Reviewing AP Inter 1st Year Telugu Study Material Grammar సంధులు can help students prepare confidently for exams.
AP Intermediate 1st Year Telugu Grammar సంధులు
సంధి : పూర్వ పరస్వరములకు, పరస్వరంబు ఏకాదేశంబు అగుట, సంధి యనబడుతుంది.
సంధి వివరణము : రెండు పదాల కలయికను ‘సంధి’ అని అంటారు. సంధి రెండు పదాల మధ్య జరుగుతుంది. పరపదం లేదా మొదటి పదాన్ని ‘పూర్వపదం’ అంటారు. రెండవ పదాన్ని పరపదం లేదా ఉత్తరపదం అంటారు. పూర్వపదంలో ఉండే చివరి అచ్చును, ‘పూర్వస్వరము’ అంటారు. పరపదము లేక ఉత్తర పదములోని మొదటి అచ్చును, ‘పరస్వరము’ అంటారు. సంధి జరిగినపుడు పూర్వస్వరము లోపిస్తుంది. పూర్వ స్వరము స్థానములో పరస్వరము ఏకాదేశంగా వస్తుంది. ‘ఏకాదేశం’ అంటే, పూర్వపర స్వరాలలో ఒక్క పరస్వరమే మిగులుతుంది.
సంధులు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి.
- తెలుగు సంధులు
- సంస్కృత సంధులు
తెలుగు సంధులు
తెలుగు పదాల మధ్య జరిగేవి, ‘తెలుగు సంధులు’. ఇవి అత్త్వ, ఇత్త్వ, ఉత్త్వ, యడాగమ, సరళాదేశ, గసడదవాదేశ సంధులు మొదలయినవి.
1) అత్త్వసంధి : సూత్రము : “అత్తునకు సంధి బహుళముగానగు”.
ఉదా :
- గ్రుచ్చిన + అట్లే = గ్రుచ్చినట్లే
- వేడుక + ಎಲ್ಲ = వేడుకెల్ల
అత్తు అంటే హ్రస్వమైన ‘అ’కారం. బహుళం అంటే సంధి అనేక రూపాలలో (నాలుగు రూపాలుగా) జరగటం. అవి :
1. ప్రవృతి : సంధి తప్పనిసరిగా జరగడం (నిత్యం)
ఉదా : రామ + అయ్య = రామయ్య
2. అప్రవృత్తి : సంధి జరగకపోవడం
ఉదా : దూత + ఇతడు = దూతయితడు
3. వైకల్పికం/విభాష : సంధి జరగవచ్చు, జరగకపోవడం
ఉదా : వేడుక + ಎಲ್ಲ = వేడుకెల్ల/వేడుకయెల్ల
4. అన్యకార్యం : జరగవలసిన వ్యాకరణ కార్యానికి బదులుగా మరొకటి జరగడం
ఉదా : ఒక + ఒక = ఒకానొక
2) ఇత్త్వసంధి : సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా : ఏమి + అంటివి = ఏమంటివి, ఏమియంటివి
ఇత్తు అంటే హ్రస్వమైన ‘ఇ’ కారం. ఏమ్యాదులు అంటే ఏమి, అది, ఇది …………….
వైకల్పికం అంటే సంధి జరిగితే ఒక రూపం జరగకపోతే మరొక రూపం రావడం.
3) ఉత్త్వసంధి : సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
ఉదా :
- నీకు + ఎల్లవారు = నీకె
- కన్నీర + ఒలికిన = కన్నీరొలికిన
- పందెము + ఒడ్డెద = పందెమొడ్డేద
- దొంగలకు + ఇత్తురు = దొంగలకిత్తురు
![]()
4) యడాగమసంధి : సూత్రము : సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
- మా + ఊరు = మాయూరు
- మా + ಇಲ್ಲು = మాయిల్లు
5) గసడదవాదేశ సంధి: సూత్రము : ప్రథమము మీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.
ఉదా :
- ఏమి + చేయుదు = ఏమిసేయుదు
- కడుపు + చొచ్చినను = కడుపుసొచ్చిన
6) టుగాగమ సంధి: సూత్రము – 1 : కర్మధారయ సమాసంలో ఉత్తునకు అచ్చుపరమైనపుడు టుగాగమంబగు.
ఉదా :
- నిలువు + అద్దము = నిలువుటద్దము
- సరసపు + అలుక = సరసపుటలుక
సూత్రము 2 : కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమైనపుడు టుగాగమం వైకల్పికంబగు.
ఉదా :
- చిగురు + ఆకు = చిగురాకు, చిగురుటాకు
- పల్లె + ఊరు = పల్లెటూరు
వివరణ : 1) ‘టు’ గాగమం అంటే ‘ట్’ అనే వర్ణం ఆగమంగా రావడం.
2) పేర్వాది శబ్దములు అంటే పేరు మొదలయిన పదములు.
7) సరళాదేశ సంధి :
సూత్రము – 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ఉదా : ప్రజలన్ + కాచుచు = ప్రజలఁగాచుచు
సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
ఉదా : నేలన్ + పడి = నేలఁబడి
సంస్కృత సంధులు
సంధిలోని రెండు పదములూ, సంస్కృతభాషకు చెందినవి అయితే, దానిని ‘సంస్కృత సంధి’ అంటారు. సంస్కృత సంధులలో ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన సంధులు. ఇవి
- సవర్ణదీర్ఘ సంధి,
- గుణసంధి,
- వృద్ధి సంధి,
- యణాదేశ సంధి
1) సవర్ణదీర్ఘ సంధి : సూత్రము : అ,ఇ, ఉ, ఋ కారములకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశముగా వచ్చును. సవర్ణం అంటే సమాన వర్ణం అని అర్థం.
ఉదా : అ = అ ఆ, ఇ – ఇ ఈ, ఉ = ఉ ఊ, ఋ = ఋ ౠ లు సవర్ణాలు.
ఉదా :
- మోహన + అక్షరములు = మోహనాక్షరములు
- కార్య + అర్థి = కార్యార్థి
- సీత + అన్వేషణ = సీతాన్వేషణ
- కృత + అర్థుడు = కృతార్థుడు
- యుగ + అంత = యుగాంతం
- పరమ + ఆప్తులు = పరమాప్తులు
- మంజుల + ఆకార = మంజులాకార
- కవి + ఇంద్రుడు = కవీంద్రుడు
- భాను + ఉదయం = భానూదయం
- మాతృ + ఋణం = మాతౄణం
![]()
2) గుణసంధి సూత్రము : అకారమునకు ఇ, ఉ, ఋకారములు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమగును. ఏ, ఓ, అర్ లను గుణములు
అంటారు.
ఉదా :
- నర + ఇంద్ర = నరేంద్ర
- మహా + ఉన్నతి = మహోన్నతి
- దేవ + ఋషి = దేవర్షి
- లంక + ఈశ్వరుడు = లంకేశ్వరుడు
- విశ్వ + ఈశుడు = విశ్వేశుడు
- ధీర + ఉత్తములు = ధీరోత్తములు
3) యణాదేశ సంధి సూత్రము : ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా య, వ, ర లు ఆదేశమగును.
ఉదా :
- అతి + ఉగ్ర = అత్యుగ్ర
- ప్రతి + అక్షము = ప్రత్యక్షము
- అతి + అంత = అత్యంత
- మధు + అరి = మధ్వరి
- పితృ + అంశ = పిత్రంశ