Regular practice with AP Inter 1st Year English Study Material and You’ve Got to Find What You Love Annotations Questions and Answers Summary helps students stay prepared for examinations.
AP Inter 1st Year English You’ve Got to Find What You Love Questions and Answers Annotations
You’ve Got to Find What You Love Annotations
Contextual Questions
Question 1.
You can’t connect the dots looking forward; you can only connect them looking backward.
Answer:
Reference: This line is taken from Steve Jobs’ commencement speech at Stanford University, titled ‘You’ve Got to Find What You Love’.
Context: Steve Jobs shares his first life story about dropping out of college and later realizing how a calligraphy class, which had no practical use at the time, helped him design beautiful typography for the Macintosh computer. He emphasizes that the value of past experiences often becomes clear only in hindsight.
Appreciation: This line reflects Jobs’ belief in intuition, trust, and life’s unpredictability. It is a powerful metaphor suggest- ing that we cannot always predict how present decisions will impact the future. Instead, we must have faith that our choices and experiences will align meaningfully when we look back. The simplicity of the metaphor ‘connecting the dots’ makes a profound life philosophy relatable and memorable. Conclusion: The line teaches us to trust the process of life and not stress over having all the answers in the present. Faith in one’s journey and following curiosity can lead to unexpected but valuable outcomes.
ప్రస్తావన: ఈ వాక్యము స్టీవ్ జాబ్స్, స్టాన్ఫర్డ్ విశ్వ విద్యాలయములో చేసిన ఉపన్యాసము ప్రారంభములోనిది. ఆ ఉపన్యాసము పేరు ‘You’ve Got to Find What You Love’.
సందర్భము : స్టీవ్ జాబ్స్ తన జీవితములోని మొదటి కథను పాఠకులతో (ప్రేక్షకులతో) పంచుకొనుచున్నాడు. మొదట కళాశాల చదువు ఆపివేసెను. తరువాత చక్కని దస్తూరిలో శిక్షణ తీసికొనెను. ఆ సమయములో ఆ విద్యతో నిజమైన ఉపయోగము లేదు. తరువాత ఆ నైపుణ్యము మాకింతోష్ కంప్యూటర్ పై చక్కని అక్షర రూపనమూనాలు, (టైపోగ్రఫి) తయారు చేయుటకు సహాయపడెను. గత అనుభవముల విలువ గతమును జాగ్రత్తగా పరిశీలించి నపుడు, స్పష్టముగా తెలియును. ఈ విషయమును ఆయన ప్రముఖముగా తెలియజేయుచున్నాడు.
ప్రశంస : ఈ వాక్యము జాబ్స్ యొక్క అంతర్ దృష్టి (ముందుచూపు) నమ్మకము, అంచనా వేయలేని జీవితమును ప్రతిబింబించును. ఇది ఒక శక్తివంతమైన రూపకము. ప్రస్తుత నిర్ణయములు భవిష్యత్తును ఎలా ప్రభావితము చేయునో మనము ఊహించలేము. కాని మనము ఎన్నుకొను విషయములపై విశ్వాసము కలిగి వుండవలెను. మనము వెనుతిరిగి చూసినపుడు (వాటి గురించి ఆలోచించినపుడు) వాటి అమరిక అర్థవంతంగా వున్నదని తెలియజేయును (ఇదే విధిలీల). రూపకములోని సరళత, నమ్మకము కలిగిన, గుర్తుపెట్టుకోదగిన లోతైన తత్వమును చెప్పుచున్నది. ఆ సరళరూపకమే ‘Connecting the dots’.
ముగింపు : మనము జీవన విధాన ప్రక్రియను నమ్మాలి; అన్ని సమాధానములు వెంటనే కావాలని ఒత్తిడి చేసికోకూడదు. ఈ విషయమును, ఈ వాక్యము, మనకు బోధించుచున్నది. ఉత్సుకతను అనుసరిస్తూ జీవన ప్రయాణము సాగించవలెను. అప్పుడు దాని ద్వారా అనుకోని, విలువైన ఫలితములు వచ్చును.
![]()
Question 2.
Sometimes life hits you in the head with a brick. Don’t lose faith.
Answer:
Reference: This quote is taken from the second story of Steve Jobs’ commencement address at Stanford University, titled ‘You’ve Got to Find What You Love’.
Context: Jobs talks about the moment he was fired from Apple, the very company he co-founded. He describes the emotional devastation and loss, but also how it led to the most creative period of his life.
Appreciation: The metaphor of being hit ‘with a brick’ powerfully conveys the unexpected and painful challenges life throws at us. Despite this, Jobs emphasizes resilience and perseverance. The advice ‘Don’t lose faith’ is simple yet universally inspiring. It encourages listeners to remain hopeful even during tough times, reinforcing the value of passion and self-belief.
