The Malady of Overthinking Annotations Questions and Answers Summary

Regular practice with AP Inter 1st Year English Study Material and The Malady of Overthinking Annotations Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year English The Malady of Overthinking Questions and Answers Annotations

The Malady of Overthinking Annotations

Contextual Questions

Question 1.
I was a hospital in myself. All they need to do would be to walk round me, and, after that, take their diploma.
Answer:
Reference: These lines are taken from the humorous essay ‘The Malady of Overthinking’ written by Jerome K. Jerome. Context: The narrator humorously imagines himself suffering from every disease listed in a medical book. After reading the symptoms, he concludes that he is such a perfect specimen of illness that medical students could just examine him and be ready for their diplomas.

Appreciation: The lines are filled with hyperbole and satire. Jerome mocks the tendency of people to overanalyze minor health issues and assume the worst. His witty exaggeration emphasizes the foolishness of self-diagnosis. The style is light-hearted and comical, effectively highlighting the theme of imagined illnesses born from overthinking.

Conclusion: This quote humorously criticizes hypochondria and showcases the narrator’s absurdity through clever exaggeration. It reflects the essay’s central message: imagination, when uncontrolled, can lead to irrational fears.

ప్రస్తావన : Jerome K.Jerome వ్రాసిన హాస్యముతో కూడిన వ్యాసము ‘The Malady of Overthinking’ నుండి ఈ పంక్తులు తీసికొనబడినవి. సందర్భము : వైద్యగ్రంథములోని ప్రతి వ్యాధి తనకు వున్నదని కథకుడు హాస్యముగా ఊహించుకొనును. వ్యాధి లక్షణములు చదివిన తరువాత, తాను, ఆ లక్షణములన్నీ కలిగిన చక్కని నమూనానని నిర్ణయించుకొనును. తనను పరీక్షించి వైద్య విద్యార్థులు డిప్లొమా పొందుటకు సిద్ధపడవచ్చును. (అనగా వారికి వ్యాధులపై అంత ఎక్కువ విషయము తెలియును)

ప్రశంస : ఈ వాక్యములు అతిశయోక్తి, వ్యంగ్యములతో నిండియున్నవి. చిన్న వ్యాధులను అతిగా విశ్లేషించుకొని, ఎక్కువ చెడు ఊహించుకొనువారిని రచయిత Jerome వెక్కిరించుచున్నారు. ఆయన, సొంతగా వ్యాధిని నిర్ణయించు మూర్ఖత్వమును తన హాస్యభరిత అతిశయోక్తి ద్వారా నొక్కి చెప్పుచున్నారు. ఈ రచనా పద్ధతి తేలికగాను, హాస్యముతోనూ వుండి, అతిగా ఆలోచించి, లేని వ్యాధులను ఊహించుకొనువారిని గురించి ప్రముఖముగా తెలియ జేయుచున్నది.

ముగింపు : ఈ వాక్యములలో hypochondria తో బాధపడుచున్నవారిని రచయిత హాస్యముగా విమర్శించుచున్నారు. ఇట్టి మానసిక స్థితిగలవారు తమకు ఏ వ్యాధి లేకపోయినా, వున్నట్లు ఊహించుకొని ఎల్లప్పుడు బాధపడతారు. కథకుని పనికిరాని ఆలోచనను చక్కని అతిశయోక్తి ద్వారా వాక్యములు తెలియజేయుచున్నవి. ఇందులో ఈ వ్యాసము యొక్క ముఖ్య సందేశము వున్నది. అదుపులో వుంచుకొనని ఊహ కారణములేని భయమునకు దారితీయును. కావున అతిగా ఊహించుకుని భయపడరాదు.

Question 2.
I walked into that reading room a happy, healthy man. I crawled out a decrepit wreck.
Answer:
Reference: These lines are taken from the essay ‘The Malady of Overthinking’ by Jerome K. Jerome

Context: After entering the British Museum as a healthy person, the narrator reads about various diseases and convinces himself that he has them all. This comical transformation leaves him mentally and physically drained.

