These TS 10th Class Telugu Bits with Answers 6th Lesson భాగ్యోదయం will help students to enhance their time management skills.
TS 10th Class Telugu Bits 6th Lesson భాగ్యోదయం
బహుళైచ్చిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – I : PART – B
1. సొంత వాక్యాలు
ప్రశ్న 1.
నిరంతర శ్రద్ధ : ………………………..
జవాబు:
విద్యార్థులు చదువు పట్ల నిరంతరశ్రద్ధ కనబరచాలి.
ప్రశ్న 2.
చైతన్యం : ………………………
జవాబు:
జాతీయోద్యమంలో గాంధీ ఉపన్యాసాల వల్ల ప్రజల్లో చైతన్యం కలిగింది.
2. అర్థాలు
ప్రశ్న 1.
దిక్కులేనివారికి తోడుగా దేవుడుంటాడు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) ఆసరా
B) వికాసం
C) తెలివి
D) సొంతం
జవాబు:
A) ఆసరా
ప్రశ్న 2.
తల్లిదండ్రులు మన ఉన్నతిని కోరుకుంటారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) ఆసరా
B) సొంతం
C) కన్నా
D) ప్రగతి
జవాబు:
D) ప్రగతి
ప్రశ్న 3.
తెలంగాణ వికాసానికి ఎందరో కృషి చేసారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) స్వతంత్రత
B) అభివృద్ధి
C) వికసనము
D) కనకం
జవాబు:
C) వికసనము
ప్రశ్న 4.
ప్రజలకు రాజ్యాంగం అవగతమయింది – గీత గీసిన దానికి అర్థం గుర్తించండి.
A) అర్థం కావటం
B) అర్థం కాకపోవటం
C) వ్యర్థంగా పోవటం
D) అవినీతిగా ఉండటం
జవాబు:
A) అర్థం కావటం
ప్రశ్న 5.
నైతికమద్దతు – అనగా అర్థం
A) అన్యాయమైన తోడ్పాటు
B) న్యాయమైన తోడ్పాటు
C) చిత్తశుద్ధి
D) ఉదాసీనత
జవాబు:
B) న్యాయమైన తోడ్పాటు
ప్రశ్న 6.
విద్యార్థులు ఉన్నతి పొందాలి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) అభివృద్ధి
B) అత్యంత
C) అంకితభావం
D) అవస్థ
జవాబు:
A) అభివృద్ధి
ప్రశ్న 7.
చైతన్యం అనగా అర్థం
A) ప్రయత్నం
B) కానరానిది
C) కదలిక
D) వికాసం
జవాబు:
C) కదలిక
ప్రశ్న 8.
సంప్రదింపులు అన్న అర్థాన్నిచ్చే పదం
A) సమ్మతితో ఆలోచనలు
B) చర్చలు
C) వాదనలు
D) గొడవలు
జవాబు:
B) చర్చలు
ప్రశ్న 9.
“సంఘంలోని దురాచారం పోగొట్టువారు” అనే అర్థం వచ్చే పదం
A) సంస్కర్తలు
B) సంఘ జీవులు
C) సంఘ దురాచారం
D) సంఘ చర్య
జవాబు:
A) సంస్కర్తలు
ప్రశ్న 10.
కొంతమంది అచిరకాలంలోనే మంచి పేరు సంపా దిస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కొంచెం చిరకాలం
B) పొడవైన సమయం
C) కొద్దికాలం
D) కొంచెం పెద్దకాలం
జవాబు:
C) కొద్దికాలం
ప్రశ్న 11.
శివునికి అర్చించుటకు తెచ్చిన పూలు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) భక్తితో ఇవ్వటం
B) ఇవ్వవలసి ఇవ్వటం
C) ఆర్పి వేయడం
D) ఇచ్చుట
జవాబు:
A) భక్తితో ఇవ్వటం
3. పర్యాయపదాలు
ప్రశ్న 1.
