Reviewing AP Inter 1st Year Telugu Study Material Grammar అనువాదం can help students prepare confidently for exams.
AP Intermediate 1st Year Telugu Grammar అనువాదం
అనువాదం అంటే కేవలం భాషాంతరీకరణ మాత్రమే కాదు. ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు మూలాన్ని అర్థం చేసుకోవడానికి తగినంత ఆంగ్ల భాషా పరిజ్ఞానం అవసరం. తర్వాత మూలంలో ఉండే భావాన్ని తెలుగులోకి మార్చాలంటే తెలుగుభాషతో చక్కని పరిచయం ఉండాలి. అప్పుడే అనువాదం సహజంగా ఉంటుంది. అనువాదం విషయంలో విద్యార్థులు కొన్ని సూచనలు పాటించాలి.
- ఆంగ్ల మూలాన్ని కనీసం రెండు మూడుసార్లు శ్రద్ధగా చదివి, అందులోని విషయాన్ని అర్థం చేసుకోవాలి.
- మూలంలోని కఠిన పదాలకు తెలుగులో అర్థాన్ని నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఏదైనా ‘ఆంగ్ల పదానికి అర్థం తెలియకపోతే ఆ పదానికి ముందు, తరువాత ఉన్న పదాల ఆధారంగా సంబంధిత వాక్యం యొక్క అర్థాన్ని ఊహించాలి.
- ఆంగ్ల మూలాన్ని అర్థం చేసుకొన్న తర్వాత అనువాదం చేయడానికి ప్రయత్నించాలి. మూలంలో ఎన్ని పదాలు, వాక్యాలు ఉన్నాయో, అన్నే వాక్యాలు తెలుగులో ఉండాలనే నియమం లేదు.
- ఆంగ్లంలోని భావానికి అనుగుణంగా చక్కని తెలుగు వాక్య నిర్మాణంతో, నుడికారాలకు అనుగుణంగా అనువాదం చేయాలి.
- మూలభాషా లక్షణాలను, ఆ భాషా నిర్మాణాన్ని, వాక్య నిర్మాణాన్ని తెలుసుకోవాలి. అలాగే లక్ష్య భాషా లక్షణాలను, నిర్మాణాన్ని గ్రహించాలి. ఈ రెండు భాషా నిర్మాణాల మధ్య ఉన్న భేద సాదృశ్యాన్ని ఆకళింపు చేసుకొని అనువాదం చెయ్యాలి.
ఉదా :
1. A wise man learns from his mistakes.
తెలివైనవాడు తన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుంటాడు.
2. The Mahakumbh Mela is the largest spiritual gathering in the world.
మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక జన సమ్మేళనం.
3. Books are the best companions for knowledge and wisdom.
జ్ఞానం, వివేకం సంపాదించడంలో పుస్తకాలు ఉత్తమ సహచరులు.
4. Action speaks louder than words.
మాటల కన్నా చేతలు మిన్న.
5. A small leak can sink a great ship.
ఒక చిన్న రంధ్రం పెద్ద నౌకను ముంచగలదు.
![]()
6. The preservation of nature is our responsibility.
ప్రకృతి పరిరక్షణ మన బాధ్యత.
7. Bhuvaneswar is called the temple city of India.
భువనేశ్వరు భారతదేశపు ఆలయనగరంగా పిలుస్తారు.
8. R.K. Narayan is a famous novelist.
ఆర్.కె. నారాయణ్ ప్రముఖ నవలా రచయిత.
9. The National animal of India is the Royal Bengal Tiger.
భారతదేశ జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి.
10. ‘The insider’ is the autobiography of our former Prime Minister Sri P.V. Narasimha Rao.
మన మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి ఆత్మకథ “ది ఇన్సైడర్”.
11. Failures are stepping stones to success.
అపజయాలు విజయానికి సోపానాలు.
12. The farmer works hard in the field.
రైతు పొలంలో కష్టపడి పని చేస్తాడు.
13. Netaji Subhash Chandra Bose is the founder of Azad Hind Fauz.
అజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించినవారు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
14. The pen is mighter than the sward.
కత్తి కంటే కలం శక్తివంతమైనది.
15. The Ganga is the longest river in India.
గంగానది భారతదేశంలో పొడవైన నది.
16. Dhyanchand was called wizard of Hockey.
ధ్యానంద్ను హాకీ మాంత్రికుడు అని పిలుస్తారు.
17. Dr. A.P.J. Abdul Kalam was called Missile man of India.
డా|| ఎ.పి.జె అబ్దుల్ కలాము భారతదేశ క్షిపణి పితామహుడిగా పిలుస్తారు.
18. A Positive attitude can change your life.
సానుకూల దృక్పథం మీ జీవితాన్ని మార్చగలదు.
19. Time is very precious.
సమయం చాలా విలువైనది.
20. The Andhra State was formed because of Sri Potti Sriramulu’s Life Sacrifice.
శ్రీ పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్ల ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
అదనపు అభ్యాస వాక్యాలు
1. Health is wealth.
ఆరోగ్యమే మహాభాగ్యం.
2. Speak kind and sweet words.
మృదువుగా, తీయగా మాట్లాడు.
3. Indian Constitution was written by Dr. B. R. Ambedkar.
డా॥ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారు.
4. New Delhi is the capital of India.
భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ.
![]()
5. Sardar Vallabhbhai Patel is the first Home Minister of India.
భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి గృహ మంత్రి.
6. Smt. M. S. Subbulakshmi is a great musician.
శ్రీమతి యమ్. ఎస్. సుబ్బులక్ష్మి గొప్ప సంగీత విద్వాంసురాలు.
7. The train had left before I reached the station.
నేను స్టేషను చేరుకునే లోపలే రైలు వెళ్ళిపోయింది.
8. He speaks Telugu as well as English.
అతను తెలుగుతో పాటు ఆంగ్లం కూడా బాగా మాట్లాడతాడు.
9. C.P. Brown Library is located at Kadapa.
సి.పి. బ్రౌన్ గ్రంథాలయం కడపలో ఉంది.
10. Ramayana was written by Valmiki.
రామాయణాన్ని వాల్మీకి రచించారు.
11. Honesty is the best policy.
నిజాయితీ చాలా ఉత్తమమైన గుణం.
12. A friend in need is a friend indeed.
కష్టాలలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు.
13. The Peacock is our National bird.
నెమలి మన జాతీయ పక్షి.
14. White revolution has increased the milk production.
శ్వేత విప్లవం పాల ఉత్పత్తిని పెంచింది.
15. Mount Everest is the highest peak in the world.
ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోకెల్లా ఎత్తైనది.
16. Dams are built to reserve water.
నీటిని నిలువ చేయటానికి ఆనకట్టలను నిర్మిస్తారు.
17. The Constitution of India is the longest written Constitution in the world.
భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం.
![]()
18. The Earth revolves around the Sun.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
19. Amaravathi is the capital of Andhra Pradesh.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని.
20. All that glitters is not gold.
మెరిసేదంతా బంగారం కాదు.