Appreciation : The contrast between ‘walked in’ and ‘crawled out’ highlights the power of negative thinking. The use of humorous exaggeration reflects how imagination can dominate reason. Jerome’s playful tone, paired with irony, delivers a subtle message about the psychological effects of anxiety and overanalysis.

Conclusion: The lines humorously illustrate how ignorance mixed with imagination can lead to unnecessary suffering, aligning with the essay’s theme of irrational self-diagnosis.

ప్రస్తావన : Jerome K. Jerome వ్రాసిన “The Malady of Overthinking’ అను వ్యాసము నుండి ఈ పంక్తులు తీసికొనబడినవి.

సందర్భము : బ్రిటిషు పురావస్తుశాలలోనికి కథకుడు ఆరోగ్యవంతునిగా ప్రవేశించును. అక్కడ వివిధ రకములైన వ్యాధుల గురించి చదువును. ఆ వ్యాధులన్నియు తనకు ఉన్నట్లు నమ్మకము కల్గును. ఇటువంటి హాస్యముతో కూడిన మార్పువల్ల ఆయన శారీరకముగా, మానసికముగా కుంగిపోవును.

ప్రశంస : ‘లోపలికి వెళ్ళును’, ‘ప్రాకుతూ, బాధతో బయటకు వచ్చును’ అను పదముల తేడా ప్రతికూల ఆలోచనల గురించి ప్రముఖముగా తెలియజేయును. హాస్యముతో కూడిన అతిశయోక్తిని ఉపయోగించుట, ఒక మనిషి యొక్క విచక్షణాశక్తిపై ఊహ ఏ విధంగా ఆధిపత్యం చేయునో తెలియజేయును. రచయిత సరదాతో వ్యంగ్యము కలిపెను. ఒక వ్యక్తి ఆదుర్దాలో అతిగా విశ్లేషించుట వలన కలుగు మానసిక ఆందోళనను సున్నితమైన సందేశము ద్వారా తెలియజేసెను.

ముగింపు : వ్యాధి గురించి తెలియకపోవుట, అమాయకత్వము కలిసిన, మనిషి ఏ విధముగా అనవసర బాధ పొందునో, ఈ వాక్యములు హాస్యముగా వివరించుచున్నవి. వీనితో పాటు ఒక వ్యక్తి కారణము లేని వ్యాధి నిర్ధారణ ఈ వ్యాసము యొక్క ముఖ్య విషయము (ఉద్దేశ్యము).

The Malady of Overthinking Annotations Questions and Answers Summary

Question 3.
Don’t stuff up your head with things you don’t understand. I followed the directions, with the happy result.
Answer:
Reference: These lines are taken from the essay ‘The Malady of Overthinking’ written by Jerome K. Jerome.

Context: The narrator shares the advice given by his doctor after he panics from reading about diseases. The doctor’s simple prescription – rest, good food, and not overthinking – restores his health.

Appreciation: The lines deliver practical wisdom in a humorous way. They emphasize the importance of mental clarity and trusting expert advice. The contrast between the narrator’s imagined illnesses and the doctor’s straight- forward solution adds to the humor. Jerome shows that sometimes, simple lifestyle changes are more effective than overanalyzing.

Conclusion: These lines present a valuable message: peace of mind and simplicity are essential for well-being. It strength- ens the central theme by contrasting the dangers of overthinking with the benefits of common sense.

ప్రస్తావన : Jerome K. Jerome వ్రాసిన ‘The Malady of Overthinking’ అను వ్యాసము నుండి ఈ పంక్తులు తీసికొనబడినవి.

సందర్భము : వ్యాధులను గురించి చదివి, కథకుడు తీవ్రముగా భయపడును. అప్పుడు వైద్యుని సలహాను స్వీకరించును. వైద్యుడు సామాన్యమైన సూచన చేయును – విశ్రాంతి, మంచి ఆహారము అతిగా ఆలోచించకపోవుట. ఇవి మంచి ఆరోగ్యమును తిరిగి ఇచ్చును.