“చిత్తము శివుడి మీద భక్తి చెప్పుల మీద” అనేది ఒక సామెత. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) ఉక్తి, పలుకు
B) యుద్ధం, రణం
C) ఆపద, ఆసక్తి
D) మనస్సు, హృదయం
జవాబు:
D) మనస్సు, హృదయం
ప్రశ్న 2.
సమాజాభివృద్ధికి కులం ఒక పెద్ద సమస్యగా మారింది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) ఉక్తి, ఇడ
B) వంశము, వంగడం
C) నీళ్ళు, గాలి
D) ఉనికి, స్పష్టత
జవాబు:
B) వంశము, వంగడం
ప్రశ్న 3.
సంస్కరణకి పర్యాయపదాలు.
A) చెడగొట్టడం, ఆధారం
B) జాతి, అనాథ
C) కొలువు, గోష్టి
D) బాగుచేయడం, చెడును రూపుమాపడం
జవాబు:
D) బాగుచేయడం, చెడును రూపుమాపడం
ప్రశ్న 4.
చరిత్ర – అనే పదానికి పర్యాయపదాలు
A) ప్రవర్తన, నడత
B) పూర్వచరిత్ర, రామాయణము
C) పోకడ, పద్ధతి
D) కథ, చరిత్ర
జవాబు:
D) కథ, చరిత్ర
ప్రశ్న 5.
అన్వయము వంశం – అనే పర్యాయపదాలు గల పదం.
A) కులము
B) జాతకము
C) వర్గము
D) జాతి
జవాబు:
A) కులము
ప్రశ్న 6.
మా కుటుంబము చాలా పెద్దది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఇల్లు, వాకిలి
B) వంశము, కుటుంబము
C) కాపురము, సంసారము
D) వంశము, వంగడము
జవాబు:
D) వంశము, వంగడము
ప్రశ్న 7.
అందరి సహకారం ఉంటే స్వచ్ఛ భారత్ సాధించగలం గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సహకారం, మామిడి
B) సహాయము, తోడ్పాటు
C) తోడ్పాటు, తోడివారు
D) మామిడి, తోడ్పాటు
జవాబు:
B) సహాయము, తోడ్పాటు
ప్రశ్న 8.
ప్రసంగము, ముచ్చటింపు – అనే పర్యాయపదాలు గల పదం.
A) వాగ్దానం
B) ఉపన్యాసం
C) వాదులాట
D) మాటా-మాట
జవాబు:
B) ఉపన్యాసం
ప్రశ్న 9.
ప్రజలు విద్యతో చైతన్యం కలిగి ఉంటారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అభిజ్ఞానము, శాకుంతలం
B) అభిజ్ఞానము, తెలివి
C) శాస్త్రము, కీర్తి
D) తెలివి, ఎక్కువ తెలివి
జవాబు:
B) అభిజ్ఞానము, తెలివి
4. వ్యుత్పత్త్యర్థాలు
ప్రశ్న 1.
‘పరాశర మహర్షి కుమారుడు’ దీనికి వ్యుత్పత్తి పదం
A) పారాశర్యుడు
B) భాష
C) వేదవ్యాసుడు
D) రావణుడు
జవాబు:
A) పారాశర్యుడు
ప్రశ్న 2.
వేదవ్యాసుడు వ్యుత్పత్తి పదం
A) వేదములను విభాగం చేసి లోకవ్యాప్తి చేసిన ముని
B) వేదాలను చదివినవాడు
C) వేదాలు, పురాణాలు విభజన చేయనివాడు
D) వేదములను వ్రాయని ముని
జవాబు:
A) వేదములను విభాగం చేసి లోకవ్యాప్తి చేసిన ముని
ప్రశ్న 3.
“దీని చేత జ్ఞాన యుక్తులగుదురు” అనే వ్యుత్పత్తి గల పదం
A) జ్ఞానం
B) చిత్తము
C) బుద్ధి
D) తెలివి
జవాబు:
A) జ్ఞానం
ప్రశ్న 4.
