These TS 10th Class Telugu Bits with Answers 7th Lesson శతక మధురిమ will help students to enhance their time management skills.
TS 10th Class Telugu Bits 7th Lesson శతక మధురిమ
బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు (1 మార్కు)
ప్రశ్న 1.
పుస్తకాల పురుగు : ………………….
జవాబు:
పుస్తకాల పురుగులైతే గానీ ఫస్టు ర్యాంకులు పరీక్షలో రావు.
ప్రశ్న 2.
నోటి చలువ : …………………….
జవాబు:
అతని నోటిచలువ వల్ల ఎవరిని దీవించినా శుభాలే జరుగుతాయి.
ప్రశ్న 3.
పెడచెవిన పెట్టు : ………………….
జవాబు:
పెద్దల మాటను పెడచెవిన పెట్టరాదు.
ప్రశ్న 4.
దిగ్భ్రాంతి : ……………………
జవాబు:
అనుకోనివి జరిగినపుడు మనిషి దిగ్భ్రాంతి చెందుతాడు.
2. అర్థాలు
ప్రశ్న 1.
తెలంగాణ భాష ఎంతో విశిష్ఠమైనది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) విలువ లేనిది
B) విలువైనది
C) సంస్కృతి
D) ఇవి ఏవీ కావు
జవాబు:
B) విలువైనది
ప్రశ్న 2.
విద్యార్థికి నిర్మలమైన ఆలోచనలు, శ్రద్ధ ఉండాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) చల్లనైన
B) అస్వచ్ఛమైన
C) స్వచ్ఛమైన
D) కఠినమైన
జవాబు:
C) స్వచ్ఛమైన
ప్రశ్న 3.
మనిషికి ఈగి గుణం ఉండాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) ధర్మగుణం
B) దానగుణం
C) తస్కరించే గుణం
D) చాడీలు చెప్పే గుణం
జవాబు:
B) దానగుణం
ప్రశ్న 4.
వక్త్రమునకు తిలకమే అలంకారము. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) ముఖము
B) నుదురు
C) నొసలు
D) మనిషి
జవాబు:
A) ముఖము
ప్రశ్న 5.
నా మిత్రుడి సౌజన్యమునకు పెద్దలు సంతోషించారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గొప్పతనము
B) ఉపన్యాసం
C) మంచితనం
D) ఐశ్వర్యం
జవాబు:
C) మంచితనం
ప్రశ్న 6.
రాజులు వేదండములెక్కి ఊరేగుతారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) గుఱ్ఱము
B) ఏనుగు
C) పల్లకి
D) కారు
జవాబు:
B) ఏనుగు
ప్రశ్న 7.
దేశ ప్రాశస్త్యమును గూర్చి గురువులు చెప్పాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) ప్రశస్తి
B) ఐశ్వర్యము
C) ప్రాధాన్యం
D) రక్షణ
జవాబు:
A) ప్రశస్తి
ప్రశ్న 8.
యుద్ధసాధనాల్లో కృపాణము ముఖ్యమైనది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) విల్లు
B) తుపాకి
C) కత్తి
D) బాణము
జవాబు:
C) కత్తి
ప్రశ్న 9.
నెహ్రుజీ పాలనాకాలంలో భారత ఖ్యాతి అనిదం పూర్వంగా విస్తరించింది. (గీత గీసిన పదానికి కి అర్థం గుర్తించండి.)
A) గొప్పగా
B) ఎంతో ఉన్నతంగా
C) ఇంతకుముందు లేనంతగా
D) విశేషంగా
జవాబు:
B) ఎంతో ఉన్నతంగా
ప్రశ్న 10.
గురువుల ఆజ్ఞలను శిష్యులు ఔదల ధరించాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) నడినెత్తి
B) భక్తి
C) శ్రద్ధ
D) నిర్లక్ష్యం
జవాబు:
A) నడినెత్తి
ప్రశ్న 11.
కనకపు గొలుసులు కొనాలంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం (Mar. ’18)
A) అందమైన
B) బంగారపు
C) రాగి
D) మెరిసేది
జవాబు:
B) బంగారపు
ప్రశ్న 12.
“వేదండము” అనే పదానికి అర్థము (June ’17)
A) సింహము
B) సింహాసనము
C) ఏనుగు
D) విసనకర్ర
జవాబు:
C) ఏనుగు
3. పర్యాయపదాలు
ప్రశ్న 1.
పుస్తకం హస్త భూషణం. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) ఖడ్గం, హసి
B) కుసుమం, సుమం
C) త్యాగం, ఈగి
D) కావ్యం, గ్రంథం
జవాబు:
D) కావ్యం, గ్రంథం
ప్రశ్న 2.
హరిశ్చంద్రుడు ఎప్పుడు సత్యమునే చెప్పేవాడు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) నిజం, యధార్థం
B) పాము, భుజగం
C) ఖడ్గము, కృపాణము
D) దానవులు, రాక్షసులు
జవాబు:
A) నిజం, యధార్థం
ప్రశ్న 3.
బాగా చదివితే విద్యార్థులు బుధులౌతారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) యశస్సు, పేరు
B) పందెం, కూలి
C) సమదర్శి, సర్వజ్ఞుడు
D) భగము, సమజ్ఞ
జవాబు:
C) సమదర్శి, సర్వజ్ఞుడు
ప్రశ్న 4.
గజముల రాజు గజేంద్రుడు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
A) హస్తి, కరి
B) దంతావళము, దంతాలు
C) అనేకపము, మీనము
D) వేదండము, వేదాంగము
జవాబు:
A) హస్తి, కరి
ప్రశ్న 5.
దోస్తు నేస్తం – అనే పదాలు పర్యాయపదాలుగా ఉన్న పదం ?
A) అరి
B) విరోధి
C) నెచ్చెలికాడు
D) భాగం
జవాబు:
C) నెచ్చెలికాడు
ప్రశ్న 6.
లతాంతము, సుమము – అనే పర్యాయపదాలుగా గల పదం ?
A) కొమ్మ
B) పుష్పము
C) తీగె
D) చెట్టు
జవాబు:
B) పుష్పము
ప్రశ్న 7.
బుధులు చెప్పిన నీతివాక్యాలు జీవితానుభవంలోనివే -గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పండితులు, విదులు
B) ఒక గ్రహము, బుద్ధిమంతురాలు
C) పెద్దలు, విదులు
D) మనీషి, పెద్దలు
జవాబు:
A) పండితులు, విదులు
ప్రశ్న 8.
