TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 1st Lesson దానశీలము Textbook Questions and Answers.

TS 10th Class Telugu 1st Lesson Questions and Answers Telangana దానశీలము

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 2)

కర్ణుని పూజామందిరంలో ‘సూర్యుడు’ ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అంటాడు.
సూర్యుడు : పుత్రా ! కర్ణా ! బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది. నాయనా జాగ్రత్త!
కర్ణుడు : తండ్రీ! ఇంద్రుడంతటివాడు రూపం మార్చుకొని “దేహి” అని నాదగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే. నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా. కాని నన్ను వారించకండి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణమేమిటి ?
జవాబు:
కవచకుండలాలుంటే కర్ణుని ప్రాణానికి ముప్పు ఉండదు. అవి దానం చేస్తే ప్రాణాలకు ముప్పు వస్తుంది. అందుకే దానం చేయకుండా ఆపాలనుకొన్నాడు సూర్యుడు. కర్ణుడు ఆయన కొడుకు గదా !

ప్రశ్న 2.
కర్ణుని మాటలను బట్టి మీకేమర్థమైంది ?
జవాబు:
ఎటువంటి ఆపద వచ్చినా, దానం చేస్తానని చెపుతాడు. కర్ణుని దానగుణం యొక్క గొప్పతనం తెలుస్తుంది.

ప్రశ్న 3.
ప్రాణానికి ముప్పని తెలిసినా కర్ణుడు ఎందుకు దానం చేశాడు ?
జవాబు:
శరీరం శాశ్వతం కాదని, ఇంద్రుడంతటివాడు రూపం మార్చుకొని దేహి అంటే కాదనని కర్ణుడు అంటాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 4.
ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా ? ఎవరు ?
జవాబు:
ఇటువంటి దానవీరులు చాలామంది ఉన్నారు.

  1. బలి : వామనుడికి మూడడుగుల నేల దానం చేశాడు. తన గురువు శుక్రాచార్యుడు వద్దన్నా వినలేదు. దానివలన తన ప్రాణాలు కోల్పోయినాడు.
  2. శిబి : పావురాన్ని కాపాడడానికి శిబిచక్రవర్తి తన శరీరంలోని మాంసం కోసి డేగకు ఇచ్చినాడు.
  3. దధీచి ఇంద్రుడికి పర్వతాల రెక్కలు తెగకొట్టడానికి వజ్రాయుధం కావలసి వచ్చింది. వజ్రాయుధం తయారీకి దధీచి తన వెన్నెముకను ఇచ్చినాడు.
  4. రంతిదేవుడు : తన రాజ్యం మొత్తం దానధర్మాలకు వినియోగించినాడు. తను తినడానికి మిగిలిన అన్నం కూడా దానం చేసినాడు. తను త్రాగడానికి ఉంచు కొన్న నీటిని కూడా దానం చేసినాడు.
  5. సక్తుప్రస్థుడు : తన సామ్రాజ్యంలోని సంపదను దానధర్మాలకే వినియోగించినాడు. తను, తన కుటుంబీకులు తినబోయిన ఆహారం కూడా దానం చేసినాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 4)

ప్రశ్న 1.
శుక్రుడు బలిచక్రవర్తితో “వలదీ దానము గీనమున్” అని ఎందుకు హెచ్చరించాడో ఊహించండి.
జవాబు:
శుక్రుడు రాక్షసులకు వంశ గురువు. శుక్రుడు ఎప్పుడూ రాక్షసుల క్షేమాన్నే కోరుకుంటాడు. శుక్రుడు తపస్సంపన్నుడు. వచ్చిన పొట్టివాడు విష్ణుమూర్తి అని శుక్రునికి తెలుసు. విష్ణుమూర్తి ఆ మూడడుగులతో తేలికగా పోడని, శుక్రుడికి తెలుసు. అతడు మూడడుగులతో మూడు లోకాలనూ కొలిచే త్రివిక్రముడు అవుతాడనీ, బ్రహ్మాండం అంతా నిండిపోతాడనీ ఆయనకు తెలుసు. ఎవ్వరూ విష్ణుమూర్తిని ఆపలేరని కూడా శుక్రాచార్యుడికి తెలుసు.

అందుకే, శుక్రుడు బలిని దానము చేయవద్దని హెచ్చరించాడు.

ప్రశ్న 2.
“మానధనులు” ఎట్లా ఉంటారని మీరు భావిస్తున్నారు.
జవాబు:
మానధనులు అంటే అభిమానమే ధనముగా గలవారు. వారికి పదవితో గాని, ధనముతో గాని సంబంధం లేదు. వారు ప్రాణం కంటే తమ గౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. ఎవరిచేతా ‘ఇది తప్పు’ అని చెప్పించుకోరు. ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చిన మాట తప్పరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టు కొంటారు. ప్రాణం కంటే తాము ఇచ్చిన మాటకే విలువ ఇస్తారు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 3.
“కీర్తిని సంపాదించడమే గొప్పదని” చెప్పిన బలిచక్రవర్తి మాటలను మీరు ఏ విధంగా సమర్థిస్తారు ?
జవాబు:
కీర్తిని సంపాదించమే గొప్పదని బలిచక్రవర్తి చెప్పిన మాట ఉత్తమమైనది. అది అందరికీ శిరోధార్య మైనది.

  1. సిరిసంపదలూ, రాజ్యమూ శాశ్వతమైనవి కావు.
  2. సత్యవంతుడని పేరు పొందిన హరిశ్చంద్ర మహారాజు వంటి వారికి లభించిన కీర్తి, శాశ్వత మైనది.
  3. దేశం కోసం తమ సర్వస్వాన్నీ అర్పించి, త్యాగం చేసిన గాంధీజీ, నెహ్రూజీ, పటేలు, సుభాష్ చంద్రబోస్ వంటి వారి త్యాగాన్నీ, దేశసేవనూ నేటికీ లోకులు కీర్తిస్తున్నారు.
  4. అక్రమ సంపాదనలతో లోకకంటకులైన వారిని లోకం నేటికీ నిందిస్తోంది. కాబట్టి కీర్తి సంపాదన ముఖ్యమన్న బలిచక్రవర్తి మాటను నేను సమర్థిస్తాను.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 5)

ప్రశ్న 1.
“తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అన్నాడు కవి. దీనినిబట్టి మీకేం తెలిసింది ?
జవాబు:
ఆడినమాట తప్పకూడదని, వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుతిరుగదు” అని బలిచక్రవర్తి అంటాడు. దీనిని బట్టి ఆడినమాట తప్పకూడదని అర్థమైంది.

ప్రశ్న 2.
“శిబి గొప్ప దాత”. ఎందుకు ?
జవాబు:
శిబి చక్రవర్తి చాలా గొప్పదాత. ఒకసారి ఒక పావురాన్ని కాపాడడానికి తన శరీరంలోని మాంసం కోసి ఇచ్చాడు. ఆ మాయా పావురం ఎంతకూ తూగకపోతే తన శరీరంలోని రెండు తొడలలోని మాంసాన్ని తనే కోసి డేగకు ఇచ్చిన దాన శీలి.

ప్రశ్న 3.
ఎదుటివారు అడిగిన దానిని ఇవ్వడంలో ఎటువంటి తృప్తి ఉంటుంది ? మీ అనుభవాలు చెప్పండి.
జవాబు:
చాలా తృప్తి ఉంటుంది. దానినే త్యాగం అంటారు. నాకు జన్మదినానికి ఒక “పార్కర్ పెన్ను” బహుమతి వచ్చింది. దానిని నా “ప్రాణస్నేహితుడు” అడుగగా ఇచ్చివేసాను. నాకు చాలా తృప్తి కలిగింది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 4.
“పొడవు పొడవున గుఱుచై” అని కవి ఎవరిని ఉద్దేశించి, ఎందుకట్లా అని ఉంటాడు ?
జవాబు:
వామనుని (విష్ణుమూర్తి) ఉద్దేశించి అన్నాడు. గొప్పవాడైన విష్ణువు చిన్నవానిగా మారి (వామనుడిగా) అడుగుతున్నాడు. అతడు కోరినదానిని ఇవ్వడం కంటె నావంటివానికి ఇంకేం కావాలని” బలిచక్రవర్తి అంటాడు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
దానాలన్నీ వేటికవే గొప్పవి. అయితే నేటి కాలంలో రక్తదానం, మరణానంతరం అవయవదానం వంటివి చేస్తున్నారు కదా ! వాటి యొక్క ప్రాధా న్యాన్ని చర్చించండి.
జవాబు:
దానం అంటే మనకున్నది ఇవ్వడం. అది కూడా కావలసిన వారికే ఇవ్వాలి. అడిగిన వారికే ఇవ్వాలి. ధనం దానం చేస్తాం. దానివలన అడిగిన వారికి కొన్ని అవసరాలు తీరతాయి. అన్నదానం చేస్తే గ్రహీతకు ఆకలి తీరుతుంది. విద్యాదానం చేస్తే గ్రహీతకు జ్ఞానం వస్తుంది. అంటే మనం ఏ దానం చేసినా స్వీకరించడానికి గ్రహీత ఉండాలి కదా ! దాత కూడా ఎంత గొప్పవాడైనా ప్రాణం లేకపోతే ఏమీ చేయలేడు.