Conclusion: This line reminds us that setbacks are not the end but often the beginning of something greater. Faith and love for what we do are essential to overcoming failures and moving forward.
ప్రస్తావన : ఈ వాక్యము స్టీవ్ జాబ్స్, స్టాన్ఫర్డ్ విశ్వ విద్యాలయములో చేసిన ఉపన్యాసములోని రెండవ కథ ప్రారంభములో వున్నది. ఆ ఉపన్యాసము పేరు ‘You’ve Got to Find What You Love’.
సందర్భము : జాబ్స్ తాను Apple కంపెనీ ఉద్యోగము నుండి తొలగింపబడిన క్షణమును గురించి మాట్లాడుచున్నాడు. ఆ కంపెనీకి తాను సహస్థాపకుడు. తన భావోద్వేగ వినాశనం, నష్టం గురించి వివరించుచున్నాడు. అంతేకాకుండా అది ఏ విధంగా తన జీవితములోని సృజన్మాతక సమయమునకు దారి తీసిందో వివరించెను.
ప్రశంస : ‘With a brick’ అన్న రూపకము, అనుకోని, బాధాకరమైన జీవిత సవాళ్లను గురించి శక్తివంతముగా తెలియజేయుచున్నది. బాధ కలిగినప్పటికి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొను ధైర్యం, పట్టుదల గురించి రచయిత నొక్కి చెప్పుచున్నాడు. (అవి వున్న వ్యక్తి ఎంత కష్టమైన పనియైన సాధించగలడు. దానికి జాబ్స్ పట్టుదలతో కూడిన జీవితమే ఒక ఉదాహరణ.) ‘Don’t lose faith’ అన్న సలహా చాల తేలికగా కనిపించును. కాని అది అందరికి స్ఫూర్తిదాయకము. ఎన్ని కష్టకాలములు ఎదురైనా, మనుషులు ఆశతో జీవించాలి. తమ అభిరుచిని, తమ నమ్మకముల విలువలను ఎల్లప్పుడు బలోపేతం చేసికోవాలి.
ముగింపు : ఎదురుదెబ్బలు దేనికీ ముగింపు కాదు. ఒక గొప్ప లక్ష్యమునకు ఆరంభము. ఈ విషయమును, ఈ పంక్తి గుర్తు చేయుచున్నది. మనము చేయు పనిపై నమ్మకము, ప్రేమ అవసరము; అపజయములను అధిగమించి, ముందుకు సాగుటకు ఇవి చాల ముఖ్యమైనవి.
Question 3.
Your time is limited, so don’t waste it living someone else’s life.
Answer:
Reference: This statement comes from the third and final story in Steve Jobs’ commencement speech, titled ‘You’ve Got to Find What You Love’.
Context: Jobs discusses his encounter with death after being diagnosed with cancer. He reflects on how the awareness of mortality sharpens focus and leads to more authentic living. He advises the audience not to be influenced by others’ expectations or judgments.
Appreciation: This is one of the most thought-provoking lines in the speech. It challenges the listener to live authentically and to make life choices based on personal passion and purpose, not societal pressure. The reference to ‘living someone else’s life’ critiques conformity and emphasizes individual freedom. The brevity of the sentence adds to its clarity and impact.
Conclusion: The line is a wake-up call to embrace our uniqueness and live life meaningfully. In a world driven by imitation and fear, Jobs’ words inspire boldness and self-trust.
ప్రస్తావన : ఈ వాక్యము స్టీవ్ జాబ్స్ చేసిన ప్రసంగములోని, మూడవ మరియు చివరి కథలోనిది. ఆ ఉపన్యాసము పేరు ‘You’ve Got to Find What You Love’.
సందర్భము : జాబ్స్క కాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగెను. తాను మరణము ఎదుర్కొను విషయమును గురించి వివరించుచున్నాడు. మరణము గురించి తెలిసిన తరువాత మన దృష్టికి పదును కలుగును; బాగా తెలివిగా, ముందు చూపుతో ఆలోచించగలము. ఇది ప్రామాణిక జీవనమునకు దారితీయును. ఇతరుల అంచనాలు, తీర్పుల ప్రభావము మనపై వుండరాదని ఆయన ప్రేక్షకులకు సలహా ఇచ్చుచున్నాడు.
ప్రశంస : ఆయన ఉపన్యాసములో ఈ పంక్తి బాగా ఆలోచన రేకెత్తింపజేయును. మనిషి తాను స్వంత అభిరుచి, ప్రయోజనం ఆధారంగా ఎంపికలు చేసుకోవాలి. సంఘములోని ఒత్తిడులు పనిచేయరాదు. అది ప్రేక్షకుని ప్రామాణికముగా బ్రతకమని సవాలు చేయుచున్నది. అంటే ఒత్తిడులకు లోనవ్వని స్వంత ఆలోచన, నిర్ణయము తీసికొని జీవించాలి. ‘Living someone else’s life’ అను ప్రస్తావన అనుగుణ్యతను విమర్శిస్తూ, వ్యక్తి స్వేచ్ఛను నొక్కి చెప్పుచున్నది. ఈ వాక్యము చాల క్లుప్తంగా వుండి, స్పష్టత మరియు దాని ప్రభావమునకు తోడగుచున్నది.