పూజ – అనే అర్థం గల పర్యాయపదాలు
A) పూజ, పూలు
B) ఆరాధన, నమస్కారము
C) ఆరాధన, ఉపాసన
D) అర్చన, కొలుపు
జవాబు:
C) ఆరాధన, ఉపాసన
ప్రశ్న 9.
వరుడు వధువు “కేలు” పట్టి నడిపించాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కేలు, మేలు
B) చేయి, హస్తము
C) చేయి, కొంగు
D) కాలు, చేయి
జవాబు:
B) చేయి, హస్తము
ప్రశ్న 10.
గురువు ఆజ్ఞ ఔదలదాల్చువాడు నీతి తెలిసినవాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) శిరసావహించు, తలదాల్చు
B) భుజాలపై మోయు, తలదాల్చు
C) చెవులతో విను, ముఖములో దాచు
D) చేతితో తాకు, శిరసావహించు
జవాబు:
A) శిరసావహించు, తలదాల్చు
ప్రశ్న 11.
“సిరి” అనే పదానికి పర్యాయపదాలు (June ’17)
A) సంపద, నీరు
B) నీరు, జలము
C) సంపద, ధనము
D) ధనము, జలము
జవాబు:
C) సంపద, ధనము
4. వ్యుత్పత్త్యర్థాలు
ప్రశ్న 1.
సర్వమును తెలిసినవాడు. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించండి.)
A) దాశరథి
B) విశ్వనాథుడు
C) పుత్రుడు
D) సర్వజ్ఞుడు
జవాబు:
D) సర్వజ్ఞుడు
ప్రశ్న 2.
ప్రపంచమునకు భర్త (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించండి.)
A) నరసింహస్వామి
B) బ్రహ్మ
C) ఇంద్రుడు
D) విశ్వనాథుడు
జవాబు:
D) విశ్వనాథుడు
ప్రశ్న 3.
“దశరథుని కుమారుడు” అనే వ్యుత్పత్తి కలిగిన పదము (June ’17)
A) సౌమిత్రి
B) కరుణాపయోనిధి
C) దాశరథి
D) కోదండపాణి
జవాబు:
C) దాశరథి
ప్రశ్న 4.
“అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవారు” – దీనికి వ్యుత్పత్తి పదం ?
A) రాక్షసుడు
B) బ్రహ్మ
C) గురువు
D) విష్ణువు
జవాబు:
C) గురువు
ప్రశ్న 5.
స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు – వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.
A) దాశరథి
B) బ్రహ్మ
C) విష్ణువు
D) ఈశ్వరుడు
జవాబు:
D) ఈశ్వరుడు
ప్రశ్న 6.
నలుపు వర్ణము కలవాడు – వ్యుత్పత్త్యర్థ గుర్తించండి.
A) రాముడు
B) కృష్ణుడు
C) అర్జునుడు
D) సాయి
జవాబు:
B) కృష్ణుడు
ప్రశ్న 7.
సత్పురుషుల యందు పుట్టునది – అను వ్యుత్పత్తి గల పదం
A) మంచితనం
B) సత్యము
C) భక్తి
D) ధైర్యము
జవాబు:
B) సత్యము
ప్రశ్న 8.
బుధుడు – అను పదమునకు వ్యుత్పత్తి అర్థం
A) బుద్ధి గలవాడు
B) సర్వము తెలిసినవాడు
C) పెద్ద ఆకారము గలవాడు
D) పెద్దలలో పెద్దవాడు
జవాబు:
A) బుద్ధి గలవాడు
ప్రశ్న 9.
దీని చేత పలుకబడును – అను వ్యుత్పత్తి గల పదం ?
A) వక్త్రము
B) వీణ
C) శక్తి
D) ఆలోచన
జవాబు:
A) వక్త్రము
ప్రశ్న 10.
భక్తికి లొంగువాడు భీముడు – గీత గీసిన పదానికి సరియైన వ్యుత్పత్తిని గుర్తించండి.
A) పాండవ వంశంలో పుట్టినవాడు
B) భయమును కలిగించువాడు
C) బలమును ప్రదర్శించువాడు
D) సంపద కలవాడు
జవాబు:
B) భయమును కలిగించువాడు
ప్రశ్న 11.
సర్వ భూతములందు స్నేహము కలవాడు – అనే వ్యుత్పత్తి గల పదం?
A) పావని
B) రాజు
C) మిత్రుడు
D) భూతపతి
జవాబు:
C) మిత్రుడు
ప్రశ్న 12.
భాగీరథి – దీనికి వ్యుత్పత్త్యర్థము
A) భగీరథునిచే తీసుకురాబడినది – గంగ
B) భగీరథుని రాజ్యం – గంగ
C) భగీరథుని రథం – గంగ
D) భగీరథుని తల్లి – గంగ
జవాబు:
A) భగీరథునిచే తీసుకురాబడినది – గంగ
ప్రశ్న 13.
విశ్వమును భరించువాడు ఈ వ్యుత్పత్తిని సూచించు పదం
A) విశ్వభరుడు
B) విశ్వదరుడు
C) విశ్వహరుడు
D) విశ్వంభరుడు
జవాబు:
D) విశ్వంభరుడు
5. నానార్థాలు
ప్రశ్న 1.
కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చోపెట్ట కూడదు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)
A) బంగారం, ఉమ్మెత్త
B) పందెం, కూలి
C) వాన, సంవత్సరం
D) సంపద, లక్ష్మి
జవాబు:
A) బంగారం, ఉమ్మెత్త
ప్రశ్న 2.
మిత్రుడు మంచిపుస్తకం వంటివాడు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)
A) కీర్తి, అధికం
B) సంపద, లక్ష్మి
C) సూర్యుడు, స్నేహితుడు
D) వంశం, జాతి
జవాబు:
C) సూర్యుడు, స్నేహితుడు
ప్రశ్న 3.
జీవనం గాలి బుడగ వంటిది. గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)
A) బ్రతుకు, నీళ్ళు
B) వాన, ఏడాది
D) ఇల్లు, శరీరం
C) కూలి, వెల
జవాబు:
A) బ్రతుకు, నీళ్ళు
ప్రశ్న 4.
శ్రీరాముని గుణము చక్కనిది – గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.
