These TS 10th Class Telugu Bits with Answers 5th Lesson నగరగీతం will help students to enhance their time management skills.
TS 10th Class Telugu Bits 5th Lesson నగరగీతం
బహుళైచ్చిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు (1 మార్కు)
ప్రశ్న 1.
పద్మవ్యూహం : ……………………….
జవాబు:
మహాభారత యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు.
ప్రశ్న 2.
జీవనఘోష : ………………………
జవాబు:
ప్రజల జీవన ఘోష నాయకులకు పట్టదు.
ప్రశ్న 3.
ఊపిరాడని : ………………………..
జవాబు:
మధ్యతరగతి వారికి ఎన్నో సమస్యలు ఊపిరాడ నివ్వవు.
ప్రశ్న 4.
నగరారణ్యం : …………………………
జవాబు:
నగరారణ్యంలో ప్రజలగోడు నాయకులకు పట్టదు
ప్రశ్న 5.
మెర్క్యురి నవ్వు : ………………………
జవాబు:
నగరాలలో ప్రజలు మెర్క్యురి నవ్వుతో జీవిస్తున్నారు.
2. అరాలు
ప్రశ్న 1.
దక్షత కల్గిన నాయకులు నేటి సమాజానికి అవసరం. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) సమర్థత
B) దక్షించుట
C) శిక్షించుట
D) భక్షించుట
జవాబు:
A) సమర్థత
ప్రశ్న 2.
నగరగీతం పఠనీయ గ్రంథం. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) అపఠనీయం
B) చదువదగిన
C) చదువతగని
D) వెలకట్టలేని
జవాబు:
B) చదువదగిన
ప్రశ్న 3.
బుధులు సదా వంద్యులు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) పామరులు
B) వ్యాపారులు
C) పాపాత్ములు
D) పండితులు
జవాబు:
D) పండితులు
ప్రశ్న 4.
కుంభి అంటే అర్థం
A) పావురం
B) వానరం
C) చిలుక
D) ఏనుగు
జవాబు:
D) ఏనుగు
ప్రశ్న 5.
తనలో భావన లేదు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) వైరం
B) తలంపు
C) శాంతం
D) క్రోధం
జవాబు:
B) తలంపు
ప్రశ్న 6.
బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) గొప్పగా
B) మూకుమ్మడిగా
C) అల్పంగా
D) నిరాడంబరంగా
జవాబు:
A) గొప్పగా
ప్రశ్న 7.
మా నగరంలోని ఎన్.టి.ఆర్. కూడలి వద్ద పెద్ద గ్రంథాలయం ఉంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) దారులు కలిసే చోటు
B) వీధులు కలిసే చోటు
C) నాలుగుదారులు కలిసే చోటు
D) వాహనాలు ఉండేచోటు
జవాబు:
C) నాలుగుదారులు కలిసే చోటు
ప్రశ్న 8.
వైద్యుడు కావాలని నాకు తీవ్రమైన వాంఛ ఉన్నది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) లక్ష్యం
B) కోరిక
C) పట్టుదల
D) ప్రయత్నం
జవాబు:
B) కోరిక
ప్రశ్న 9.
నరుడు స్వయం కృషితో నారాయణుడిగా మారాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) రవి
B) మానవుడు
C) జంతువు
D) ఋషి
జవాబు:
B) మానవుడు
ప్రశ్న 10.
ధనవంతుని సౌభాగ్యం పేదలకు ఉపయోగపడాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. )
A) ధనవైభవం
B) దారిద్య్రం
C) ప్రయత్నం
D) పరిశ్రమ
జవాబు:
A) ధనవైభవం
ప్రశ్న 11.
ఏకాకిగా ఉండాలని కొందరి కోరిక. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) కలిసిమెలిసి
B) జతగా
C) ఆప్యాయముగా
D) ఒంటరిగా
జవాబు:
D) ఒంటరిగా
3. పర్యాయపదాలు
ప్రశ్న 1.
అలిశెట్టి రచనలలో రైతు బాధ, కృషీవలుని తపన, వ్యవసాయదారుని జీవనం కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. (గీత గీసిన పదాలకు సరిపడు
పర్యాయపదం గుర్తించండి.)
A) రక్షకుడు
B) భక్షకుడు
C) కర్షకుడు
D) మాంత్రికుడు
జవాబు:
C) కర్షకుడు
ప్రశ్న 2.