ముగింపు : మన ప్రత్యేకతను నిలుపుకొని అర్థవంతముగా జీవించమని ఈ వాక్యము మేలుకొలుపు పలుకుచున్నది. ఈ ప్రపంచము అనుకరణ, భయము చేత నడుపబడుచున్నది. ఈ సందర్భములో జాబ్స్ మాటలు ధైర్యమును, ఆత్మవిశ్వాసమును ప్రేరేపించుచున్నవి.
Question 4.
Stay Hungry. Stay Foolish.
Answer:
Reference: These words were used by Steve Jobs to close his commencement speech at Stanford University, titled ‘You’ve Got to Find What You Love’.
Context: Jobs recalls how these words from a countercultural publication inspired him during his youth. He shares them with the graduating students as a final piece of advice to stay curious, passionate, and unafraid of taking risks.
Appreciation: The phrase ‘Stay Hungry’ suggests never be- ing satisfied, always striving for more knowledge, growth, and creativity. ‘Stay Foolish’ encourages maintaining a spirit of wonder, daring, and open-mindedness. The line is poetic and motivational, summarizing the essence of Jobs’ philoso- phy: innovation requires curiosity, boldness, and a willing- ness to look beyond conventional limits.
Conclusion: These four words have become iconic. They challenge us to remain curious learners and bold dreamers throughout our lives. It is a timeless message that continues to inspire generations.
ప్రస్తావన : తన ప్రారంభోపన్యాసము చివర ఈ మాటలను స్టీవ్ జాబ్స్ పలికెను. స్టాన్ఫోర్డ్ విశ్వ విద్యాలయములో చేసిన ఈ ఉపన్యాసము పేరు ‘You’ve Got to Find What You Love’.
సందర్భము : తన యవ్వనమున, ఒక సాంస్కృతిక వ్యతిరేక పుస్తకములోని ఈ మాటలు, ఏ విధముగా ప్రభావితము చేసినది, జాబ్స్ గుర్తు చేసికొను చున్నాడు. దానిని పట్టభద్రులైన విద్యార్థులతో పంచుకొనుచున్నాడు. ఇది ఆయన చివరి సలహా – ఆసక్తితో వుండు, అభిరుచితో వుండు, ప్రమాదములతో కూడిన నిర్ణయాలు తీసికొనటానికి భయపడవద్దు.
ప్రశంస : ఎప్పుడూ తృప్తిపడవద్దు, ఎల్లప్పుడు ఎక్కువ జ్ఞాన సంపాదన, అభివృద్ధి, సృజనాత్మకత కొరకు కష్టపడు. ఈ విషయమును ‘Stay Hun- gry’ సూచించుచున్నది. అద్భుతము, ధైర్యము, విశాల దృక్పథము వీనిని ‘Stay Foolish’ ప్రోత్సహించుచున్నది. ఈ వాక్యము కవితాత్మకము, ప్రేరణాత్మకముగా వుండి, జాబ్స్ తత్వ సారమును క్లుప్తముగా తెలియ జేయుచున్నది. కొత్త విషయములు కనుగొనుటకు, ఆసక్తి, ధైర్యము, సంప్రదాయ హద్దులకు మించి ఆలోచించుట అవసరము.
ముగింపు : ఈ నాలుగు మాటలు మెచ్చదగినవిగా మారినవి. మనము ఆసక్తి కలిగిన విద్యార్థులుగా, ధైర్యముగా కలలుగనేవారిగా జీవితాంతము వుండాలని మనలను సవాలు చేయుచున్నవి. ఇది కాలాతీతమైన సందేశము. తరతరాల వారికి ప్రేరేపణ కలిగించు సత్యము.
![]()
You’ve Got to Find What You Love Questions and Answers
Question 1.
Why did Steve Jobs drop out of college, and how did it influence his future?
Answer:
Steve Jobs dropped out of Reed College after six months because he found no clear value in spending his parents’ life savings on an education that did not inspire or guide him. He was uncertain about his future and felt burdened by taking courses that didn’t interest him. Dropping out allowed him the freedom to explore his curiosity. One of the most significant outcomes was his decision to attend a calligraphy class, which later influenced the design of the Macintosh computer’s beautiful typography.
Although the decision seemed risky and uncertain at the time, Jobs later realized it was one of the best choices he made. It taught him to trust his instincts and follow his passion, even without a clear plan. This experience reinforced his belief that sometimes the impact of our choices only becomes clear in hindsight, and that trusting one’s intuition can lead to unexpected success.