అందుచేత ప్రాణదానం అన్ని దానాలకంటే ఉత్తమమైనది. ప్రాణం నిలబడాలంటే రోగాలు తగ్గాలి. కొన్ని రకాల రోగాలకు కారణం రక్తం లేకపోవడం. ఆపరేషన్లు జరిగినపుడు రోగికి రక్తం కావాలి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయాల పాలవుతారు. అప్పుడు కూడా రోగి ప్రాణాలు కాపాడ్డానికి రక్తం కావాలి. ఒక్కొక్కసారి కావలసిన గ్రూపు రక్తం దొరకక రోగి ప్రాణాలు కూడా పోతాయి. అందుచేత అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. దానివలన దాతకు కూడా నష్టమేమీ లేదు. మళ్ళీ వెంటనే కొత్త రక్తం పడుతుంది. కనీసం ఆరునెలల కొకసారి రక్తదానం చేయాలి. దానివల్ల రక్తం శుద్ధి అవుతుంది. అత్యవసర పరిస్థితులలో వైద్యుల సలహాలననుసరించి రక్తదానం చేయవచ్చు.

మనకు తెలియకుండానే ఎంతో మందికి ప్రాణదానం చేసిన పుణ్యం వస్తుంది. ఆరోగ్యానికీ మంచిదే. కొంతమంది కొన్ని అవయవాలు పనిచేయక మరణిస్తారు. అటువంటివారిలో ఎక్కువమంది మూత్రపిండాల వ్యాధితో మరణిస్తుంటారు. వారిని ఆదుకోవాలంటే మూత్రపిండం దానం చేయవచ్చు. ప్రతి మనిషికీ రెండు మూత్రపిండాలు ఉంటాయి. వైద్యుల సలహాతో ఒకటి దానం చెయ్యవచ్చు.

బ్రెయిన్డెడ్ అయిన వారి కళ్ళు, కాలేయం, గుండె మొదలైనవి ఆయా అవసరాలున్నవారికి మార్పిడి చేయవచ్చు. దానివలన మరొకరి అవయవాల రూపంలో జీవించవచ్చు. వారికి అవయవదానం చేసిన పుణ్యం కూడా వస్తుంది. అందుకే తన మరణానంతరం తన అవయవాలను దానం చేయవలసినదిగా వీలునామా రాయాలి. దానిని బంధువులు కూడా ఆటంకపరచకూడదు. పోయిన ప్రాణం తిరిగిరాదు. శరీరం కూడా నశించి పోతుంది. అవయవాలు దానం చేస్తే మరొకరి జీవితంలో వెలుగు వస్తుంది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 2.
పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి.
జవాబు:
దాతల్లో గొప్పవాడా ! ఓ బలిచక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండి పోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.

ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తి కోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా ? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా !

ఓ పండితోత్తమా ! నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే. నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ ! ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడినమాట తప్పను) ఎందుకీ వేలకొద్ది మాటలు ?

ప్రశ్న 3.
ఒకటో పద్యానికి ఇక్కడ ప్రతిపదార్థం ఉంది. ఇదే విధంగా నాలుగు, ఆరు సంఖ్యగల పద్యాలకు ప్రతి పదార్థాలు రాయండి.
1వ పద్యం ప్రతిపదార్థము :
వదాన్య + ఉత్తమా ! = దాతల్లో శ్రేష్ఠుడా ! (ఓ బలిచక్రవర్తీ !)
కులమున్ = (రాక్షస) కులమును
రాజ్యమున్ = (రాక్షస) రాజ్యమును
తేజమున్ = తేజస్సును
నిలుపుము నిలబెట్టుము
ఈ = ఈ
కుబ్జుండు = పొట్టివాడు (వామనుడు)
విశ్వంభరుండు = విష్ణుమూర్తి (జగత్తును భరించువాడు హరి)
అలఁతిన్ + పోడు = అంత తేలికగా వదలిపెట్టడు
త్రివిక్రమ = ముల్లోకములను ఆక్రమించెడి
స్ఫురణన్ = స్ఫూర్తి కలవాడు
వాడు = వాడు
ఐ = అయ్యి
నిండున్ = నిండిపోవను
బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును
కలడే = సమర్థుడు ఉన్నాడా
మానన్ = ఆపుటకు
ఒకండు = ఒకడైన
నా = నా యొక్క
పలుకులున్ = మాటలను
ఆకర్ణింపుము = వినుము
కర్ణంబులన్ = చెవులారా
వలదు = వద్దు
ఈ = ఈ
దానమున్ = దానము
గీనమున్ = గీనము
వర్ణిన్ = బ్రహ్మచారిని
పనుపుమా = పంపివేయుము (పంపించవయ్యా !)
జవాబు:
4వ పద్యం ప్రతిపదార్థము :
భార్గవా = ఓ శుక్రాచార్యా ! (భార్గవుడు = భృగువు పుత్రుడు, శుక్రుడు)
రాజులు = ఎంతో మంది రాజులు
కారే = కాలేదా ?
రాజ్యముల్ = రాజ్యములు
కలుగవే = పొందలేదా ఏమి
గర్వ = అహంకారముతో
ఉన్నతిన్ = గొప్పదనాన్ని
పొందరే = పొందలేదా ఏమి
వారు = వాళ్ళందరు
ఏరి = ఎక్కడ ఉన్నారు ?
సిరిని = సంపదలను
మూటగట్టుకొని = కూడగట్టుకొని
పోవన్ + చాలిరే = తీసుకెళ్ళగలిగారా, లేదు
భూమిపైన్ = నేలపైన (ఈ భూలోకంలో)
పేరు + ఐనన్ = కనీసము పేరైనా
కలరే = ఉన్నదా, లేదు
శిబి = శిబిచక్రవర్తి
ప్రముఖులున్ = మొదలగువారు
యశః = కీర్తి
కాములు + ఐ = కోరువారై
కోర్కులు = దానములను
ప్రీతిన్ = సంతోషంతో
ఈరే = ఇవ్వలేదా
ఈ = ఇప్పటి
కాలమున = కాలమునందును
వారలన్ = వారిని
మఱచిరే = మరిచిపోయారా, లేదు (మరిచిపోలేదని అర్థం)