శృతి జడలో గులాబీ పువ్వు, మందార కుసుమం, మల్లె పుష్పం ఉన్నాయి. (గీత గీసిన పదాలకు సరిపడు పర్యాయపదం గుర్తించండి.)
A) పువ్వు
B) రెమ్మ
C) కొమ్మ
D) చెట్టు
జవాబు:
A) పువ్వు
ప్రశ్న 3.
కాంతవంద్యురాలు, స్త్రీ గౌరవనీయురాలు, వనిత కల్పలత, ఇందులోని పర్యాయపదాలు గుర్తించండి.
A) కల్పలత, వనిత, స్త్రీ
B) కాంత, స్త్రీ, వనిత
C) వనిత, వంద్యురాలు, స్త్రీ
D) కాంత, గౌరవం, కల్పలత
జవాబు:
B) కాంత, స్త్రీ, వనిత
ప్రశ్న 4.
భాగీరథీ తీరంలో ఋషులు తపస్సు చేస్తున్నారు. పంచపావని గంగ జాహ్నవిగా కీర్తి పొందింది. (ఇందులోని పర్యాయపదాలు గుర్తించండి.)
A) భాగీరథి, గంగ, జాహ్నవి
B) భాగీరథి, గంగ, పావని
C) తీరం, తమస్సు, గంగ
D) పావని, గంగ, తీరం
జవాబు:
A) భాగీరథి, గంగ, జాహ్నవి
ప్రశ్న 5.
లక్ష్మి ఇంటికి వస్తుంది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) శ్రీ, ఇందిర, కమల
B) శ్రీ, సాలెపురుగు, వస్త్రము
C) సంపద, అంబరం, వాన
D) స్త్రీ, శ్రీ, వనిత
జవాబు:
A) శ్రీ, ఇందిర, కమల
ప్రశ్న 6.
ఇల్లాలు ఇంటికి దైవం. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) భార్య, కుమారి, సతి
B) భార్య, అర్థాంగి, పత్ని
C) పతి, భర్త, భార్య
D) భార్య, సుత, తనయ
జవాబు:
B) భార్య, అర్థాంగి, పత్ని
ప్రశ్న 7.
వాంఛ, కోరికలు – అనే పదాలకు సమానార్థక పదం గుర్తించండి.
A) వాంఛ
B) అభిలాష
C) గుర్రాలు
D) కోరిక
జవాబు:
B) అభిలాష
ప్రశ్న 8.
చెట్లు – అనే పదానికి అదే సమానార్థానిచ్చే పదాలు
A) కుండ, కొండ
B) చెట్లు, మెట్లు
C) ప్లాట్లు, చెట్లు
D) వృక్షాలు, తరువులు
జవాబు:
D) వృక్షాలు, తరువులు
ప్రశ్న 9.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) గ్రామం, జనపదం
B) కలలు, స్వరాజ్యం
C) స్వరాజ్యం, గ్రామం
D) దేశం, జనపదాలు
జవాబు:
A) గ్రామం, జనపదం
ప్రశ్న 10.
సిటి, షహర్ – అనే పర్యాయపదాలు ఈ పదానికి సంబంధించినవి.
A) గ్రామం
B) గీతం
C) నగరం
D) మనిషి
జవాబు:
C) నగరం
4. వ్యుత్పత్త్యర్థాలు
ప్రశ్న 1.
ప్రపంచమునకు భర్త – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం
A) శివుడు
B) ముక్కంటి
C) విశ్వనాథుడు
D) అంతర్యామి
జవాబు:
C) విశ్వనాథుడు
ప్రశ్న 2.
ఈశ్వరుడు – దీనికి వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది ?
A) పశువులకు నాథుడు
B) సృష్టికి నాథుడు
C) విభూతి ధరించినవాడు
D) ఐశ్వర్యం కలవాడు
జవాబు:
D) ఐశ్వర్యం కలవాడు
ప్రశ్న 3.
“లక్ష్మీదేవికి భర్త” – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం
A) కాంతాపతి
B) భూనాథుడు
C) శ్రియఃపతి
D) లోకనాథుడు
జవాబు:
C) శ్రియఃపతి
ప్రశ్న 4.