ఆరు నెలల తరువాత, స్టీవ్ జాబ్స్, రీడ్ కళాశాలలో చదువు ఆపివేసెను. తన తల్లిదండ్రుల జీవితకాల నిల్వలను తనకు ప్రేరణ, మార్గదర్శకము ఇవ్వని చదువుపై ఖర్చు చేయుట ఉపయోగము లేనిదని భావించెను. తన భవిష్యత్తు గురించి స్థిరమైన అభిప్రాయం లేదు. తనకు నచ్చని చదువు భారము మోయుట ఇష్టం లేదు. తనకు నచ్చిన విషయాలు తెలిసికొనటానికి, చదువు మానేయటం స్వేచ్ఛ నిచ్చింది. దాని వలన వచ్చిన ఒక ముఖ్య ఫలితమే చక్కని దస్తూరి తరగతులకు వెళ్లుట. ఆ విద్య తరువాత తాను మాకింతోష్ కంప్యూటరై పై చక్కని అక్షరరూప నమూనాలు తయారుచేయుటకు సహకరించెను.
ఆ సమయమున ఆ నిర్ణయము అస్థిరత, ప్రమాదముతో కూడినదిగా కనిపించెను. అది తన మంచి నిర్ణయాలలో ఒకటని, జాబ్స్, తరువాత తెలిసికొనెను. సరైన ప్రణాళిక లేకున్నప్పటికీ, తన సహజశక్తులను నమ్ముకొని, తన అభిరుచి ప్రకారము నడచుకోవాలని ఈ సంఘటన ఆయనకు నేర్పినది. ఈ అనుభవము ఆయన నమ్మకమును బలోపేతం చేసింది. మన ఎంపికల ప్రభావము గతమును జాగ్రత్తగా పరిశీలించిన స్పష్టముగా తెలియును. తన అంతర్ దృష్టిని నమ్ముట, అనుకోని విజయమునకు దారి తీయును.
Question 2.
What did Steve Jobs learn from being fired from Apple, and how did it change his life?
Answer:
Being fired from Apple, the company he co-founded, was a deeply painful experience for Steve Jobs. However, it became a turning point in his life. He initially felt like a public failure, unsure of his path. But over time, he realized that he still loved what he did. This realization helped him start over with a renewed sense of freedom and creativity. Jobs went on to establish NeXT and Pixar, both of which became highly influential. Pixar revolutionized animation, and NeXT’s technology played a crucial role in Apple’s future. Jobs also found personal happiness, meeting his wife during this period.
The setback removed the pressure of success and allowed him to become more innovative. From this experience, he learned that failure can lead to growth and transformation. It reaffirmed his belief that passion and perseverance are essential for overcoming adversity and achieving great things in life.
తాను సహవ్యవస్థాపకుడుగా వున్న Apple కంపెనీ నుండి Steve Jobs తొలగించబడెను. అది ఆయనకు తీవ్రమైన బాధను కలిగించిన అనుభవము. అది తన అపజయముగా మొదట భావించెను. తన మార్గమేమిటో ఖచ్చితముగా తెలియదు. కాని తాను తన వృత్తిని ప్రేమిస్తున్నానని కాలక్రమేణా తెలిసికొన అని గలిగెను. ఆ నిజమును గ్రహించిన తరువాత రెట్టించిన స్వేచ్ఛతో, సృజనాత్మకతతో మరల పని ప్రారంభించెను. NeXT, Pixar లను ప్రారంభించెను. రెండిటికి మంచి పేరు వచ్చెను.
Pixar యానిమేషన్లో పెనుమార్పులు తెచ్చెను. NeXT యొక్క టెక్నాలజి Apple భవిష్యత్తులో ప్రముఖ పాత్ర పోషించెను. అదే సమయంలో తనకు కాబోయే జీవిత భాగస్వామిని కలిసికొని నిజజీవితమున సంతోషమును పొందెను. ఈ ఎదురు దెబ్బలు విజయపు ఒత్తిడిని పోగొట్టెను. తాను బాగా సృజనాత్మకముగా వుండగలిగెను. అపజయము విజయమునకు, మంచి మార్పునకు దారితీయునని అప జయముల ద్వారా నేర్చుకొనెను. అభిరుచి, పట్టుదల కష్టములను అధిగ మించుటకు ముఖ్యమన్న గట్టి నమ్మకము కలిగెను. వాని ద్వారా జీవితములో గొప్పవాటిని సాధించగలమని ఈ సంఘటన వలన మరల నిర్ధారింపబడెను.
Question 3.
What lesson about life and death does Steve Jobs convey in “You’ve Got to Find What You Love,” and how does it relate to his advice on living a fulfilling life?