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

6వ పద్యం ప్రతిపదార్థము

ధీవర్య = ఓ విజ్ఞాని ! (ఓ పండితోత్తమా !)
నిర్ణయంబు + ఐన = నరకము దాపురించినా
నిబంధము + ఐన = అనారోగ్యం కలిగినా
ధరణీ = రాజ్యము
నిర్మ = నాశనము
ఐనన్ = అయినా సరే
దుర్మరణంబు + ఐనన్ = అకాల మరణం సంభవించినా
కుల + అంతము + ఐన = వంశం నాశమైనా
నిజమున్ = నిజంగానే పైవన్నీ
రానిమ్ము = వస్తేరానీ
కానిము = జరిగెడిది జరగనిమ్ము
వేయేటికిన్ = వేయిమాటలు దేనికి
వినుమా = వినుము
అభ్యాగతుండు = అతిథిగా వచ్చినవాడు
హరుడు = శివుడు
ఐనన్ = అయినా
హరి = విష్ణువు
నీరజభవుండు + ఐన = బ్రహ్మదేవుడయినా
నాదు = నా యొక్క
జిహ్వ = నాలుక
ఔన్ = ఇస్తానని
తిరుగన్ = వెనుతిరుగుట (మాట తప్పడం)
నేరదు = చేయలేదు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “ఈ కుబ్జుండు అలఁతింబోడు” అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ‘ఉద్దేశమేమై’ ఉంటుంది ? దానితో మీరు ఏకీభవిస్తారా ?
జవాబు:
“వామనుడు (పొట్టివాడు) సామాన్యుడు కాదు. విష్ణువు, విశ్వంభరుడు కొంచెం మాత్రం తీసుకొనిపోయేవాడు కాదు. మూడడుగులతో కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవ్వరూ అతడిని ఆపలేరు”. నా మాట వినమని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పాడు. శిష్యుడ్ని రక్షించడం కొరకు అలా చెప్పాడు. ఇదే ఉద్దేశం. ఇంతకంటె వేరులేదు. నేను కూడా దీనిని ఏకీభవిస్తాను.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ఆ) హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏవిధంగా ఉంటే అతడు తృప్తి జెందుతాడు ?
జవాబు:
హాలికుడు అంటే వ్యవసాయదారుడు. రైతును దేశానికి వెన్నెముక అంటారు. అంతేగాని సౌకర్యాలేమి కల్పించరు. రైతును ప్రభుత్వాలు పట్టించుకోవాలి.
రైతులకు కావలసిన సౌకర్యాలు :

  1. తగినంత నీటి సదుపాయం కల్పించాలి.
  2. మంచి విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలి.
  3. వడ్డీలేని అప్పులను ఇవ్వాలి.
  4. ఎరువులు, పురుగుమందులు మొదలైనవి సబ్సిడీ ధరలపై ఇవ్వాలి.
  5. భూసార పరీక్షలు చేసి, సూచనలు సలహాలు ఇవ్వాలి.
  6. నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలి.
  7. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పూర్తి అవగాహన కలిగించాలి.
  8. తను పండించిన దానికి ధరను నిర్ణయించుకొనే స్వేచ్ఛ రైతుకు కల్పించాలి.
  9. దళారీ వ్యవస్థను నిర్మాలించాలి.
  10. పండించిన పంట నిల్వ చేసుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.

ఇ) ‘సిరి మూట గట్టుకొని పోవం జాలిరే ?’ అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది ?
(లేదా)
“సంపదలు శాశ్వతం కాదు. వారు సంపాదించిన కీర్తి ప్రతిష్టలే శాశ్వతం”. వివరించండి.
(లేదా)
సంపదలు గొప్పవా ? కీర్తిప్రతిష్టలు గొప్పవా ? చర్చించండి.
జవాబు:
పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. బలి ఆంతర్యంలో ఈ క్రింది కారణాలు ఉన్నాయి.

  1. సంపదను అనుభవించాలి లేదా దానం చేయాలి.
  2. అనుభవించడం వలన కీర్తి ప్రతిష్టలు రావు.
  3. దానం చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పుణ్యం వస్తుంది.
  4. అనుభవించినా, దానం చేసినా తను బ్రతికి ఉండగానే చేయాలి.
  5. ఎప్పటికైనా మరణం తప్పదు. మరణించాక సంపద ఎవరెవరో పట్టుకొని పోతారు.
  6. తన చేతులతో తను దానం చేసుకోవాలని బలి ఉద్దేశం.
  7. వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు.
  8. శ్రీమహావిష్ణువుకు దానం చేసే అదృష్టం అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎన్ని జన్మలెత్తినా అటువంటి అవకాశం రాదు.
  9. తన సంపద కంటే ప్రాణం కంటే శ్రీమహావిష్ణువుకు దానం చేయడమే విలువైనదని బలి ఉద్దేశం.
  10. శ్రీమహావిష్ణువు (గ్రహీత) ఉన్నంతకాలం మహాదాత అయిన బలి కీర్తి ఉంటుంది. అదే బలిచక్రవర్తి కోరిక.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ఈ) “ఆడినమాట తప్పగూడదు” ఎందుకు ?
(లేదా)
“మాట దిరుగలేరు మానధనులు” అనే మాటను సమర్థిస్తూ వ్రాయండి.
(లేదా)
“మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమే మాన ధనులకు మేలు” అని బలి ఎందుకన్నాడు ?
(లేదా)
“తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అని బలిచక్రవర్తి శుక్రా చార్యునితో ఎందుకన్నాడు ? ఆ మాటలో గల సామం జన్యమెట్టిదో వివరించండి.
(లేదా)
“తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అన్నాడు కవి. దీనిని బట్టి మీకేం తెలిసింది ?
(లేదా)
“మాట దిరుగలేరు మానధనులు” అన్న మాటను మీరు సమర్థిస్తారా ? ఎందుకు ?
జవాబు:
పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డపని చేసినవాడినైనా భరిస్తాను కాని, ఆడినమాట తప్పినవాడిని మాత్రం మోయలేను అని చెప్పిందట. అంతేకాదు, తాను అన్నమాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం, అభిమానధనులైన వారికి ఉత్తమమార్గం.

ఎన్ని కష్టాలు వచ్చినా, పేదరికం సంభవించినా, ధన ప్రాణాలకు చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. ఇచ్చినమాట తప్పటం కన్నా మహాపాపం లేదు.
సత్యవాక్యం వల్ల పుణ్యం వస్తుంది. సత్యం మాట్లాడేవారికి స్వర్గాది పుణ్యలోకాలు సంభవిస్తాయి. కాబట్టి ఆడినమాట తప్పగూడదు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) నేటి సమాజానికి దాతృత్వంగల వ్యక్తుల అవసరమేమిటో వివరించండి.
(లేదా)
దానశీలము కలిగిన వ్యక్తుల వలన సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటి ?
(లేదా)
దాతృత్వమే నేటి సమాజానికి అవసరం. వివరించండి.
జవాబు:

  1. నేటి సమాజంలో ఒకరినొకరు పట్టించుకోవడం తగ్గుతోంది.
  2. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే దానగుణం రావాలి.
  3. దానగుణం వలన ఆపదలో ఉన్నవారికి సహాయం దొరుకుతుంది.
  4. మోసం తగ్గుతుంది. దొంగతనాలు తగ్గుతాయి.
  5. మనిషిలో స్వార్థం తగ్గుతుంది.
  6. సమాజంలో క్రూరత్వం తగ్గుతుంది.
  7. స్నేహం పెరుగుతుంది.
  8. కలిసిమెలసి ఉంటారు. ఒకరి కష్టసుఖాలలో ఒకరు పాలుపంచుకొంటారు.
  9. ప్రపంచమంతా ఒకే కుటుంబం. అందరూ నావాళ్ళే అనే భావాలు పెంపొందుతాయి.
  10. అవిద్య, పేదరికం, రోగాలు, యుద్ధాలు మొదలైనవి అంతమౌతాయి. సంపద, ఆరోగ్యం, శాంతి మొదలగునవి పెరుగుతాయి.
  11. పగ, ప్రతీకారం, ద్వేషం మొదలైనవి పోతాయి.
  12. గౌరవం, ప్రేమ, వాత్సల్యం, అభిమానం, బంధుత్వాలు, స్నేహాలు మొదలైనవి పెరుగుతాయి.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

(లేదా)

ఆ) పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
జవాబు:
శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో నీ కులాన్ని, రాజ్యాన్ని నిలబెట్టుకో ఈ పొట్టివాడు విష్ణువు. ఇతడు తేలికగా పోడు. మూడులోకాలనూ మూడడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండుతాడు. నా మాట విను ఈ దానం గీనం వద్దు అని శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కళ్ళుమూసుకొని బలిచక్రవర్తి ఇలా అన్నాడు.

‘ఓ మహాత్మా ! నీవు చెప్పింది నిజమే నేను ఈ లోకంలో అర్థమూ, కామమూ, జీవనోపాయము ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో తిరిగి పంపించలేను. ఇచ్చినమాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి “ఎటువంటి చెడ్డపని చేసిన వానినైనా మోస్తాను. కాని ఆడిన మాట తప్పిన వానిని మాత్రం మోయలేను” అని బ్రహ్మతో చెప్పింది కదా ! యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందటమూ, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైన వారికి మేలైన మార్గాలు.