“మృగాదులు తిరుగుటకు యోగ్యమైనది” – దీనికి వ్యుత్పత్తి పదం
A) మృగాలు
B) అరణ్యము
C) నగారా
D) పొదరిల్లు
జవాబు:
B) అరణ్యము
ప్రశ్న 5.
“జలధి” కి వ్యుత్పత్తి పదం
A) జలములచే ధరించబడునది
B) ఉదకనిధిచే నిండినది
C) అమ్ముల పొదిలోనిది
D) గుణములకు నిధి
జవాబు:
A) జలములచే ధరించబడునది
ప్రశ్న 6.
“భగీరథునిచే తీసుకొని రాబడినది” దీనికి వ్యుత్పత్తి పదం
A) కృష్ణ
B) తుంగభద్ర
C) పెన్నా
D) గంగ (భాగీరథి)
జవాబు:
D) గంగ (భాగీరథి)
ప్రశ్న 7.
రణన (ధ్వని) లేని ప్రదేశము – అను వ్యుత్పత్తి గల పదము
A) అరణ్యము
B) కాంతారం
C) రణము
D) భాగము
జవాబు:
B) కాంతారం
ప్రశ్న 8.
నగ (కొండ) వంటి భవనములు కల ప్రదేశము – అను వ్యుత్పత్తి గల పదము
A) నగరము
B) శీతనగము
C) పట్టణం
D) ఏనుగు
జవాబు:
D) ఏనుగు
5. నానార్థాలు
ప్రశ్న 1.
సంపదలతో శబ్దార్థాలు గల కావ్యాలను కొని, పంచి ప్రయోజనం పొందవచ్చును. (గీత గీసిన పదాలకు సరిపడు నానార్థపదం గుర్తించండి.)
A) తల్లి
B) తండ్రి
C) తాత
D) అర్థం
జవాబు:
D) అర్థం
ప్రశ్న 2.
వాహిని దీనికి నానార్ధములు
A) నది, సేన
B) నది, సముద్రం
C) సముద్రం, సాగరం
D) నది, స్రవంతి
జవాబు:
A) నది, సేన
ప్రశ్న 3.
ఆకాశంలో మిత్రుడు ప్రకాశిస్తున్నాడు. (గీత గీసిన పదానికి నానార్థం గుర్తించండి.)
A) వైరి, విరోధి
B) మిత్రుడు, నేస్తం
C) పగతుడు, మిత్రుడు
D) స్నేహితుడు, సూర్యుడు
జవాబు:
D) స్నేహితుడు, సూర్యుడు
ప్రశ్న 4.
కాలుట – పదానికి నానార్థాలు
A) ఉన్నతి, నరుకు
B) తరుగుట, మరుగుట
C) మండుట, పాదము
D) పాతిక, అర్ధ
జవాబు:
C) మండుట, పాదము
ప్రశ్న 5.
వరిమడి, దిగంతము – అనే నానార్థాలనిచ్చే పదం
A) సీమ
B) విదేశము
C) సొడ్డు
D) నారమడి
జవాబు:
A) సీమ
ప్రశ్న 6.
అర్థము – పదానికి నానార్థాలు
A) ధనము, డబ్బు
B) సగం, ధనం
C) ధనం, రాశి
D) ధనము, కారణము
జవాబు:
B) సగం, ధనం
ప్రశ్న 7.
ధనము, కారణము – అనే నానార్థాలు గల పదం
A) అర్ధము
B) డబ్బు
C) సగము
D) సంపద
జవాబు:
C) సగము
ప్రశ్న 8.
చాటించు, పెద్ద గోల – అనే నానార్థాలు గల పదం
A) ఘోష
B) గోడు
C) డప్పు
D) ముట్టడి
జవాబు:
A) ఘోష
ప్రశ్న 9.
మనుష్యుడు, అర్జునుడు – అనే నానార్థాలు గల పదం
A) నరుడు
B) ఋషి
C) నారాయణుడు
D) నారి
జవాబు:
C) నారాయణుడు
ప్రశ్న 10.
ఈ సీమ దాటి ఎవరూ రారు ? (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) హద్దు, పొద్దు
B) ప్రదేశము, ఎల్ల
C) దిక్కుల చివర, సీమచింత
D) రాయలసీమ, బంగారం
జవాబు:
A) హద్దు, పొద్దు
6. ప్రకృతి – వికృతులు
ప్రశ్న 1.