A) వింటినారి, కోపము
B) దారం, వింటికారి
C) స్వభావం, గుణం
D) దారం, గుణం
జవాబు:
B) దారం, వింటికారి
ప్రశ్న 5.
శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప రాజు – గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.
A) ప్రభువు, సూర్యుడు
B) దిక్కు, కోరిక
C) మానవుడు, అర్జునుడు
D) ప్రభువు, చంద్రుడు
జవాబు:
D) ప్రభువు, చంద్రుడు
ప్రశ్న 6.
ఆశ శృతి మించరాదు. గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) దిక్కు, కోరిక
B) త్రోవ, పంక్తి
C) జాతి, వంశం
D) వెల, భూమి
జవాబు:
A) దిక్కు, కోరిక
ప్రశ్న 7.
మిత్రులు లేని జీవితం వ్యర్థం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) జాతి, వంశం
B) స్నేహితుడు, సూర్యుడు
C) మానవుడు, అర్జునుడు
D) లక్ష్మి, పార్వతి
జవాబు:
B) స్నేహితుడు, సూర్యుడు
ప్రశ్న 8.
ప్రథమము – అనే పదానికి నానార్థాలు ఏవి ?
A) మొదటిది, ముఖ్యము
B) మొదటిది, ఒక్కటిగా
C) ప్రారంభము, ముఖ్యము
D) ఆది, తుది
జవాబు:
A) మొదటిది, ముఖ్యము
ప్రశ్న 9.
కృతయుగము, ఒక లోకము, నిజము నానార్థాలు గల పదం ?
A) ఋణము
B) యుగము
C) సత్యము
D) ఒట్టు
జవాబు:
C) సత్యము
ప్రశ్న 10.
సాధువుల అర్చన విశిష్టమైనది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పూజ, పూజనము
B) పూజ, గౌరవించుట
C) అర్చన, గీతాలు
D) శ్లోకాలు, గీతాలు
జవాబు:
B) పూజ, గౌరవించుట
ప్రశ్న 11.
అందరికి అధిపతి “ఈశ్వరుడు” – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పరమాత్మ, ప్రభువు, శివుడు
B) శివుడు, పార్వతి, యజమాని
C) పరమాత్మ, కాలుడు, పూజారి
D) ధనవంతుడు, శివుడు, వేణి
జవాబు:
A) పరమాత్మ, ప్రభువు, శివుడు
ప్రశ్న 12.
లక్ష్మి, సరస్వతి, సంపద, విషము – అను నానార్థాలు గల పదము
A) గాయత్రి
B) కాలకూటము
C) ఐశ్వర్యము
D) శ్రీ
జవాబు:
D) శ్రీ
ప్రశ్న 13.
బుధుడు – అను పదానికి నానార్థాలు
A) ఒక గ్రహము, విద్వాంసుడు
B) విగ్రహము, వేలుపు
C) ఒక వారము, నక్షత్రము
D) దాత, విద్వాంసుడు
జవాబు:
A) ఒక గ్రహము, విద్వాంసుడు
ప్రశ్న 14.
గురువు – అనే పదానికి నానార్థాలు
A) ఉపాధ్యాయుడు, రిక్షావాడు
B) బృహస్పతి, ఒక వారం
C) ఉపాధ్యాయుడు, బృహస్పతి
D) తండ్రి, బండి లాగువాడు
జవాబు:
C) ఉపాధ్యాయుడు, బృహస్పతి
ప్రశ్న 15.
సూర్యుడు, స్నేహితుడు – ఈ నానార్థాలను సూచించు పదం
A) ఇంద్రుడు
B) హరి
C) మిత్రుడు
D) శివుడు
జవాబు:
C) మిత్రుడు
6. ప్రకృతి – వికృతులు
ప్రశ్న 1.
మహాభాగవతం గొప్ప కావ్యం (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
A) కబ్బం
B) కార్యము
C) కర్జము
D) కంబం
జవాబు:
A) కబ్బం
ప్రశ్న 2.
హృదయంలో కల్మషం ఉండరాదు (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
A) ఋషి
B) భూమి
C) ఎద
D) భిక్ష
జవాబు:
C) ఎద
ప్రశ్న 3.
వ్యాసుడు భిక్ష చేసి శిష్యులను పోషించెను. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
A) బికిరం
B) మిత్తి
C) రుషి
D) జన్మ
జవాబు:
A) బికిరం
ప్రశ్న 4.
బడి పొత్తములు భద్రంగా ఉంచుకోవాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) గ్రంథము
B) పుస్తకములు
C) సంచి
D) పత్రము
జవాబు:
B) పుస్తకములు
ప్రశ్న 5.
ఈ పృథివిలో భారతదేశం పవిత్రదేశం గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) భూమి
B) నేల
C) పుడమి
D) ధరణి
జవాబు:
C) పుడమి
ప్రశ్న 6.
బిచ్చము – వికృతిగా గల పదం ?
A) భిక్షము
B) బిచ్చు
C) బిట్టు
D) బీగము
జవాబు:
A) భిక్షము
ప్రశ్న 7.
నా కార్యమునకు దైవ సహాయం కలదు గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కారణము
B) కర్జము
C) కర్ణము
D) కరణము
జవాబు:
B) కర్జము
ప్రశ్న 8.
సిరి గలవాడు విష్ణువే – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) లచ్చి
B) లక్ష్మి
C) సిరులు
D) శ్రీ
జవాబు:
D) శ్రీ
ప్రశ్న 9.
భక్తి – అనే పదానికి వికృతి పదము
A) బకితి
B) బత్తి
C) ప్రపత్తి
D) పూజ
జవాబు:
B) బత్తి
ప్రశ్న 10.
తిరము – అనే పదానికి వికృతి
A) తీరము
B) తిరగలి
C) స్థిరము
D) చిరము
జవాబు:
C) స్థిరము
ప్రశ్న 11.
విద్య వలన వినయం వస్తుంది. గీత గీసిన పదానికి వికృతి పదం
A) విద్య
B) విద్దె
C) వద్ద
D) విద్యా
జవాబు:
D) విద్యా
ప్రశ్న 12.
చెరువులో మచ్చీలు దొరికాయి. గీత గీసిన పదానికి ప్రకృతి పదం
A) మచ్చము
B) మత్సరం
C) మత్స్యము
D) మచ్చడం
జవాబు:
C) మత్స్యము
ప్రశ్న 13.