రైతుకు మంచి పొలమూ, మంచి విత్తనాలు ఒక చోట దొరకడం అరుదు. అదే విధంగా దాతకు తగిన ధనమూ, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా ! ఆచార్యా! పూర్వం రాజులున్నారు, రాజ్యాలున్నాయి. ఎంతో గర్వంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొనిపోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా ? వారిని ఈనాటికి లోకం మరువలేదుకదా !

ఎడతెగని యజ్ఞాలు చేసివా పుణ్యకార్యాలు కావించినా విష్ణువును చూడటానికి వీలుపడదు. అటువంటి గొప్పవాడు పొట్టివాడై అడుగుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి. నాకు నరకం వచ్చినా, భూమండలం అదృశ్యమైనా, దుర్మరణం వచ్చినా, నా కులానికి చెడు జరిగినా సరే ! నేను ఆడినమాట తప్పను జరగవలసింది జరగనీ ! భయం లేదు. వచ్చిన వాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే ! ఎందుకు పలుమాటలు ? నా నాలుకకు మారుమాట రాదు.

బాగా బ్రతికినా, పెక్కుకష్టాలకు గురియైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికీ చేటువచ్చినా కడకు చావు సంభవించినా సరే మానధనులు మాటతప్పలేరు. బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ఆ సందర్భంలో భర్తసైగ గమనించి బ్రహ్మచారి కాళ్ళు కడగటానికి బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది. అప్పుడు బలి చక్రవర్తి ఓ బ్రహ్మచారీ ! లేవయ్యా ! ఇటు రావయ్యా ! నీవు అడిగింది ఇస్తాను.

నీ పాదాలు కడుగనివ్వు ఇంకా ఆలస్యం దేనికి ? అనగానే బలి చక్రవర్తి దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలం మేలు కల్గించేది, అన్ని ఉపనిషత్తులకూ అలంకారమైనది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేది, అయిన కుడిపాదాన్ని కడిగాడు. ఆలాగే ఎడమ పాదాన్ని కడిగాడు. ఆ నీరు తలపై జల్లుకున్నాడు.

బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. ‘బ్రహ్మణుడవు, విష్ణుస్వరూపుడవూ, వేదాల నియమాలు తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను” అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ వెనువెంటనే ధారపోసినాడు. అది చూచి లోకం ఆశ్చర్యపడింది. ఓ పరీక్షన్మహారాజా ! అన్ని భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలి చక్రవర్తి దానం చేయగానే అన్ని దిక్కులూ కళకళలాడినాయి. పంచభూతాలు “బళిబళి” అని పొగిడినాయి.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం అనే విషయాలపై నినాదాలు, సూక్తులు రాయండి.
జవాబు:
నేటికీ మన సమాజం ఈ విధంగా, మంచిగా ఉందంటే కారణం, ఆడిన మాట తప్పక పోవడం, దానగుణం కల్గిన వంటివారు నేటి సమాజంలో ఉండటం. కాబట్టి ఆడిన మాట తప్పటం కన్నా మరణించటం మేలు. దానగుణం అన్ని గుణాల్లో గొప్పది.
ఆడినమాట తప్పకపోవడం
నినాదాలు :

  1. ఆడి తప్పకండి – పలికి బొంకకండి.
  2. ఇచ్చినమాట నిలబెట్టుకొండి – నీతిగా బ్రతకండి.
  3. మితంగా మాట్లాడండి – అమితంగా విలువివ్వండి.
  4. మాటమీద నిలబడండి – పౌరుషంగా బ్రతకండి.

సూక్తులు :

  1. ఆడి తప్పరాదు. పలికి బొంకరాదు.
  2. మాటకు ప్రాణం సత్యం.
  3. మానధనులు మాట తప్పరు.
  4. ప్రాణం కంటే మాట విలువైనది.

నినాదాలు :
దానగుణం

  1. రక్తదానం చేయండి – ప్రాణాలు కాపాడండి.
  2. అవయవదానం ప్రోత్సహించండి – మరణం తర్వాతా జీవించండి.
  3. విద్యాదానం చేయండి – వివేకం పెంచండి.
  4. అన్నదానం చేయండి – జన్మను ధన్యం చేసు కోండి.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) పలికి లేదనుట = మాట ఇచ్చి తప్పుట
జవాబు:
పలికి లేదనుట కంటె మించిన పాపము లేదు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ఆ) కుఱుచగుట = పొట్టియగుట
జవాబు:
కుఱుచైనంత మాత్రమున మన విలువేమి తగ్గదు.

ఇ) చేతులొగ్గు = చేతులు వంచి
జవాబు:
కర్ణుడు ఇంద్రునకు చేతులొగ్గి దానం చేసాడు.

ప్రశ్న 2.
క్రింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

అ) నీరజభవుడు = విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు (బ్రహ్మ).
ఆ) త్రివిక్రముడు = మూడడుగులచే ముల్లోకములను కొలిచినవాడు (విష్ణువు).

ప్రశ్న 3.
క్రింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి.

అ) జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయినీ, ఆనందాన్నీ కలిగిస్తాయి.
జవాబు:
జలము – నీరు, వారి, అంబువు, ఉదకం, క్షీరము, జీవనం, సలిలము, తోయం

ఆ) జీవచ్ఛవం కావటంకన్నా యశఃకాయుడు కావడం మిన్న.
జవాబు:
యశః – కీర్తి, యశస్సు, సమజ్ఞ, భగము, శ్లోకము, ప్రతిష్ఠ, ఖ్యాతి, పేరు

ప్రశ్న 4.
క్రిందివాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.

అ) సిరి = శ్రీ
ఆ) విష్ణువు = వెన్నుడు
ఇ) ధర్మము = దమ్మము
ఈ) బ్రహ్మ = బమ్మ

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 5.
క్రింది పదాలకు నానార్థాలు రాయండి.

అ) కులము = వంశం, జాతి, శరీరం, ఇల్లు, సమూహం
ఆ) క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం, మనస్సు ఉపవాసము
ఇ) హరి = విష్ణువు, ఇంద్రుడు, గుఱ్ఱం, దొంగ, సింహం, కోతి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని
ఈ) చిత్రము = అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు, పదచమత్కారం.

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
క్రింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీసి సంధిపేరు రాయండి.
ఉదా : రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది.
అత్యద్భుతం = అతి + అద్భుతం (యణాదేశసంధి)

అ) గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు.
జవాబు:
గర్వోన్నతి = గర్వ + ఉన్నతి (గుణసంధి)

ఆ) అభ్యాగతులకు దానం చేయడం మంచిది.
జవాబు:
అభ్యాగతులకు = అభి + ఆగతులకు (యణాదేశ సంధి)

ఇ) రంతిదేవుడు వదాన్యోత్తముడు.
జవాబు:
వదాన్యోత్తముడు = వదాన్య + ఉత్తముడు (గుణసంధి)

ఈ) అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి.
జవాబు:
అణ్వాయుధాలు = అణు + ఆయుధాలు (యణాదేశ సంధి) అణ్వాయుధాలు = అణ్వాయుధము + లు (లులనల సంధి)

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రశ్న 2.
క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.

అ) జీవధనములు – జీవమును, ధనమును (ద్వంద్వ సమాసము)
ఆ) యువతీయువకులు – యువతియును, యువకులును (ద్వంద్వ సమాసము)
ఇ) దశదిక్కులు – దశ సంఖ్యగల దిక్కులు (ద్విగు సమాసము)
ఈ) భూతప్రేతములు – భూతమును, ప్రేతమును (ద్వంద్వ సమాసము)

ప్రశ్న 3.
క్రింది పద్య పాదాలను గణవిభజన చేసి, ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి. లక్షణాలను రాయండి.

అ) తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా
జవాబు:
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 1
ఇది మత్తేభ పద్యపాదము.
లక్షణములు :

  1. పై పద్యపాదమున స, భ, ర, న, మ, య, వ అను గణములు వరుసగా వచ్చినాయి.
  2. యతి 1 – 14 (తె – ధి)
  3. ప్రాస నియమం కలదు.
  4. 4 పాదములు పద్యమునకు ఉంటాయి.