Answer:
In his speech, Steve Jobs shares a powerful lesson about life and death: awareness of mortality is a vital tool for making meaningful choices. He recalls asking himself each day whether he would be happy doing what he planned if it were his last day. This reflection helped him focus on what truly mattered. His cancer diagnosis further deepened his understanding, as he faced the possibility of death firsthand. Jobs emphasizes that death clears out the old to make way for the new, reminding us not to waste life living by others’ expectations.
He urges us to follow our hearts, ignore societal noise, and pursue what we genuinely love. The lesson is that life is short and uncertain, so we must not delay living authentically. His message inspires people to embrace passion, trust intuition, and make bold decisions that align with their true selves to live a fulfilling and purposeful life.
తన ఉపన్యాసములో స్టీవ్ జాబ్స్ జీవితము, మరణము గురించి శక్తివంతమైన పాఠమును పంచుకొనుచున్నాడు. సరయిన ఎంపికలకు మరణము గురించి తెలియుట ఒక ముఖ్య సాధనము. అదే తన చివరి రోజు అయినట్లుగా ప్రణాళిక వేసికోవాలి. ఈ విషయమును తాను ప్రతి రోజు గుర్తు తెచ్చుకుంటాడు. తన పని తనకు సంతోషము కలిగించినదా లేదాయని ఆలోచిస్తాడు. ఏది ముఖ్యమో అది చేయుటకు ఈ ఆలోచన ఆయనకు సహాయపడింది. క్యాన్సరు వ్యాధి నిర్ధారణ తన అర్థము చేసికొను శక్తిని బాగా పెంచింది. తన మరణము గురించి తనకు ముందు తెలుసుగనుక ఇది సాధ్యపడింది. మరణము పాతదానిని పోగొట్టి కొత్తదానికి దారి చూపించును. ఎదుటివారి అంచనాల మేరకు బతికి జీవితం వృథా చేసికొనవద్దు.
మన మనస్సు ప్రకారం మనం నడచుకోవాలని ఆయన ఉద్బోధించుచున్నాడు. సంఘములోని సమస్యలను పట్టించుకోవద్దు. మనము నిజముగా ఇష్టమైన దానిని మాత్రమే చేయవలెను. జీవితము చిన్నది. అస్థిరమైనది. కాబట్టి మనము ప్రామాణికతతో జీవించుటకు ఆలస్యము చేయవద్దు. మనిషి తాను స్వంత అభిరుచిని పాటించాలి; అంతర్ దృష్టిని నమ్మాలి; ధైర్యముగా నిర్ణయాలు తీసికోవాలి; తన నిర్ణయాలు తన నిజాయితీకి సరిపోయి, అనుకున్నది నెరవేరుస్తూ, ప్రయోజనకరమైన జీవితం గడపాలి. ఇది ఆయన ప్రజలను ఉత్తేజపరచుచు ఇచ్చిన సందేశము.
![]()
Question 4.
What does Jobs mean by ‘Stay Hungry. Stay Foolish,’ and why is it important?
Answer:
Steve Jobs was a visionary entrepreneur, innovator, and co- founder of Apple Company. He revolutionized both the software and hardware industries. Jobs introduced innovative products like the Macintosh computer, iPhone, and iPad. He is known for his creativity and spirit, and he overcame personal and professional challenges, leaving innovation and inspiration behind him. He shares valuable life lessons with the graduates of Stanford University through three significant stories from his life, each tells important life lessons. Steve Jobs said,
‘Stay Hungry. Stay Foolish’ in his famous speech at Stanford University in 2005. This quote carries a powerful message for students and young people. ‘Stay Hungry’ means always be eager to learn more, improve yourself, and achieve something new. It tells us not to be satisfied with what we know or have. ‘Stay Foolish’ means don’t be afraid to take risks or try new ideas, even if others think they are silly. It encourages us to be creative and think differently.
This message is important because it motivates us to keep growing and learning in life. It reminds us not to fear failure or rejection. It helps us follow our dreams and stay curious. It teaches us to believe in ourselves, even when others don’t. Steve Jobs wanted young people to be brave, curious, and passionate. If we stay hungry and foolish, we will keep learning, exploring, and creating new things, and that’s the key to success and happiness in life.
స్టీవ్ జాబ్స్ ఒక దూరదృష్టి గల వ్యాపారవేత్త, ఆవిష్కర్త, మరియు ఆపిల్ కంపెనీ సహ స్థాపకుడు. ఆయన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మాకింతోష్ కంప్యూటర్, ఐఫోన్, ఐప్యాడ్ వంటి వినూత్నమైన ఉత్పత్తులను ఆయన పరిచయం చేశారు. ఆయనలోని సృజనాత్మకత, స్ఫూర్తి ఎన్నదగినవి. ఆయన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సవాళ్ళను ఎదుర్కొని, కొత్త ఆవిష్కరణలను మరియు ప్రేరణను మనకు అందించారు. ఆయన స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం పట్టభద్రులతో తన జీవితంలోని మూడు ముఖ్యమైన సంఘటనల నుండి విలువైన జీవన పాఠాలను పంచుకున్నారు. 2005లో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన ప్రసంగంలో స్టీవ్ జాబ్స్ ‘Stay Hungry. Stay Foolish’ (ఆశపడుతూ ఉండండి. మూర్ఖులుగా ఉండండి అని అన్నారు.