దేశభక్తి కలిగి ఉండాలి. గీత గీసిన పదానికి వికృతి పదం.
A) బస్తి
B) భవనం
C) బత్తి
D) భాష్యం
జవాబు:
C) బత్తి
ప్రశ్న 14.
మేలు బంతి రాతలో అక్షరాలు అందంగా కనబడాలి. గీత గీసిన పదానికి ప్రకృతి పదం
A) బంధి
B) పంక్తి
C) భక్తి
D) పంతం
జవాబు:
B) పంక్తి
భాషాంశాలు (వ్యాకరణం) (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – II : PART – B
1. సంధులు
ప్రశ్న 1.
“సర్వేశ్వరా” ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) అత్వసంధి
జవాబు:
B) గుణసంధి
ప్రశ్న 2.
“శీతామృత” ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) అకారసంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘసంధి
ప్రశ్న 3.
‘వర్ష + ఆసనము’ ఈ పదాల్ని కలిపి వ్రాయగా ………………….. అవుతుంది. (June ’18)
A) వర్షశసనము
B) వర్షాశనము
C) వర్షేశనము
D) వర్షాశనము
జవాబు:
D) వర్షాశనము
ప్రశ్న 4.
“విశ్వనాథేశ్వర” విడదీయగా
A) విశ్వనాథ + ఈశ్వర
B) విశ్వ + అనాథ + ఈశ్వర
C) విశ్వనాథే + ఈశ్వర
D) పైవేవికావు
జవాబు:
A) విశ్వనాథ + ఈశ్వర
ప్రశ్న 5.
దేవాగ్రహారములు – విడదీయండి.
A) దేవ + అగ్రహారములు
B) దేవఅగ్ర + హారములు
C) దేవాగ్ర + హారములు
D దేవన్ + అగ్రన్ + హారములు
జవాబు:
A) దేవ + అగ్రహారములు
ప్రశ్న 6.
పేశలానందము – విడదీయండి.
A) పేశలః + ఆనందము
B) పేశలానందః + ము
C) పేశల + ఆనందము
D) పేశ + అల + నందము
జవాబు:
C) పేశల + ఆనందము
ప్రశ్న 7.
స్వాయత్తము – విడదీయండి.
A) స్వా + యత్తము
B) స్వా + ఆయత్తము
C) స్వా + ఆయత్తము
D) స్వ + ఆయత్తము
జవాబు:
D) స్వ + ఆయత్తము
ప్రశ్న 8.
సత్యోక్తి – విడదీయండి.
A) సత్య + ఉక్తి
B) సత్యః + ఉక్తి
C) సత్యు + ఉక్తి
D) సాత్య + ఉక్తి
జవాబు:
A) సత్య + ఉక్తి
ప్రశ్న 9.
అర్చన సేయు – విడదీయండి.
A) ఆర్చన + సేయు
B) అర్చన + చేయు
C) ఆర్చనము + చేయు
D) ఆర్చన + సేయు
జవాబు:
B) అర్చన + చేయు
ప్రశ్న 10.
సజ్జనులు – విడదీయండి.
A) సజ్జ + నులు
B) సా + జ్జనులు
C) సత్ + జనులు
D) సత్ + జ్జనులు
జవాబు:
C) సత్ + జనులు
ప్రశ్న 11.
పుష్పమది – విడదీయండి.
A) పుష్పః + మీది
B) పుష్పః + మది
C) పుష్పమ్ + అది
D) పుష్పము + అది
జవాబు:
D) పుష్పము + అది
ప్రశ్న 12.
యుగాంతం ఇది ఏ సంధి ?
A) గుణ
B) సవర్ణదీర్ఘ
C) వృద్ధి
D) యణాదేశ
జవాబు:
B) సవర్ణదీర్ఘ
ప్రశ్న 13.
దివ్యౌషధం – దీన్ని విడదీస్తే
A) దివ్య + ఓషధం
B) దివ్య + ఔషధం
C) దివ్యా + ఔషధం
D) దివి + ఔషధం
జవాబు:
A) దివ్య + ఓషధం
2. సమాసాలు
ప్రశ్న 1.
“స్వచ్ఛవాపూరము” ఏ సమాసము ?
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) నఞ తత్పురుష సమాసం
C) బహువ్రీహి సమాసము
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
జవాబు:
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ప్రశ్న 2.
“ఆర్తజనబాంధవుడు” ఏ సమాసం ?
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) చతుర్థీ తత్పురుష సమాసము
D) నఞ తత్పురుష సమాసము
జవాబు:
A) షష్ఠీ తత్పురుష సమాసము
ప్రశ్న 3.
“నింద కానిది” (సమాస నామం గుర్తించండి.)
A) నింద
B) అనింద
C) ఆ నింద
D) అనింద కానిది
జవాబు:
B) అనింద
ప్రశ్న 4.
“త్యాగమయ దీక్ష”. (ఇది ఏ సమాసము ?)
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) ద్విగు సమాసము
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
జవాబు:
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ప్రశ్న 5.
సత్యోక్తి – ఏ సమాసం ?
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) ద్వంద్వ సమాసం
C) ద్విగు సమాసం
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
A) విశేషణ పూర్వపద కర్మధారయం
ప్రశ్న 6.
దేశ జనని – ఏ సమాసం ?
A) షష్ఠీ తత్పురుష
B) రూపక సమాసం
C) ద్వంద్వ సమాసం
D) ద్విగు సమాసం
జవాబు:
A) షష్ఠీ తత్పురుష
ప్రశ్న 7.
పయోనిధి – ఏ సమాసం ?
A) రూపక సమాసం
B) ద్వంద్వ సమాసం
C) షష్ఠీ తత్పురుష
D) ద్విగు సమాసం
జవాబు:
C) షష్ఠీ తత్పురుష
ప్రశ్న 8.
భండన భీముడు – సరియైన విగ్రహవాక్యమును గుర్తించండి.
A) భండనమునకు భీముడు
B) భండనము చేత భీముడు
C) భండనము నందు భీముడు
D) భండనము వలన, భీముడు
జవాబు:
A) భండనమునకు భీముడు
ప్రశ్న 9.