ఆ) అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టియా
జవాబు:
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 2
ఇది చంపకమాల పద్యపాదము.
లక్షణములు :

  1. పై పద్యపాదమున న, జ, భ, జ, జ, జ, ర అను గణములు వరుసగా వచ్చినాయి.
  2. యతి : 1-11 (అ – య)
  3. ప్రాస నియమం కలదు.
  4. 4 పాదములు పద్యమునకు ఉంటాయి.

త్రిక సంధి:
క్రింది పదాలను గమనించండి.
అ) అచ్చోటు → ఆ + చోటు
ఆ) ఇవ్విధము → ఈ + విధము
ఇ) ఎక్కాలము → ఏ + కాలము
పై పదాలలో పూర్వపదాల్లో ఆ, ఈ, ఏ లు ఉన్నాయి. ఇవి సర్వనామాలు.
ఈ త్రికముమీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది.
ఆ, ఈ, ఏ లను ‘త్రికం’ అంటారు.
ఆ + చోటు → ఆ + చ్చోటు;
ఆ ఈ + విధము → ఈ + వ్విధము;
ఇ) ఏ + కాలము ఏ + క్కాలము
త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమౌతుంది.

ఇలా ద్విత్వం (ద్విరుక్తం) పైన ఉన్న దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

బహుళం : ఒక వ్యాకరణ కార్యం నిత్యంగారావడం, రాకపోవడం, వికల్పంగారావడం, అన్యకార్యం రావడం · ఇట్లా నాలుగు విధాలుగా జరిగితే ‘బహుళం’ అంటారు.
అ) ఆ + చ్చోటు → అచ్చోటు
ఆ) ఈ + వ్విధము → ఇవ్విధము
ఇ) ఏ + క్కాలము → ఎక్కాలము
ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికమైన దీర్ఘం హ్రస్వమౌతుంది.
ఆచ్ఛికం : అచ్చ తెలుగు పదం.

ప్రాజెక్టు పని

వివిధ పండుగల సందర్భంగా వివిధ మతాలవారు చేసే దానధర్మాలను తెలుసుకోండి. సమాచారం సేకరించండి. పట్టికను రాయండి. నివేదిక ప్రదర్శించండి.
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 3
జవాబు:
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 4
TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము 5

విశేషాంశాలు
1. అష్టాదశ పురాణాలు
1) మత్స్య పురాణం
2) మార్కండేయ పురాణం
3) భాగవత పురాణం
4) భవిష్య పురాణం
5) బ్రహ్మ పురాణం
6) బ్రహ్మవైవర్త పురాణం
7) బ్రహ్మాండ పురాణం
8) విష్ణు పురాణం
9) వరాహ పురాణం
10) వామన పురాణం
11) వాయు పురాణం
12) అగ్ని పురాణం
13) నారద పురాణం
15) లింగ పురాణం
17) కూర్మ పురాణం
14) పద్మ పురాణం
16) గరుడ పురాణం
18) స్కాంద పురాణం

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

2. శిబిచక్రవర్తి :

గొప్పదాత దయాగుణంకలవాడు. ఈయన దానగుణాన్ని పరీక్షించుటకు ఇంద్రుడు, అగ్ని డేగ, పావురాల రూపాలతో వస్తారు. పావురాన్ని డేగ నుంచి రక్షించడానికి శిబి తన శరీరభాగాన్ని కోసి ఆహారంగా ఇస్తాడు. తన శరీరాన్ని ఎంత కోసి సమర్పించినా అది పావురం బరువుతో సరితూగదు. అప్పుడు శిబి ఆర్తరక్షణ ధర్మాన్ని పాటించి తననే ఆహారంగా ఆర్పించుకుంటాడు. అంతటి మహాదాత ఆయన శిబిని కీర్తించి ఇంద్రాగ్నులు అతనికి తేజో శరీరాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తారు.

సూక్తి : తన ఆకలిని సహించుకునే తపోధనుడి శక్తికన్నా, ఇతరుల ఆకలి తీర్చే దానశీలి శక్తి మిన్న !

ప్రతిపదార్థ తాత్పర్యాలు

1. మ.
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలఁడే మాన్ప నొకండు ? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం ; బనుపుమా వర్ణిన్ నోత్తమా!

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
వదాన్య + ఉత్తమా ! = దాతల్లో శ్రేష్ఠుడా ! (ఓ బలిచక్రవర్తీ !)
కులమున్ = (రాక్షస) కులమును
రాజ్యమున్ (రాక్షస) రాజ్యమును
తేజమున్ = తేజస్సును
నిలుపుము = నిలబెట్టుము
ఈ = ఈ
కుబ్జుండు = పొట్టివాడు (వామనుడు)
విశ్వంభరుండు = విష్ణుమూర్తి (జగత్తును భరించువాడు హరి)
అలతిన్ + పోడు = అంత తేలికగా వదలిపెట్టడు
త్రివిక్రమ = ముల్లోకములను ఆక్రమించెడి
స్ఫురణన్ = స్ఫూర్తి కలవాడు
వాడు = వాడు
ఐ = అయ్యి
నిండున్ = నిండిపోవున
బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును
కలడే = సమర్థుడు ఉన్నాడా
మాన్పన్ = ఆపుటకు
ఒకండు = ఒకడైన
నా = నా యొక్క
పలుకులున్ = మాటలను
ఆకర్ణింపుము = వినుము
కర్ణంబులన్ = చెవులారా
వలదు = వద్దు
ఈ = ఈ
దానమున్ = దానము
గీనమున్ = గీనము
వర్ణిన్ = బ్రహ్మచారిని
పనుపుమా = పంపివేయుము (పంపించవయ్యా !)

తాత్పర్యము :
దాతల్లో గొప్పవాడా ! ఓ బలిచక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా ? నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

వ. అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు
క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యిట్లనియె.

ప్రతిపదార్థము
అని = అని
ఇట్లు = ఇలా
హితంబు = మేలుకోరి
పలుకుచున్న = చెప్పుతున్న
కుల = వంశ
ఆచార్యునకున్ = గురువునకున్
యశస్వి = కీర్తిగలవాడు (కీర్తిమంతుడైన) (బలి)
క్షణమాత్ర = కొంచెము సేపు
నిమీలిత = అరమూసిన
లోచనుడు = కన్నులు కలవాడు
అయి = అయ్యి
ఈ విధముగ
ఇట్లు = పలికెను

తాత్పర్యము :
అని ఈ విధంగా తన వంశగురువైన శుక్రాచార్యుడు తన మేలుకోరి చెప్పుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైన బలి ఇట్లన్నాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

2. సీ. నిజమానతిచ్చితి నీవు మహాత్మక !
మహిని గృహస్థధర్మంబు నిదియ
యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు
నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
నర్థలోభంబున నర్థిఁ బొమ్మనుటెట్లు?
పలికి లేదనుకంటెఁ బాప మెద్ది
‘యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని
సత్యహీనుని మోవఁజాల’ ననుచుఁ

తే. బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
సమరమున నుండి తిరుగకఁ జచ్చుకంటెఁ
బలికి బొంకక నిజమునఁ బరఁగు కంటెఁ
మానధనులకు భద్రంబు మఱియుఁ గలదె

