TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana Chandassu ఛందస్సు Questions and Answers.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

1. ఉత్పలమాల :

  1. ఉత్పలమాల వృత్తము నందు సాధారణముగా నాలుగు పాదములుండును.
  2. ప్రతి పాదమునందును భ, ర, న, భ, భ, ర, వ అను గణములు వరుసగా ఉండును.
  3. పదవ అక్షరము యతి స్థానము.
  4. ప్రాస నియమము కలదు.

2. చంపకమాల :

  1. ప్రతి పద్యమునందును నాలుగు పాదము లుండును. ఇది వృత్తము.
  2. ప్రతి పాదములోను న, జ, భ, జ, జ, జ, ర అను గణాలు వరుసగా ఉండును.
  3. పదకొండవ అక్షరమున యతి చెల్లును.
  4. ప్రాస నియమము కలదు.

3. శార్దూలము:

  1. నాలుగు పాదములు గల వృత్తము.
  2. ప్రతి పాదంలోను 19 అక్షరాలు ఉంటాయి.
  3. ప్రతి పాదములోను మ, స, జ, స, త, త, గ అను గణములు వరుసగా ఉండును.
  4. పదమూడవ అక్షరమున యతి చెల్లును.
  5. ప్రాస నియమము కలదు.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

4. మత్తేభము :

  1. నాలుగు పాదములు గల వృత్తము.
  2. ప్రతి పాదంలోను 20 అక్షరాలు ఉంటాయి.
  3. ప్రతి పాదము నందు స, భ, ర, న, మ, య, వ అను గణములు వరుసగా ఉండును.
  4. పదునాల్గవ అక్షరము యతి స్థానము.
  5. ప్రాస నియమము కలదు.

5. తేటగీతి :

  1. తేటగీతి పద్యమునందు సాధారణముగా నాలుగు పాదములుండును.
  2. ప్రతి పాదము నందును ఒక సూర్యగణము, రెండు ఇంద్ర గణములు, రెండు సూర్యగణములు వరుసగా ఉండును.
  3. నాలుగవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
  4. ప్రాస నియమము లేదు.
  5. ప్రాసయతి వేయవచ్చును.

6. ఆటవెలది :

  1. ఆటవెలది పద్యమునందు నాలుగు పాదము లుండును.
  2. 1, 3 పాదములలో మూడు సూర్యగణములు, మా రెండు ఇంద్రగణములు వరుసగా వచ్చును.
  3. 2, 4 పాదములలో అయిదు సూర్యగణములే ఉండును.
  4. నాలుగవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
  5. ప్రాస నియమము లేదు.
  6. ప్రాసయతి వేయవచ్చును.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

7. కందము :

  1. 1, 3 పాదములలో మూడేసి గణములు, 2, 4 పాదములలో ఐదేసి గణములు ఉండును. అనగా 1, 2 పాదాలలో 8 గణములు అట్లే 3, 4 పాదములలో కలిసి 8 గణములు ఉండును.
  2. గగ, భ, జ, స, నల యను గణములు ద్రగణలు మాత్రమే వాడవలెను.
  3. ప్రాస నియమము కలదు.
  4. 2, 4 పాదములలో చివరి అక్షరము గురువుగా ఉండవలెను.
  5. 2, 4 పాదములలో మూడవ గణము (1, 2 భగణం పాదములు కలిపిన 6వ గణము) నలము గాని, జగణము గాని తప్పక ఉండవలెను.
  6. 2, 4 పాదములలోని మొదటి గణం మొదటి అక్షరానికి, అదే పాదములోని నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లును.
  7. బేసి గణము (1, 3, 5, 7) జగణము కాకూడదు.

8. ద్విపద :
రెండు పాదములే ఉండును. ప్రతి పాదము నందును 3 ఇంద్ర గణములు, 1 సూర్యగణము ఉండును. 3వ గణము మొదటి అక్షరమున యతిమైత్రి చెల్లును. రెండేసి పాదములకు ఒక ప్రాస ఉండును.

9. సీసము :

  1. ప్రతి పాదమునందును ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉండును.
  2. ఒకటి, మూడు, అయిదు, ఏడు గణముల ప్రథమాక్షర ములకు యతి చెల్లును.
  3. ప్రాస నియమము లేదు.
  4. ప్రాసయతి వేయవచ్చును.
  5. నాలుగుపాదాల చివర ఆటవెలదిగాని, తేటగీతిగాని తప్పక చేర్చవలెను.
  6. ప్రతి పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి, రెండు భాగాలుగా చేయవచ్చును.
  7. మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు, రెండో భాగంలో రెండు సూర్యగణాలు వరుసగా ఉండును.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

గురు లఘువులను గుర్తించి, పద్య వృత్తమును గుర్తించటం

1.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 1
ఇది చంపకమాల పద్యపాదము.

2.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 2
ఇది “ఉత్పలమాల” పద్యపాదము.

3.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 3 ఇందులో 3 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉన్నాయి. ఇది ద్విపద పద్యపాదము.

4.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 4
ఈ పద్యపాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “ఉత్పలమాల” పద్యపాదము.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 5
ఈ పద్యపాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “చంపకమాల” పద్యపాదము.

6.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 6 ఈ పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “శార్దూల” పద్యపాదం.

7.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 7
ఈ పద్యపాదంలో స, భ, ర, న, మ, య, వ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి పద్యపాదము మత్తేభము.

8.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 8
ఇది తేటగీతి పద్యపాదము.

TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

9.
TS 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 9
ఇది ద్విపద పద్యపాదము.

Leave a Comment