అరణ్యంకు వికృతి
A) అరణ్యం
B) ఆరణ్యం
C) అటవి
D) ఆటవి
జవాబు:
C) అటవి
ప్రశ్న 2.
పట్టముకు ప్రకృతి
A) పట్టణం
B) పాట్టణము
C) పాణ్ణము
D) ప్రాణము
జవాబు:
A) పట్టణం
ప్రశ్న 3.
సిరి ఇంట చేరింది. (గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.)
A) శీరి
B) శ్రీ
C) శర
D) శ్రీరం
జవాబు:
B) శ్రీ
ప్రశ్న 4.
మానవులు ధర్మం ఆచరించాలి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) దరుమము
B) దమ్మం
C) దెమ్మం
D) ధమ్మెము
జవాబు:
B) దమ్మం
ప్రశ్న 5.
‘మిత్తి’ కి ప్రకృతి పదం గుర్తించండి.
A) మ
B) మృత్యువు
C) మృత్తిక
D) మరణం
జవాబు:
C) మృత్తిక
ప్రశ్న 6.
‘ప్రకృతి’కి వికృతి పదం గుర్తించండి
A) పగిది
B) పకృతి
C) ప్రకతి
D) పగతి
జవాబు:
C) ప్రకతి
ప్రశ్న 7.
‘నగరు’ పదానికి ప్రకృతి పదం ?
A) నగరం
B) నగ
C) నాగ
D) నగవు
జవాబు:
A) నగరం
ప్రశ్న 8.
పువ్వు పదానికి ప్రకృతి పదం ?
A) పూజా
B) పువ్వం
C) పుష్పం
D) పుణ్యం
జవాబు:
C) పుష్పం
ప్రశ్న 9.
భాగ్యము పదానికి వికృతి పదం ?
A) భాగం
B) బాగ
C) బాగా
D) బాగ్గెం
జవాబు:
D) బాగ్గెం
ప్రశ్న 10.
స్థిరం పదానికి వికృతి పదం ?
A) సిరం
B) తిరం
C) చిరం
D) సిర
జవాబు:
B) తిరం
భాషాంశాలు (వ్యాకరణం) (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – II : PART – B
1. సంధులు
ప్రశ్న 1.
“నగరారణ్యం” విడదీయగా
A) నగ + ఆరారణ్యం
B) నగర + అరణ్యం
C) నగారా + ఆరణ్యం
D) నగారా + అరణ్యం
జవాబు:
B) నగర + అరణ్యం
ప్రశ్న 2.
ఏమ్యాదుల క్రియాపదాలలోని ఇత్తునకు సంధి ఎలా జరుగుతుంది ?
A) బహుళంగా
B) వైకల్పికంగా
C) సంధి జరుగదు
D) సంధి తరుచుగా జరుగుతుంది.
జవాబు:
B) వైకల్పికంగా
ప్రశ్న 3.
“శోకాగ్ని” ఇది ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) వృద్ధి సంధి
D) విసర్గ సంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 4.
పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఏది ?
A) రజనీశ్వరుడు
B) అత్తఱి
C) ముత్యపుచిప్ప
D) మనోహరం
జవాబు:
C) ముత్యపుచిప్ప
ప్రశ్న 5.
సమాంతర రేఖలు – విడదీయండి.
A) సమ + అంతర రేఖలు
B) సమ + ఆంతర రేఖలు
C) సమాంతర + రేఖలు
D) సమాంతర రేఖ + లు
జవాబు:
A) సమ + అంతర రేఖలు
ప్రశ్న 6.
చైత్రారంభం – విడదీయండి.
A) చైత్రా + ఆరంభం
B) చైత్ర + ఆరంభం
C) చైత్రత్ + ఆరంభం
D) చైత్రత్ + సంరంభం
జవాబు:
B) చైత్ర + ఆరంభం
ప్రశ్న 7.
ఊపిరాడని – విడదీయండి.
A) ఊపిర + ఆడని
B) ఊపిరిన్ + ఆడనిన్
C) ఊపిరి + ఆడని
D) ఊపిరి + అడనిన్
జవాబు:
C) ఊపిరి + ఆడని
ప్రశ్న 8.
పూరిల్లు – విడదీయండి.