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము.
నిజమున్ = సత్యమును
ఆనతిచ్చితివి = చెప్పితివి
నీవు = నీవు
మహాత్మక = గొప్ప ఆత్మ కలవాడా !
మహిని = భూమిపైన
గృహస్థ = గృహస్థుల యొక్క
ధర్మంబున్ = ధర్మము
ఇదియ = ఇదే
కామంబు = కామము (వాంఛ)
యశము = కీర్తి
వృత్తియున్ = జీవనాధారం
ఎయ్యదిన్ = ఏదైనా
ప్రార్థింపన్ = కోరితే
ఇత్తును = ఇచ్చెదను
అనియున్ = అని కూడా
అర్థ = సంపదలపై
లోభంబునన్ = లోభముతో
అర్థిన్ = అడిగినవానిని
పొమ్ము = వెళ్ళిపొమ్ము
అనుట = అనుట
ఎట్లు = ఎలా కుదురుతుంది
పలికి = మాట యిచ్చి
లేదు = లేదు
అనుట = అనుట
కంటెన్ = కంటె
పాపము = పాపము
ఎద్ది = ఏముంది ?
తొల్ల = పూర్వము
భూదేవి = భూదేవి
ఎట్టి = ఎలాంటి
దుష్కర్ముని = చెడ్డపని చేసినవానినైన
నేన్ = నేను (భూమాత)
భరించెదన్ = మోయగలను
కాని = కాని
సత్యహీనుడు = ఆడిన మాటతప్పువానిని
మోవజాలన్ = మోయలేను
అనుచున్ = అని
బ్రహ్మ = బ్రహ్మదేవుని
తోడన్ = తోటి
పలుక = అన్నది కదా
సమరమున = యుద్ధము
నుండి = నుండి
తిరుగక = వెనుతిరుగక
చచ్చు = మరణించుట
కంటెన్ = కంటె
పలికి = మాట యిచ్చి
బొంకక = పలికిలేదనకుండ
నిజమునన్ = సత్యమునందు
పరగు = వర్థిల్లెడి
కంటెన్ = కంటె
మానధనులకు = అభిమానమే ధనముగా కలవారికి
భద్రంబు = శుభమైనది
మఱియున్ = మరింకొకటి
కలదె = ఉన్నదా (లేదు అని అర్థం)

తాత్పర్యము :
ఓ మహాత్మా ! నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుటకున్నా పాపం లేదు. పూర్వం భూదేవి “ఎటువంటి చెడ్డపని చేసినవానినైన భరిస్తాను. కాని ఆడిన మాట తప్పినవానిని మాత్రం మోయలేను” అని బ్రహ్మతో చెప్పింది కదా ! యుద్ధంలో వెనుదిరుగకుండా వీరమరణం పొందడమూ మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైనవాళ్ళకు మేలైన మార్గాలు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

3. క॥ ధాత్రిని హలికునకును సు
క్షేత్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం
జిత్రముగ దాత కీవియుఁ
బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే !

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
హలికునకును = రైతుకు
ధాత్రిన్ = భూమిపైన
సుక్షేత్రము = మంచి పొలము
బీజములున్ = మంచి విత్తనములును
ఒకటన్ = ఒకేచోట
చేకుఱు = సమకూరిన
భంగిన్ = విధంగా
దాతకు = దానము చేయువానికి
చిత్రముగ = అపురూపముగ
ఈవియున్ = దానమునకు తగినది
పాత్రము = తగిన గ్రహీత
సమకూరున్ = కలిసివచ్చు
అట్టి = అటువంటి
భాగ్యము = అదృష్టము
కలదే = ఉందా, లేదు

తాత్పర్యము :
రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటం అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించటానికి ఉత్తముడైన వ్యక్తీ దొరికే అదృష్టం అరుదే కదా !

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

II

* 4. శా.
కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతిం
వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపైఁ
బేరైనం గలదే ? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు ? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !

ప్రతిపదారము

భార్గవా = ఓ శుక్రాచార్యా ! (భార్గవుడు = భృగువు పుత్రుడు, శుక్రుడు)
రాజులు = ఎంతో మంది రాజులు
కారే = కాలేదా ?
రాజ్యముల్ = రాజ్యములు
కలుగవే = పొందలేదా ఏమి
గర్వ = అహంకారముతో
ఉన్నతిన్ = గొప్పదనాన్ని
పొందరే = పొందలేదా ఏమి
వారు = వాళ్ళందరు
ఏరి = ఎక్కడ ఉన్నారు ?
సిరిని = సంపదలను
మూటగట్టుకొని = కూడగట్టుకొని
పోవన్ + చాలిరే = తీసుకెళ్ళగలిగారా, లేదు
భూమిపైన్ = నేలపైన (ఈ భూలోకంలో)
పేరు + ఐనన్ = కనీసము పేరైనా
కలరే = ఉన్నదా, లేదు
శిబి = శిబిచక్రవర్తి
ప్రముఖులున్ = మొదలగువారు
యశః = కీర్తి
కాములు + ఐ = కోరువారై
కోర్కులు = దానములను
ప్రీతిన్ = సంతోషంతో
ఈరే = ఇవ్వలేదా
ఈ = ఇప్పటి
కాలమున = కాలమునందును
వారలన్ = వారిని
మఱచిరే = మరిచిపోయారా, లేదు (మరిచిపోలేదని అర్థం)

తాత్పర్యము :
ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తి కోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా ? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా !

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

5. క. ఉడుగని క్రతువుల వ్రతములఁ
బొడగనఁ జననట్టి పొడవు పొడవునంఁ గుఱుచై
యడిగెడి నఁట ననుబోఁటికి,
నిడరాదె మహానుభావ ! యిష్టార్థంబుల్

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము
మహా + అనుభావ ! = ఓ మహానుభావా !
ఉడుగని = ఎడతెగని
క్రతువుల = యాగములతో
వ్రతములన్ = వ్రతములతో
పొడగనన్ = దర్శించుటకు
చననట్టి = వీలు కానట్టి
పొడవు = గొప్పవాడు
పొడవున = ఔన్నత్యముతో, కొలతలో
కుఱచ = తక్కువ, పొట్టి
ఐ = అయ్యి
ఇష్ట = కోరిన
అర్థంబుల్ = సంపదలను
అడిగెన్ + అంట = అడుగుతున్నాడట
నను = నా
పోటికిన్ = వంటివానికి
ఇడన్ = దానమిచ్చుట
రాదె = చేయకూడదా ఏమి

తాత్పర్యము :
మహానుభావా ! ఎడతెగని యజ్ఞాలు, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడడం సాధ్యంకాదు. అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడంకంటే నా వంటి వానికి ఇంకేం కావాలి ?

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

* 6. మ.
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము. కానిమ్ము పో :
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా ! ధీవర్య! యేటికిన్ ?

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము
ధీవర్య = ఓ విజ్ఞాని ! (ఓ పండితోత్తమా !)
నిర్ణయంబు + ఐన = నరకము దాపురించినా
నిబంధము + ఐన = అనారోగ్యం కలిగినా
ధరణీ = రాజ్యము
నిర్మ = నాశనము
ఐనన్ = అయినా సరే
దుర్మరణంబు + ఐనన్ = అకాల మరణం సంభవించినా
కుల + అంతము + ఐన = వంశం నాశమైనా
నిజమున్ = నిజంగానే పైవన్నీ
రానిమ్ము = వస్తేరానీ
కానిము = జరిగెడిది జరగనిమ్ము
వేయేటికిన్ = వేయిమాటలు దేనికి
వినుమా = వినుము
అభ్యాగతుండు = అతిథిగా వచ్చినవాడు
హరుడు = శివుడు
ఐనన్ = అయినా
హరి = విష్ణువు
నీరజభవుండు + ఐన = బ్రహ్మదేవుడయినా
నాదు = నా యొక్క
జిహ్వ = నాలుక
ఔన్ = ఇస్తానని
తిరుగన్ = వెనుతిరుగుట (మాట తప్పడం)
నేరదు = చేయలేదు

తాత్పర్యము :
ఓ పండితోత్తమా ! నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా “సరే. నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ ! ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడినమాట తప్పను) ఎందుకీ వేలకొద్ది మాటలు ?

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

III

7.
ఆ. బ్రదుకవచ్చుఁ గాక బహుబంధనములైన
వచ్చుఁగాక లేమి వచ్చుఁగాక
జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక
మాట దిరుగలేరు మానధనులు

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
బ్రదుకవచ్చున్ + కాక = (బాగా) బ్రతికే అవకాశం ఉండవచ్చు
బహు = చాలా
బంధనములు + ఐన = చిక్కులైనా
వచ్చున్ + కాక = వచ్చినా కానీ
లేమి = దరిద్రం
వచ్చున్ + కాక = వచ్చినా కానీ
జీవ = ప్రాణాలూ
ధనములు + ఐనన్ = సంపదలు కూడా
చెడున్ + కాక = చెడిపోయినా కానీ
పడున్ + కాక = మరణం వచ్చినా కానీ
మానధనులు = అభిమానమే ధనంగా గలవారైన పౌరుషవంతులు
మాటన్ = ఇచ్చిన మాటను
తిరుగలేరు = తప్పలేరు

తాత్పర్యము :
మానధనులైన వారు బాగా బ్రతికితే బ్రతకవచ్చు. చాలా చిక్కులైనా ఎదుర్కోవలసి రావచ్చును. దరిద్రం వస్తే రావచ్చు. ప్రాణాలు, సంపద కూడా నాశనం కావచ్చు. మరణం కూడా సంభవించవచ్చు. అయినా ఎట్టి పరిస్థితులలోనూ మాట తప్పరు.