“బాగుగా ఒప్పునది” అను వ్యుత్పత్తి గల పదం
A) ఒప్పు
B) కప్పు
C) సభ
D) సభికులు
జవాబు:
A) ఒప్పు
5. నానార్థాలు
ప్రశ్న 1.
నీతి, న్యాయాలు ప్రజలందరూ పాటించాలి – (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)
A) ఉపాయం, రీతి
B) యుద్ధం, రణం
C) ఉక్తి, పలుకు
D) నీళ్ళు, గాలి
జవాబు:
A) ఉపాయం, రీతి
ప్రశ్న 2.
మనిషి వ్యసనమున పడరాదు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)
A) వంశం, జాతి
B) ఉనికి, స్పష్టత
C) ఆపద, ఆసక్తి
D) ప్రాణం, గాలి
జవాబు:
C) ఆపద, ఆసక్తి
ప్రశ్న 3.
జాతి అన్న పదానికి నానార్థాలు
A) సంతానం, పుట్టుక
B) వెనుక, ఆధారం
C) తోడు, అధికారం
D) కొలువు, గోష్టి
జవాబు:
D) కొలువు, గోష్టి
ప్రశ్న 4.
వర్గము అన్న పదానికి నానార్థాలు
A) ఆధారం, తోడు
B) అధ్యాయము, తెగ
C) తెగ, ఇల్లు
D) ప్రభువు, పరిషత్తు
జవాబు:
B) అధ్యాయము, తెగ
ప్రశ్న 5.
అన్యాయములు జరుగకుండా ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలి. – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ప్రభువు, తెగ
B) జాతి, అధ్యాయము
C) ప్రక్క, వెనుక
D) శయ్య, జాతి
జవాబు:
C) ప్రక్క, వెనుక
ప్రశ్న 6.
జాతి అభివృద్ధికి కులము ఒక అడ్డంకి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ప్రభువు, ఇల్లు
B) తెగ, గుంపు
C) జాతి, శరీరం
D) వంశము, జాతి
జవాబు:
D) వంశము, జాతి
ప్రశ్న 7.
సహకారము అన్న పదానికి నానార్థాలు
A) తియ్యమామిడి చెట్టు, సహాయము
B) వంశము, జాతి
C) ఇల్లు, వెనుక
D) జాతి, తోడు
జవాబు:
A) తియ్యమామిడి చెట్టు, సహాయము
ప్రశ్న 8.
రాజకీయ నాయకులు సభలలో వాదులాడు కుంటున్నారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) జాతి, ప్రభువు
B) జూదము, కొలువు కూటము
C) వెనుక, ప్రక్క
D) ఆధారము, జాతి
జవాబు:
B) జూదము, కొలువు కూటము
ప్రశ్న 9.
పుట్టుక, వర్ణము – అనే నానార్థం గల పదం
A) జాతి
B) జన్మ
C) జలతారు
D) జాజికాయ
జవాబు:
B) జన్మ
ప్రశ్న 10.
వర్గము – అనే పదానికి నానార్థాలు
A) భాగము, అధ్యాయము
B) జాతి సమూహం, నీతి
C) గుంపు, జాతి, సమూహం
D) బలము, ధైర్యము
జవాబు:
C) గుంపు, జాతి, సమూహం
6. ప్రకృతి – వికృతులు
ప్రశ్న 1.
అప్పగించిన పనిని శ్రద్ధతో చెయ్యాలి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) ఆర్య
B) ఆత్మ
C) అర్పణ
D) ఆజ్ఞ
జవాబు:
C) అర్పణ
ప్రశ్న 2.
ప్రజల క్షేమం ప్రభుత్వం చూడాలి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) కొలము
B) సేమము
C) దిష్టి
D) నిక్కము
జవాబు:
B) సేమము
ప్రశ్న 3.