A) పువ్వు + ఇల్లు
B) పూవు + యిల్లు
C) పూరియ + ఇల్లు
D) పూరి + ఇల్లు
జవాబు:
D) పూరి + ఇల్లు
ప్రశ్న 9.
ఏమది – విడదీయండి.
A) ఏమి + అది
B) ఏమి + యది
C) ఏమి + యయ్యది
D) ఏమి + మది
జవాబు:
A) ఏమి + అది
2. సమాసాలు
ప్రశ్న 1.
“మహానగరం” ఏ సమాసం?
A) విశేషణ పూర్వపద కర్మధారయ
B) షష్ఠీ తత్పురుష
C) అవ్యయీభావ
D) ద్విగువు
జవాబు:
A) విశేషణ పూర్వపద కర్మధారయ
ప్రశ్న 2.
అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ
A) మనచూపులు
B) ప్రతిమనిషి
C) మహావృక్షం
D) పూరిళ్ళు
జవాబు:
B) ప్రతిమనిషి
ప్రశ్న 3.
యథాశక్తి – ఇది ఏ సమాసం ?
A) ద్విగువు
B) అవ్యయీభావం
C) బహువ్రీహి
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
B) అవ్యయీభావం
ప్రశ్న 4.
ఇనప్పెట్టె – ఏ సమాసం ?
A) షష్ఠీ తత్పురుష
B) తృతీయా తత్పురుష
C) సప్తమీ తత్పురుష
D) ద్వంద్వ
జవాబు:
B) తృతీయా తత్పురుష
ప్రశ్న 5.
పఠనీయ గ్రంథం – ఏ సమాసం?
A) షష్ఠీ
B) ద్వంద్వ
C) ద్విగువు
D) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
D) విశేషణ పూర్వపద కర్మధారయం
ప్రశ్న 6.
“విశ్వంలో వింతలు” పఠనీయ గ్రంథంగా చెప్తారు – గీత గీసిన పదానికి సరైన విగ్రహవాక్యం గుర్తించండి
A) పఠనీయములు గ్రంథములు
B) పఠనీయము ఐన గ్రంథము
C) గ్రంథం యొక్క పఠనీయం
D) పఠన గ్రంథము కానిది
జవాబు:
B) పఠనీయము ఐన గ్రంథము
ప్రశ్న 7.
“నాలుగు కాళ్ళు” – సమాసము పేరు
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) సంభావనా పూర్వపద కర్మధారయము
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
జవాబు:
B) ద్విగు సమాసము
ప్రశ్న 8.
సమాంతరమైన రేఖలు – సమాసము పేరు
A) విశేషణ ఉత్తరపద కర్మధారయము
B) విశేషణ పూర్వపద కర్మధారయము
C) ఉపమాన పూర్వపద కర్మధారయము
D) బహువ్రీహి సమాసము
జవాబు:
B) విశేషణ పూర్వపద కర్మధారయము
ప్రశ్న 9.
మన చూపులు ఏ సమాసము ?
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
C) ద్విగు సమాసము
D) బహువ్రీహి సమాసము
జవాబు:
A) షష్ఠీ తత్పురుష సమాసము
ప్రశ్న 10.
నగర మహావృక్షం నీడన సామాన్యుడు జీవించడం కష్టం (గీత గీసిన పదం యొక్క సరైన విగ్రహవాక్యం గుర్తించండి.)
A) నగరము యొక్క మహావృక్షం
B) నగరము వంటి మహావృక్షం
C) నగరము అనెడు మహావృక్షం
D) నగరమును, మహావృక్షమును
జవాబు:
A) నగరము యొక్క మహావృక్షం
3. చంధస్సు
ప్రశ్న 1.
“పొదిలి యొండొండ దివియు భువియు దిశలు” – ఇది ఏ వృత్తానికి చెందినది ?
A) ఉత్పలమాల
B) తేటగీతి
C) ఆటవెలది
D) శార్దూలము
జవాబు:
B) తేటగీతి
ప్రశ్న 2.
సూర్యగణాలు ఎన్ని ?
A) రెండు
B) మూడు
C) ఆరు
D) నాలుగు
జవాబు:
A) రెండు
ప్రశ్న 3.
మునివర నీవు శిష్యు గణముంగొని చయ్యనరమ్ము విశ్వనా ………………. ఈ వాక్యం ఏ అలంకారం
A) ఉత్పలమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల
4. అలంకారాలు
ప్రశ్న 1.