వ. అయ్యవసరమున
ప్రతిపదార్థము
ఆ + అవసరమయిన = ఆ సమయంలో

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

8.
ఆ. దనుజలోకనాథు దయిత వింధ్యావళి
రాజవదన మదమరాళ గమన
వటుని కాళ్లు గడుగ వర హేమఘటమున
జలముఁ దెచ్చె భర్త సన్న యెఱిగి.

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
రాజవదన = చంద్రముఖి
మదమరాళ = రాయంచలవంటి
గమన = నడకలు కలామె
దనుజలోక నాథు= రాక్షసులందరికి రాజైన బలిచక్రవర్తి
దయిత = భార్య
వింధ్యావళి = వింధ్యావళి
భర్త = మొగుని
సన్న = సంజ్ఞను
ఎఱిగి = అర్థము చేసికొని
వటుని = బ్రహ్మచారి
కాళ్ళు = పాదములు
కడుగ = కడుగుటకు
వర = శ్రేష్ఠమైన
హేమ = బంగారు
ఘటమునన్ = కలశముతో
జలమున్ = నీటిని
తెచ్చెన్ = తీసుకువచ్చెను

తాత్పర్యము :
అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖమూ మత్తిల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతని ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయటానికై శ్రేష్ఠమైన బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

వ. అయ్యవసరంబునఁ గపటవటునకు నద్దానవేంద్రుం డిట్లనియె.

ఆ + అవసరంబున = ఆ సమయంలో (అప్పుడు)
కపట వటునకు = మోసగాడైన వామనునితో
ఆ + దానవేంద్రుడు = ఆ బలిచక్రవర్తి
ఇట్లు + అ = ఇట్లా అన్నాడు

తాత్పర్యము :
అప్పుడు వామనునితో బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు.

9.
క. రమ్మా ! మాణవకోత్తమ!
లెమ్మా ! నీ వాంఛితంబు లే దన కిత్తుం
దెమ్మా ! యడుగుల నిటు రా
నిమ్మా! కడుగంగవలయు నేఁటికిఁ దడయన్ ?

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్ధము
మాణవక + ఉత్తమా != ఉత్తమమైన బాలకుడా !
లెమ్ము + ఆ = లేచి
రమ్ము + ఆ = ఇటు రా!
అడుగులన్ = పాదములను
ఇటు = ఇటుపక్కకి
రానిమ్ము = రానిమ్ము
కడుగంగవలయున్ = కడగాలి
తెమ్ము + ఆ = తేవయ్య !
తడయున్ = ఆలస్యము చేయుట
ఏటికిన్ = దేనికి ?
నీ = నీ యొక్క
వాంఛితంబున్ = కోరికను
లేదు = లేదు
అనకన్ = అనకుండగా
ఇత్తున్ = ఇచ్చెదను

తాత్పర్యము :
ఓ ఉత్తమ బ్రహ్మచారీ! లేవయ్యా! ఇటు రావయ్యా ! నీవు అడిగింది లేదనుకుండా ఇస్తా, నీ పాదాలు కడుగనివ్వు. ఇంకా ఆలస్యం దేనికి ?

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

10.
క. సురలోక సముద్ధరణము
నిరత శ్రీకరుణ మఖిల నిగమాంతాలం
కరణము భవసంహరణము
హరిచరణము నీటఁ గడిగె నసురోత్తముఁడున్.

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్ధము
సురలోక = దేవతలు అందరును
సముద్దరణమున్ = చక్కగా కాపాడెడిది
నిరత = కలకాలము
శ్రీకరుణ = మేలు కలిగించెడిది
అఖిల = సర్వ
నిగమాంత = వేదాంతములకు
అలంకరణమున్ = అలంకారమైనది
భవ = పునర్జన్మప్రాప్తి
సంహరణమున్ = పోగొట్టునది
హరి = విష్ణుని యొక్క
చరణమున్ = పాదమును
అసుర = రాక్షసులలో
ఉత్తముడున్ = శ్రేష్ఠుడైన బలిచక్రవర్తి
నీట = నీటితో
కడిగెన్ = శుభ్రపరచెను

తాత్పర్యము :
వామనుడైన విష్ణువు కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది. కలకాలమూ మేలు కలిగించేది. అన్ని ఉపనిషత్తులకూ అలంకారమైంది. భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని పాదాన్ని కూడా కడిగాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

వ. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు సేసి
వామపాదంబు గడిగి తత్పావన జలంబు
శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణ నంబుసేసి.

ప్రతిపదార్దము
ఇట్లు = ఈ విధముగ
ధరణీసుర = బ్రాహ్మణుని (ధరణీసురుడు – భూమిపై దేవత-విప్రుడు)
దక్షిణ = కుడి
చరణ = పాదమును
ప్రక్షాళనము = కడుగుట
చేసి = చేసి
వామ = ఎడమ
పాదంబున్ = పాదమును
కడిగి = కడిగి
తత్ = ఆ రెండు పాదాలూ కడిగిన
పావన = పవిత్రమైన
జలంబున్ = నీటిని
శిరంబునన్ = తలపైన
చల్లుకొని = చిలకరించుకొని
దేశ = ప్రదేశము
కాల = కాలము
ఆది = మున్నగువాని
పరిగణనంబు = సంకల్పము
చేసి = చేసి (చెప్పాడు)
వార్చి = పూజించి

తాత్పర్యము :
పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశ, కాల పూర్వకమైన ‘సంకల్పాన్ని’ చెప్పాడు

11. శా.
‘విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
ద ప్రామాణ్యవిదే త్రిపాదధరణీం దాస్యామి’ యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాఁచి పూజించి ‘బ్ర
హ్మ ప్రీత మ్మని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందఁ గన్.

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్ధము
దనుజేశ్వరుండు = రాక్షసరాజు బలిచక్రవర్తి
విప్రాయ = బ్రాహ్మణుని కొరకు
ప్రకట = ప్రసిద్ధమైన
వ్రతాయ = నిష్ఠకల వానికొరకు
విష్ణు = విష్ణుమూర్తి యొక్క
స్వరూపాయ = స్వరూపము ఐనవాడి కొరకు
వేద = వేదములందలి
ప్రామాణ్య = ప్రమాణములను
విదే = తెలిసినవాడవు
భవతే = నాకు
త్రి = మూడు (3)
పాద = అడుగుల
ధరణీం = భూమిని
దాస్యామి = దానము చేయుచుంటిని
అంచున్ = అనుచు
క్రియాక్షిప్రుండై = పనియందు వేగము కలవాడై
చేన్ = చేయి
చాచి = చాచి
వడుగున్ = బ్రహ్మచారిని
పూజించి = పూజచేసి
భువనంబు = జగత్తంతా
ఆశ్చర్యమున్ = ఆశ్చర్యము
పొందగన్ = పడునట్లుగా (పడింది)
బ్రహ్మ = పరబ్రహ్మకి
ప్రీతమ్ము = ప్రీతి కలుగుగాక
అని = అని
ధారవోసి (ధార + పోసి) = ధారపోసెను (దారపోయు దానం చేసెడి క్రియలో నీటిధారను దాతచేతి నుండి గ్రహీత చేతిలో పడునట్లు పోసెడి విధి)

తాత్పర్యము :
బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. “బ్రాహ్మణుడవూ ప్రసిద్ధమైన వ్రతము కలవాడవూ విష్ణు స్వరూపుడవూ వేదాల ప్రమాణతను తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నా’ అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ వెనువెంటనే చేతిలో నీటిని ధారవోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

12.
క. బలి చేసిన దానమునకు
నలినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం
గలకల మని దశ దిక్కులు
బళి బళియని పొగడె భూత పంచకమనఘా!