ప్రశంస : ఆచరణ సాధ్యమైన జ్ఞానమును ఈ వాక్యములు హాస్య పద్ధతి ద్వారా తెలియజేయును. మానసిక స్పష్టత, అనుభవజ్ఞుల సలహాలను నమ్ముట వీని ప్రాముఖ్యత గురించి ఈ పంక్తులు నొక్కి చెప్పుచున్నవి. కథకుని వ్యాధి గురించి ఊహ, వైద్యుని నిజాయితీ పరిష్కారము, హాస్యమునకు జోడించబడినవి. అతి విశ్లేషణ కంటె కొన్ని సందర్భములలో సామాన్య జీవన విధానము బాగుగా పనిచేయునని రచయిత Jerome తెలియజేయును.

ముగింపు : ఈ పంక్తులు మనశ్శాంతి మరియు నిరాడంబరత (సరళత) సుఖంగా జీవించేందుకు అవసరమైనవనే సందేశాన్ని అందించును. ఇది లోక జ్ఞానం వల్ల ఉండే ఉపయోగాలను అధిక ఆలోచన వల్ల వచ్చే ప్రమాదాలతో పోల్చడం ద్వారా ప్రధాన ఇతివృత్తాన్ని బలపరుచును.

Question 4.
You know, it often is so – those simple, old-fashioned remedies are sometimes more efficacious than all the dispensary stuff.
Answer:
Reference : This line is taken from the essay “The Malady of Overthinking’ by Jerome K. Jerome.

Context: Reflecting on his childhood, the narrator recalls how scoldings and physical actions were more effective in motivating him than pills or medicines.

Appreciation : The line conveys irony and nostalgia, pointing out that traditional, simple remedies often worked better than modern medication. Jerome uses this observation to criticize blind reliance on medicines and highlight the effectiveness of common-sense methods. His tone is humorous yet meaningful.

Conclusion: The line humorously supports the essay’s message that overmedication is often unnecessary. Simple remedies and sound advice can be more effective than allopathic treatments when the real problem lies in the mind.

ప్రస్తావన : Jeroine K. Jerome వ్రాసిన “The Malady of Overthinking’ అను వ్యాసము నుండి ఈ పంక్తి తీసికొనబడినది.

సందర్భము : : కథకుడు తన బాల్యము గురించి ఆలోచించును. ఆ రోజులలో తిట్లు, దెబ్బలు గుళికలు, మందులకంటె బాగా సమర్థవంతంగా వుండేవి.

ప్రశంస : ఈ వాక్యములు కథకుని చిన్నప్పటి భావములను, వ్యంగ్యభరితముగా తెలియజేయును. ఆధునిక వైద్యముకన్న సాంప్రదాయబద్ధమైన చిట్కాలు (సామాన్య చికిత్స) బాగుగా పనిచేసేవి. గుడ్డిగా మందులపై ఆధారపడుట కన్న సామాన్య జ్ఞానముతో ఉపయోగించు పద్ధతులు చక్కగా పనిచేయునని Jerome ఈ వ్యాసము ద్వారా తెలియజేయుచున్నాడు. అతను తెలియజేయు పద్ధతి హాస్యముతో కూడినప్పటికి అర్థవంతమైనది, ఉపయోగకరమైనది.

ముగింపు : ఈ పంక్తి హాస్యముతో కూడి వ్యాసము యొక్క సందేశమును బలపరచుచున్నది. అతిగా మందుల వాడకము అనవసరము. సామాన్య చికిత్సలు, మంచి సలహా ఇంగ్లీషు వైద్యము కంటె బాగా పనిచేయును. అయితే ఈ సూచన మానసిక సమస్య వున్నవారికి మాత్రమే ఇవ్వబడినది.