సేవకుల దృష్టి సేవపై ఉండాలి. ఆర్భాటాలకు తావివ్వ కూడదు. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) అయ్య
B) అర్పణ
C) సేమము
D) దిష్టి
జవాబు:
D) దిష్టి
ప్రశ్న 4.
వీరయ్య ‘సత్తె కాలపు మనిషి’ వికృతి పదం ?
A) సత్వం
B) సత్రం
C) సత్యం
D) ఏవీకావు
జవాబు:
C) సత్యం
ప్రశ్న 5.
తెలంగాణ ఉద్యమ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గది. వికృతి పదం ?
A) చారిత
B) చదరం
C) చరిత
D) ఏవీకావు
జవాబు:
C) చరిత
ప్రశ్న 6.
పుణ్యకార్యాలు చేసిన వారిని సమాజం ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. (కార్యంకు వికృతి)
A) కర్ణం
B) కరణం
C) కరం
D) ఏవీకావు
జవాబు:
A) కర్ణం
భాషాంశాలు (వ్యాకరణం) (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – II : PART – B
1. సంధులు
ప్రశ్న 1.
దగ్గరయ్యేలా – సంధి పేరు తెల్పండి.
A) లులనల సంధి
B) ఉత్వ సంధి
C) అకార సంధి
D) త్రిక సంధి
జవాబు:
C) అకార సంధి
ప్రశ్న 2.
ఉపన్యాసాలు – సంధి పేరు తెల్పండి.
A) అత్వ సంధి
B) ఇత్వ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) లులనల సంధి
జవాబు:
D) లులనల సంధి
ప్రశ్న 3.
వర్గపు నాయకుడు – సంధి పేరు తెల్పండి.
A) అత్వ సంధి
B) ఇత్వ సంధి
C) ఉత్వ సంధి
D) పుంప్వాదేశ సంధి
జవాబు:
D) పుంప్వాదేశ సంధి
ప్రశ్న 4.
కార్యాచరణ – సంధి పేరు తెల్పండి.
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) అకార సంధి
D) ఇత్వ సంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 5.
భాగ్యోదయం – సంధి పేరు తెల్పండి.
A) అకార సంధి
C) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) గుణ సంధి
జవాబు:
D) గుణ సంధి
ప్రశ్న 6.
అత్యంత – సంధి పేరు తెల్పండి.
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) యణాదేశ సంధి
D) అకార సంధి
జవాబు:
C) యణాదేశ సంధి
ప్రశ్న 7.
అత్తునకు సంధి బహుళముగానగు అనే సూత్రానికి ఉదాహరణ
A) చేయాలి + అనుకుంటే
B) లోపల + లోపల
C) చిన్న + అప్పుడు
D) బలము + అయిన
జవాబు:
C) చిన్న + అప్పుడు
ప్రశ్న 8.
లులనల సంధికి ఉదాహరణ
A) దురాచారాలు
B) పాలు
C) బీదరాలు
D) దీపములు
జవాబు:
A) దురాచారాలు
ప్రశ్న 9.
ఔర + ఔర కలిపితే
A) ఔరిరా
B) ఔరౌర
C) ఔరేరి
D) జొరర
జవాబు:
B) ఔరౌర
2. సమాసాలు
ప్రశ్న 1.
మూఢనమ్మకాలు – సమాసం పేరు గుర్తించండి.
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) ద్విగువు
D) ద్వంద్వ సమాసం
జవాబు:
A) విశేషణ పూర్వపద కర్మధారయం
ప్రశ్న 2.
షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) మార్గదర్శి
B) చిత్తశుద్ధి
C) దుస్థితి
D) అచిరం
జవాబు:
B) చిత్తశుద్ధి
ప్రశ్న 3.
ద్వితీయా తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) దేవదాసి
B) అజ్ఞానం
C) అచిరకాలం
D) మార్గదర్శి
జవాబు:
D) మార్గదర్శి
ప్రశ్న 4.
