన్ని పైకి లాగేదిగా, ఆకాశాన్ని భూమ్మీదికి దించేదిగా అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగే ఉత్తేజాన్ని కవిత్వం కలిగించాలి. అనేక సహజ వనరులతో, ప్రకృతి సౌందర్యంతో, విభిన్న ప్రాణుల జీవనానికి అనుగుణంగా ఉన్న అమూల్యమైన భూమిని, ఈ పర్యావరణాన్ని కాపాడుకునేలా కవిత్వం స్ఫూర్తి కలిగించాలి. మనిషి మానవీయ విలువలతో మంచి మనిషిగా ఎదిగేలా కవిత్వం నేర్పాలని కవి గాఢంగా కోరుకుంటున్న కోరిక ఈ కవిత.

విశేషాంశాలు

  1. పలుకుబడి : మాటతీరు ఉచ్ఛారణలో ఉండే విలక్షణత. దీన్నే ‘యాస’ అంటారు.
  2. నుడికారం : మాటయందలి చమత్కారం. ఏ భాష నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి, భౌగోళిక పరిస్థితుల లోంచి, ఆప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలలోంచి ఉద్భవిస్తుంది.
  3. జాతీయం : జాతివాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు.
    ఉదా : ‘చేతికి ఎముకలేదు’ అన్న జాతీయంలోని పదాలకు నిఘంటుపరంగా ఎముకలేని చేయంటే కేవలం

కండరాలు మాత్రమే ఉండాలె. కాని ఈ జాతీయానికి ధారాళంగా దానమిచ్చే మనిషి’ అని
అర్థం వస్తుంది. ఈ విధంగా పదాలకున్న వాక్యార్ధం పోయి లక్ష్యార్థం రావడాన్నే ‘జాతీయం’ అంటారు.
కొట్టినపిండి, తలపండిన, వీనుల విందైన, కబంధహస్తాలు, అగస్త్య భ్రాత మొదలైనవి మరికొన్ని జాతీయాలు.

సూక్తి : ఆత్మలను పలికించేదే అసలైన భాష
ఆ విలువ కరువైపోతే అది కంఠశోష
-డా|| సి. నారాయణరెడ్డి

పదాలు – అర్థాలు

I

అబ్బురపడు = ఆశ్చర్యపడు
పలుకుబడి = ఉచ్ఛారణము, మాట చెల్లుబడి
నుడికారము = మాట చమత్కారము, మాట, పలుకుబడి
పట్టుబడుట = నేర్చుకొనుట, అలవాటగుట
స్మరించుట = గుర్తుకు తెచ్చుకొనుట
యాదిచేసుకొనుట = గుర్తుకు తెచ్చుకొనుట
బాల్యమిత్రులు = చిన్నప్పటి (మిత్రులు) స్నేహితులు
ఉద్దండము = పొడవైనది, ఎక్కువైనది, మిక్కిలి
ప్రౌఢ = గంభీరమైనది
సన్నిధానము = సమీపము, ఆశ్రయము

II

పునరుద్ధరించుట = బాగుచేయుట
గురువు = ఉపాధ్యాయుడు, బృహస్పతి
సొంపు = అందం
రమ్యమైన = అందమైన
ప్రాముఖ్య = ప్రముఖమైనవి
టక్సాలా = టంకసాల
ప్రాముఖ్యం = ప్రాధాన్యత

III

పొల్యూట్ = కలుషితమైన
వర్దంతి = చనిపోయిన రోజు
జయంతి = పుట్టినరోజు
సమ్మేళనం = కలయిక, కలుపుట, కలియుట
విద్వాంసుడు = పండితుడు
ఆశ్రయించకుండా = తీసుకొనకుండా
వెల్లడించుట = వ్యక్తం చేయుట
జాబులు = లేఖలు, జవాబులు
అడ్వకేటు = వకీలు, న్యాయవాది

TS 10th Class Telugu Guide 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

IV

రుచించవు = ఇష్టపడవు, నచ్చవు
ఘోరము = దారుణము
గ్రాంథికం = గ్రంథములలో ఉండే భాష (గ్రాంథికం)
అగ్రగణ్యుడు = మొదటివాడు
వ్యవహారికం = మాటలలో మనంఉచ్చరించేది (వ్యవహారిక మాట)

పాఠం ఉద్దేశం

ఒక భాషలోని నుడికారపుసొంపు, పలుకుబడులు, జాతీయాలవల్ల భాష ఎంతో పరిపూర్ణంగా, సౌందర్య వంతంగా విలసిల్లుతుందో చెబుతూ, ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజువేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ప్రధానోద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రస్తుత పాఠ్యభాగం డా॥ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన ‘యాది’ అనే వ్యాస సంపుటిలోనిది.

కవి పరిచయం

రచయిత : డా॥ సామల సదాశివ

జననం : 11.05.1928

మరణం : 07.08.2012

జన్మస్థలం : కుంరం భీమ్ జిల్లాలో భాగమైన దహెగామ్ మండలం తెనుగుపల్లె

ఇతర రచనలు :

  1. ఉర్దూ సాహిత్య చరిత్ర
  2. అన్జద్ రుబాయీలు
  3. మలయమారుతాలు
  4. యాది.
  5. సంగీత శిఖరాలు

పురస్కారాలు :

  1. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం (అన్జద్ రుబాయీలకు)
  2. 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (స్వర్ణలయలు గ్రంథానికి)
  3. కాకతీయ,తెలుగు విశ్వ విద్యాలయాల గౌరవ డాక్టరేట్.

విశేషాంశాలు : ఉత్తమ అనువాదకుడు, విమర్శకుడు.

శైలి : భాష సహజ సుందరం, సరళం

ప్రవేశిక

సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు; ‘ఆంధ్రబిల్హణ’ బిరుదాంకితుడూ అయిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి “వారీ! రామచంద్రా ! ఇగపటు” అన్నాడు.
గుడిపూజారి “మొదలు మీ కండ్లకు నీళ్ళు పెట్టుకోండి” అని ఆశ్చర్యపరచాడు.
“మసీదు మెట్లమీద కూర్చొని ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను” అన్నాడు. భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తఖీమీర్.
ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ ‘యాది’ లోనివి. ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదువవలసిందే!

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ -వ్యాసం

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం, సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసలక్షణం.

Leave a Comment