The Malady of Overthinking Questions and Answers

Question 1.
Comment on the title of “The Malady of Overthinking” by Jerome K. Jerome. Are maladies of overthinking limited to health? Explain your view.
Answer:
The title “The Malady of Overthinking” is cleverly chosen as it uses the word malady-which means illness – to describe a mental condition caused not by physical pathogens but by excessive thought. Jerome humorously narrates how reading about diseases makes him believe he has every illness listed. While the essay focuses on health, the title suggests a broader interpretation. Overthinking is not confined to health – it affects academics, relationships, decision-making, and mental well-being. It leads to anxiety, indecision, fear, and even depression. The essay, though humorous, reflects a serious truth: unchecked imagination and constant worry can affect a person’s peace of mind and functionality. Thus, the title effectively captures both the literal and metaphorical implications of overthinking as a disorder of the mind, not just the body.

ఈ పేరు ‘The Malady of Overthinking’ తెలివిగా ఎన్నుకొనబడినది. ఇందులో ‘malady’ అను పదము వాడబడినది. ‘Malady’ అనగా వ్యాధి. ఈ వ్యాధి శారీరక కారణమునకు సంబంధించినది కాదు. అతిగా ఆలోచించుటకు సంబంధించినది. కథకుడు వ్యాధుల గురించి చదువును. అందులో వున్న ప్రతి వ్యాధి తనకున్నదని నమ్మును. ఈ విషయమును రచయిత Jerome హాస్యముగా వివరించెను. ఈ వ్యాసము పేరు ఆరోగ్యమును గురించి ప్రముఖముగా తెలియజేయును. కాని ఇది ఒక విస్తృతమైన వివరణను సూచించును. అతిగా ఆలోచించుట ఆరోగ్యమునకు మాత్రమే సంబంధించినది కాదు. అది అనేక విధములైన ప్రభావములు కలిగి వున్నది చదువు, సంబంధాలు, నిర్ణయములు చేయుట, మానసిక ఆరోగ్యము మొదలగునవి. అది ఆందోళన, నిర్ణయము తీసికొనలేకపోవుట (అనిశ్చితి), భయము ఇంకా నిరాశలకు దారితీయును. ఇది హాస్యభరిత వ్యాసమైనను ఒక ముఖ్యమైన నిజమును తెలియజేయుచున్నది. అదుపు లేని ఊహ, ఎల్లప్పుడు విచారము ఒక మనిషి యొక్క ప్రశాంతతను భగ్నము చేయును; మనసును సరయిన మార్గంలో పనిచేయనివ్వదు. ఈ విధముగా ఈ వ్యాసము యొక్క పేరు అసలైన అర్థమును, దాని రూపాంతరములను మనసుకు ఆకట్టుకొనునట్లు తెలియ జేయును. అతిగా ఆలోచించుట శరీరమునకు, మనస్సుకు సంబంధించిన రుగ్మత (వ్యాధి).

Question 2.
What are the potential dangers of gaining excessive information about diseases as we have seen in “The Malady of Overthinking”?
Answer:
In “The Malady of Overthinking,” Jerome K. Jerome humorously explores the consequences of self-diagnosis through excessive reading. The narrator visits the British Museum for a simple inquiry about hay fever but ends up believing he has nearly every disease mentioned in a medical book. This irrational conclusion shows the danger of too much information without proper understanding. Gaining medical knowledge without expert guidance often leads to hypochondria, anxiety, and misinterpretation. People may begin to imagine symptoms that don’t exist or assume the worst about minor ailments. The narrator’s exaggerated belief that he is a “hospital in himself” serves as a warning about the psychological toll of such obsession. Today, with the internet, this problem has worsened; self-diagnosis through online searches often causes panic. Jerome’s essay remains highly relevant as it reminds us that information without context or professional advice can do more harm than good.