నగారా మోగిందా, నయాగరా దుమికిందా ! ఇది ఏ అలంకారం ?
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) ముక్తపదగ్రస్తం
D) అంత్యానుప్రాసాలంకారం
జవాబు:
D) అంత్యానుప్రాసాలంకారం
ప్రశ్న 2.
“లేమా ! దనుజుల గెలువగలేమా” ఇది ఏ అలంకారం ?
A) ముక్తపదగ్రస్తం
B) యమకం
C) లాటానుప్రాస
D) వృత్త్యనుప్రాస
జవాబు:
B) యమకం
ప్రశ్న 3.
ఒక పద్యపాదంగాని, వాక్యం గానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదంగానీ, -వాక్యం గానీ మొదలయితే దాన్ని ఏ అలంకార మంటారు ?
A) లాటానుప్రాస
B) యమకం
C) ముక్తపదగ్రస్తం
D) ఉపమ
జవాబు:
C) ముక్తపదగ్రస్తం
ప్రశ్న 4.
“కమలాక్షు నర్చించు కరములు కరములు” ఈ ఉదాహరణ ఏ అలంకారం ?
A) యమకం
B) ఉపమ
C) రూపకం
D) లాటానుప్రాస
జవాబు:
D) లాటానుప్రాస
ప్రశ్న 5.
“భారతమునందు యుక్తి – భాగవతమునందు భక్తి” ఇందులోని అలంకారం ఏది ?
A) అంత్యానుప్రాస
B) వృత్త్యానుప్రాస
C) లాటానుప్రాస
D) యమకం
జవాబు:
A) అంత్యానుప్రాస
ప్రశ్న 6.
“విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉండడం” ఇది ఏ అలంకారం ?
A) లాటానుప్రాస
B) శ్లేషాలంకారం
C) యమకం
D) ఉత్ప్రేక్ష
జవాబు:
C) యమకం
5. వాక్య పరిజ్ఞానం
ప్రశ్న 1.
‘దయచేసి ఆ పని పూర్తి చేయండి’ – ఇది ఏ వాక్యం ?
A) విధ్యర్థక వాక్యం
B) ప్రార్థనార్థక వాక్యం
C) సంభావనార్థక వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
B) ప్రార్థనార్థక వాక్యం
ప్రశ్న 2.
“వర్తమాన కాల అసమాపక క్రియనే” మంటారు ?
A) విధ్యర్థకం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) నిషేధార్థకం
జవాబు:
B) శత్రర్థకం
ప్రశ్న 3.
“పాఠం చదివినప్పటికీ రాలేదు” ఇది ఏ వాక్యం ?
A) క్త్వార్థము
B) చేదర్థకం
C) అప్యర్థకం
D) విధ్యర్థకం
జవాబు:
C) అప్యర్థకం
ప్రశ్న 4.
“పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు” (దీనికి వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు
B) పల్లెటూళ్ళు ఎండిపోయాయి
C) పల్లెటూళ్ళలో మాత్రమే పచ్చదనం ఉండదు
D) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు కావు
జవాబు:
D) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు కావు
ప్రశ్న 5.
“నీయెడ దోసంగుల్లేమి భావించితిన్” ఇది ఏ వాక్యం ?
A) ప్రత్యక్ష కథనం
B) పరోక్ష కథనం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం
జవాబు:
A) ప్రత్యక్ష కథనం
ప్రశ్న 6.
“వివేకం లేని రాజును సేవించడం కంటే వనవాసం మంచిది” ఇది ఏ వాక్యం ?
A) గ్రాంథికం
B) పదం
C) గద్యం
D) వ్యవహారికం
జవాబు:
D) వ్యవహారికం
ప్రశ్న 7.
“రాముడు విభీషణుని రక్షించెను” – ఇది ఏ వాక్యం ?
A) కర్తరి వాక్యం
B) కర్మణి వాక్యం
C) ప్రత్యక్షం
D) పరోక్షం
జవాబు:
A) కర్తరి వాక్యం
ప్రశ్న 8.
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి.
A) గీత బజారుకు వెళ్ళి, గీత కూరగాయలు కొన్నది
B) గీత వెళ్ళి, కూరగాయలు కొన్నది
C) గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది
D) గీత బజారుకు వెళ్ళి, గీత కూరగాయలు
జవాబు:
C) గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది
ప్రశ్న 9.
“పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం ముఖ్యం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు – ఏ వాక్యమో గుర్తించండి.
A) పరోక్ష వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామాన్య వాక్యం
D) ప్రత్యక్ష వాక్యం
జవాబు:
D) ప్రత్యక్ష వాక్యం
ప్రశ్న 10.
ఈ కింది వాక్యాలలో ప్రత్యక్ష కథనం గల వాక్యం
A) “అక్కా! ఆ చెరువు చూడు” అన్నాడు తమ్ముడు
B) అక్క ఆ చెరువును చూసింది
C) చెరువు నిండా పూసిన పూలు
D) “తనకు ఆ పూలు కావాలి అంది అక్క
జవాబు:
A) “అక్కా! ఆ చెరువు చూడు” అన్నాడు తమ్ముడు
ప్రశ్న 11.
వర్తమానంలో ఉన్న స్త్రీలు కలుసుకోబడాలి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) వర్తమానంలో ఉన్న స్త్రీలను కలుసుకోవాలి
B) స్త్రీలకు వర్తమాన కాలంలో కలుసుకొని తీరాలి
C) స్త్రీలతో వర్తమాన కాలంలో కలుసుకొనవలెను
D) వర్తమానంలోని స్త్రీలతో కలుసుకొనబడాలి
జవాబు:
A) వర్తమానంలో ఉన్న స్త్రీలను కలుసుకోవాలి
ప్రశ్న 12.
ఉత్సాహంతో ఈ పని మొదలుపెట్టాం – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) మొదలుపెట్టాం ఉత్సాహంతో ఈ పని
B) ఈ పనితో పనిని మొదలుపెట్టాము
C) ఉత్సాహం వల్ల ఈ పని మొదలుపెట్టాము
D) ఉత్సాహంతో ఈ పని మొదలు పెట్టబడింది.
జవాబు:
D) ఉత్సాహంతో ఈ పని మొదలు పెట్టబడింది.
ప్రశ్న 13.
చరిత్రసాగిన క్రమం ప్రతివాళ్ళచేత ప్రశ్నింపబడింది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) ప్రతివాళ్ళు ప్రశ్నించారు
B) ప్రతివాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని
C) ప్రశ్నించారు అందరు చరిత్రసాగిన విధానమును
D) ప్రశ్నించబడింది ప్రతివాళ్ళు చరిత్ర సాగిన విధానమును
జవాబు:
B) ప్రతివాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని
ప్రశ్న 14.
‘నేను నీతో రాను’ అని రమేష్ నీతో అన్నాడు ప్రత్యక్ష కథనాన్ని, పరోక్ష కథనంగా మార్చండి.
A) తాను నీతో రానని, రమేష్ నీతో అన్నాడు
B) నేను నీతో రానని రమేష్ నీతో అన్నాడు
C) నీవు నాతో రావని రమేష్ నీతో అన్నాడు
D) నేనూ రమేష్ నీతో రామని చెప్పాడు
జవాబు:
A) తాను నీతో రానని, రమేష్ నీతో అన్నాడు
ప్రశ్న 15.
“నాకు మహిళలంటే గౌరవం” అని మంత్రి అన్నారు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) తనకు మహిళలంటే గౌరవమని మంత్రి అన్నారు.
B) మహిళలపై గౌరవం అధికమని మంత్రి చెప్పారు.
C) మంత్రి మహిళలపట్ల గౌరవం ప్రకటించారు.
D) అతనికి మహిళలపై గౌరవం మెండని చెప్పాడు.
జవాబు:
A) తనకు మహిళలంటే గౌరవమని మంత్రి అన్నారు.
ప్రశ్న 16.
“మాకు ఎందరో సహకరించారు” అని రచయితలు అన్నారు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వారికి ఎందరో సహకరించారని రచయితలు చెప్పుకున్నారు.
B) సహకరించినవారు ఎందరో ఉన్నారని రచయితలు చెప్పారు.
C) తమకు సహకరించినవారు కొందరున్నారని రచయితలు చెప్పుకున్నారు.
D) తమకు ఎందరో సహకరించారని రచయితలు అన్నారు.
జవాబు:
D) తమకు ఎందరో సహకరించారని రచయితలు అన్నారు.