కవి పరిచయం :
ఈ పద్యము మహాకవి బమ్మెర పోతనచే రచించబడిన ‘దానశీలము’ అనే పాఠ్యభాగము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
అనఘా = ఓ పుణ్యుడా ! (పరీక్షిన్మహారాజా !)
బలి = బలి చక్రవర్తి
చేసిన = చేసినట్టి
దానమునకు = దానమునకు
నలినాక్షుఁడు = విష్ణువు
నిఖిల = సమస్తమైన
భూత = జీవులకు
నాయకుడు = ప్రభువు
అగుటన్ = అగుట వలన
దశ = పది
దిక్కులు = దిశలందు (దశ దిక్కులు = 4 దిక్కులు, 4 మూలలు, పైన క్రింద మొత్తం 10 వైపులు)
భూతపంచకము = పంచభూతములును (పంచభూతములు (1) పృథివి (2) అప్ (3) తేజస్సు (4) వాయువు (5) ఆకాశము)
గలకలమని = కలకలలాడి
బళిబళి = ఒహో ఒహో
అని = అని
పొగడె = (విష్ణువును) పొగిడిను

తాత్పర్యము :
ఓ పరీక్షిన్మహారాజా ! అన్ని భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానమియ్యగానే పది దిక్కులూ, పంచభూతాలూ “బళి బళి” అని పొగిడాయి.

పాఠం నేపథ్యం / ఉద్దేశం

విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడు. ఇతడు తన శక్తిసామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలినవారు వివక్షకు గురౌతారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిస్తాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనా వతారం ఎత్తుతాడు. బలి నర్మదానదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట యిస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహిస్తాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు. బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అంటాడు.

ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వాన్ని, దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

పోతన తెలుగులో భాగవతాన్ని రాశాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీమత్ భాగవతం, అష్టమ స్కంధంలోని “వామన చరిత్ర” లోనిది.

కవి పరిచయం

కవి పేరు : బమ్మెర పోతనామాత్యుడు.

గ్రహింపబడిన గ్రంథం: బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలోని ‘వామన చరిత్ర’ లోనిది.

పోతన తల్లిదండ్రులు : లక్కమాంబ, కేసన

కాలము : 15వ శతాబ్దము.

జన్మస్థలము : బమ్మెర గ్రామము, పూర్వపు వరంగల్ జిల్లా.

ఇతర రచనలు : వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం, ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీకల్యాణం.

అంకితం : మానవమాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం ఇవ్వనన్నాడు. భగవంతుడిచ్చిన కవితాశక్తితో రచించిన భాగవతాన్ని శ్రీరామునికే అంకితం ఇస్తానన్నాడు. శ్రీరామ చంద్రునికే అంకితం ఇచ్చాడు.

అనువాదం : పోతన కొన్ని భాగాలను పెంచి వర్ణించాడు. కొన్నిటిని ఉన్నవి ఉన్నట్లుగా అనువదించాడు.

బిరుదు : పోతనకు ‘సహజ పండితుడు’ అని బిరుదు కలదు. అంటే పుట్టుకతోనే ఆయనకు పాండిత్యం, కవిత్వము అల్లగల శక్తి ఉన్నాయి. పోతన ‘భక్తకవి’.

ప్రత్యేకత : పండిత పామర జనరంజకంగా బమ్మెర పోతన రచన ఉంటుంది. ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీకల్యాణం, వామన చరిత్ర మొదలైన వాటిలో పద్యాలు నోటికి రాని తెలుగువారు లేరు.

అలంకారాలు : శబ్దాలంకారాలు ఎక్కువగా ప్రయో గించాడు. అర్థాలంకారాలు కూడా సందర్భానుసారంగా ప్రయో గించాడు.

నివాసం : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు జిల్లా నేటి జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామ నివాసి.

వృత్తి : వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించాడు. అంతేకాని, రాజా స్థానాలకు వెళ్ళలేదు. సన్మానాలను తిరస్కరించాడు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

ప్రవేశిక

ఇచ్చిన మాట తప్పకపోవటం, తాను సంపాదించిన దానిలో శక్తిమేరకు దానం చేయడం, తన యింటికి వచ్చిన అతిథి, అభ్యాగతులను ఆదరించటం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు.

మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది.

ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చినమాటకు కట్టుబడి తన గురువు వారించినా, హెచ్చరిస్తున్నా కాదంటూ ‘వామనుని’ కోరికమేరకు దానం చేస్తాడు.

ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసు కొండి.

ప్రక్రియ -ప్రాచీన పద్యం (పురాణం)

ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. ‘సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం’ అనేవి పురాణ లక్షణాలు. పురాణాలు 18. వీటిలో భాగవత పురాణం ఒకటి. పోతన తెలుగులో భాగవతాన్ని రాశాడు.

పాఠ్యభాగ సారాంశము

శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో నీ కులాన్ని, రాజ్యాన్ని నిలబెట్టుకో ఈ పొట్టివాడు విష్ణువు. ఇతడు తేలికగా పోడు. మూడులోకాలనూ మూడడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండుతాడు. నా మాట విను ఈ దానం గీనం వద్దు అని శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కళ్ళుమూసుకొని బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ‘ఓ మహాత్మా ! నీవు చెప్పింది నిజమే నేను ఈ లోకంలో అర్థమూ, కామమూ జీవనోపాయము – ఏది అడిగినా ఇస్తానని చెప్పాను.

ఇప్పుడు ధనంపై దురాశతో తిరిగి పంపించలేను. ఇచ్చినమాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి “ఎటువంటి చెడ్డపని చేసిన వానినైనా మోస్తాను. కాని ఆడిన మాట తప్పిన వానిని మాత్రం మోయలేను” అని బ్రహ్మతో చెప్పింది కదా ! యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందటమూ, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైన వారికి మేలైన మార్గాలు.

TS 10th Class Telugu Guide 1st Lesson దానశీలము

రైతుకు మంచి పొలమూ, మంచి విత్తనాలు ఒక చోట దొరకడం అరుదు. అదే విధంగా దాతకు తగిన ధనమూ, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా ! ఆచార్యా ! పూర్వం రాజులున్నారు, రాజ్యాలున్నాయి. ఎంతో గర్వంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదను మూటకట్టు కొనిపోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా ? వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా !

ఎడతెగని యజ్ఞాలు చేసినా పుణ్యకార్యాలు కావించినా విష్ణువును చూడటానికి వీలుపడదు. అటువంటి గొప్పవాడు పొట్టివాడై అడుగుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి. నాకు నరకం వచ్చినా, భూమండలం అదృశ్యమైనా, దుర్మరణం వచ్చినా, నా కులానికి చెడు జరిగినా సరే ! నేను ఆడినమాట తప్పను జరగవలసింది జరగనీ ! భయం లేదు. వచ్చిన వాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే ! ఎందుకు పలుమాటలు ? నా నాలుకకు మారుమాట రాదు.

బాగా బ్రతికినా, పెక్కు కష్టాలకు గురియైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటువచ్చినా కడకు చావు సంభవించినా సరే మానధనులు మాటతప్పలేరు. బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ఆ సందర్భంలో భర్తసైగ గమనించి బ్రహ్మచారి కాళ్ళు కడగటానికి బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది. అప్పుడు బలి చక్రవర్తి ఓ బ్రహ్మచారీ ! లేవయ్యా ! ఇటు రావయ్యా ! నీవు అడిగింది. ఇస్తాను. నీ పాదాలు కడుగనివ్వు ఇంకా ఆలస్యం దేనికి ?

అనగానే బలి చక్రవర్తి దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలం మేలు కల్గించేది, అన్ని ఉపనిషత్తులకూ అలంకార మైనది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేది, అయిన కుడిపాదాన్ని కడిగాడు. ఆలాగే ఎడమ పాదాన్ని కడిగాడు. ఆ నీరు తలపై జల్లుకున్నాడు.

బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. ‘బ్రహ్మణుడవు విష్ణుస్వరూపుడవూ, వేదాల నియమాలు – తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను’ అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ వెనువెంటనే ధారపోసినాడు. అది చూచి లోకం ఆశ్చర్యపడింది. ఓ పరీక్షన్మహారాజా ! అన్ని భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలి చక్రవర్తి దానం చేయగానే అన్ని దిక్కులూ కళకళలాడినాయి. పంచభూతాలు “బళిబళి” అని పొగిడినాయి.

Leave a Comment