Jerome K. Jerome, ‘The Malady of Overthinking’ అను ఈ వ్యాసములో అతిగా చదివి, స్వంతముగా వైద్య నిర్ధారణ చేయుటవలన కలుగు ఫలితములను హాస్య పద్ధతిలో అన్వేషణ ద్వారా తెలియజేయుచున్నాడు. జలుబు, మంటకు సంబంధించిన hay fever అను చిన్న విషయమును గురించి తెలిసికొనుటకు కథకుడు బ్రిటిషు పురావస్తుశాలకు వెళ్లును. వైద్య గ్రంథములోని అన్ని వ్యాధులు తనకు వున్నవని చివరిగా నమ్మును. ఈ కారణము లేని నిర్ణయము, సరైన అవగాహన లేకుండా, అతిగా తెలిసికొనుట వలన కలుగు అనర్థమును తెలియజేయును. అనుభవజ్ఞుల మార్గదర్శనము లేకుండ వైద్య విజ్ఞానము పొందుట అనేక అనర్థములకు దారితీయును అన్ని వ్యాధులు తనకున్నపని అనుకొనుట, ఆందోళన, తప్పుగా అన్వయించుకొనుట మొదలగునవి. తమకు లేని లక్షణములు వున్నవని ప్రజలు అనుకొనెదరు. చివరకు చిన్న వ్యాధులను చాల తీవ్రమైనవని అనుకుంటారు. కథకుడు ఒక అతి నమ్మకమును కలిగివుండెను; ‘తానే ఒక వైద్యశాలను’ అని. ఇది అమిత చెడును కలిగించు మానసిక స్థితి. ఈ రోజున Internet ప్రభావముతో ఈ సమస్య మరింత తీవ్రమైనది. Onlineలో వెదకుట భయభ్రాంతులను చేయుచున్నది. Jerome గారి వ్యాసము, ప్రస్తుత పరిస్థితులకు చక్కగా తగియున్నది. సందర్భమునకు తగని సమాచారము, వృత్తి నిపుణుల నుంచి పొందని సలహాలు మంచికన్న ఎక్కువ చెడును చేయును.

The Malady of Overthinking Annotations Questions and Answers Summary

Question 3.
In the context of academic performance and mental health, how useful is the doctor’s “prescription” in “The Malady of Overthinking”?
Answer:
The doctor’s “prescription” in “The Malady of Overthinking” is surprisingly simple and deeply insightful. It includes eating fruit salad, drinking water, walking daily, sleeping early, and not filling the mind with things one doesn’t understand. While the narrator expects medicine, the doctor prescribes a healthy routine and mental clarity. In the context of academic performance and mental health, this advice is very relevant. Students often suffer from stress, anxiety, and burnout due to overthinking, unhealthy habits, and lack of balance. The doctor’s approach reminds us that mental peace, proper rest, physical activity, and moderation in thoughts are essential for both learning and emotional well-being. In a world overloaded with information and pressure, such a holistic prescription is more beneficial than medication. Jerome uses humor to show that mental health depends not on pills but on lifestyle. This advice, though old-fashioned, is timeless and effective.

‘The Malady of Overthinking’ అను వ్యాసములో వైద్యుని యొక్క సలహా, చాల తేలికయినది, ఆలోచనను కలిగించునది (అంతర్దృష్టి కలిగించునది). అందులో చాల విషయాలు గలవు – పండ్ల ముక్కలు తినుట, నీరు త్రాగుట, రోజూ నడచుట, త్వరగా నిద్రపోవుట, అర్థంకాని విషయములతో మనసు నింపకుండుట (పాడుచేసికొనకపోవుట). వైద్యుడు మందు ఇచ్చునని కథకుడు అనుకొనెను. కాని వైద్యుడు ఆరోగ్యకరమైన దినచర్యను, మరియు మానసిక స్పష్టతను ఇచ్చెను. నేటి విద్యావిధానము, మానసిక ఆరోగ్యమునకు ఈ సూచన బాగా తగినది. విద్యార్థులు ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఆందోళన, అతిగా పనిచేసి అలసిపోవుట వంటి సమస్యలతో తరచు బాధపడుదురు. ఈ అలసట, అతిగా ఆలోచించుట అనారోగ్యకర అలవాట్లు, మానసిక అస్థిరత వలన కలుగును. వైద్యుని సలహా మనకు అనేక మంచి విషయములను గుర్తు చేయుచున్నది. మానసిక శాంతి, తగిన విశ్రాంతి, శారీరక శ్రమ, పరిమితమైన ఆలోచనలు (ఆందోళన కలిగించనివి) చదువునకు, భావోద్వేగ ములను అదుపులో పెట్టుటకు చాల మంచివి. ఈ రోజు ప్రపంచములో అమిత సమాచారము, ఒత్తిడి వున్నవి. ఇట్టి స్థితిలో ఈ సమగ్రమైన మందుల కంటె ఉపయోగకరమైనది, మానసిక ఆరోగ్యము మందు బిళ్లలపై గాక జీవన విధానముపై ఆధారపడుచున్నదని Jerome హాస్యమును కలిపి తెలియజేయు చున్నాడు. ఈ సలహా పాతదయినను అన్ని కాలములకు తగినది, ప్రభావ వంతమైనది.