నఞ తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) అజ్ఞానం
B) మూఢనమ్మకాలు
C) మూర్ఖుల సంఘం
D) గర్వకారణం
జవాబు:
A) అజ్ఞానం
ప్రశ్న 5.
ద్వంద్వ సమాసానికి ఉదాహరణ
A) దుస్థితి
B) అజ్ఞానం
C) యువతీయువకులు
D) కుల పెద్ద
జవాబు:
C) యువతీయువకులు
ప్రశ్న 6.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ
A) ప్రజాభిప్రాయం
B) అచిరకాలం
C) మంచిమాట
D) చిత్తశుద్ధి
జవాబు:
C) మంచిమాట
ప్రశ్న 7.
నఞ తత్పురుషకు ఉదాహరణ
A) అన్నము
B) అజ్ఞానం
C) ఆకాశం
D) అధికారం
జవాబు:
B) అజ్ఞానం
ప్రశ్న 8.
“చిరము కానిది” సమాసము చేయగా
A) చిరంకాని
B) సంచారము
C) అచిరము
D) చిరంతనము
జవాబు:
C) అచిరము
ప్రశ్న 9.
హిందూమతం – సరియైన విగ్రహవాక్యం గుర్తించండి.
A) హిందువులతో మతము
B) హిందూ మరియు మతము
C) హిందువుల కొరకు మతము
D) హిందూ అను పేరు గల మతము
జవాబు:
D) హిందూ అను పేరు గల మతము
ప్రశ్న 10.
ధర్మమును గురించి శాస్త్రము – సమాసము చేయగా
A) ధర్మపు శాస్త్రము
B) ధర్మశాస్త్రము
C) ధర్మాధర్మ శాస్త్రము
D) ధర్మాల శాస్త్రము
జవాబు:
B) ధర్మశాస్త్రము
3. ఛందస్సు
ప్రశ్న 1.
1, 4 పాదాలలో 5 సూర్యగణాలుండే పద్యం ఏది ?
A) తేటగీతి
B) సీసం
C) కందం
D) ఆటవెలది
జవాబు:
D) ఆటవెలది
ప్రశ్న 2.
భ, జ, స, నల, గగ అనే గణాలు కల్గిన పద్యం ఏది ?
A) సీసం
B) కందం
C) తేటగీతి
D) ద్విపద
జవాబు:
B) కందం
ప్రశ్న 3.
‘స -భ-ర-న-మ-య-వ’ అనుగణాలు ఏ పద్యపాదానికి చెందినవి ?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము
ప్రశ్న 4.
‘న-జ-భ-జ-జ-జ-ర’ అనుగణాలు ఏ పద్య
పాదానికి చెందినవి ?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) కందం
D) తేటగీతి
జవాబు:
A) చంపకమాల
ప్రశ్న 5.
శార్దూల పద్యంలోని గణాలు ఏమిటి ?
A) భ-ర-న-భ-భ-ర-వ
B) మ-స-జ-స-త-త-గ
C) స-భ-ర-న-మ-య-వ
D) న-జ-భ-జ-జ-జ-ర
జవాబు:
B) మ-స-జ-స-త-త-గ
4. అలంకారాలు
ప్రశ్న 1.
“గుండెలో శూలమ్ము, గొంతులో శల్యమ్ము” అలంకారం గుర్తించండి.
A) ఉత్ప్రేక్ష
B) శ్లేష
C) అంత్యానుప్రాస
D) లాటానుప్రాసాలంకారం
జవాబు:
C) అంత్యానుప్రాస
ప్రశ్న 2.
“లేమా దనుజుల గెలువగలేమా !” అలంకారం గుర్తించండి.
A) లాటానుప్రాసం
B) యమకం
C) ఉపమాలంకారం
D) రూపకాలంకారం
జవాబు:
B) యమకం
ప్రశ్న 3.