‘దాశరథి అను పేరుగల శతకం’ అనే విగ్రహ వాక్యానికి సమాసపదం (June ’18)
A) దాశరథి రాసిన శతకం
B) దాశరథి శతకం
C) దాశరథికోసం రాసిన శతకం
D) దాశరథి మెచ్చిన శతకం
జవాబు:
B) దాశరథి శతకం
ప్రశ్న 10.
ఇంతకు పూర్వం లేనిది – అనిదంపూర్వం – సమాసము పేరు
A) షష్ఠీ తత్పురుష
B) సప్తమీ తత్పురుష
C) బహువ్రీహి
D) నఞ తత్పురుష
జవాబు:
D) నఞ తత్పురుష
ప్రశ్న 11.
ధర్మపురి యందు నివాసము గలవాడు – ధర్మపురి నివాసి – ఏ సమాసము ?
A) సప్తమీ తత్పురుష
B) విశేషణ పూర్వపద కర్మధారయము
C) బహువ్రీహి
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
C) బహువ్రీహి
ప్రశ్న 12.
పంచవన్నెలు – ఇది ఏ సమాసం ?
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) ద్వంద్వం
C) ద్విగువు
D) రూపక
జవాబు:
C) ద్విగువు
ప్రశ్న 13.
నఞ తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) రాజాజ్ఞ
B) ఆశ్చర్యం
C) ఆనందం
D) అసత్యం
జవాబు:
D) అసత్యం
3. ఛందస్సు
ప్రశ్న 1.
శార్దూల వృత్తంలోని యతిస్థానం ఎంత ?
A) 12
B) 14
C) 16
D) 10
జవాబు:
B) 14
ప్రశ్న 2.
పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలో – ఇది ఏ పద్యపాదము ?
A) ఆటవెలది
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు:
B) ఉత్పలమాల
ప్రశ్న 3.
తనదేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్ – ఇది ఏ పద్యపాదము ?
A) ఉత్పలమాల
B) శార్దూలం
C) మత్తేభం
D) కందం
జవాబు:
C) మత్తేభం
ప్రశ్న 4.
ఉత్పలమాల యందలి అక్షరాల సంఖ్య ఎంత ?
A) 21
B) 18
C) 19
D) 20
జవాబు:
D) 20
ప్రశ్న 5.
సూర్యగణాలు ఎన్ని ?
A) 4
B) 2
C) 3
D) 6
జవాబు:
B) 2
ప్రశ్న 6.
I U I – ఇది ఏ గణము ?
A) జగణం
B) తగణం
C) రగణం
D) మగణం
జవాబు:
A) జగణం
ప్రశ్న 7.
U U U – ఇది ఏ గణము ?
A) నగణం
B) మగణం
C) యగణం
D) తగణం
జవాబు:
B) మగణం
ప్రశ్న 8.
న, జ, భ, జ, జ, జ, అనే గణాలుండే పద్యం
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
B) చంపకమాల
ప్రశ్న 9.
ప్రతి పాదంలో 21 అక్షరాలుండే పద్యం
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
A) చంపకమాల
ప్రశ్న 10.
చంపకమాల, ఉత్పలమాల, మత్తేభము పద్యాలలో ఒక్కొక్క పద్యానికి ఎన్ని పాదాలుంటాయి ?
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
D) 4
ప్రశ్న 11.
తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా – ఈ పద్యపాదం ఏ పద్యానికి చెందినది ?
A) చంపకమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) ఉత్పలమాల
జవాబు:
B) మత్తేభం
ప్రశ్న 12.
శాకాహారులుఁ గంధ భోజులు, శిలోంచ ప్రక్రముల్ తాపసుల్ ఈ పాదంలో గీత గీసిన పదం ఏ గణం ?
A) నగణం
B) మగణం
C) రగణం
D) సగణం
జవాబు:
D) సగణం
4. అలంకారాలు
ప్రశ్న 1.
అడిగెదనని కడువడిఁజను
నడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగన్ –
ఇందులోని అలంకారం గుర్తించండి.
A) వృత్త్యానుప్రాస
B) లాటానుప్రాస
C) యమకం
D) ఛేకానుప్రాస
జవాబు:
A) వృత్త్యానుప్రాస
ప్రశ్న 2.
మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృ భాషయే – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.
A) వృత్త్యానుప్రాస
B) లాటానుప్రాస
C) యమకం
D) ముక్తపదగ్రస్తం
జవాబు:
A) వృత్త్యానుప్రాస
ప్రశ్న 3.
నీ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుయున్నారము – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.
A) లాటానుప్రాస
B) వృత్త్యానుప్రాస
C) యమకం
D) అంత్యానుప్రాస
జవాబు:
B) వృత్త్యానుప్రాస
ప్రశ్న 4.
చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.
A) యమకం
B) వృత్త్యానుప్రాస
C) లాటానుప్రాస
D) ముక్తపదగ్రస్తం
జవాబు:
B) వృత్త్యానుప్రాస
ప్రశ్న 5.
ఆమె ముఖం చంద్రబింబంలా మనోహరంగా ఉంది. పై వాక్యంలో ఏ అలంకారం దాగి ఉంది ?
A) ఉత్ప్రేక్ష
B) రూపకం
C) లాటానుప్రాసం
D) ఉపమాలంకారం
జవాబు:
A) ఉత్ప్రేక్ష
ప్రశ్న 6.
అర్థ భేదంతో కూడిన హల్లుల జంట వెంటవెంటనే ప్రయోగించడం – ఇది ఏ అలంకార లక్షణం ?
A) యమకం
B) ఛేకానుప్రాసం
C) లాటానుప్రాసం
D) ముక్తపదగ్రస్తం
జవాబు:
C) లాటానుప్రాసం
ప్రశ్న 7.
తన దేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి – ఇందులోని అలంకారం గుర్తించండి.
A) లాటానుప్రాసం
B) యమకం
C) వృత్త్యనుప్రాసం
D) అంత్యానుప్రాసం
జవాబు:
C) వృత్త్యనుప్రాసం
ప్రశ్న 8.
ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తమైతే, అది ఇందులోని అలంకారం
A) లాటానుప్రాసం
B) యమకం
C) వృత్త్యనుప్రాసం
D) అంత్యానుప్రాసం
జవాబు:
C) వృత్త్యనుప్రాసం
ప్రశ్న 9.
నీ విమల మేచకరూపసుధారసంబు – ఇందులోని అలంకారం గుర్తించండి.