The Malady of Overthinking Summary in English & Telugu

The Malady of Overthinking Summary in English

The Malady of Overthinking by Jerome K. Jerome is a humorous and thoughtful piece that highlights the dangers of reading too much medical information and overthinking one’s health. The narrator shares his personal experience of how a simple visit to the British Museum turned into a shocking and funny health scare.

He initially visits the library to read about a minor issue-possibly hay fever. After finding the information he needed, he casually continues flipping through the pages of a medical book. Out of curiosity, he starts reading about other diseases and gradually convinces himself that he has almost every illness listed. As he reads about each disease-from typhoid and diphtheria to gout and zymosis-he becomes more and more sure that he is suffering from them all. The only illness he does not have is “housemaid’s knee,” which oddly makes him feel left out. Later, he accepts that he can manage without it.

He becomes obsessed with his own health and begins to imagine himself as a rare and valuable patient for medical students. He even jokes that students wouldn’t need to visit hospitals if they just studied him, as he was a hospital by himself. He checks his pulse and heartbeat and gets worried when he can’t feel them properly. He examines his tongue in a mirror and assumes he has scarlet fever.

Feeling like a dying man, he visits his friend, a doctor, and explains how he has diagnosed himself with every disease except one. The doctor listens patiently, checks him, and writes a very simple “prescription”: eat fruit salad, drink three liters of water daily, walk ten miles each morning, go to bed at 10 p.m., and-most importantly-stop stuffing his head with things he doesn’t understand.

The narrator follows this humorous but wise advice and starts feeling healthy again. He ends the story by joking that his real lifelong illness has been a strong dislike for work, which people mistakenly called laziness. The story cleverly shows how too much thinking and self-diagnosis can harm our peace of mind and that simple living and mental calmness are often the best cures.

The Malady of Overthinking Summary in Telugu

Jerome K Jerome వ్రాసిన ఆలోచనను కలుగజేయు హాస్య ప్రధానమైన వ్యాసము ‘అతి ఆలోచన అనే వ్యాధి’. వైద్య సమాచారమును గురించి ఎక్కువగా చదువుట, ఆలోచించుట ఎంత ప్రమాదకరమో బాగా (ప్రముఖముగా) తెలియజేయుచున్నది. రచయిత ఆంగ్లేయుల పురావస్తుశాలను మామూలుగా దర్శించును. అది ఏ విధంగా ఆరోగ్యమునకు సంబంధించిన భయము, దిగ్భ్రాంతిని కలిగించినదో మనతో పంచుకొనుచున్నాడు. ఇది ఆయన యొక్క స్వంత అనుభవము.

చిన్న సమస్యను గురించి చదివి తెలిసికొనుటకు ఆయన మొదట గ్రంథాలయమునకు వెళ్లును. అది జ్వరమునకు సంబంధించినది. (గవత జ్వరము జలుబు, మంటకు సంబంధించిన, పుప్పొడి రేణువుల ద్వారా వచ్చు జ్వరము). సమాచారము కొరకు వైద్య గ్రంథమును చదువును. ఆసక్తితో మిగిలిన జబ్బుల గురించి కూడ చదువును. అక్కడ సూచించబడిన అన్ని వ్యాధులు తనకు వున్నవి అన్న నమ్మకము కల్గును; (ఆయన మనసు ఆ విధముగా ఒప్పించును). ఆయన typhoid (సన్నిపాత జ్వరము), diphtheria (వాపు, పుండ్లు), gout (వాతరోగము, పుండ్లు), zymosis (పులియుట వల్ల వచ్చు వ్యాధి) మొదలగు వ్యాధుల గురించి చదివి, వాటన్నిటితో తాను బాధపడుచున్నానని నిర్ణయమునకు వచ్చును. అతనికి లేని ఒకే ఒక వ్యాధి ‘housemaid’s knee’. అది ఎందుకు తనను వదలివేసిందోనని వింతగా భావించాడు. ఆ వ్యాధి లేకపోయినా సర్దుకుపోగలనని అంగీకరిస్తాడు.