అతిశయోక్తి అలంకార లక్షణం గుర్తించండి.
A) ఉపమేయానికి, ఉపమానానికి భేదం లేనట్లు చెప్పడం
B) హల్లుల జంట అర్థభేదంతో చెప్పడం
C) ఒక వస్తువును లేదా విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం
D) ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం
జవాబు:
C) ఒక వస్తువును లేదా విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం
ప్రశ్న 4.
తరాలు మారినా అంతరాలు తరగలేదు వాక్యంలోని అలంకారం ఏది ?
A) వృత్త్యనుప్రాస
B) యమకము
C) అంత్యానుప్రాస
D) రూపకము
జవాబు:
A) వృత్త్యనుప్రాస
ప్రశ్న 5.
అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి విద్యాజ్యోతిని వారిలో వెలిగించాడు. ఈ వాక్యం ఏ అలంకారానికి ఉదాహరణ
A) ఉపమాలంకారం
B) వ్యతిరేకాలంకారం
C) రూపకాలంకారం
D) ఉత్ప్రేక్షాలంకారము
జవాబు:
C) రూపకాలంకారం
5. వాక్య పరిజ్ఞానం
ప్రశ్న 1.
కట్టలు కట్టుకొని దూసుకొని పోవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) దూసుకొని వెళ్ళవలె కట్టలు కట్టుకొని
B) కట్టలు కట్టి దూసుకుపోవలెను
C) కట్టలు కట్టుకొని దూసుకొని వెళ్ళవలె
D) కట్టలు కట్టుకొని దూసుకొని పోవాలి
జవాబు:
D) కట్టలు కట్టుకొని దూసుకొని పోవాలి
ప్రశ్న 2.
అనుసరించుటకు సమాయత్తము కావలెను – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) సమాయత్తంబు కావలెను అనుసరించుటకు
B) అనుసరించడానికి సమాయత్తం కావాలి
C) సమాయత్తంబు కావలె అనుసరించుటకు
D) సమాయత్తము కావలెను అనుసరించుటకు
జవాబు:
B) అనుసరించడానికి సమాయత్తం కావాలి
ప్రశ్న 3.
‘నీ విషయాన్ని పరిశీలిస్తారు’ – కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) నీ విషయాన్ని పరిశీలించగలము
B) నీ విషయం పరిశీలింపబడుతుంది
C) నీ విషయం పరిశీలింపరు
D) నీది పరిశీలింపవలసిన విషయం కాదు
జవాబు:
B) నీ విషయం పరిశీలింపబడుతుంది
ప్రశ్న 4.
నరుడు చైతన్యం పొందాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) పొందబడ్డాడు నరుడు చైతన్యం
B) నరునిచేత చైతన్యం పొందబడింది
C) చైతన్యంచే నరుడు పొందబడ్డాడు
D) నరునికి చైతన్యం పొందలేదు
జవాబు:
B) నరునిచేత చైతన్యం పొందబడింది
ప్రశ్న 5.
రవి పాఠం విన్నాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) రవికి పాఠం వినబడింది
B) వినబడింది రవికి పాఠం
C) రవిచేత పాఠం వినబడింది
D) పాఠం చదువబడింది రవి వల్ల
జవాబు:
C) రవిచేత పాఠం వినబడింది
ప్రశ్న 6.
నరుడు చక్రం తిప్పాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) తిప్పబడింది చక్రం నరుని వల్ల
B) నరునికి చక్రం తిప్పడం రాదు
C) నరునిచేత చక్రం తిప్పబడింది
D) నరునియందు చక్రం తిప్పబడింది.
జవాబు:
C) నరునిచేత చక్రం తిప్పబడింది
ప్రశ్న 7.
ఆశీర్యార్థక వాక్యానికి ఉదాహరణ గుర్తించండి.