ఈ సూక్తి విద్యార్థులకు మరియు యువతకు శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది. ‘Stay Hungry’ అంటే నిత్యం కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి వుండటం, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడం మరియు కొత్త విజయాలను సాధించడం. మనం సాధించిన దానితో సంతృప్తి పడకూడదని ఇది చెబుతుంది. ‘Stay Foolish’ అంటే కొత్త లక్ష్యాలు ప్రయత్నించడానికి, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి భయపడకూడదు, ఇతరులు అవి అవివేకమైన పనులని భావించినా సరే. ఇది మనల్ని సృజనాత్మకంగా మరియు విభిన్నంగా ఆలోచించమని ప్రోత్సహిస్తుంది.
మనం జీవితంలో ఎదుగుతూ, నేర్చుకుంటూ ఉండాలని ప్రబోధించే ఈ సందేశం ఎంతో ముఖ్యమైనది. ఇది మనకు విఫలం కావడం లేదా తిరస్కరణ గురించి భయపడవద్దని గుర్తు చేస్తుంది. ఇది మన కలల్ని అనుసరించడానికి, జిజ్ఞాసతో ఉండటానికి తోడ్పడుతుంది. ఇది ఇతరులు నమ్మకపోయినప్పుడు కూడా మనల్ని మనమే నమ్ముకోవాలని చెబుతుంది. స్టీవ్ జాబ్స్ యువత ధైర్యంగా, ఉత్సాహంగా, జిజ్ఞాసతో మరియు తపనతో ఉండాలని ఆశించారు. మనం ఎప్పటికీ ‘హంగ్రీ’ మరియు ‘ఫూలిష్’గా ఉంటే మనం నిరంతరం నేర్చుకుంటూ, పరిశీలిస్తూ, కొత్తవాటిని సృష్టిస్తూ ఉంటాం జీవితంలో విజయానికి మరియు ఆనందానికి కీలకం.
You’ve Got to Find What You Love Summary in English & Telugu
You’ve Got to Find What You Love Summary in English
Steve Jobs gave this famous speech at a graduation ceremony at Stanford University. He shared three important stories from his life to inspire the students. The first story is about “connecting the dots”. Steve talks about dropping out of college because he didn’t find it useful and didn’t want to waste his parents’ money. After leaving college, he followed his interests, like taking a calligraphy class. At that time, he didn’t know it would help him later. But years later, the skills he learned helped him design the beautiful fonts on the first Macintosh computer. He says you can’t connect the dots looking forward-only looking backward. So, you must trust that the choices you make today will somehow connect in the future.
The second story is about “love and loss”. Steve explains how he started Apple in a garage and built it into a successful company. But at age 30, he was fired from his own company. He was heartbroken, but he still loved his work. So, he started new companies like NeXT and Pixar and also met his future wife. Later, Apple bought NeXT, and Steve returned to Apple. He says getting fired was the best thing that happened to him-it gave him a fresh start. He tells everyone to “find what you love” and never settle.
The third story is about “death”. Steve talks about being diagnosed with cancer and how facing death made him realize what truly matters. He says that remembering we will die helps us make better life choices. Life is short, so don’t waste time living someone else’s life. Follow your heart and intuition.
In the end, Steve shares a message from The Whole Earth Catalog: “Stay Hungry. Stay Foolish.” This means always stay curious, eager to learn, and bold enough to try new things. His speech is a lesson in following passion, staying strong through failures, and living an authentic life.
సారాంశం
ఈ ప్రసిద్ధమైన ఉపన్యాసమును స్టాన్ఫర్డ్ విశ్వ విద్యాలయ స్నాతకోత్సవ ములో స్టీవ్ జాబ్స్ చేసెను. విద్యార్థులలో ప్రేరణ కలిగించుటకు ఆయన తన జీవితములోని మూడు కథలను పంచుకొనెను. మొదటి కథ ‘connecting the dots’ గురించినది. కళాశాల తనకు ఉపయోగకరముగా కనిపించలేదు; తాను తన తల్లిదండ్రుల డబ్బును వృథా చేయదలచుకోలేదు. అందుకని కళాశాల నుంచి బయటకు వచ్చాడు. కళాశాలను వదలివేసిన తర్వాత తనకు నచ్చినవాటిని ఆచరించాడు – వాటిలో ఒకటి చక్కని దస్తూరిలో శిక్షణ తీసికొనుట. ఆ విద్య తరువాత తనకు సహాయపడునని అప్పుడు అతనికి తెలియదు.