అతను తన ఆరోగ్యమును గురించి అతిగా ఆలోచించును. తాను వైద్య విద్యార్థులకు ఉపయోగపడే ఒక అరుదైన, విలువైన రోగినని ఊహించుకొనును. తన గురించి జోకులు (ఛలోక్తులు) వేసికొనును. వైద్య విద్యార్థులు తనను పూర్తిగా పరీక్షించినచో చాలు; వైద్యశాలలకు వెళ్లవలసిన పని లేదు; ఎందుకంటే తానే ఒక వైద్యశాల అనుకుంటాడు. అనగా వైద్యశాలలో చెప్పబడిన వ్యాధులన్నియు తన శరీరములో వున్నవి. తనకు బాగా లేనపుడు తన నాడి, హృదయ స్పందన పరీక్షించుకొనును, బాధపడును. తన నాలుకను అద్దము ముందు పరీక్షించుకొని తనకు ఎర్ర మరకలతో కూడిన తీవ్ర అంటువ్యాధి వున్నదని భావించును.

తాను చావుకు సిద్ధముగా వున్నానని భావించును. తన స్నేహితుడైన ఒక వైద్యుని కలసి, తాను ఒక్క వ్యాధి తప్ప తనకున్న అన్ని వ్యాధులను గుర్తించ గలిగానని చెప్పును. వైద్యుడు అతనిని పరీక్షించి అతి సామాన్యమైన సూచన చేయును – రోజూ పండ్ల ముక్కలు (fruit salad) తినుట; రోజూ మూడు లీటర్ల నీరు త్రాగుట; ప్రతి ఉదయము పదిమైళ్లు నడచుట; రాత్రి పదిగంటలకు నిద్రించుట. ముఖ్యమైన విషయమేమిటంటే అర్థంగాని విషయములతో మనస్సును నింపుట చేయరాదు.

The Malady of Overthinking Annotations Questions and Answers Summary

ఈ సలహా హాస్యముగా వున్నను, చాల తెలివైనది. దీనిని అమలులో పెట్టిన తరువాత ఆరోగ్యముగా అనిపించెను. నిజమైన, జీవితాంతము వుండు వ్యాధి పని మీద ఇష్టము లేకపోవుట. దీనిని ప్రజలు పొరపాటున సోమరితనం అంటారు. ఈ విధముగా రచయిత కథను హాస్యముగా ముగించును. కాని ఈ కథ ఒక తెలివైన విషయమును తెలియజేయుచున్నది. అతిగా ఆలోచించుట, స్వంతముగా వ్యాధి నిర్ధారణ చేసికొనుట మనశ్శాంతికి ప్రమాదకరము. సామాన్య జీవనము, మానసిక ప్రశాంతత వ్యాధులను చక్కగా నయము చేయును.

Glossary:

1. ailment : /ˈeɪlmənt/ (noun) : a minor illness or sickness; స్వల్ప రుగ్మత

2. indolently /ˈɪndələntli/ (adverb) : in a lazy or idle manner; జడత్వంగా

3. distemper /dɪsˈtempə(r)/ (noun) : an infectious disease; అంటువ్యాధి

4. scourge /skɜː(r)ʤ/ (noun) : a cause of great pain or suffering; శాపం

5. premonitory /prɪˈmɒnɪtərɪ/ (adjective) : giving a warning of something bad; ముందస్తు హెచ్చరికగా ఉండే