A) నిండా నూరేళ్ళు వర్థిల్లు
B) దయచేసి రేపు రండి
C) చేతులు శుభ్రంగా కడుక్కోండి
D) లోపలికి రావద్దు
జవాబు:
A) నిండా నూరేళ్ళు వర్థిల్లు
ప్రశ్న 8.
‘ఎవరా సుందరాంగి’ ? – ఇది ఈ క్రింది వాక్యానికి ఉదాహరణ
A) అనుమత్యర్థక వాక్యం
B) సామర్థ్యార్థక వాక్యం
C) ప్రశ్నార్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం
జవాబు:
C) ప్రశ్నార్థక వాక్యం
ప్రశ్న 9.
‘శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు’ ఇది ఏ రకమైన వాక్యం ?
A) సామాన్య వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) క్త్వార్థక వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం
ప్రశ్న 10.
విందుకు వెళ్ళాము. విందు రుచిగా లేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది ?
A) రుచిగా లేదు గాని విందుకు వెళ్ళాము
B) విందుకు వెళ్ళినా రుచికరంగా పెట్టలేదు
C) రుచితో కూడిన విందుకు వెళ్ళాము
D) విందుకు వెళ్ళాము గాని రుచిగా లేదు
జవాబు:
D) విందుకు వెళ్ళాము గాని రుచిగా లేదు
ప్రశ్న 11.
“తెలుగులోనే రాయండి, తెలుగు మాట్లాడండి” అని టివి ఛానల్లో ప్రసారం చేశారు గుర్తించండి.
A) సంక్లిష్ట వాక్యం
B) కర్మణి వాక్యం
C) ప్రత్యక్ష కథనం
D) పరోక్ష కథనం
జవాబు:
C) ప్రత్యక్ష కథనం
ప్రశ్న 12.
“చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమౌతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు – ఏ వాక్యమో గుర్తించండి.
A) ప్రత్యక్ష కథనం
B) పరోక్ష కథనం
C) సంయుక్త వాక్యం
D) సంక్లిష్ట వాక్యం
జవాబు:
A) ప్రత్యక్ష కథనం
ప్రశ్న 13.
తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు – ఇది ఏ వాక్యం ?
A) ప్రత్యక్ష కథనం
B) పరోక్ష కథనం
C) సంయుక్త వాక్యం
D) సంక్లిష్ట వాక్యం
జవాబు:
B) పరోక్ష కథనం
ప్రశ్న 14.
“మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నాడు భాగ్యరెడ్డి వర్మ – ఇది ఏ వాక్యమో గుర్తించండి
A) పరోక్ష
B) సంయుక్త వాక్యం
C) సామాన్య వాక్యం
D) ప్రత్యక్ష వాక్యం
జవాబు:
D) ప్రత్యక్ష వాక్యం
ప్రశ్న 15.
“మేమూ వస్తాం సర్” – ఇది ఏ వాక్యం ?
A) పరోక్షం
B) కర్మణి వాక్యం
C) కర్తరి వాక్యం
D) ప్రత్యక్ష కథనం
జవాబు:
D) ప్రత్యక్ష కథనం
ప్రశ్న 16.
పిల్లలూ ! రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాను – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రత్యక్షవాక్యం
B) నిశ్చయార్థకం
C) చేదర్థకం
D) కర్మణి వాక్యం
జవాబు:
B) నిశ్చయార్థకం
ప్రశ్న 17.
ఈ క్రింది వాక్యాలలో ప్రత్యక్ష కథనం కానిది
A)“నేను రానా తమ్ముడు” అన్నది అక్క
B) “తాము వస్తాం సార్” అన్నాము మేము.
C) బజారుకి వెళ్లామా అని అడిగింది జానకి.
D) “నేను కూడా వస్తా” అన్నాను నేను.
జవాబు:
A)“నేను రానా తమ్ముడు” అన్నది అక్క
ప్రశ్న 18.