A) ఉపమాలంకారం
B) రూపకాలంకారం
C) స్వభావోక్తి
D) అతిశయోక్తి
జవాబు:
B) రూపకాలంకారం
ప్రశ్న 10.
విష్ణురోచిష్ణు జిష్ణు సహిష్ణు – ఇందలి అలంకారం గుర్తించండి.
A) ఛేకానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) యమకం
D) లాటానుప్రాస
జవాబు:
B) వృత్త్యనుప్రాస
ప్రశ్న 11.
మహాకవుల మాటలు తేనె వలె తీయగా ఉంటాయి. దీనిలోని అలంకారం
A) ఉపమా
B) ఉత్ప్రేక్ష
C) రూపక
D) శ్లేష
జవాబు:
A) ఉపమా
ప్రశ్న 12.
వృత్యానుప్రాస అలంకారంలో
A) రెండు హల్లుల జంటలు పక్కపక్కనే వస్తాయి
B) అర్థభేదంతో ఒకే రకమైన పదాలు వస్తాయి
C) మొదటి పాదం చివరి పదంతో, రెండవ పాదం మొదలౌతుంది
D) ఒకే హల్లు తిరిగి తిరిగి వస్తుంది
జవాబు:
D) ఒకే హల్లు తిరిగి తిరిగి వస్తుంది
5. వాక్య పరిజ్ఞానం
ప్రశ్న 1.
గుట్టుగ లక్ష్మి పొందు దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) లక్ష్మి రహస్యంబుగ పొందు
B) గుట్టుగా లక్ష్మి పొందుతుంది
C) గుట్టుగ పొందు లక్ష్మి
D) గుట్టుగ లచ్చి పొందుము
జవాబు:
B) గుట్టుగా లక్ష్మి పొందుతుంది
ప్రశ్న 2.
మూర్ఖుల చిత్తంబు కఠినంబు – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) మూర్ఖుల మనస్సు కఠినం
B) కఠినంబు మనసు చిత్తంబు మూర్ఖం
C) మూర్ఖుల చిత్తము కఠినంబుగా నుండి
D) మూర్ఖుల చిత్తంబున కఠినంబు
జవాబు:
A) మూర్ఖుల మనస్సు కఠినం
ప్రశ్న 3.
ఆపదలయందు ధైర్యముత్తమంబు – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) ధైర్యముత్తమం ఆపదలందు
B) ఉత్తమంబు ధైర్యం ఉత్తమంబు
C) ఉత్తమంబు ధైర్యమం యుత్తమం
D) ఆపదల్లో ధైర్యం ఉత్తమం
జవాబు:
D) ఆపదల్లో ధైర్యం ఉత్తమం
ప్రశ్న 4.
వాల్మీకి కావ్యంబు రచించె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) వాల్మీకి కావ్యం రచించాడు
B) వాల్మీకిచే కావ్యంబు రచియించె
C) రచయించెను కావ్యంబున వాల్మీకి
D) రచయింపగా వాల్మీకి కావ్యంబు
జవాబు:
A) వాల్మీకి కావ్యం రచించాడు
ప్రశ్న 5.
సజ్జన సహవాసం జగతికి మేలు చేకూర్చు – దీనికి ఆధునిక వాక్యాన్ని గుర్తించండి.
A) మేలు కలుగున సజ్జన సంగతి జగతికి
B) జగతిలో మేలు కలుగు సజ్జన సంగతి
C) సజ్జన సంగతి మేలు చేకూరదు జగతికి
D) సజ్జన సహవాసంతో జగతికి మేలు కలుగుతుంది
జవాబు:
D) సజ్జన సహవాసంతో జగతికి మేలు కలుగుతుంది
ప్రశ్న 6.
రామకృష్ణారావు గారు ఆమోదముద్ర వేశారు – ఇది ఏ వాక్యం ?
A) కర్తరి వాక్యం
B) కర్మణి వాక్యం
C) చేదర్థకం
D) సామాన్య వాక్యం
జవాబు:
A) కర్తరి వాక్యం
ప్రశ్న 7.
మానవుడు విలువలు పాటించాడు – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) పాటించాలి మానవుడు నైతిక విలువలు
B) మానవునిచే విలువలు పాటించబడ్డాయి
C) విలువలచే మానవుడు పాటించబడ్డాడు
D) విలువల వల్ల మానవుడు వృద్ధి పొందాడు
జవాబు:
B) మానవునిచే విలువలు పాటించబడ్డాయి
ప్రశ్న 8.
దాత దానం చేశాడు. – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) దాత వల్ల దానం పొందబడెను
B) పొందబడింది దానం దాతవల్ల
C) దాతచే దానం చేయబడింది
D) చేయబడింది దాతతో దానం
జవాబు:
C) దాతచే దానం చేయబడింది
ప్రశ్న 9.
రామదాసు రాముని సేవించాడు. – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) రాముని సేవించాడు రామదాసుతో
B) రామదాసు చేత రాముడు సేవించబడినాడు
C) రాముడు సేవించబడినాడు రామదాసు వల్ల
D) రామదాసుతో సేవించబడినాడు రాముడు
జవాబు:
B) రామదాసు చేత రాముడు సేవించబడినాడు
ప్రశ్న 10.
లక్ష్మణకవి సుభాషితాలను అనువదించాడు. దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) అనువదింపబడినాయి లక్ష్మణకవి వల్ల సుభా షితాలు
B) సుభాషితాలతో అనువదింపబడినాయి లక్ష్మణకవి
C) లక్ష్మణకవి వలన సుభాషితాలు అనువాదానికి లోనైనాయి
D) లక్ష్మణకవిచే సుభాషితాలు అనువదింపబడినాయి
జవాబు:
D) లక్ష్మణకవిచే సుభాషితాలు అనువదింపబడినాయి
ప్రశ్న 11.
రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి ఈ వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చండి.
A) రేఖామాత్రంగానే నా భావాలు ఇక్కడ పొందు పరచాను
B) నా భావాలు రేఖామాత్రంగానే ఇక్కడ పొందు పరచాను
C) రేఖామాత్రంగా నా భావాలు పొందుపరచబడెను
D) నా భావాలు రేఖామాత్రంగా పొందుపరచబడెను
జవాబు:
A) రేఖామాత్రంగానే నా భావాలు ఇక్కడ పొందు పరచాను
ప్రశ్న 12.