6. listlessness /listləsnəs/ (noun): lack of energy or interest; ssoiot) అలసట

7. typhoid /ˈtaɪfɔɪd/ (noun): a serious bacterial disease; టైఫాయిడ్ వ్యాధి

8. sift /sɪft/ (verb) : to examine carefully; జాగ్రత్తగా పరిశీలించుట

9. ague /ˈeɪgjuː/ (noun): a fever with chills; వణుకు జ్వరం

10. Bright’s disease /braɪts dɪˈziːz/ (noun) : old term for kidney disease; మూత్రపిండాల వ్యాధి

11. diphtheria /dɪfˈθɪərɪə/ (noun): a serious throat infection; గొంతు అంటువ్యాధి

12. plodded/ˈplɒdɪd/ (verb) : walked slowly with effort; మిక్కిలి కష్టంతో నిడిచెను

13. conscientiously /ˌkɒnʃɪˈenʃəsli/ (adverb): with great care and responsibility; నిష్ఠగా

14. invidious /ɪnˈvɪdɪəs/ (adjective) : likely to arouse resentment; అపహాస్యమైన

15. reservation /rezəˈveɪʃən/ (noun) : a doubt or hesitation; అనుమానం

16. malignant /məˈlɪgnənt/ (adjective): harmful, dangerous (especially of diseases); ప్రమాదకరమైన

17. zymosis /zaɪˈməʊsɪs/ (noun) : old term for infectious disease; అంటువ్యాధి

18. acquisition /ˌækwɪˈzɪʃən/ (noun) : the act of gaining something; సంపాదన

19. decrepit /dɪˈkrepɪt/ (adjective) : weak and worn out; బలహీనమైన

20. chum /ʧʌm/ (noun) : a close friend; స్నేహితుడు

The Malady of Overthinking Annotations Questions and Answers Summary

21. commonplace /ˈkɒmənpleɪs/ (adjective) : ordinary; సాధారణమైన

22. prescription /prɪsˈkrɪpʃən/ (noun): a written direction for medicine; మందుల చీటి

23. hamper /ˈhæmpə(r)/ (verb) : to hinder or obstruct; అడ్డుకొని, ఆటంకపరుచు

24. oblige /əˈblaɪʤ/ (verb): to do a favor; సహాయం చేయు

25. circular /ˈsɜːkjʊlə/(r)/ (noun) : a printed notice or advertisement; ప్రకటన పత్రిక

26. disinclination /ˌdɪsɪnklɪˈneɪʃən/ (noun) : unwillingness; అయిష్టత

27. infancy /ˈɪnfənsɪ/ (noun) : early stage; శిశు దశ

28. martyr /’ma:rta(r)/ (noun) : a person who suffers for a cause; త్యాగధర్ముడు

29. skulking /ˈskʌlkɪŋ/ (verb) : moving secretly; దొంగల్లా తిరుగుచున్న

30. efficacious /ˌefɪˈkeɪʃəs/ (adjective): effective; ప్రభావవంతమైన

31. acquisition /ˌækwɪˈzɪʃən/ (n) : the act of gaining or obtaining something; సంపాదించుట, పొందుట

32. commence /kəˈmens/ (v) : to begin or start; ప్రారంభించు

33. devastating /ˈdevəsteɪtɪŋ/ (adj) : extremely destructive or damaging; వినాశకరమైన

34. grasping /ˈgrɑːspɪŋ/ (adj): greedy or wanting more than one needs; అత్యాశ గల

35. idly /ˈaɪdlɪ/ (adv): without any particular purpose or activity; సోమరితనంగా

36. induce /ɪnˈdjuːs/ (v): cause or bring about; ప్రేరేపించు

37. plunge /plʌnʤ/ (v) : to dive or fall into something suddenly; మునుగు

38. ponder /ˈpɒndə(r)/ (v) : to think about carefully; లోతుగా ఆలోచించు

39. reflect /rɪˈflekt/ (v): to think deeply; దీర్ఘంగా ఆలోచించు

The Malady of Overthinking Annotations Questions and Answers Summary

40. wreck /rek/ (n) : a person who is emotionally devastated or ruined; మానసికంగా దెబ్బతిన్న వ్యక్తి