పాతనోట్లు ఎప్పుడో రద్దు చేయబడ్డాయి – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రత్యక్ష కథనం
B) కర్మణి వాక్యం
C) ఆధునిక వాక్యం
D) కర్తరి వాక్యం
జవాబు:
B) కర్మణి వాక్యం
ప్రశ్న 19.
“రేపు వాడు బడికి వెడుతున్నాడు ?” – ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం ఏది ?
A) రేపు వాడు బడికి వెళ్ళగలడు
B) రేపు వాడు బడికి రాడు
C) రేపు వాడు బడికి వస్తాడు
D) రేపు వాడు బడికి వెళ్ళడు
జవాబు:
D) రేపు వాడు బడికి వెళ్ళడు
ప్రశ్న 20.
మంత్రాలకు చింతకాయలు రాలవు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) మంత్రాలకు రాలవు చింతకాయలతో
B) మంత్రాలకు చింతకాయలు రాలతాయి
C) మంత్రాలకు చింతకాయలు రాలవచ్చు
D) మంత్రాలకు చింతకాయలు రాలలేకపోవచ్చు
జవాబు:
B) మంత్రాలకు చింతకాయలు రాలతాయి
ప్రశ్న 21.
మానవుడిని శాశ్వతం చేస్తాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) మానవుడిని శాశ్వతం చేయవు
B) మానవునిచే శాశ్వతం చేయబడవు
C) మానవుడివల్ల శాశ్వతం లభించకపోవచ్చు
D) శాశ్వతం వల్ల మానవుడు గొప్పవాడయ్యాడు.
జవాబు:
B) మానవునిచే శాశ్వతం చేయబడవు
ప్రశ్న 22.
నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు – సంయుక్త వాక్యం ఏదో గుర్తించండి.
A) నమాజు చదవరు
B) నమాజు చదవడానికి ఎవరూరారు
C) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు పోతుంటారు.
D) నమాజు చదవడానికి ఎవ్వరూ రారు, ఎవ్వరూ పోరు.
జవాబు:
C) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు పోతుంటారు.
ప్రశ్న 23.
తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు. తిరుమల రామచంద్రగారు ఆంధ్రభాషలో పండితుడు – సంయుక్త వాక్యం ఏదో గుర్తించండి.
A) తిరుమల రామచంద్రగారు తెలుగు పండితుడు
B) మంచి పండితుడు తిరుమల రామచంద్రగారు సంస్కృతంలో పండితుడు.
C) తిరుమల రామచంద్రగారు సంస్కృతం, ఆంధ్ర భాషలలో పండితుడు.
D) తిరుమల రామచంద్రగారు సంస్కృత పండితుడు మరియు తెలుగు పండితుడు.
జవాబు:
C) తిరుమల రామచంద్రగారు సంస్కృతం, ఆంధ్ర భాషలలో పండితుడు.
ప్రశ్న 24.
కమల బాగా రాసింది. కమలకు ర్యాంకు రాలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది ?
A) కమల బాగా చదవడం వల్ల ర్యాంకు రాలేదు
B) ర్యాంకు రాలేదు కాని బాగా చదివింది కమల
C) కమల బాగా రాసింది గాని ర్యాంకు రాలేదు
D) కమల బాగా చదివినా ర్యాంకును కొద్దిగా జారవిడుచుకుంది.
జవాబు:
C) కమల బాగా రాసింది గాని ర్యాంకు రాలేదు
ప్రశ్న 25.
సామాజిక సమస్యలు పరిష్కారం అవుతాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) సామాజిక సమస్యలు పరిష్కారం కావు
B) సామాజిక సమస్యలతో పరిష్కారం చేయబడతాయి
C) సామాజిక సమస్యలకు పరిష్కారం దొరకదు
D) సామాజిక సమస్యలు పరిష్కారం చేయబడవు
జవాబు:
A) సామాజిక సమస్యలు పరిష్కారం కావు