‘నాకు హితము కావాలి’ అని రచయిత అన్నాడు. దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వారికి హితము అవసరమని రచయిత అన్నాడు
B) తనకు హితము కావాలని రచయిత అన్నాడు.
C) తనకు కావలెను హితంబున అని రచయిత అన్నాడు.
D) వానికి రచయిత అన్నాడు హితంబు అని
జవాబు:
B) తనకు హితము కావాలని రచయిత అన్నాడు.
ప్రశ్న 13.
“నాకు సజ్జన మైత్రి ఇష్టం” అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏమి ?
A) రవికి సజ్జనమైత్రి అవసరమని చెప్పాడు
B) తనకు సజ్జనమైత్రి ఇష్టమని రవి అన్నాడు.
C) అతనికి సజ్జనమైత్రి అవసరమని రవి అన్నాడు
D) వానికి సజ్జనమైత్రి తప్పక అవసరమని అన్నాడు
జవాబు:
B) తనకు సజ్జనమైత్రి ఇష్టమని రవి అన్నాడు.
ప్రశ్న 14.
“నాతో గుడికి రావద్దు” – అని లత చెప్పింది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) గుడికి ఆమెతో రాకూడదని లత చెప్పింది
B) తనతో గుడికి రావద్దని లత చెప్పింది
C) గుడికి ఆమెతో రావద్దని లత చెప్పింది
D) లత నాతో రావద్దని గుడికి అని చెప్పింది
జవాబు:
B) తనతో గుడికి రావద్దని లత చెప్పింది
ప్రశ్న 15.
‘నన్ను దయతో కాపాడు’ అని భక్తుడు ప్రార్థించాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ?
A) భగవంతుడు నన్ను కాపాడాలని భక్తుడు వేడుకున్నాడు.
B) అతడిని కాపాడాలని భక్తుడు వేడుకున్నాడు.
C) భగవంతుడు తప్పక కాపాడాలని దైవాన్ని ప్రార్థించాడు భక్తుడు
D) తన్ను దయతో కాపాడమని భక్తుడు ప్రార్థించాడు
జవాబు:
D) తన్ను దయతో కాపాడమని భక్తుడు ప్రార్థించాడు
ప్రశ్న 16.
“నా కివ్వాల్సింది ఏమీ లేదు” అని నాతో అన్నాడు – ఇది ఏ వాక్యం ?
A) కర్మణి వాక్యం
B) కర్తరివాక్యం
C) ప్రత్యక్ష కథనం
D) ఏవీ కావు
జవాబు:
C) ప్రత్యక్ష కథనం
ప్రశ్న 17.
బాగా కష్టపడితే, ఫలితం అదే వస్తుంది – ఇది ఏ వాక్యం ?
A) చేదర్థకము
B) వ్యతిరేకార్థకము
C) అప్యర్థకము
D) శత్రర్థకము
జవాబు:
D) శత్రర్థకము
ప్రశ్న 18.
తుఫాను వస్తుంది. వర్షం రావచ్చు – ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) అనుమత్యర్థక వాక్యం
C) సంభావనార్థక వాక్యం
D) విద్యర్థక వాక్యం
జవాబు:
C) సంభావనార్థక వాక్యం
ప్రశ్న 19.
దున్నే వాడికే భూమి అనే హక్కు తయారుచేయబడింది – ఇది ఏ వాక్యం ?
A) కర్తరి వాక్యం
B) చేదర్థక వాక్యం
C) కర్మణి వాక్యం
D) ఏవీ కావు
జవాబు:
C) కర్మణి వాక్యం
ప్రశ్న 20.
“నేను గుంటూరులో 4వ తరగతి వరకు చదివాను” అని లక్ష్మీబాయి చెప్పింది. – ఇది ఏ వాక్యమో గుర్తించండి.
A) ప్రత్యక్ష వాక్యం
B) పరోక్ష వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం
జవాబు:
A) ప్రత్యక్ష వాక్యం
ప్రశ్న 21.
మీరు పరీక్షలు రాయవచ్చు – ఇది ఏ వాక్యం ?
A) సంభావనార్థకం
B) క్త్వార్థకం
C) ప్రశ్నార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు:
D) అనుమత్యర్థకం
ప్రశ్న 22.
ఆ సినిమా ఎంత బాగుందో ! – ఇది ఏ వాక్యం ?
A) సందేహార్థకం
B) ఆత్మార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు:
C) ఆశ్చర్యార్థకం
ప్రశ్న 23.
బాలకా ! నీ పేరేమిటి ? – ఇది ఏ వాక్యం ?
A) సంభావనార్థకం
B) ప్రశ్నార్థకం
C) భావార్థకం
D) సందేహార్థకం
జవాబు:
B) ప్రశ్నార్థకం
ప్రశ్న 24.
యజమాని కరుణిస్తే కార్మికులు ఆనందిస్తారు – ఇది ఏ వాక్యం ?
A) హేత్వర్థకం
B) ప్రేరణార్థకం
C) తుమున్నర్థకం
D) చేదర్థకం
జవాబు:
D) చేదర్థకం
ప్రశ్న 25.
కొద్ది నిమిషాల్లో వర్షం కురవవచ్చు – ఇది ఏ వాక్యం ?
A) సందేహార్థకం
B) అనుమత్యర్థకం
C) శత్రర్థకం
D) సంభావనార్థకం
జవాబు:
D) సంభావనార్థకం
ప్రశ్న 26.
శ్రీను అన్నం తిని, బడికి వెళ్ళాడు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) సంక్లిష్ట
C) చేదర్థకం
D) శత్రర్థకం
జవాబు:
C) చేదర్థకం
ప్రశ్న 27.
పిల్లలు సముద్ర తీరాన ఆడుతూ, ఇల్లు కట్టుకున్నారు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) కర్మణి
B) సంయుక్త
C) సంభావనార్థకం
D) సంక్లిష్ట
జవాబు:
D) సంక్లిష్ట
ప్రశ్న 28.
ఆయన ప్రజాసేవకుడా ? రాజకీయ నాయకుడా ? – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) సంభావనార్థకం
C) విధ్యర్థకం
D) ప్రేరణార్థకం
జవాబు:
A) సంయుక్త
ప్రశ్న 29.
సోన్దేవుడు స్త్రీలను బంధించాడు కాబట్టి శివాజీకి కోపం వచ్చింది – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) కర్మణి
C) సంయుక్త
D) శత్రర్థకం
జవాబు:
C) సంయుక్త
ప్రశ్న 30.
సుజాతకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది. – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సందేహార్థకం
B) అప్యర్థకం
C) భావార్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
D) ప్రశ్నార్థకం
ప్రశ్న 31.
అయ్యో ! ఎంత పని జరిగింది. – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రశ్నార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) అప్యర్థకం
D) ఆత్మార్థకం
జవాబు:
B) ఆశ్చర్యార్థకం
ప్రశ్న 32.
వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ వాడొద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) నిషేధార్థకం
B) హేత్వర్థకం
C) ప్రేరణార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు:
A) నిషేధార్థకం
ప్రశ్న 33.
దయచేసి ఎక్కువ శబ్దం చేయకండి – ఇది ఏ రకమైన వాక్యం ?
A) విద్యర్థకం
B) ప్రార్థనార్థకం
C) ఆత్మార్థకం
D) కర్తరి
జవాబు:
B) ప్రార్థనార్థకం
ప్రశ్న 34.
దీర్ఘాయుష్షు కలుగుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రార్థనార్థకం
B) హేత్వర్థకం
C) ఆశీర్వాదార్థకం
D) చేదర్థకం
జవాబు:
C) ఆశీర్వాదార్థకం
ప్రశ్న 35.
శ్రీకృష్ణుడు, సాందీపుడు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) కర్మణి
C) సంయుక్త
D) శత్రర్థకం
జవాబు:
C) సంయుక్త
ప్రశ్న 36.
రాధ జడవేసుకొని, పూలు పెట్టుకున్నది. – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) చేదర్థకం
C) అప్యర్థకం
D) సంక్లిష్ట
జవాబు:
D) సంక్లిష్ట
ప్రశ్న 37.
వేణు చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) క్త్వార్థకం
B) కర్మణి
C) సంక్లిష్ట
D) తుమున్నర్ధకం
జవాబు:
C) సంక్లిష్ట
ప్రశ్న 38.
మీకు టీ కావాలా ? కాఫీ కావాలా – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) శత్రర్థకం
C) ఆత్మార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు:
A) సంయుక్త
ప్రశ్న 39.
శీను టివి చూస్తూ అన్నం తింటున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) శత్రర్థకం
C) క్త్వార్థకం
D) చేదర్థకం
జవాబు:
B) శత్రర్థకం
ప్రశ్న 40.
రామారావుకు పాడడమంటే ఆసక్తి కాని వినడమంటే విరక్తి – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) అప్యర్థకం
C) శత్రర్థకం
D) సంయుక్త
జవాబు:
D) సంయుక్త
ప్రశ్న 41.
సుజాత, రవీ అన్నా చెల్లెళ్ళు. ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) కర్మణి
C) సందేహార్థకం
D) తుమున్నర్థకం
జవాబు:
A) సంయుక్త
ప్రశ్న 42.
మీరు బయటకు వెళ్లవచ్చు. – ఇది ఏ వాక్యం ?
A) సంక్లిష్ట వాక్యం
B) సంయుక్తవాక్యం
C) విధ్యర్థకవాక్యం
D) అనుమత్యర్థకవాక్యం
జవాబు:
D) అనుమత్యర్థకవాక్యం
ప్రశ్న 43.
మీరందరు బాగా చదవండి. – ఇది ఏ వాక్యం ?
A) సందేహార్థకం
B) విద్యర్థకం
C) ప్రేరణార్థకం
D) ఆత్మార్థకం
జవాబు:
B) విద్యర్థకం
ప్రశ్న 44.
వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ వాక్యం ?
A) చేదర్థకవాక్యం
B) అప్యర్థకవాక్యం
C) విధ్యర్థకవాక్యం
D) శత్రర్థకం
జవాబు:
A) చేదర్థకవాక్యం
ప్రశ్న 45.
మీరు ఊరునుంచి ఎప్పుడు వచ్చారు – ఇది ఏ వాక్యం ?
A) సందేహార్థకం
B) విద్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) పైవేవీకావు
జవాబు:
C) ప్రశ్నార్థకం
ప్రశ్న 46.
మీకు విజయం కలుగుగాక. – ఇది ఏ వాక్యం ?
A) సంభావనార్థకం
B) ఆశీర్వాద్యర్థకం
C) విధ్యర్థకం
D) సందేహార్థకం
జవాబు:
B) ఆశీర్వాద్యర్థకం
ప్రశ్న 47.
ఈరోజు ఆట జరుగుతుందో, జరగదో ! – ఇది ఏ వాక్యం ?
A) విద్యర్థకం
B) ప్రశ్నార్థకం
C) సంభావనార్థకం
D) సందేహార్థకం
జవాబు:
D) సందేహార్థకం
ప్రశ్న 48.
రమ చక్కగా పాడగలదు. – ఇది ఏ వాక్యం ?
A) అనుమత్యర్థకం
B) విధ్యర్థకం
C) సామర్థ్యార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు:
C) సామర్థ్యార్థకం
ప్రశ్న 49.
మా పాఠశాలకు రేపు మంత్రిగారు రావచ్చు. – ఇది ఏ వాక్యం ?
A) సందేహార్థకం
B) ప్రశ్నార్థకం
C) అనుమత్యర్థకం
D) సంభావనార్థకం
జవాబు:
D) సంభావనార్థకం
ప్రశ్న 50.
రైలు వచ్చింది కాని చుట్టాలు రాలేదు – ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం
జవాబు:
A) సంయుక్త వాక్యం
ప్రశ్న 51.
“నేను మంచి విద్యార్థిని” – అని రవి అన్నాడు. ఇది ఏ వాక్యం ?
A) పరోక్ష వాక్యం
B) ప్రత్యక్ష వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం
జవాబు:
B) ప్రత్యక్ష వాక్యం
ప్రశ్న 52.
పరోక్ష వాక్యానికి ఉదాహరణ
A) “నా పెళ్ళికి రండి” అని రవి పిలిచాడు.
B) “మీరు బహుమతులు తేవద్దు” అని రవి అన్నాడు.
C) “మీరు తొందరగా రండి” అని రవి అన్నాడు.
D) తాను వెళ్ళిపోయిందని రవి అన్నాడు.
జవాబు:
D) తాను వెళ్ళిపోయిందని రవి అన్నాడు.