కాని సంవత్సరముల తరువాత ఆ నైపుణ్యము మాకింతోష్ కంప్యూటరుపై చక్కని అక్షర రూపముల నమూనాలు తయారు చేయుటకు సహాయపడెను. చుక్కలను ముందుకు చూచుచు కలపలేము; వెనుకకు చూసి మాత్రమే కలుపగలము. కావున ఈ రోజున నీకు నచ్చిన విషయములు భవిష్యత్తులో ఏదో ఒక విధంగా కలపవచ్చును. అవి మనకు ఉపయోగపడగలవని మనము తప్పనిసరిగా నమ్మవలెను.
రెండవ కథ ‘love and loss’ గురించినది. తాను ఏ విధముగా ఒక గ్యారేజిలో Apple ను మొదలు పెట్టి తరువాత దానిని విజయవంతమైన కంపెనీగా నిర్మించినది తెలియజేయుచున్నాడు. కాని తన 30 ఏళ్ళ వయసులో తన సొంత కంపెనీ నుంచి తొలగించబడ్డాడు. అతనికి గుండె పగిలినంత బాధ కలిగింది. అయినప్పటికి తన పనిని ఇష్టపడ్డాడు. అందువలన NEXT మరియు Pixar వంటి కొత్త కంపెనీలను ప్రారంభించాడు. తన కాబోవు జీవిత భాగస్వామిని కలిశాడు.
తరువాత Apple కంపెనీ NexT ను కొన్నది. స్టీవ్ తిరిగి Apple కంపెనీకి వచ్చాడు. ఉద్యోగము పోవుట, తన జీవితములో తనకు జరిగిన అతి మంచి పని అని ఆయన చెప్పుచున్నాడు. అది తన కొత్త జీవితమునకు ప్రారంభమైనది. ‘నీకు నచ్చిన దానిని కనుగొను; అంతేగాని ఒక చోట స్థిరపడవద్దు’. ఈ విషయము ఆయన ప్రతివారికి చెప్పును.
మూడవ కథ ‘death’ గురించినది. స్టీవ్ తన కాన్సర్ వ్యాధి నిర్ధారణ గురించి మాట్లాడుచున్నాడు. చావు దగ్గర పడుతున్న కొద్దీ ఏది ముఖ్యమో తెలిసికొన్నాడు. చనిపోతామని గుర్తు వచ్చినపుడు తాము ఎంచుకొనవలసిన మంచివాటిని తెలిసికొనుటకు మరణము సహాయపడుతుంది. జీవితము చిన్నది. కావున మరొకరి వలె జీవించి కాలమును వృథా చేసికొనవద్దు. నీ మనసు చెప్పినట్లు అనుసరించు.
The Whole Earth Catalog నుంచి చివరిగా స్టీవ్ ఒక సందేశమును పంచుకొనుచున్నాడు. ‘ఆకలితో వుండు; మూర్ఖునిగా వుండు’. అనగా ఉత్సుకతతో వుండు; నేర్చుకోవాలనే ఆసక్తితో వుండు; కొత్తవాని కొరకు ప్రయత్నము చేయు ధైర్యముతో వుండు. అభిరుచిని అనుసరించుటకు అతని ప్రసంగము ఒక పాఠము; అపజయములలో కూడ దృఢంగా వుండాలి; ఒక ప్రామాణిక జీవితమును గడపాలి.
