AP Inter 1st Year Telugu Grammar పదదోషాలు

Reviewing AP Inter 1st Year Telugu Study Material Grammar పదదోషాలు can help students prepare confidently for exams.

AP Intermediate 1st Year Telugu Grammar పదదోషాలు

భాషా నైపుణ్యాలు నాలుగు విధాలు. అవి :

  1. శ్రవణం (వినడం),
  2. భాషణం (మాట్లాడడం),
  3. పఠనం (చదవడం),
  4. లేఖనం (వ్రాయడం).

ఈ భాషానైపుణ్యాలలో చివరిది, కష్టమైనది లేఖనం అనగా వ్రాయడం.

పదాలను రాసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. పదదోషాలు లేకుండా రాయాలి. రాసేటప్పుడు అచ్చులకు బదులు హల్లులు, హల్లులకు బదులు అచ్చులు రాయడం అక్కడక్కడా కనిపిస్తుంది. అలాగే మహాప్రాణాలకు బదులు అల్ప ప్రాణాలు, అల్పప్రాణాలకు బదులు మహాప్రాణాలు రాయడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అర్థంలో మార్పు వస్తుందని గ్రహించాలి. ఇటువంటి దోషాలను సరిచేసుకుని లేఖనాన్ని మెరుగుపరుచుకోవాలి.

గమనిక :

  1. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ అనే పదింటిని “మహా ప్రాణాలు” అంటారు.
  2. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ – అనే పదింటినీ “అల్ప ప్రాణాలు” అని పిలుస్తారు.

శ, ష, స లను తారుమారు చేసి రాయడం, వట్రుసుడికి బదులు, ‘రు’ రాయడం, ‘రు’ కి బదులు వట్రుసుడి రాయడం వంటి దోషాలు ఎక్కువగా మన లేఖనంలో కన్పిస్తుంటాయి. కొన్నింటిని పరిశీలిద్దాం.

AP Inter 1st Year Telugu Grammar పదదోషాలు

1. అచ్చుకి బదులు హల్లులు రాయడం :

సాధు రూపాలు (ఒప్పులు)అసాధు రూపాలు (తప్పులు)
1. ఇంద్రుడుయింద్రుడు
2. ఉంగరమువుంగరము
3. ఎకరముయెకరము
4. ఒక్కరువక్కరు
5. ఋషిరుషి
6. ఋణంరుణం

2. హల్లులకు బదులు, అచ్చులు రాయడం :

సాధు రూపాలు (ఒప్పులు)అసాధు రూపాలు (తప్పులు)
7. వీధిఈధి
8. వెంకడుఎంకడు
9. హంసఅంస

మహాప్రాణాలు : వర్గాక్షరాలలో ద్వితీయాక్షరాలైన ఖ ఛ ఠ థ ఫ లూ, చతుర్థాక్షరాలైన ఘ ఝ ఢ ధ భ లూ మహాప్రాణాలు.

అల్పప్రాణాలు : వర్గాక్షరాలలో ప్రథమాక్షరాలైన క చ ట త ప లూ, తృతీయాక్షరాలైన గ జ డ ద బ లూ అల్పప్రాణాలు.

3. మహాప్రాణాలకు బదులు అల్పప్రాణాలు రాయడం :

సాధు రూపాలు (ఒప్పులు)అసాధు రూపాలు (తప్పులు)
10. సంధిసంది
11. ధ్వనిద్వని
12. కథకద
13. భ్రమరముబ్రమరము
14. గర్భముగర్భము
15. పాఠశాలపాటశాల

4. అల్పప్రాణాలకు బదులు మహాప్రాణాలు రాయడం :

సాధు రూపాలు (ఒప్పులు)అసాధు రూపాలు (తప్పులు)
17. మల్లికార్జునమల్లిఖార్జున
18. కచ్చితముఖచ్చితము
19. విద్యార్థివిధ్యార్థి
20. శాకాహారముశాఖాహారము
21. శంకుస్థాపనశంఖుస్థాపన

AP Inter 1st Year Telugu Grammar పదదోషాలు

5. శ, ష, స లు తారుమారు

సాధు రూపాలు (ఒప్పులు)అసాధు రూపాలు (తప్పులు)
22. సీమశీమ
23. శీతాకాలంసీతాకాలం
24. శివాజీషివాజీ

6. వట్రుసుడికి (AP Inter 1st Year Telugu Grammar పదదోషాలు 1) బదులు కావడి (AP Inter 1st Year Telugu Grammar పదదోషాలు 2) రాయడం :

అసాధు రూపాలు (తప్పులు)సాధు రూపాలు (ఒప్పులు)
25. పృథ్విప్రథ్వి
26. తృప్తిత్రుప్తి
27. కృశించుక్రుశించు
28. ఆకృతిఆక్రుతి

7. క్రావడికి (AP Inter 1st Year Telugu Grammar పదదోషాలు 2) బదులు వట్రుసుడి (AP Inter 1st Year Telugu Grammar పదదోషాలు 1) రాయడం :

సాధు రూపాలు (ఒప్పులు)అసాధు రూపాలు (తప్పులు)
29. శత్రువుశతృవు
30. క్రుంగుకృంగు
31. ధ్రువధృవ
32. త్రుటితృటి
33. ఆత్రుతఆతృత