![]()
Glossary:
1. commencement : /kəmˈɛnsmənt/ (n) : a graduation ceremony; ప్రారంభోత్సవం
2. biological : /bˌaɪəlˈɑːdʒɪkəl/ (adj) related by blood/ genetics; జీవసంబంధమైన
3. unwed : /ʌnwˈɛd/ (adj): not married; వివాహం కాని
4. relented : /ɹɪlˈɛntᵻd/ (v): changed attitude; yielded; వదులుకొనెను
5. naively : /naɪˈiːvli/ (adv): without experience or wisdom; అనుభవం లేకుండా
6. calligraphy : /kælˈɪɡɹəfi/ (n): artistic handwriting; సుందర లిపి
7. serif : /sˈɛɹɪf/ (n) small decorative stroke on letters; అక్షర అలంకరణ
8. typography : /taɪpˈɑːɡɹəfi/ (n): art of arranging type; ముద్రణ కళ
9. intuition: /ɪntuːˈɪʃən/ (n): instinctive understanding; అంతర్ దృష్టి
10. diverge : /daɪvˈɜːdʒ/ (v): differ in opinion; విభేదించు
11. devastating : /dˈɛvᵻstˌeɪɾɪŋ/ (adj): extremely destructive; విధ్వంసకరమైన
12. entrepreneurs: /ˌɑːntɹɪpɹənˈʊɹz/ (n) people who start businesses; వ్యవస్థాపకులు
13. renaissance : /ɹˈɛnəsˌɑːns/ (n) revival or rebirth; పునరుజ్జీవనం
14. diagnosed : /dˌaɪəɡnˈoʊzd/ (v) : identified a medical condition; రోగనిర్ధారణ చేసెను
15. pancreas : /pˈæŋkɹiəs/ (n): abdominal gland; క్లోమం
16. biopsy: /baɪˈɑːpsi/ (n): tissue sample examination; కణజాల పరీక్ష
17. endoscope : /ˈɛndoʊskˌoʊp/ (n) medical viewing instrument; అంతర్దర్శిని
18. sedated: /sᵻdˈeɪɾᵻd/ (adj): calmed with drugs; శాంతింపచేయబడిన
19. dogma : /dˈɑːɡmə/ (n) authoritative principle; సిద్ధాంతం
20. idealistic : /aɪdˈiəlˈɪstɪk/ (adj): visionary; unrealistically optimistic; ఆదర్శవాద
21. hitchhiking : /hˈɪtʃhaɪkɪŋ/ (n): getting free rides from passing vehicles; వేరొకరి వాహనంలో ఉచిత ప్రయాణం చేయడం
22. adventurous : /ɐdvˈɛntʃɚɹəs/ (adj): willing to take risks; సాహసోపేతమైన
23. baton : /bɐtˈɑːn/ (n): staff passed in relays; కర్ర , దండం
24. subtle : /sˈʌɾəl/ (adj): delicate, not obvious; సూక్ష్మమైన
25. proportionally : /pɹəpˈɔːɹʃənəli/ (adv): in proper relation; అనుపాతంలో
26. karma : /kˈɑːɹmə/ (n): fate or destiny; కర్మ
![]()
27. buttoned up : /bˈʌʔn̩d ˈʌp/ (phr.y): tied up neatly; చక్కగా బిగించెను
28. incurable: /ɪŋkjˈʊɹɹəbəl/ (adj): cannot be healed; నయం కాని
29. microscope : /mˈaɪkɹəskˌoʊp/ (n): instrument for viewing small objects; సూక్ష్మదర్శిని
30. destination: /dˌɛstɪnˈeɪʃən/ (n): end point of a journey; గమ్యం
31. adoption: /ɐdˈɑːpʃən/ (n): legally taking another’s child as one’s own; దత్తత
32. tuition : /tuːˈɪʃən/ (n) : fee for instruction; బోధనా, రుసుము
33. priceless: /pɹˈaɪsləs/ (adj): extremely valuable; అమూల్యమైన
34. deposits: /dᵻpˈɑːzɪts/ (n): sums payable as security; నగదు జామీనులు
35. dorm room: /dˈɔːɹm ɹˈuːm/ (n): a room in a dormitory where students live and sleep; గృహంలోని గది
36. scary : /skˈɛɹi/ (adj): causing fear or fright; భీతి గొలిపే
37. fonts : /fˈɔnts/ (n) styles or designs of text characters in printing or digital documents; ముద్రణలో లేదా ఎలక్ట్రానిక్ పత్రాలలో వాడే అక్షర శైలులు
38. board : /bˈɔːɹd/ (n) : group of directors ; నిర్వహకుల సముదాయం
39. falling out : /fˈɔːlɪŋ ˈaʊt/ (phr.v): quarrel; విభేదించడం
40. animation : /ˌænɪmˈeɪʃən/ (n): technique of making cartoons; కదిలే చిత్రాలు రూపొందించు సాంకేతికత
41. feature film : /fˈiːtʃɚ fˈɪlm/ (n): full-length movie; పొడవున చిత్రం
42. temple: /tˈɛmpəl/ (n): place of worship; దేవాలయం
43. curiosity: /kjˌʊɹɹɪˈɔsᵻɾi/ (n): desire to know; కుతూహలం.
44. stumbled : /stˈʌmbəld/ (v): discovered accidentally; అనుకోకుండా కనుగొనెను
45. garage : /ɡɚɹˈɑːʒ/ (n): building for storing vehicles; వాహనాలు నిలిపివుంచు భవనం
46. billion : /bˈɪliən/ (n): one thousand million; వందకోట్లు
47. released: /ɹᵻlˈiːst/ (v): made available; చేయబడెను
48. talented : /tˈæləntᵻd/ (adj) having natural ability; ప్రతిభావంతులైన
49. freed : /fɹˈiːd/ (v): released from constraint; కలిగెను / కలిగించెను
50. foolish : /fˈuːlɪʃ/ (adj): lacking good sense; తెలివితక్కువ